ముమ్మాటికీ అఘాదే తప్పు.. ఐసీసీ సీరియస్‌ | ICC Reprimands Salman Agha On-field outburst Controversial Run-out | Sakshi
Sakshi News home page

ముమ్మాటికీ అఘాదే తప్పు.. ఐసీసీ సీరియస్‌

Mar 14 2026 6:07 PM | Updated on Mar 14 2026 7:01 PM

ICC Reprimands Salman Agha On-field outburst Controversial Run-out

పాకిస్థాన్‌ క్రికెటర్‌ సల్మాన్‌ అఘా రనౌట్‌ క్రికెట్‌లో పెను దుమారాన్ని రేపుతుంది. బంగ్లాదేశ్‌తో రెండో వన్డే సందర్భంగా సల్మాన్‌ ఔటైన తీరు క్రికెట్‌ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. తనను ఔట్‌ చేశాడన్న కోపంతో సల్మాన్‌ అఘా తన హెల్మెట్‌, గ్లౌవ్స్‌, బ్యాట్‌ను నేలకేసి కొట్టడమే గాక కెప్టెన్‌ మిరాజ్‌తో పాటు వికెట్‌ కీపర్‌ లిట్టన్‌ దాస్‌తో గొడవపడ్డాడు.  

అఘా ఔటైన తీరు వివాదాస్పదమే అయినప్పటికీ అతడి చర్య మాత్రం క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ పలువురు క్రీడా నిపుణులు పేర్కొన్నారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కూడా సల్మాన్‌ అఘాపై చర్యలు తీసుకుంది. ఔట్‌ నిర్ణయం రాగానే మైదానంలో అనుచిత ప్రవర్తనకు దిగడమే గాక మ్యాచ్‌ రిఫరీ నీయముర్‌ రషీద్‌ ఫిర్యాదు మేరకు లెవల్‌ 1 నేరానికి అఘా పాల్పడినట్లు ఐసీసీ తేల్చింది.

‘క్రికెట్‌ పరికరాలను అగౌరవపరిచినట్లు పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ అఘాపై ఫిర్యాదు అందింది. మైదానంలోనే అతను హెల్మెట్‌, గ్లౌవ్స్‌, బ్యాట్‌ను విసిరేసినట్లు తేలింది. గతంలో సల్మాన్‌ అఘా నుంచి ఇలాంటి ప్రవర్తన ఎన్నడూ చూడలేదు. కానీ ఇప్పుడు మాత్రం అఘా చేసిన పనిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. 

ఇప్పటికే అతడి ఖాతాలో ఒక డీమెరిట్‌ పాయింట్‌ జత చేశాం. అయితే బంగ్లాదేశ్‌ ఆటగాడు లిటన్‌ దాస్‌తో జరిగిన వాగ్వాదంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనిని కేవలం అపార్థంగా పరిగణించాం. మేం చట్టం ప్రకారమే నడుచుకుంటూనే ఇలాంటి తీర్పును ఇచ్చాం’ అని ఐసీసీ స్పష్టం చేసింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 47.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది.మాజ్‌ సదాఖత్‌ (75), సల్మాన్‌ అఘా (64) రాణించారు. అనంతరం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని 243 పరుగులుగా నిర్దేశించారు. అయితే బంగ్లాదేశ్‌ 23.3 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. ప్రస్తుతం ఇరుజట్లు చెరో వన్డే గెలవగా, మూడో వన్డే ఆదివారం జరగనుంది.

చదవండి: ఐదేళ్ల ప్రయాణం.. దిగ్గజాల సరసన సూర్యా భాయ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement