International Cricket Council
-
‘టీమిండియా పాకిస్తాన్‌కు రాకపోతే.. మా వైఖరి వేరుగా ఉంటుంది.. ఇకపై’
చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో టీమిండియా విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మెగా టోర్నీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ జట్టును దాయాది దేశానికి పంపేందుకు సిద్ధంగా లేమని భారత క్రికెట్ నియంత్రణ మండలి సంకేతాలు ఇచ్చింది.హైబ్రిడ్ విధానంలో ఈవెంట్‌ను నిర్వహించాలని..ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తే లేదని.. హైబ్రిడ్ విధానంలో ఈవెంట్‌ను నిర్వహించాలని ఐసీసీని కోరినట్లు సమాచారం. అయితే, పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. తమ దేశంలో జరిగే ఈ మెగా టోర్నీలో టీమిండియా తప్పక పాల్గొనాలని.. భారత జట్టు మ్యాచ్‌ల కోసం లాహోర్ స్టేడియాన్ని సిద్ధం చేశామని చెబుతోంది.సరేనన్న ఐసీసీ?ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ సైతం అప్పట్లో ఈ విషయం గురించి మాట్లాడుతూ చాంపియన్స్ ట్రోఫీ వేదిక మార్చే అవకాశం లేదని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ మాత్రం భారత ప్రభుత్వం అనుమతిస్తే తప్ప రోహిత్ సేనను పాక్‌కు పంపమని పేర్కొంది. అందుకు స్పందనగా ఐసీసీ.. టీమిండియా మ్యాచ్‌లకు తటస్థ వేదికను ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.మా వైఖరి వేరుగా ఉంటుందిఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘మేము ఇటీవలి కాలంలో ప్రతి విషయంలో సానుకూలంగా స్పందించాం. అయితే, ప్రతిసారి మేము అలాగే చేస్తామని భావించవద్దు’’ అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.సరైన కారణం చూపించాలి‘‘ఒకవేళ ఏదైనా జట్టు ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలంటే సరైన కారణం చూపించాలి. టీమిండియా ఇక్కడికి రాకపోవడానికి భద్రతను కారణంగా చూపడం అనేది అసలు విషయమే కాదు. ఎందుకంటే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా పాకిస్తాన్‌కు వస్తున్నాయి. ఆ జట్లు పాక్‌లో టోర్నీ ఆడాలనే తలంపుతో ఉన్నాయి.అదే జరిగితే.. అసలు ఈ టోర్నీని ఎవరూ చూడరునిజానికి ఐసీసీ మనుగడకు కారణమే పాకిస్తాన్, ఇండియా. ఒకవేళ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత్‌లాగే మేము ఆడమని చెప్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. అదే జరిగితే.. అసలు ఈ టోర్నీని ఎవరూ చూడరు. ఈసారి గనుక టీమిండియా ఇక్కడికి రాకపోతే.. పాకిస్తాన్ తీవ్ర నిర్ణయం తీసుకుంటుంది. ఈ టోర్నీని బహిష్కరిస్తుంది’’ అని రషీద్ లతీఫ్ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశాడు.భద్రత కంటే ఏదీ ఎక్కువ కాదుఇక అతడి వ్యాఖ్యలకు టీమిండియా అభిమానులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. భారత ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ రాజీపడబోదని పేర్కొంటున్నారు. పాక్ ఆటగాళ్లు భారత్‌కు వచ్చి సురక్షితంగా వెళ్లగలిగారని.. కానీ టీమిండియా ఆటగాళ్లను పాక్‌కు పంపే పరిస్థితులు మీ దేశంలో లేవంటూ లతీఫ్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఆడేందుకు పాక్ జట్టు గతేడాది భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్‌గా అతడే! -
ICC: తొలిసారి మెగా టోర్నీలోకి జింబాబ్వే.. భారత్ షెడ్యూల్ ఇదే
అంతర్జాతీయ మహిళా క్రికెట్‌కు సంబంధించిన ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాం(FTP) ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఐసీసీ వుమెన్స్ చాంపియన్‌షిప్‌తో పాటు మహిళల వన్డే ప్రపంచకప్ 2029కు సన్నాహకంగా ఈ షెడ్యూల్ ఉండబోతోందని పేర్కొంది. అంతేకాదు.. ఈసారి వరల్డ్‌కప్ టోర్నీలో అదనంగా మరో జట్టు కూడా చేరుతోందని తెలిపింది. జింబాబ్వే తొలిసారిగా ఈ మెగా ఈవెంట్లో అడుగుపెట్టనుందని ఐసీసీ పేర్కొంది.44 సిరీస్లుఇక 2025-29 మధ్యకాలంలో వుమెన్స్ చాంపియన్‌షిప్‌లో మొత్తంగా 44 సిరీస్‌లు నిర్వహించబోతున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఇందులో 132 వన్డేలు ఉంటాయని.. ప్రతి సిరీస్‌లోనూ మూడు మ్యాచ్‌ల చొప్పున జట్లు ఆడతాయని తెలిపింది.కాగా ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాంలో భాగంగా భారత మహిళా క్రికెట్ జట్టు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో స్వదేశంలో మ్యాచ్‌లు ఆడనుంది. ఇక విదేశీ గడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఐర్లాండ్ జట్లను ఎదుర్కోనుంది.ఇదిలా ఉంటే.. భారత్ వేదికగా 2025లో ఐసీసీ వుమెన్స్ వనన్డే వరల్డ్‌కప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. అదే విధంగా.. యునైటెడ్ కింగ్డమ్లో 2026లో టీ20 ప్రపంచకప్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, 2028 టీ20 వరల్డ్‌కప్‌నకు మాత్రం ఇంకా వేదికను ప్రకటించలేదు.ఐసీసీ వుమెన్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనబోయే దేశాలుఆస్ట్రేలియా, ఇండియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే.ఆస్ట్రేలియా షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్‌లతో.. అదే విధంగా భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక పర్యటన.ఇండియా షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్ పర్యటనబంగ్లాదేశ్ షెడ్యూల్స్వదేశంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, శ్రీలంకలతో.. ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ పర్యటనఇంగ్లండ్ షెడ్యూల్స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఐర్లాండ్‌లతో.. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక పర్యటనఐర్లాండ్ షెడ్యూల్స్వదేశంలో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్‌లతో.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, శ్రీలంక పర్యటనన్యూజిలాండ్ షెడ్యూల్స్వదేశంలో భారత్, సౌతాఫ్రికా, జింబాబ్వే, శ్రీలంకలతో.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఐర్లాండ్ పర్యటనపాకిస్తాన్ షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో.. సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్ పర్యటనసౌతాఫ్రికా షెడ్యూల్స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్‌లతో.. ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, జింబాబ్వే పర్యటనశ్రీలంక షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఐర్లాండ్‌లతో... న్యూజిలాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనవెస్టిండీస్ షెడ్యూల్స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంకలతో.. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే, ఐర్లాండ్ పర్యటనజింబాబ్వే షెడ్యూల్స్వదేశంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్‌లతో.. భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ పర్యటన.చదవండి: ఉత్కంఠ పోరులో పాక్‌పై ఆస్ట్రేలియా గెలుపు -
టీమిండియా రాకపోతే..: పీసీబీ, ఐసీసీకి ఇంగ్లండ్ బోర్డు వార్నింగ్!
చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా పాల్గొనకపోతే భారీ నష్టం తప్పదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చీఫ్ రిచర్డ్ థాంప్సన్ అన్నాడు. పాకిస్తాన్లో జరిగే ఈ మెగా టోర్నీలో రోహిత్ సేన పాల్గొంటేనే ఈవెంట్ విజయవంతమవుతుందని అభిప్రాయపడ్డాడు. లేనిపక్షంలో ప్రసార హక్కులు కొనేందుకు ఎవరూ ముందుకు రారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, అంతర్జాతీయ క్రికెట్ మండలిని పరోక్షంగా హెచ్చరించాడు.వన్డే ఫార్మాట్లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనుండగా.. టీమిండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ అర్హత సాధించాయి.హైబ్రిడ్ విధానంలో?అయితే.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ విముఖంగా ఉంది. ఇరు దేశాల మథ్య పరిస్థితుల నేపథ్యంలో 2008 తర్వాత ఇంత వరకు భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు వెళ్లలేదు. అందుకే.. ఆసియా వన్డే కప్-2023 టోర్నీ పాకిస్తాన్లో జరిగినప్పటికీ బీసీసీఐ తటస్థ వేదికలపై తమ జట్టు మ్యాచ్‌లు జరగాలని కోరడంతో పాటు మాట నెగ్గించుకుంది.చాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ ఇదే తరహా హైబ్రిడ్ విధానం పాటించాలని ఐసీసీని ఒప్పించే పనిలో ఉన్నట్లు సమాచారం. అయితే, పాక్ బోర్డు మాత్రం టీమిండియా తమ దేశానికి రావాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ బోర్డు చీఫ్ రిచర్డ్ థాంప్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.టీమిండియా రాకపోతే జరిగేది ఇదే!‘‘బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా.. ఇప్పుడు ఐసీసీ చైర్మన్ అయ్యారు. టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా అన్న అంశాన్ని తేల్చడంలో ఆయనదే కీలక పాత్ర. ఇరువర్గాలు చర్చించి.. టోర్నీ సజావుగా సాగే మార్గం కనుగొంటారనే ఆశిస్తున్నాం.టీమిండియా లేకుండా ఈ టోర్నీ జరుగుతుందని అనుకోవడం లేదు. ఎందుకంటే.. భారత జట్టు లేకుండా ఈ ఈవెంట్ జరిగితే ప్రసార హక్కులు ఎవరూ కొనరు. ఏదేమైనా పాకిస్తాన్ మాత్రం టీమిండియా తమ దేశానికి రావాలని కోరుకుంటోంది’’ అని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు.చదవండి: IPL 2025: రిషబ్ పంత్‌కు బిగ్ షాక్.. ఢిల్లీ కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్? -
జై షా స్థానాన్ని భర్తీ చేయనున్న పీసీబీ చీఫ్?
భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ పదవి చేపట్టనున్నారు. ఈ ఏడాది డిసెంబరు 1న ఐసీసీ బాస్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నిక ప్రక్రియ ఇప్పటికే పూర్తైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జై షా త్వరలోనే బీసీసీఐ కార్యదర్శి పదవి నుంచి తప్పుకోనున్నారు.అదే విధంగా.. ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) అధ్యక్షుడిగానూ రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏసీసీ కొత్త ప్రెసిడెంట్ ఎవరన్న చర్చ జరుగుతుండగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ పేరు తెరమీదకు వచ్చింది. జై షా స్థానాన్ని నక్వీ భర్తీ చేయనున్నాడని.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.కొత్త బాస్‌గా నక్వీ?‘‘వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న ఏసీసీ సమావేశంలో.. కొత్త అధ్యక్షుడిగా మొహ్సిన్ నక్వీ ఎంపిక కానున్నారు. రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు’’ అని ఏసీసీ వర్గాలు వెల్లడించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. కాగా ఆసియా వన్డే కప్-2023 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడికి వెళ్లలేదన్న సంగతి తెలిసిందే.అయితే, పాక్ బోర్డు మాత్రం భారత జట్టు తమదేశానికి రావాల్సిందేనని పట్టుపట్టగా.. జై షా నేతృత్వంలోని ఏసీసీ హైబ్రిడ్ విధానంలో మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో పాక్‌తో పాటు శ్రీలంకను ఆతిథ్య దేశంగా ఎంపిక చేసి.. టీమిండియా మ్యాచ్‌లను అక్కడ నిర్వహించింది. భారత్‌తో పాటు లంక ఫైనల్‌కు చేరగా.. టైటిల్ పోరు కూడా శ్రీలంకలోనే జరిగింది. అయితే, జై షా స్థానంలో నక్వీ వస్తే.. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే ఆసక్తి నెలకొంది.ఐసీసీ టోర్నీలకు సన్నాహకాలుగాఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది భారత్‌లో పురుషుల ఆసియాకప్ జరుగనుంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీని2025 సెప్టెంబర్‌లో నిర్వహించనున్నారు. స్వదేశంలో జరుగనున్న టీ20 ప్రపంచకప్-2026కు ముందుగా ఈ టోర్నీని నిర్వహించడం వల్ల.. ఆసియా దేశాలకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. అనంతరం.. ఆసియా కప్-2027నకు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుంది. అదే ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో బంగ్లాలో వన్డే ఫార్మాట్లో ఆసియాకప్ నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. -
ఐసీసీ చైర్మన్‌గా జై షా ఏకగ్రీవ ఎన్నిక.. ప్రకటన విడుదల
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చైర్మన్‌గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించి ఐసీసీ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది డిసెంబరు 1న ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపింది. కాగా ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా ఉన్న గ్రెగ్ బార్క్లే తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఆగష్టు 20న ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.ఇప్పటికే రెండు దఫాలుగా చైర్మన్‌గా వ్యవహరించిన గ్రెగ్ బార్క్లే.. మూడోసారి పగ్గాలు చేపట్టేందుకు విముఖంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానాన్ని జై షా భర్తీ చేశారు. ఐసీసీలోని మొత్తం పదహారు మంది సభ్యుల్లో 15 మంది జై షాకు అనుకూలంగా ఉండటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.సరికొత్త రికార్డుఇక నవంబరు 30న బార్క్లే పదవీకాలం ముగియనుండగా... ఆ మరుసటి రోజు జై షా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో 35 ఏళ్ల జై షా సరికొత్త రికార్డు సాధించారు. అత్యంత పిన్న వయసులో ఐసీసీ బాస్‌గా నియమితులైన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.కాగా జై షా ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శిగా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజా పరిణామం నేపథ్యంలో ఆయన త్వరలోనే బీసీసీఐ పదవి నుంచి వైదొలగనున్నారు. ఇక ఐసీసీ చైర్మన్‌గా ఎన్నిక కావడం తనకు దక్కిన గొ ప్ప గౌరవం అని జై షా హర్షం వ్య క్తం చేశారు.జై షాకు హెచ్‌సీఏ శుభాకాంక్షలుఐసీసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జై షాకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడు జగన్మోహన్ రావు శుభాకాంక్షలుతెలిపారు. జైషా నాయకత్వంలో ప్రపంచ క్రికెట్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.చదవండి: లక్నో కెప్టెన్సీకి రాహుల్ గుడ్‌బై!.. రేసులో ఆ ఇద్దరు!Jay Shah has been elected unopposed as the next Independent Chair of the ICC.https://t.co/Len6DO9xlE— ICC (@ICC) August 27, 2024 -
మూడో ర్యాంక్‌లో స్మృతి మంధాన
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన ఒక స్థానం మెరుగుపర్చుకుంది. తాజా ర్యాంకింగ్స్ లో స్మృతి 738 రేటింగ్ పాయింట్లతో మూడో ర్యాంక్‌కు చేరుకుంది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 648 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. దీప్తి శర్మ 20వ ర్యాంక్‌లో, జెమీమా 33వ ర్యాంక్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌కు చెందిన నటాలీ సివెర్ బ్రంట్ 783 పాయింట్లతో తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. -
టీమిండియా మ్యాచ్‌లన్నీ అక్కడే!.. నో చెప్పిన ఐసీసీ!
చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సర్వసభ్య సమావేశంలో ఈ విషయంపై స్పష్టత వస్తుందని భావించినా.. అలా జరుగలేదు. రోహిత్ సేనను పాకిస్తాన్‌కు పంపేదేలేదని బీసీసీఐ పట్టుదలగా ఉన్న విషయం తెలిసిందే.అయితే, నిబంధనల ప్రకారం మ్యాచ్‌లన్నీ తమ దేశంలోనే నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. భారత జట్టును పాకిస్తాన్‌కు తీసుకువచ్చే బాధ్యత ఐసీసీకే అప్పగించినట్లు సమాచారం.టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే!ఈ విషయం గురించి పీసీబీ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య దేశంగా.. తమ కర్తవ్యాలకు అనుగుణంగా పీసీబీ డ్రాఫ్ట్ షెడ్యూల్‌తో పాటు టోర్నీ ఫార్మాట్‌కు సంబంధించిన వివరాలను ఐసీసీకి సమర్పించింది.ఈ అంశాల గురించి మిగతా దేశాల బోర్డులతో చర్చించి.. షెడ్యూల్‌ను ఖరారు చేయాల్సిన బాధ్యత ఐసీసీ మీద ఉంది. డ్రాఫ్ట్ షెడ్యూల్లో భాగంగా టీమిండియా మ్యాచ్‌లు అన్నీ(ఒకవేళ అర్హత సాధిస్తే సెమీ ఫైనల్, ఫైనల్‌లతో సహా) లాహోర్‌లో నిర్వహిస్తామని తెలిపింది.అంతేకాదు.. అక్కడి టాక్స్ విధానం, వేదికల ఎంపిక, టీమిండియా మ్యాచ్‌ల నిర్వహణకు ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అనుమతుల గురించి కూడా రాతపూర్వకంగా వివరాలు అందించింది’’ అని తెలిపాయి.ఐసీసీ నో చెప్పినట్లే!చాంపియన్స్ ట్రోఫీ-2025లో తమ మ్యాచ్‌లకు వేదిక మార్చాలన్న బీసీసీఐ డిమాండ్‌కు ఐసీసీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సర్వసభ్య సమావేశంలో భాగంగా టోర్నమెంట్ నిర్వహణ కోసం అయ్యే ఖర్చుకు గతంలో కంటే అదనపు మొత్తాన్ని బడ్జెట్లో చేర్చినట్లు తెలుస్తోంది.ఒకవేళ ఇండియా మ్యాచ్‌లను హైబ్రిడ్ విధానంలో పాక్ వెలుపల నిర్వహిస్తే దాని పర్యవసనాలు, అందుకు అయ్యే ఖర్చు కోసం ఈ మొత్తాన్ని పక్కనపెట్టినట్లు సమాచారం. కాగా డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం మార్చి 1న టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు ముహూర్తం ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
ICC: టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే?!
చాంపియన్స్ ట్రోఫీ-2025 విషయంలో వెనక్కి తగ్గేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సిద్ధంగా లేరని సమాచారం. మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లోనే నిర్వహించాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇదే విషయాన్ని నఖ్వీ అంతర్జాతీయ క్రికెట్ మండలికి కూడా చెప్పినట్లు సమాచారం. ఈ మెగా టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఐసీసీకి స్పష్టం చేసినట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.తగ్గేదేలే!కాగా వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వగా.. చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. అయితే, ఇరు దేశాల మధ్య పరిస్థితులు, భద్రతా కారణాల దృష్ట్యా బీసీసీఐ టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు సిద్ధంగా లేదు.అందుకే ఆసియా వన్డే కప్-2023 మాదిరే ఈసారి కూడా హైబ్రిడ్ విధానంలో షెడ్యూల్ ఖరారు చేయాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఆసియా టోర్నీలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు మాత్రం శ్రీలంకలో నిర్వహించారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ ఇలాగే జరగాలని బీసీసీఐ కోరుకుంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ బాధ్యత మీదే టీమిండియాను పాకిస్తాన్‌కు తీసుకువచ్చే బాధ్యత ఐసీసీదేనని.. ఈ విషయంతో తమకు ఎలాంటి సంబంధం లేదని నఖ్వీ కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. అలా జరగని పక్షంలో ఆ జట్టు టోర్నీ నుంచి వైదొలగాలే తప్ప హైబ్రిడ్ మోడల్‌కు మాత్రం తాము ఒప్పుకొనేది లేదని అతడు అన్నట్లుగా పాక్ మీడియా వెల్లడించింది.ఈ నేపథ్యంలో ఐసీసీ ఎటువైపు మొగ్గుచూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. టీమిండియా గనుక ఈ టోర్నీ ఆడకపోతే ఓవరాల్‌గా తమకు నష్టం. అదే పాక్ మాట కాదంటే తాము నష్టపోయినందుకు పరిహారం చెల్లించాలని కోరే అవకాశం ఉంది.టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే?!కొలంబోలో జరుగుతున్న ఐసీసీ సర్వసభ్య సమావేశం ముగిసేలోగా ఈ అంశంపై ఐసీసీ తుది నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ ప్రభుత్వం టీమిండియా మ్యాచ్‌లను లాహోర్‌లో నిర్వహించేందుకు షెడ్యూల్ కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాగా 2008లో చివరిసారిగా మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో టీమిండియా పాకిస్తాన్లో పర్యటించింది. చదవండి: NCAకు వీవీఎస్ లక్ష్మణ్ గుడ్‌బై.. కొత్త హెడ్ అతడే! -
కుల్దీప్ యాదవ్‌కు ఊహించని షాక్!
టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాలతో అమెరికా బిజీగా గడుపుతోంది. న్యూయార్క్‌లో ప్రాక్టీస్ సెషన్లో చెమటోడుస్తున్న క్రికెటర్లు.. తాజాగా కొత్త జెర్సీలతో ఫొటోలకు ఫోజులిచ్చారు.అదే విధంగా.. ఐసీసీ అందించే ‘‘టీమ్ ఆఫ్ ది ఇయర్’’ అవార్డులు కూడా అందుకున్న టీమిండియా స్టార్స్.. క్యాపులు ధరించి ఫొటోలు దిగారు. ఇదిలా ఉంటే.. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్టులో భాగమైన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా గురువారం క్యాప్ స్వీకరించాడు.టీమిండియాకు విలువైన ఆస్తిటీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి క్యాప్ అందజేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. క్యాప్ అందిస్తున్న సమయంలో.. ‘‘టీమిండియాకు విలువైన ఆస్తి.. అద్భుతమైన అథ్లెట్‌కు క్యాప్ అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: కుల్దీప్ యాదవ్’’ అని రోహిత్ పేర్కొన్నాడు.ఇందుకు బదులుగా.. ‘‘థాంక్యూ రోహిత్ భాయ్’’ అని కుల్దీప్ సమాధానమిచ్చాడు. ఇందుకు స్పందిస్తూ.. ‘‘నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా?’’ అని రోహిత్ కుల్దీప్ను అడిగాడు. ఏమీ లేదంటూ అతడు బదులివ్వగా.. ‘‘లేదు లేదు నువ్వు మాట్లాడాల్సిందే’’ అని రోహిత్ శర్మ పట్టుబట్టాడు.‘‘బ్యాట్‌తోనా? అదెప్పుడు?’’ఈ క్రమంలో.. ‘‘పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. అయితే, గతేడాది నేను బంతితో, బ్యాట్‌తో బాగా రాణించాను’’ అని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు. వెంటనే స్పందించిన రోహిత్.. ‘‘బ్యాట్‌తోనా? అదెప్పుడు?’’ అని సరదాగా కౌంటర్ వేశాడు.ఈ జట్టుకు నేనే కెప్టెన్‌ను!దీంతో కంగుతిన్న కుల్దీప్ టెస్టుల్లో బ్యాటింగ్ చేశానని గుర్తుచేయగా.. రోహిత్ బదులిస్తూ.. ‘‘ మనం వన్డేల గురించి మాట్లాడుతున్నాం. ఈ జట్టుకు నేనే కెప్టెన్‌ను. అయినా నువ్వు బ్యాటింగ్ చేయడం నేనెప్పుడూ చూడలేదు.కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు’’ అంటూ రోహిత్ కుల్దీప్ను ఆటపట్టించాడు. దీంతో బిక్కమొఖం వేయడం అతడి వంతైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా జూన్ 1 బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 5న ఐర్లాండ్‌తో న్యూయార్క్ వేదికగా తమ వరల్డ్‌కప్ ప్రయాణం మొదలుపెట్టనుంది.చదవండి: ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
IND vs PAK: ఒక్క టికెట్ రూ. 16 లక్షలా?.. ఐసీసీపై లలిత్ మోదీ ఫైర్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభానికి సమయం సమీపిస్తోంది. జూన్ 1 ఈ ఐసీసీ ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక ఈ మెగా టోర్నమెంట్‌కు అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.వెస్టిండీస్‌తో కలిసి వరల్డ్‌కప్ నిర్వహణ హక్కులు దక్కించుకున్న యూఎస్ఏ.. ఇప్పటికే మ్యాచ్‌లు జరిగే స్టేడియాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనిలో మునిగిపోయింది.చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆరోజేఇదిలా ఉంటే.. టీమిండియా ఈ ఈవెంట్లో తమ లీగ్ మ్యాచ్‌లన్నీ యూఎస్ఏలోనే ఆడనుంది. జూన్ 5 న ఐర్లాండ్‌తో మ్యాచ్ ద్వారా తాజా ఎడిషన్‌లో తమ ప్రయాణం మొదలుపెట్టనున్న రోహిత్ సేన.. జూన్ 9న తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.ఇక దాయాదుల పోరు అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఎప్పుడో రద్దు కాగా.. కేవలం ఆసియా కప్, ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లలో మాత్రమే టీమిండియా- పాక్‌లు ముఖాముఖి తలపడుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ హైవోల్టేజీ మ్యాచ్‌లకు మరింత ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో ఐసీసీ ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో మరీ దారుణంగా ప్రవర్తిస్తోందంటూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్త, మాజీ కమిషనర్ లలిత్ మోదీ మండిపడ్డాడు.లాభాలు దండుకోడానికి కాదుఇండియా- పాక్ మ్యాచ్‌కు వేదికైన న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ స్టేడియంలో టికెట్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు.. ‘‘వరల్డ్‌కప్‌లో ఇండియా- పాక్ మ్యాచ్ నేపథ్యంలో డైమండ్ క్లబ్ సీటు టిక్కెట్లను ఏకంగా 20000 డాలర్లకు అమ్ముతున్నారని తెలిసి షాకయ్యాను.అమెరికాలో వరల్డ్‌కప్ నిర్వహిస్తోంది క్రికెట్‌కు ఇక్కడ ఆదరణ పెంచడానికి, ఫ్యాన్ ఎంగేజ్మెంట్ కోసం మాత్రమే అనుకున్నాం. కానీ మీరు లాభాలు దండుకోడానికి కాదు’’ అంటూ ఐసీసీ తీరును లలిత్ మోదీ ఎక్స్ వేదికగా విమర్శించాడు. దాదాపు రూ. 16 లక్షలకు పైనే!కాగా 20 వేల అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ. 16 లక్షలకు పైనే! ఇక లలిత్ మోదీ ట్వీట్ చూసిన ఫ్యాన్స్ టికెట్ ధర తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే, ఈ ధరలకు సంబంధించి ఇంత వరకు అధికారిక సమాచారం మాత్రం లేదు.కాగా క్యాష్ రిచ్ లీగ్‌ను సృష్టించిన లలిత్ మోదీ ఆర్థిక అవకతవకలకు పాల్పడి దేశం నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు లండన్‌లో తలదాచుకుంటున్నట్లు సమాచారం.Shocked to learn that @ICC is selling tickets for Diamond Club at $20000 per seat for the #indvspak WC game. The WC in the US is for game expansion & fan engagement, not a means to make profits on gate collections. $2750 for a ticket It’s just #notcricket #intlcouncilofcrooks pic.twitter.com/lSuDrxHGaO— Lalit Kumar Modi (@LalitKModi) May 22, 2024 -
క్రికెట్లో కొత్త రూల్.. బ్యాటర్లకు గుడ్‌న్యూస్
కొత్త ఏడాది ఆరంభంలో బ్యాటర్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఓ గుడ్‌న్యూస్ అందించింది. స్టంపౌట్ రూల్ విషయంలో ఐసీసీ కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు వికెట్ కీపర్ స్టంపింగ్‌కు అప్పీలు చేసినప్పుడు ఆన్ ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ రిఫర్ చేసేవారు. థర్డ్ అంపైర్ తొలుత క్యాచ్(ఆల్ట్రా ఎడ్జ్)ను చెక్ చేసి.. ఆ తర్వాత స్టంప్ ఔటా కాదాన్నది పరిశీలించి తన నిర్ణయాన్ని వెల్లడించేవాడు. అయితే ఇకపై ఈ రూల్ అంతర్జాతీయ క్రికెట్లో మరి కన్పించదు. ఐసీసీ కొత్త రూల్ ప్రకారం.. ఫీల్డ్ అంపైర్లు స్టంపౌట్‌కు రిఫర్ చేస్తే, థర్డ్ అంపైర్ కేవలం స్టంపింగ్‌ను మాత్రమే చెక్ చేయాలి. అంతే తప్ప బంతి బ్యాట్‌కు తాకిందా లేదన్నది పరీశిలించాల్సిన అవసరం లేదు. ఫీల్డింగ్ జట్లు పాత నిబంధనను ఎక్కువ ఊపయోగించకోవడంతో ఐసీసీ ఈ తరహా మార్పులు చేసింది. ఈ రూల్ గతేడాది డిసెంబర్ 12 నుంచే అమలు లోకి వచ్చినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. -
CWC 2023:‘టీమ్ ఆఫ్ ద టోర్నీ’ కెప్టెన్ గా రోహిత్
వన్డే ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ‘టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్’ ఎంపిక చేసింది. ఈ జట్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మను సారథిగా నియమించింది. తుది 11 మంది జట్టులో ఆరుగురు భారత క్రికెటర్లు (రోహిత్, కోహ్లి, రాహుల్, షమీ, బుమ్రా, జడేజా) ఉన్నారు. మ్యాక్స్‌వెల్, జంపా (ఆ్రస్టేలియా), డికాక్ (దక్షిణాఫ్రికా), డరైల్ మిచెల్ (న్యూజిలాండ్), మదుషంక (శ్రీలంక) ఇతర సభ్యులుగా ఉన్నారు. -
అరుదైన అవకాశం
సాక్షి, హైదరాబాద్: క్రికెట్లో అరుదుగా కనిపించే వ్యక్తులు మహిళా అంపైర్లు. మహిళలు జాతీయ స్థాయి మ్యాచ్‌లకు అంపైర్లుగా వ్యవహరించడమే గగనంగా కనిపించే ఈ రోజుల్లో... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) డెవలప్మెంట్ అంపైర్స్ ప్యానెల్లో భారత మహిళా అంపైర్లు తమ సంఖ్య పెంచుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు మహిళ జీఎస్ లక్ష్మి మ్యాచ్ ఐసీసీ రిఫరీస్ ప్యానల్లో చోటు దక్కించుకోగా... తాజాగా ఈ జాబితాలో మరో ఇద్దరు చేరారు. చెన్నైకి చెందిన జననీ నారాయణ్, నవీ ముంబైకి చెందిన వృందా రాఠి ‘ఐసీసీ డెవలప్మెంట్ అంపైర్స్’ అంతర్జాతీయ ప్యానల్‌కు ఎంపికైనట్లు బీసీసీఐ బుధవారం ప్రకటించింది. దీంతో ఈ ప్యానల్లో భారత మహిళా అధికారుల సంఖ్య మూడుకు చేరింది. ఈ డెవలప్మెంట్ అంపైర్స్ ప్యానల్ అనేది పలు రీజియన్లకు చెందిన అత్యుత్తమ అంపైర్లు, రిఫరీలను ఎంపిక చేసి అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకు ఉపయోగపడుతుంది. అత్యంత కఠినంగా ఉండే బీసీసీఐ లెవల్–2 అంపైరింగ్ పరీక్షను పాసైన మహిళా అధికారులుగా గతంలోనే గుర్తింపు తెచ్చుకొని.... ప్రస్తుతం అత్యున్నత స్థాయి అంపైరింగ్ ప్యానల్లో చోటు దక్కించుకున్న జనని, వృందా గురించి చూస్తే... జననీ నారాయణ్: 34 ఏళ్ల జనని 2018 నుంచి దేశవాళీ టోర్నీలకు అంపైర్‌గా వ్యవహరిస్తోంది. క్రికెట్ వీరాభిమాని అయిన జనని ఇంగ్లండ్ అంపైర్ డేవిడ్ షెఫర్డ్, ఎస్. వెంకటరాఘవన్ (భారత్)లను ఆదర్శంగా తీసుకుంది. 2015లోనే తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి లోకల్ డివిజన్ మ్యాచ్‌లకు అధికారిగా వ్యవహరించింది. ఎంసీసీ నిబంధనలపై మంచి పట్టు ఉన్న ఆమె... ఎంతో కష్టపడి బీసీసీఐ లెవల్–1 కోర్సును కూడా పూర్తిచేసింది. తర్వాత థియరీ, ప్రాక్టికల్స్‌తో కూడిన కఠినమైన లెవల్–2 పరీక్షలోనూ మెరుగ్గా రాణించి.. జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించింది. వృందా రాఠీ: మాజీ క్రికెటర్, స్కోరర్ అయిన వృందాకు క్రికెట్‌తో మంచి అనుబంధముంది. స్వతహగా మీడియం పేసర్ అయిన వృందా కాలేజీ స్థాయిలో 2007 నుంచి వరుసగా నాలుగేళ్ల పాటు ముంబై యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించింది. 2008–09 ఆలిండియా చాంపియన్‌గా నిలిచిన ముంబై యూనివర్సిటీ జట్టులో ఆమె సభ్యురాలు కూడా. అదే ఏడాది నుంచి బీసీసీఐ స్కోరర్‌గా కెరీర్ ప్రారంభించిన వృందా... 2013 మహిళల ప్రపంచ కప్‌లోనూ ఆమె స్కోరర్‌గా పనిచేసింది. న్యూజిలాండ్ అంపైర్ క్యాతీ క్రాస్‌ను చూసి స్ఫూర్తి పొంది అంపైరింగ్ వైపు మొగ్గు చూపింది. 2014లో రాష్ట్ర స్థాయిలో అంపైరింగ్ పరీక్ష పాసైన వృందా వివిధ స్థాయి టోర్నీల్లో 150 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించింది. తర్వాత 2016లో బీసీసీఐ లెవల్–1 పరీక్షలో 94 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి 2017లో లెవల్–1 కోర్సును పూర్తిచేసింది. 2018లో లెవల్–2ను ముగించి ‘బీసీసీఐ దేశవాళీ అంపైర్ల ప్యానల్’లో చోటు దక్కించుకుంది. -
యంగెస్ట్ క్రికెట్ కోచ్.. పేదరికంతో ఎదగలేక
బంజారాహిల్స్: లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడా యువకుడు. పేదరికంలో ఉన్నా పట్టుదలతో సాధన చేసి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు నగరానికి చెందిన పంతొమ్మిదేళ్ల షేక్ మహ్మద్ గౌస్. ఈ పేద యువకుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో ఇండియా నుంచి యంగెస్ట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. అహర్నిశలు కష్టపడి సాధన చేసి పెద్దలను మెప్పించి ఈ స్థాయికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడి ప్రయాణం అంత సాదాసీదాగా సాగలేదు. టోలిచౌకిలో నివసించే గౌస్ తండ్రి అబ్దుల్ ఖాదర్ వలీ వికలాంగుడు కాగా, తల్లి పర్వీన్ చీరలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కృష్ణానగర్‌లోని విద్యానికేతన్ స్కూల్లో పదో తరగతి వరకు చదివిన మహ్మద్ గౌస్ ప్రస్తుతం కూకట్‌పల్లిలోని గౌతమి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. తన పదో ఏట నుంచే క్రికెట్ పట్ల మక్కువ పెంచుకున్న ఇతడు స్కూల్‌తో పాటు కాలేజీలోనూ క్రికెట్ టీమ్‌లో అద్భుత ప్రతిభ చూపించాడు. అయితే, ఆర్థికంగా వెనుకబడటం, పెద్దల ప్రోత్సాహం లేకపోవడంతో ప్రతిభ ఉన్నా జాతీయ జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు. అండర్–19 జట్టులోకి వెళ్లడానికి ఇతడు చేసిన ప్రయత్నాలకు కూడా ప్రోత్సాహం లేకపోవడంతో విఫలమయ్యాయి. సురేందర్ అగర్వాల్ టీమ్‌లో ఆడిన మహ్మద్ గౌస్ ప్రతిభ దశదిశలా చాటినట్లయింది. గత ఆగస్టులో దుబాయ్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో మహ్మద్ గౌస్‌ను ఎంగెస్ట్ కోచ్‌గా నియమించారు. యూఏఈ క్రికెట్ యాజమాన్యం ఈ యువకుడ్ని కోచ్‌గా రావాలంటూ పిలిచినా వెళ్లలేదు. మనదేశాన్ని వదిలి మరో దేశానికి వెళ్లి కోచింగ్ ఇవ్వడానికి మనసొప్పలేదని చెబుతున్నాడీ యువకుడు. క్రికెట్లో చిన్నారులకు శిక్షణ ఇస్తున్న గౌస్ నాలా ఎవరూ కాకూడదు.. ప్రస్తుతం తాను అమీర్‌పేట ధరంకరం రోడ్డులో 11 మంది చిన్నారులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పాడు గౌస్. ఇందులో ఫీజు కట్టలేని వారికి మినహాయింపునిచ్చి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. వచ్చే జనవరి నాటికి 25 మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించాడు. ప్రతిభ ఉండికూడా పేదరికంతో క్రికెట్ ఆడలేని ఎంతోమంది తనలాగే నిస్సహాయులుగా మిగిలిపోతున్నారని, జాతీయ జట్టులో ఆడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనలాగా మరొకరు కాకూడదని క్రికెట్లో ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్టు చెబుతున్నాడు. ఉత్తమ క్రీడాకారులను తయారు చేస్తా.. తాను కోచింగ్ తీసుకోవడానికి ఆర్థిక పరిస్థితులు అడ్డొవచ్చాయని, దీంతో ముందుకు వెళ్లలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసిన మహ్మద్ గౌస్.. రాబోయే రోజుల్లో హైదరాబాద్ నుంచి ఉత్తమ క్రీడాకారులను తయారు చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడేలా తీర్చిదిద్దుతానన్నాడు. తనకు కోచింగ్ ఇవ్వడానికి మంచి స్థలం కేటాయిస్తే ఎంతోమంది పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందన్నాడు. క్రికెట్ ఆడాలకునే ఎంతో మంది చిన్నారులకు శిక్షణ తీసుకోవాలని ఉన్నా మైదానాలు, సౌకర్యాలు లేక వెనకబడిపోతున్నారని ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వాలు ముందు చూపుతో గ్రౌండ్లు కేటాయించాలని కోరాడు. 110 ఏళ్ల క్రికెట్ చరిత్రలో.. క్రికెట్‌కున్న 110 ఏళ్ల చరిత్రలో 19 ఏళ్ల వయసులో ఇంతవరకు ఎవరూ కోచ్ కాలేదని, ఈ ఘనత తనకు మాత్రమే దక్కిందని గౌస్ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే తనకు లభించిన ఈ ఘనతను ఇంకా చాలా మంది గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘యంగెస్ట్ కోచ్’గా తనకు లభించిన గుర్తింపు సంపన్నుల పిల్లలకు లభించి ఉంటే ఎంతో ఆర్భాటం చేసి ఉండేవారని.. ప్రభుత్వాలు కూడా గౌరవించేవన్నాడు. కానీ పేదలు ఎన్ని విజయాలు, ఘనతలు సాధించినా దానికి ప్రభుత్వం నుంచి ఏమాత్రం గుర్తింపు లేదనడానికి తానే నిదర్శనమన్నాడు. -
మైదానంలో మాటల యుద్ధం
మైదానంలో మాటల యుద్ధం ఇప్పుడు మూకీ సినిమానుంచి టాకీ వరకు చేరింది... కొన్నాళ్ల క్రితం వరకు ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసుకున్నా పెదాల కదలికతోనే వారేం అనుకున్నారో అభిమానులు ఊహించేసుకునేవారు...కానీ మీకు అంత కష్టమెందుకు మేమున్నామంటూ ప్రసారకర్తలు అర్థ తాత్పర్యాలతో వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. తాజాగా కోహ్లి, పైన్ సంభాషణ స్పష్టంగా వినిపించడం కూడా అలాంటిదే. ఇటీవలి వరకు కేవలం మ్యాచ్ సాగుతున్న సమయంలో మాత్రమే స్టంప్ మైక్‌లు పని చేసేవి. బంతి డెడ్ కాగానే, విరామంలో అన్నీ బంద్. కానీ తాజా భారత్, ఆస్ట్రేలియా సిరీస్ నుంచి సర్వకాలాల్లో మైక్‌లు పని చేసే విధంగా నిబంధన సవరించడంతో క్రికెటర్లు క్షణక్షణం అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. క్రికెట్లోకి టెక్నాలజీ చొచ్చుకొస్తోంది. కాలంతో పాటు ఈ పరిణామం సహజం అనుకున్నా... అది మరీ ‘పిచ్’లోకే వచ్చేసింది. దూషణలు, సంభాషణలు, వాదనలు, వివాదాలతో పాటు ఆటగాడి కనీస ప్రతిస్పందనలనూ బయటపెట్టేస్తోంది. చివరకు తమను దెబ్బతీసేందుకు ఓ సాధనంగా వాడుతున్నారంటూ పర్యాటక జట్లు వాపోయేంతగానూ మారుతోంది. ప్రస్తుత ఆస్ట్రేలియా–భారత్ టెస్టు సిరీస్‌లో జరుగుతున్న ఘటనలు ఈ కోణంలో మరింత చర్చ రేపుతున్నాయి. ఇప్పటికైతే ఇవి కాస్త ఆసక్తికరంగా ఉన్నప్పటికీ... మున్ముందు విషయం ఎక్కడవరకు వెళ్తుందో చూడాలి. ఈ చెవులు... చాలా పెద్దవి కొద్ది రోజుల క్రితం వరకు మ్యాచ్‌లో ఓవర్ మధ్య విరామం సందర్భంగా ‘స్టంప్ మైక్’లు ఆఫ్ అయ్యేవి. అయితే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నవంబర్ నుంచి తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం స్టంప్ మైక్‌లు నిరంతరం ఆన్‌లో ఉంటాయి. అంటే, విరామం సందర్భంలోనూ పిచ్ పరిసరాల్లో జరిగే సంభాషణలు రికార్డవుతుంటాయి. ఈ విధంగానే పెర్త్ టెస్టులో ఇషాంత్–జడేజా వాగ్యుద్ధం, అంతకుముందు పరస్పరం రెచ్చగొట్టుకున్నట్లు సాగిన కోహ్లి–పైన్ సంవాదం, ‘కోహ్లిని మీరు కెప్టెన్‌గా చూడొచ్చేమో... అతడు అంత మంచివాడేమీ కాద’ని మురళీ విజయ్‌తో పైన్ అన్న మాటలు వెలుగులోకి వచ్చాయి. మామూలుగా అయితే ఎవరైనా చెబితేనే తెలిసే సంగతులివి. కానీ, స్టంప్ మైక్ ఆన్‌లోనే ఉండటంతో చాలా సులువుగా అందరికీ చేరిపోయాయి. ఇక్కడ మ్యాచ్ ప్రసారకర్తల పాత్రనూ తక్కువ చేయలేం. ప్రసార‘కక్షదారులు’ ఐసీసీ ఏ ఉద్దేశంలో తెచ్చిందోగాని, తాజా నిబంధన క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇదే సమయంలో మ్యాచ్ అధీకృత ప్రసార సంస్థలు తమ దేశ జట్లకు ఉపయోగపడేలా లీకులు ఇస్తుండటంతో పర్యాటక జట్లను మానసికంగా దెబ్బకొట్టే ఎత్తుగడగానూ మారింది. ఉదాహరణకు పెర్త్ టెస్టులో భారత పేసర్ ఇషాంత్‌శర్మ, సబ్‌స్టిట్యూట్ ఆటగాడు రవీంద్ర జడేజా మధ్య వాగ్యుద్ధం మ్యాచ్ నాలుగో రోజున చోటుచేసుకుంది. వాస్తవంగా అదే రోజు దీనిని బయటపెట్టాలి. కానీ, మ్యాచ్ ప్రసారకర్త ‘చానెల్ 7’ ఈ ఫీడ్‌ను మరుసటి రోజు విడుదల చేసింది. చిత్రమేమంటే... ఇదే సమయంలో షమీ బౌన్సర్ హెల్మెట్‌కు తగిలి ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్‌కు చుక్కలు కనిపించాయి. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఇషాంత్–జడేజా ఉదంతాన్ని చెప్పడం ద్వారా టీమిండియాలో విభేదాలు ఉన్నాయని చాటాలని చూసింది. వారిద్దరి మధ్య సంభాషణ కూడా ఆ ఫుటేజీలో స్పష్టంగా వినిపించింది. దాంతో భారత జట్టు మేనేజ్మెంట్ కల్పించుకుని... తమ జట్టులో అంతా బాగుందని చెప్పుకోవాల్సి వచ్చింది. అంతకుముందు అడిలైడ్ టెస్టులో ఇషాంత్‌పై ఇలాగే గురిపెట్టింది. వరుసగా ‘నోబాల్స్’ వేస్తుండటంతో అతడి బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకుని తీక్షణ పరిశీలనకు దిగింది. మొత్తం ఐదు నోబాల్స్ వేస్తే మూడింటినే ప్రకటించారంటూ విశ్లేషించింది. తద్వారా మ్యాచ్ అధికారులను మించిన పాత్ర పోషించింది. ఇందులో ప్రత్యర్థిని ఆత్మరక్షణలో పడేయడంతో పాటు సొంత జట్టును పైమెట్టు ఎక్కించే వ్యూహం దాగుండటం గమనార్హం. ఒకవిధంగా చెప్పాలంటే గూఢచారి పాత్ర అన్నమాట. అంతకుముందు... ఆ తర్వాత ఇప్పుడంటే ఆస్ట్రేలియాకు లాభం చేకూర్చాలని చూస్తున్నదని చానెల్ 7 తీరును చెప్పుకొంటున్నాం గానీ, అసలు ప్రసారకర్తల దృష్టిలో పడి చావుదెబ్బ తిన్నది ఆస్ట్రేలియానే. ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో కేప్‌టౌన్ టెస్టులో ఫీల్డ్ అంపైర్లు, మూడో అంపైర్ సహా ఎవరూ పసిగట్టలేని ఆసీస్ ఆటగాళ్ల బాల్ ట్యాంపరింగ్‌ను బయటపెట్టింది మ్యాచ్ ప్రసారకర్తే. విదేశంలో జరిగింది కాబట్టి అప్పటి ఆస్ట్లేలియా కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్, ఓపెనర్ బాన్‌క్రాఫ్ట్ తప్పించుకోలేనంతగా దొరికిపోయారు. ఈ ఘటన స్వదేశంలో జరిగి ఉంటే, ఆ ఫీడ్‌ను తొక్కిపట్టి ఆసీస్‌ను బయటపడేసే వారే. అంతకుముందు భారత పర్యటనలో తమ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్, భారత స్పిన్నర్ జడేజా మధ్య చోటుచేసుకున్న వివాదాన్ని బీసీసీఐ కావాలనే కొంత ఆలస్యంగా బయటపెట్టిందని స్మిత్ అప్పట్లో విమర్శించడం గమనార్హం. -
100 కోట్ల మంది క్రికెట్ అభిమానులు!
దుబాయ్: క్రికెట్‌ను విశ్వవ్యాపితం చేసేందుకు టి20నే సరైన ఫార్మాట్‌గా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గుర్తించింది. ఇటీవలి కాలంలో వేర్వేరు దేశాల్లో క్రికెట్ గురించి ఆదరణ పెరగడానికి టి20 కారణమైందని ఐసీసీ నిర్ధారణకు వచ్చింది. ఐసీసీ భారీ స్థాయిలో నిర్వహించిన గ్లోబల్ మార్కెట్ సర్వే ఈ అంశాలను వెల్లడించింది. 12 టెస్టు దేశాలతో పాటు భవిష్యత్తులో క్రికెట్ మార్కెట్‌ను విస్తృతం చేయగలిగే అవకాశమున్న అమెరికా, చైనా దేశాలలో ఈ సర్వే జరిపారు. వంద కోట్ల మంది అభిమానుల్లో 95.2 కోట్ల మంది ఈ 14 దేశాల్లోనే ఉంటే (ఇందులో 90 శాతం మంది ఉపఖండానికి చెందిన వారే) 8.7 కోట్ల మంది ప్రపంచంలోని మిగతా దేశాల్లో ఉన్నారు. 87 శాతం మంది టి20 ఫార్మాట్‌తో ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండాలని కోరుకోవడం విశేషం. ఐసీసీ గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ విశేషాలు ► ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు: సుమారు 100 కోట్లకు పైగా (16–69 మధ్య వయసువారు) ► సర్వేలో పాల్గొన్నవారు: సుమారు 30 కోట్ల మంది æ మహిళా అభిమానుల సంఖ్య: 39 శాతం ► మూడు ఫార్మాట్లు ఇష్టపడేవారు: 64 శాతం æ టి20లు: 92 శాతం, వన్డేలు: 88 శాతం, టెస్టులు: 69 శాతం (విడివిడిగా) ► ప్రపంచకప్ లాంటి ఐసీసీ ఈవెంట్లు బాగా ఇష్ట పడే వారు: 95 శాతం ► మహిళల క్రికెట్ కవరేజి కోరుకుంటున్నవారు: 70 శాతం. -
నియమావళిని సవరిస్తాం
న్యూఢిల్లీ: ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిలో సవరణలు చేపడతామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సీఈఓ డేవిడ్ రిచర్డ్సన్ వెల్లడించారు. బాల్ ట్యాంపరింగ్, శ్రుతిమించిన స్లెడ్జింగ్‌లాంటి వ్యవహారాలను సీరియస్‌గా తీసుకుంటామని, కఠిన చర్యలకు ఊతమిచ్చేలా నియమావళిని మారుస్తామని ఆయన చెప్పారు. ‘త్వరలోనే మార్పులకు శ్రీకారం చుడతాం. నియమావళికి చెప్పుకోదగ్గ సవరణలు తీసుకొస్తాం. దీని వల్ల జరిగిన తప్పిదాలకు తగిన శిక్షలు వేసే ఆస్కారం ఉంటుంది. దీంతో తీవ్రమైన తప్పులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు’ అని అన్నారు. ఫుట్‌బాల్‌లో ఉన్నట్లు ఎల్లో, రెడ్ కార్డులను క్రికెట్లోనూ ప్రవేశపెడితే వచ్చే ప్రయోజనమేమీ తనకు కనబడటం లేదన్నారు. ‘ఇదివరకే దీనిపై ఐసీసీ చర్చించింది కూడా! మళ్లీ మరోసారి చర్చించాల్సిన అవసరముంది. అయితే ఈ కార్డులతో పరిస్థితిలో మార్పుంటుందని నేననుకోవడం లేదు’ అని రిచర్డ్సన్ తెలిపారు. -
'క్రికెట్' కాస్త కొత్తగా...
భారత్‌తో ఇటీవల జరిగిన టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఉపుల్ తరంగ పరుగు పూర్తి చేసే ప్రయత్నంలో నిర్ణీత సమయంలోపే బ్యాట్‌ను క్రీజులో ఉంచగలిగాడు. అయితే వేగంగా నేలను తాకిన బ్యాట్ అనూహ్యంగా గాల్లోకి లేచింది. సరిగ్గా అదే సమయంలో కీపర్ సాహా బెయిల్స్ పడగొట్టడంతో తరంగ రనౌట్‌గా వెనుదిరిగాడు. అంతకు ముందు చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ కూడా ఇదే తరహాలో అవుటయ్యాడు. అయితే ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై అలాంటిది నాటౌట్‌గా గుర్తిస్తారు. దీంతో పాటు మరికొన్ని నిబంధనలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా బ్యాట్ పరిమాణం, ఫుట్‌బాల్ తరహాలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే మైదానం బయటకు పంపడంలాంటివి కూడా ఉన్నాయి. దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రూపొందించిన కొత్త నిబంధనలు ఈ నెల 28 నుంచి అమల్లోకి వస్తున్నాయి. భారత్–ఆస్ట్రేలియా, ఇంగ్లండ్–వెస్టిండీస్ సిరీస్‌లు ఇప్పటికే కొనసాగుతున్న కారణంగా మిగతా మ్యాచ్‌లను పాత నిబంధనల ప్రకారమే నిర్వహిస్తారు. త్వరలో జరిగే దక్షిణాఫ్రికా–బంగ్లాదేశ్, పాకిస్తాన్–శ్రీలంక సిరీస్‌ల నుంచి కొత్త రూల్స్ వర్తిస్తాయి. 2000 నుంచి ఇప్పటి వరకు అవసరాన్ని బట్టి ఐసీసీ క్రికెట్ నిబంధనల్లో ఆరు సార్లు మార్పుచేర్పులు చేసింది. ‘మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) క్రికెట్ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. దానికి అనుగుణంగానే ఐసీసీ కూడా వాటిని అనుసరించాలని నిర్ణయించింది. కొత్త మార్పులపై అంపైర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాం. అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఇకపై వీటిని అమలు చేసే సమయం ఆసన్నమైంది’ అని ఐసీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్) జెఫ్ అలార్డిస్ చెప్పారు. ముఖ్యంగా బ్యాట్‌కు, బంతికి మధ్య అంతరం తగ్గించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. రేపటి నుంచి కొత్తగా అమల్లోకి రానున్న కొన్ని ప్రధాన ఐసీసీ నిబంధనల వివరాలు ఇలా ఉన్నాయి. ► బ్యాట్ పొడవు, వెడల్పులో ఎలాంటి పరిమితులు లేకపోయినా... బ్యాట్ మందం 67 మిల్లీ మీటర్లకు మించరాదు. అనుమానం వస్తే అంపైర్లు బ్యాట్ మందాన్ని పరికరంతో పరీక్షిస్తారు. ఇప్పటి వరకు వార్నర్ తదితరులు ఎక్కువ మందం కలిగిన భారీ బ్యాట్లు వాడుతున్నారు. ► బౌండరీ వద్ద గాల్లోకి ఎగిరి ఫీల్డర్లు పట్టే క్యాచ్‌లు ఇటీవల తరచుగా కనిపిస్తున్నాయి. బౌండరీ దాటి గాల్లోనే దాన్ని లోపలికి తోసి మళ్లీ వాటిని అందుకుంటున్నారు. అయితే ఇందులో మార్పు చేశారు. ఇకపై ఫీల్డర్ బంతిని తాకే సమయంలో కూడా అతను బౌండరీ లోపలే ఉండాలి. లేదంటే బౌండరీగా పరిగణిస్తారు. ► బ్యాట్స్‌మన్ పరుగు పూర్తి చేసే సమయంలో ఫీల్డర్/కీపర్ వికెట్లు పడగొట్టడానికి ముందే అతని బ్యాట్‌గానీ, అతనుగానీ క్రీజులో చేరి... ఆ తర్వాత బ్యాట్ గాల్లోకి ఎగరడం లేదా బ్యాట్స్‌మన్ నియంత్రణ కోల్పోయినా అతను సురక్షితంగా క్రీజులో అడుగు పెట్టినట్లే లెక్క. దానిని రనౌట్‌గా పరిగణించరు. ► ఇప్పటి వరకు బ్యాట్స్‌మన్ ఒక్కసారి మైదానం వీడితే అతడిని వెనక్కి పిలవడానికి లేదు. అయితే అతను నాటౌట్‌గా తేలితే ఇకపై తర్వాతి బంతి వేసే లోపు మళ్లీ వెనక్కి పిలుచు కోవచ్చు. ‘హ్యాండిల్డ్ ద బాల్’ (వికెట్ల వైపు వెళ్లే బంతిని చేతితో ఆపడం) నిబంధనను పూర్తిగా తొలగించి దానిని ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’లోకి కలిపేశారు. ► ఐసీసీ లెవల్ 4 నిబంధన ప్రకారం మైదానంలో ఆటగాడు హద్దు మీరి దురుసుగా ప్రవర్తిస్తే అంపైర్ అతడిని మొత్తం మ్యాచ్‌లో ఆడకుండా తప్పించవచ్చు. ఉద్దేశపూర్వకంగా నోబాల్ వేసినప్పుడు, బ్యాట్స్‌మన్ క్రీజ్ దాటి చాలా ముందుకు వచ్చి గార్డ్ తీసుకున్నప్పుడు చర్యలు తీసుకునే అధికారాన్ని అంపైర్లకు అప్పజెప్పారు. ► బౌలర్ బంతిని విసిరిన తర్వాత క్రీజులోకి చేరేలోపు రెండు సార్లు నేలను తాకితే దానిని నోబాల్‌గా పరిగణిస్తారు. పిచ్‌కు దూరంగా బంతి పడినా దానిని నోబాల్‌గానే ప్రకటిస్తారు. నోబాల్ కీపర్‌కు అందకుండా వెళ్లి బౌండరీని తాకితే బౌలర్ నోబాల్ మాత్రమే వేసినట్లు. బైస్ను అతని ఖాతాలో కలపరు. ► బ్యాట్స్‌మన్ షాట్ కొట్టిన తర్వాత బంతి ఫీల్డర్ లేదా వికెట్ కీపర్ హెల్మెట్‌కు తగిలి వచ్చినా సరే... ఫీల్డర్ క్యాచ్ పడితే దానిని అవుట్‌గా పరిగణిస్తారు. ఇప్పటి వరకు అలా వస్తే అది నాటౌట్‌గా ఉండేది. ► అంతర్జాతీయ టి20ల్లో కూడా అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్)ను అమలు చేస్తారు. ఒక ఇన్నింగ్స్‌లో ఒక రివ్యూకు అవకాశం ఉంటుంది. టెస్టుల్లో రివ్యూ చేసిన సమయంలో ‘అంపైర్ నిర్ణయం’ సరైనదిగా డీఆర్ఎస్ చూపించినప్పుడు జట్టు ఒక రివ్యూను కోల్పోదు. దీని వల్ల ఇకపై ఇన్నింగ్స్‌కు 2 రివ్యూలు మాత్రమే ఉంటాయి. 80 ఓవర్ల తర్వాత అదనంగా మరో 2 రివ్యూలు చేరడం ఉండదు. -
బిగ్–3 ఫార్ములా కొనసాగించాలి
బీసీసీఐ ఎస్‌జీఎంలో ఏకగ్రీవ నిర్ణయం న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో ప్రస్తుతమున్న ఆదాయ విభజన ఫార్ములా ‘బిగ్–3’ని కొనసాగించాల్సిందేనని బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర క్రికెట్ సంఘాలన్నీ ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని అమోదించాయి. ఐసీసీకి వచ్చే ఆదాయంలో సింహభాగం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డులకు దక్కేలా ఫార్ములా అమలవుతున్న సంగతి తెలిసిందే. జూన్‌లో లండన్‌లో జరిగే ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం వరకు ఈ బిగ్–3 ఫార్ములాను కొనసాగించాలని బీసీసీఐ తేల్చిచెప్పింది. ఈ ఫార్ములాకు విరుద్ధంగా ఐసీసీ నిర్ణయం తీసుకుంటే చాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత్ వైదొలగాలనే డిమాండ్‌ను మాత్రం రాష్ట్ర సంఘాలు వ్యతిరేకించాయి. అలాంటి నిర్ణయం తగదని సూచించాయి. ఈ నెల 27, 28 తేదీల్లో దుబాయ్‌లో జరిగే ఐసీసీ బోర్డు మీటింగ్‌లో బీసీసీఐ వైఖరిని చెప్పేందుకు అమితాబ్ చౌదరి భారత బోర్డు ప్రతినిధిగా హాజరు కానున్నారు. భారత ప్రయోజనాలు కాపాడటమే తమ ముఖ్య ఉద్దేశమని చౌదరి ఈ సందర్భంగా చెప్పారు. నజరానా రెట్టింపు: ఆస్ట్రేలియాపై 2–1తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత ఆటగాళ్లకు ఇచ్చే నజరానాను రెట్టింపు చేశారు. ఒక్కొక్కరికి రూ. కోటి ఇవ్వాలని బీసీసీఐ సమావేశంలో నిర్ణయించారు. ఇంతకుముందు రూ. 50 లక్షలు చొప్పున ప్రోత్సాహక బహుమతి ఇస్తామని బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పుణే పిచ్ నాసిరకం
నివేదిక ఇచ్చిన మ్యాచ్ రిఫరీ బీసీసీఐ వివరణ కోరిన ఐసీసీ పుణే: ఊహించినట్లుగా పుణే పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరిగిన ఈ పిచ్‌ను నాసిరకమైనదిగా ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. టెస్టు ముగిసిన అనంతరం మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ తన నివేదికను ఐసీసీకి అందజేశారు. ‘ఐసీసీ పిచ్, అవుట్ ఫీల్డ్ నిర్వహణకు సంబంధించిన క్లాజ్–3 ప్రకారం బ్రాడ్ ఐసీసీకి నివేదిక ఇచ్చారు. ఇందులో పుణే పిచ్ నాణ్యతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు’ అని ఐసీసీ ప్రకటించింది. ఈ నివేదికను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పంపించామని, దీనిపై స్పందించేందుకు 14 రోజుల గడువు ఇచ్చినట్లు కూడా ఐసీసీ వెల్లడించింది. బీసీసీఐ ఇచ్చే వివరణను ఐసీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్) జెఫ్ అలార్డిస్, రంజన్ మదుగలే సమీక్షిస్తారు. తుది సమీక్షలో పుణే పిచ్ కనీస ప్రమాణాలను పాటించలేదని తేలితే తొలి టెస్టు మ్యాచ్ కాబట్టి హెచ్చరికతో వదిలేయడం లేదా అత్యధికంగా 15 వేల డాలర్ల జరిమానా పడే అవకాశం ఉంది. ఈ నెల 23 నుంచి 25 వరకు మూడు రోజుల్లోపే ముగిసిన పుణే టెస్టులో భారత్ 333 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. తొలి రోజు నుంచే ఈ వికెట్‌పై బంతి అనూహ్యంగా స్పిన్ అయింది. ఇరు జట్లు కలిపి కోల్పోయిన మొత్తం 40 వికెట్లలలో 31 వికెట్లను స్పిన్నర్లే పడగొట్టారు. 2015 డిసెంబర్లో కూడా ఇదే తరహాలో నాగ్‌పూర్ పిచ్‌ను కూడా ఐసీసీ తప్పుపట్టింది. మూడు రోజులకే ముగిసిన ఆ మ్యాచ్‌లో కూడా భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడింది. ఆరు రకాలుగా విభజన... అంతర్జాతీయ పిచ్‌లను నాసిరకం (పూర్)గా గుర్తించే ముందు ఐసీసీ కొన్ని ప్రమాణాలు పాటిస్తుంది. టెస్టు మ్యాచ్ పిచ్‌కు రేటింగ్ ఇవ్వడంలో ఆరు రకాల కేటగిరీలు ఉన్నాయి. వెరీ గుడ్, గుడ్, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్, పూర్, అన్‌ఫిట్ అనే కేటగిరీలు ఉన్నాయి. ఇందులో పిచ్ ప్రమాదకరంగా ఉంటే అన్‌ఫిట్‌గా తేలుస్తారు. ఇప్పుడు పుణే పిచ్‌ను ఐసీసీ పూర్ కేటగిరీలో చేర్చింది. ఇందు కోసం నాలుగు అంశాలు ప్రామాణికంగా ఉంటాయి. ► మ్యాచ్‌లో ఏ దశలోనైనా బంతి సీమ్ గమనం చాలా ఎక్కువగా ఉండటం. ► మ్యాచ్‌లో ఏ దశలోనైనా పిచ్‌పై బౌన్స్‌లో తేడాలు చాలా ఎక్కువగా ఉండటం. ► మ్యాచ్ ప్రారంభంలోనే పిచ్ స్పిన్ బౌలర్లకు చాలా ఎక్కువగా సహకరించడం. ► మ్యాచ్‌లో ఏ దశలోనైనా పిచ్‌పై అసలు ఏమాత్రం బంతి సీమ్, టర్న్ కాకపోవడం లేదా అసలు బౌన్స్ లేకపోవడం. ఈ రకంగా బ్యాటింగ్, బౌలింగ్ మధ్య సమతూకాన్ని ఏ మాత్రం పాటించకపోవడం అంటే బౌలర్లను దెబ్బ తీయడమే. -
బీసీసీఐకి భారీ దెబ్బ!
నూతన ఆదాయ పంపిణీ విధానంతో రూ. 1400 కోట్ల మేర నష్టం! న్యూఢిల్లీ: తమ ఆర్థిక ప్రయోజనాలకు భారీగా కోత విధించే నిర్ణయం తీసుకున్నందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఎలాగైనా ఈ అడ్డంకిని అధిగమించాలనే ఆలోచనలో ఉన్న బోర్డు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయనుంది. భారత్‌లో క్రికెట్‌కున్న క్రేజ్‌ను సొమ్ము చేసుకుంటూ ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన బోర్డుగా బీసీసీఐ పేరు తెచ్చు కుంది. అయితే తాము ఐసీసీకి ఎంత ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నా అందరితోపాటే తమకూ సమానంగా పంపిణీ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయింది. 2007 నుంచి 2015 వరకు ఐసీసీ అన్ని టెస్టు దేశాలకు సమానంగా ఆదాయాన్ని పంచేది. దీంతో బీసీసీఐ సహా అన్ని బోర్డులకు కూడా సమానంగా దాదాపు 52.5 మిలియన్ డాలర్లు (రూ.353 కోట్లు) దక్కేవి. అయితే ఈ పంపిణీని క్రికెట్ పెద్దన్నగా పరిగణించబడే బీసీసీఐ ఇష్టపడలేదు. దీంతో తమ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందనే కారణంతో 2014లో ఐసీసీ చైర్మన్‌గా ఉన్న ఎన్.శ్రీనివాసన్ నూతన ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చారు. దీంట్లో భాగంగానే ‘బిగ్ త్రీ’ నమూనా తెర పైకి వచ్చింది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుల నుంచి అధికంగా ఆదాయం వస్తుంది కాబట్టి వారికి వాటా కూడా అదే నిష్పత్తి ప్రకారం దక్కాలనేది దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో భారత్‌కు అధికంగా 20.3 శాతం ఆదాయం దక్కాల్సి ఉంటుంది. ఈ లెక్క ప్రకారం ఎనిమిదేళ్ల కాలానికి (2015–23) ఐసీసీ ఆదాయంలో భారత్‌కు రూ.3,400 కోట్లు దక్కుతుందని లెక్కగట్టారు. కానీ 2015లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్‌గా ఎంపికయ్యాక పరిస్థితులు తలక్రిందులయ్యాయి. ఆయన ‘బిగ్ త్రీ’ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పంపిణీ ద్వారా చిన్న దేశాలు చితికిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కొత్త ఆర్థిక విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఇది భారత క్రికెట్ బోర్డు ఆర్జనకు నష్టం చేకూర్చేది కావడంతోనే ప్రస్తుతం వ్యతిరేకిస్తోంది. బీసీసీఐకి దక్కేది ఎక్కువే... తాజాగా శనివారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో నూతన ఆర్థిక విధానంపై చర్చ జరిగింది. దీనివల్ల బీసీసీఐ వాటా తగ్గినా.. ఇతర సభ్య దేశాలతో పోలిస్తే ఎక్కువగానే ఆదాయం ఆర్జించే అవకాశం ఉంది. 2015–2023 వరకు సాగే ఈ కొత్త నమూనాలో ఐసీసీ నుంచి భారత బోర్డు 290 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.2,000 కోట్లు) ఆర్జించనుంది. ఇతర సభ్యదేశాలకన్నా ఇంత ఎక్కువ మొత్తం దక్కుతున్నా బీసీసీఐ ఇంకా ఎందుకు అదనంగా కోరుకుంటుందని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ వాదిస్తున్నారు. వన్డేల్లోనూ సూపర్ ఓవర్! ఇప్పటిదాకా టి20 క్రికెట్లోనే అమలవుతున్న సూపర్ ఓవర్ పద్ధతి ఇక వన్డే మ్యాచ్‌ల్లోనూ కనిపించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీలో దీన్ని ప్రవేశపెట్టాలని ఐసీసీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ టోర్నీ సెమీఫైనల్స్, ఫైనల్లో మ్యాచ్ ‘టై’గా ముగిస్తే సూపర్ ఓవర్ వేయనున్నారు. గతంలో ఐసీసీ ఈవెంట్స్ జరిగినప్పుడు ఫైనల్లో మాత్రమే సూపర్ ఓవర్‌ను ఉపయోగించేవారు. -
రెండో ర్యాంక్‌కు భారత్
దుబాయ్: ఐసీసీ టి20 ర్యాంకుల్లో భారత్ ఒక స్థానం మెరుగు పర్చుకుంది. ఇప్పటివరకు మూడో స్థానంలో ఉన్న టీమిండియా తాజాగా ఇంగ్లండ్‌పై 2–1తో సిరీస్ గెలవడం ద్వారా రెండో ర్యాంక్‌కు ఎగబాకింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం విడుదల చేసిన టి20 బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో కోహ్లి నిలకడగా అగ్రస్థానంలోనే ఉన్నాడు. టి20 బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా రెండో ర్యాంకులోనే ఉండగా, అశ్విన్ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. -
అశ్విన్, జడేజా టాప్–2 ర్యాంక్స్ పదిలం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వరుసగా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆదివారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అశ్విన్ 887 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో, జడేజా 879 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. పేస్ బౌలింగ్ విభాగంలో డేల్ స్టెయిన్‌ను నాలుగో స్థానానికి నెట్టి ఆస్ట్రేలియా పేస్ బౌలర్ హాజల్‌వుడ్ మూడో స్థానానికి చేరుకున్నాడు. -
డబుల్ ధమాకా
► ఈ యేటి మేటి క్రికెటర్‌గా అశ్విన్ ఎంపిక ► టెస్టుల్లోనూ అత్యుత్తమ ప్లేయర్ పురస్కారం ► వన్డే జట్టు సారథిగా విరాట్ కోహ్లి ► ఐసీసీ వార్షిక అవార్డుల ప్రకటన దుబాయ్: ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలోనూ అత్యద్భుత ప్రతిభ చూపిన భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక అవార్డుల్లో డబుల్ బొనాంజాతో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ప్రతిష్టాత్మక ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గానే కాకుండా ‘ఉత్తమ టెస్టు క్రికెటర్’గానూ ఎంపికయ్యాడు. ఐసీసీ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచినందుకు అశ్విన్... సర్ గ్యారీ సోబర్స్ ట్రోఫీ అందుకోనున్నాడు. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా అశ్విన్ నిలిచాడు. గతంలో రాహుల్ ద్రవిడ్(2004), సచిన్ టెండూల్కర్(2010) ఈ ట్రోఫీ అందుకున్నారు. మరోవైపు ద్రవిడ్(2004) అనంతరం ఒకే ఏడాది ఇలా రెండు ముఖ్య అవార్డులను గెల్చుకున్న రెండో భారత ఆటగాడిగానూ అశ్విన్ రికార్డులకెక్కాడు. ప్రపంచ వ్యాప్తంగా గతంలో కలిస్(దక్షిణాఫ్రికా–2005), పాంటింగ్(ఆస్ట్రేలియా–2006), సంగక్కర (శ్రీలంక–2012), మైకేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా–2013), మిచెల్ జాన్సన్(ఆస్ట్రేలియా–2014), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా–2015) ఈ ఫీట్ సాధించారు. ఈ అవార్డుల ప్రకటన కోసం గతేడాది సెప్టెంబర్ 14 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 20వరకు ప్రదర్శనలను పరిగణలోకి తీసుకున్నా రు. ఈ అవార్డులపై ఓటింగ్ జరిగింది. ఈ కాలంలో 30 ఏళ్ల అశ్విన్ ఎనిమిది టెస్టులు ఆడి 48 వికెట్లు తీయడంతోపాటు 336 పరుగులు సాధించాడు. 19 టి20ల్లో 27 వికెట్లు తీశాడు. అంతేకాకుండా 2015, 2016 సీజన్లను టెస్టుల్లో నంబర్‌వన్ బౌలర్‌గా ముగించాడు. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్, బీసీసీఐ అధ్యక్షుడు ఠాకూర్ కూడా అశ్విన్‌కు శుభాకాంక్షలు తెలి పారు. ఐసీసీ టెస్టు జట్టులో భారత కెప్టెన్ కోహ్లికి స్థానం దక్కలేదు. ఈ సెప్టెంబరులో ఓటింగ్ ముగిసిన తర్వాత కోహ్లి 964 పరుగులు చేయడంతో అతని పేరును ఈ అవార్డు ఎంపికకు పరిశీలించలేదు. తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల విభాగం అవార్డుల్లో వన్డే, టి20ల్లో ఉత్తమ క్రికెటర్‌గా సుజీ బేట్స్ (న్యూజిలాండ్) ఎంపికైంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. ఆమె ఏడు వన్డేల్లో 472 పరుగులు చేసి, 8 వికెట్లు తీసింది. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు మిస్బాకు.. ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపి ఈ ఏడాది ఆరంభంలో జట్టును టెస్టుల్లో నాలుగో స్థానం నుంచి నంబర్‌వన్‌గా నిలిచేలా చేసిన పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బా వుల్ హక్ తమ దేశం నుంచి తొలిసారిగా ఈ అవార్డును దక్కించుకున్నాడు. ఎరాస్మస్కు డేవిడ్ షెఫర్డ్ ట్రోఫీ దక్షిణా ఫ్రికాకు చెందిన మారి యస్ ఎరాస్మస్ ఉత్తమ అంపైర్‌గా నిలిచి షెఫర్డ్ ట్రోఫీని అందుకోనున్నారు. ఏడాది కాలంగా అత్యుత్తమంగా రాణిస్తున్న ఆటగాళ్లతో కలిపి ఐసీసీ టెస్టు, వన్డే జట్లను ఎంపిక చేసింది. ఇందులో చోటు దక్కించుకున్న ఆటగాళ్ల వివరాలు... ఐసీసీ టెస్టు జట్టు: కుక్ (కెప్టెన్ – ఇంగ్లండ్), వార్నర్, స్మిత్, వోజెస్, స్టార్క్ (ఆస్ట్రేలియా), విలియమ్సన్ (న్యూజిలాండ్), రూట్, బెయిర్‌స్టో, స్టోక్స్ (ఇంగ్లండ్), అశ్విన్ (భారత్), రంగన హెరాత్ (శ్రీలంక), స్టెయిన్ (దక్షిణాఫ్రికా). ఐసీసీ వన్డే జట్టు: కోహ్లి (కెప్టెన్–భారత్), వార్నర్, స్టార్క్, మిషెల్ మార్‡్ష (ఆస్ట్రేలియా), డి కాక్, డివిలియర్స్, రబడ, ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా), రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా (భారత్), జోస్ బట్లర్ (ఇంగ్లండ్), సునీల్ నరైన్ (వెస్టిండీస్). వన్డేల్లో ఉత్తమ ఆటగాడిగా డి కాక్ దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ ఓటింగ్ పీరియడ్‌లో ఆడిన 16 వన్డేల్లో 793 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలున్నాయి. వికెట్ కీపర్‌గా 15 మందిని అవుట్ చేశాడు. టి20ల్లో ఉత్తమ ప్రదర్శన అవార్డు ఈ ఏడాది జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ క్రికెటర్ కార్లోస్ బ్రాత్‌వైట్ చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించాడు. ఈ అవార్డు గెల్చుకున్న తొలి విండీస్ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్‌గా ముస్తఫిజుర్ మూడు వన్డేల్లో ఎనిమిది వికెట్లు, 10 టి20ల్లో 19 వికెట్లు తీసిన బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్... తమ దేశం నుంచి ఐసీసీ వార్షిక అవార్డును అందుకుంటున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. అసోసియేట్ జట్ల ఉత్తమ క్రికెటర్‌గా... అఫ్ఘానిస్తాన్ వికెట్ కీపర్ షహజాద్ ఆడిన 16 వన్డేల్లో 699 పరుగులు చేశాడు. 17 టి20 మ్యాచ్‌ల్లో 301 పరుగులు... ఇంటర్ కాంటినెంటల్ మ్యాచ్‌ల్లో 301 పరుగులు సాధించాడు. అఫ్ఘానిస్తాన్ నుంచి తొలిసారిగా ఈ ఘనత సాధించిన ఆటగాడయ్యాడు. ఐసీసీ నుంచి ఈ గొప్ప గౌరవాన్ని పొందినందుకు సంతోషంగా ఉంది. సచిన్, ద్రవిడ్ అనంతరం ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలవడం చాలా గొప్పగా ఉంది. ఈ సందర్భంగా చాలామందికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ దశకు చేరుకున్నాను. ముఖ్యంగా జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది ఎంతగానో ప్రోత్సహించారు. ఇక నా కుటుంబానికి ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. ధోని రిటైర్మెంట్ అనంతరం ఏర్పడిన సంధి కాలాన్ని యువ కెప్టెన్ కోహ్లి నేతృత్వంలో అద్భుతంగా అధిగమించాం. – అశ్విన్ -
మనోహర్‌కే ‘స్పాట్’
ఐసీసీ చైర్మన్ పదవినుంచి తప్పించేందుకు బీసీసీఐ విఫల ప్రయత్నం కలిసి రాని ఇతర బోర్డులు దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిననాటినుంచి శశాంక్ మనోహర్‌కు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మధ్య ఏదో ఒక వివాదం తరచుగా వస్తూనే ఉంది. బోర్డుకు రెండు సార్లు అధ్యక్షుడిగా పని చేసినా, తమకు ఏ దశలోనూ అండగా నిలవడం లేదని బీసీసీఐ గుర్రుగా ఉండగా... తాను తటస్థ అధ్యక్షుడినని, అన్ని బోర్డులూ సమానమేనని మనోహర్ చెప్పుకున్నారు. తాజాగా లోధా సిఫారసుల అమలు విషయంలో తమకు అనుకూలంగా లేఖ రాయమంటూ బీసీసీఐ కోరడం, ఐసీసీ దానిని పట్టించుకోకపోవడం జరిగారుు. ఈ నేపథ్యంలో పాత సాహచర్యాన్ని పక్కన పడేసి ఏకంగా మనోహర్‌ను ఐసీసీ చైర్మన్ పదవినుంచే తప్పించేందుకు భారత బోర్డు ప్రయత్నించినట్లు తెలిసింది. ఇటీవల దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన ఐసీసీ సమావేశం సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఈ వ్యూహం పన్నినా చివరకు అది విఫలమైంది. శ్రీనివాసన్ సూచనలతో... ఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు కేప్‌టౌన్ వెళ్లిన ఠాకూర్ అక్కడినుంచి బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కేతో పాటు మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌తో కూడా మాట్లాడారు. శశాంక్ మనోహర్‌ను తప్పించే విషయంలో వారి మధ్య చర్చ జరిగినట్లు బోర్డు సీనియర్ అధికారి ఒకరు నిర్ధారించారు. ఐసీసీలో సాధ్యమైనన్ని ఎక్కువ పదవులు పొందడం ద్వారా క్రికెట్‌ను నడిపించాలనేది బీసీసీఐ ఆలోచన. అరుుతే శశాంక్ ఉండగా ఇది సాధ్యం కాకపోవచ్చు కాబట్టి ఆయననే అక్కడినుంచి తొలగించాలని ప్రయత్నం జరిగినట్లు ఆయన వెల్లడించారు. శశాంక్‌కు ప్రత్యామ్నాయంగా తనకు మంచి మిత్రుడైన ఇంగ్లండ్ బోర్డు చైర్మన్ గైల్స్ క్లార్క్ పేరును శ్రీనివాసన్ సూచించారు కూడా. అరుుతే ఐసీసీలో ఓటింగ్‌కు వెళ్లక ముందే బీసీసీఐకి భంగపాటు ఎదురైంది. నిబంధనల ప్రకారం ఠాకూర్ ప్రతిపాదనకు కనీసం మరో టెస్టు దేశం మద్దతు పలకాల్సి ఉంది. అరుుతే తాము శశాంక్ పనితీరుతో సంతృప్తిగా ఉన్నామని చెప్పి వారంతా ఆయనకు మద్దతు పలికారు. తన ప్రతిపాదనకు పూర్తిగా వ్యతిరేకత ఎదురవడంతో ఠాకూర్ నివ్వెరపోయారు. ఒక వేళ మరో దేశం మద్దతిచ్చి ఓటింగ్‌కు వెళ్లినా పది టెస్టుల్లో కనీసం ఎనిమిది దేశాలు అనుకూలంగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా సాధ్యం కాకపోయేదేమో! ఇప్పటికే సొంత ఇంట్లో అనేక సమస్యలతో సతమతమవుతున్న బీసీసీఐ, ఐసీసీ వ్యవహారాల్లో కూడా తలదూర్చే ప్రయత్నం చేసి విఫలం కావడం బోర్డుకు మరో పెద్ద దెబ్బగా చెప్పవచ్చు.