బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమిండియా వీరబాదుడును క్రికెట్ ప్రేమికులు అంత తేలికగా మర్చిపోలేరు. కాన్పూర్‌లో పొట్టి ఫార్మాట్ తరహాలో ఒక్కో భారత బ్యాటర్ చెలరేగుతూ ఉంటే అభిమానులు పండుగ చేసుకున్నారు. అంతకు ముందు వర్షం వల్ల రెండు రోజుల ఆట రద్దైన కారణంగా ఉసూరుమన్న ఫ్యాన్స్‌కు.. రోహిత్ సేన పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చి లెక్క సరిచేసింది.
50, 100, 200, 250 పరుగుల రికార్డు
టెస్టు ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 50, 100, 200, 250 పరుగుల రికార్డును సాధించి.. ప్రపంచంలో ఈ ఘనతలు నమోదు చేసిన తొలి క్రికెట్ జట్టుగా చరిత్ర సృష్టించింది. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ 11 బంతుల్లోనే 23 పరుగులు చేస్తే.. అతడి జోడీ యశస్వి జైస్వాల్(72) కేవలం 32 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
1877 నుంచి ఇదే తొలిసారి
విరాట్ కోహ్లి 35 బంతుల్లో 47 పరుగులు చేస్తే.. కేఎల్ రాహుల్ 43 బంతుల్లోనే 68 పరుగులు సాధించాడు. ఈ నలుగురు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన కారణంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 34.4 ఓవర్లలోనే 285 పరుగులు చేయగలిగింది. ఇదిలా ఉంటే.. ఈ తుఫాన్ ఇన్నింగ్స్ నేపథ్యంలో భారత జట్టు ఖాతాలో అత్యంత అరుదైన రికార్డు ఒకటి నమోదైంది.
ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి జట్టుగా రోహిత్ సేన నిలిచింది. తద్వారా ఇంగ్లండ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. 1877 నుంచి ఇప్పటి వరకు ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో టెస్టుల్లో 90 సిక్సర్లు నమోదు చేసిన టీమ్‌గా చరిత్రకెక్కింది.
కాగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ మూడు, యశస్వి జైస్వాల్ రెండు, శుబ్‌మన్ గిల్ ఒకటి, విరాట్ కోహ్లి ఒకటి,. కేఎల్ రాహుల్ రెండు, ఆకాశ్ దీప్ రెండు సిక్సర్లు బాదారు. ఇక నవంబరులో టీమిండియా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు, ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టులు ఆడనుంది. కాబట్టి తన సిక్సర్ల రికార్డును రోహిత్ సేన తానే బద్దలు కొట్టే అవకాశం ఉంది.
టెస్టుల్లో ఒకే ఏడాదిలో అత్యధిక సిక్సర్లు బాదిన జట్లు
టీమిండియా- 90 సిక్స్‌లు(2024లో ఇప్పటి వరకు)
ఇంగ్లండ్- 89 సిక్స్‌లు(2022లో)
టీమిండియా- 87 సిక్స్‌లు(2021లో)
న్యూజిలాండ్- 81 సిక్స్‌లు(2014లో)
న్యూజిలాండ్- 71 సిక్స్‌లు(2013లో).
చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లనుందా? బీసీసీఐ ఏమంటోంది?
Comments
Please login to add a commentAdd a comment