దుబాయ్: అబుదాబి టీ10 లీగ్‌కు చెందిన ఫ్రాంచైజీ మాజీ సహాయ కోచ్ సన్నీ ఢిల్లాన్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాక్ ఇచ్చింది. అతడిపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. లీగ్‌లో పలు మ్యాచ్‌ల ఫిక్సింగ్‌కు ప్రయత్నించడం వల్లే అతనిపై ఆరేళ్లపాటు నిషేధం విధించినట్లు ఐసీసీ తెలిపింది. 2023, సెప్టెంబరు 13వ తేదీ నుంచే ఈ నిషేధం అమలవుతుందని ఐసీసీ పేర్కొంది.
2021లో అబుదాబిలో జరిగిన టీ10 క్రికెట్ లీగ్ సందర్భంగా పుణేకు చెందిన ఢిల్లాన్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. ఇందులో అతనితో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రమేయం ఉన్నట్లు ఐసీసీకి చెందిన అవనీతి నిరోధక విభాగం తేల్చింది.
‘ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అవినీతి నిరోధక నియమావళిని అతిక్రమించినట్లు దర్యాప్తులో తేలడంతో సన్నీ ఢిల్లాన్‌పై చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. ఢిల్లాన్‌తో పాటు ఫిక్సింగ్‌కు పాల్పడిన పరాగ్ సాంఘ్వి, కృష్ణ కుమార్ చౌదరీలపై కూడా ఐసీసీ లీగల్ చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment