Sunny
-
క్రికెట్ కోచ్‌పై ఆరేళ్ల నిషేధం: ఐసీసీ
దుబాయ్: అబుదాబి టీ10 లీగ్‌కు చెందిన ఫ్రాంచైజీ మాజీ సహాయ కోచ్ సన్నీ ఢిల్లాన్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాక్ ఇచ్చింది. అతడిపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. లీగ్‌లో పలు మ్యాచ్‌ల ఫిక్సింగ్‌కు ప్రయత్నించడం వల్లే అతనిపై ఆరేళ్లపాటు నిషేధం విధించినట్లు ఐసీసీ తెలిపింది. 2023, సెప్టెంబరు 13వ తేదీ నుంచే ఈ నిషేధం అమలవుతుందని ఐసీసీ పేర్కొంది.2021లో అబుదాబిలో జరిగిన టీ10 క్రికెట్ లీగ్ సందర్భంగా పుణేకు చెందిన ఢిల్లాన్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. ఇందులో అతనితో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రమేయం ఉన్నట్లు ఐసీసీకి చెందిన అవనీతి నిరోధక విభాగం తేల్చింది. ‘ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అవినీతి నిరోధక నియమావళిని అతిక్రమించినట్లు దర్యాప్తులో తేలడంతో సన్నీ ఢిల్లాన్పై చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. ఢిల్లాన్తో పాటు ఫిక్సింగ్‌కు పాల్పడిన పరాగ్ సాంఘ్వి, కృష్ణ కుమార్ చౌదరీలపై కూడా ఐసీసీ లీగల్ చర్యలు చేపట్టింది. -
ప్రేమోన్మాది ఘాతుకం
ఆదోని రూరల్: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన అశ్విని అనే ఇంటర్మీడియెట్ విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలైంది. విద్యార్థిని నోట్లో పురుగుల మందు పోసి హత్యచేసిన ఘటన శుక్రవారం నగరూరు గ్రామంలో కలకలం రేపింది. విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నరసమ్మ, చిన్న వీరేష్ దంపతుల ఏకైక కుమార్తె అశ్విని పత్తికొండ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి సన్నీ శుక్రవారం అశ్విని ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. తనను ప్రేమించకపోతే చంపేస్తానని వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా చూపుతూ ఆమెను బెదిరించాడు. అయినప్పటికీ బాలిక అతని మాట లెక్కచేయకపోవడంతో సన్నీ ఆమె నోట్లో బలవంతంగా పురుగు మందు పోసి పరారయ్యాడు. కొద్దిసేపటికి విద్యార్థిని తల్లిదండ్రులు పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె చావుబతుకుల్లో కనిపించింది. సన్నీ అనే వ్యక్తి బలవంతంగా పురుగు మందు తాగించాడని తల్లిదండ్రులకు తెలిపింది. వారు వెంటనే ఆమెను ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
యువతితో నటుడి నిశ్చితార్థం.. నిలదీసిన భార్యపై కత్తితో దాడి
బనశంకరి: మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవడాన్ని ప్రశ్నించిన భార్యపై బుల్లితెర నటుడు చాకుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న సన్నిమహిపాల్ సీరియల్లో నటిస్తున్నాడు. జనవరిలో ఫేస్బుక్ ద్వారా ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ప్రేమిస్తున్నట్లు నమ్మించి శారీరకంగా ఒకటి కావడంతో ఆమె గర్భం దాల్చింది. గర్భిణి కావడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి డిమాండ్ చేయడంతో గతనెల 15న దేవస్థానంలో ఇద్దరికి వివాహమైంది.వివాహమైన అనంతరం వారం పాటు తనతో కలిసున్న భర్త తల్లిదండ్రులను ఒప్పిస్తానని మాటిచ్చాడు. అప్పటివరకు ఇద్దరు స్నేహితులుగా ఉండాలని అలాగే మేనేజ్ చేయాలని షరతు విధించాడు. అనంతరం మంగళూరు వెళ్లి కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రుల సమక్షంలో మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెల్సి ఆ యువతి సన్నిమహిపాల్ను ప్రశ్నించడానికి అర్ధరాత్రి విజ్ఞాననగరలో అతడి నివాసానికి వెళ్లింది.ఇద్దరి మధ్య గొడవ జరగడంతో సన్నిమహిపాల్ ఆమెపై చాకుతో దాడి చేశాడు. అనంతరం కారులో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఈ గొడవలో తనకు అబార్షన్ అయిందని భార్య తెలిపింది. మరోవైపు తను బలవంతంగా వివాహం చేసుకుని ఇంట్లోకి ప్రవేశించిందని ఆరోపిస్తూ సన్నిమహిపాల్ సదరు యువతిపై హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
సన్నీ చంద్ర నుంచి అడివి శేష్ గా పేరు మార్చుకోవడానికి కారణం తెలిస్తే
-
తాంత్రికుడు వస్తున్నాడు
మహేందర్ వడ్లపట్ల, సన్నీ కునాల్, రాజేష్, అనూష, త్రివేణి నటించిన చిత్రం ‘తాంత్రికుడు’. సౌమ్య వడ్లపట్ల సమర్పణలో మహేందర్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం టీజర్‌ని మాజీ కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగోపాల చారి రిలీజ్ చేశారు. ‘‘మంచి చిత్రం తీయాలని అమెరికా నుండి వచ్చి, ‘తాంత్రికుడు’ తీశా’’ అన్నారు మహేందర్ వడ్లపట్ల. ఈ చిత్రానికి సంగీతం: కె. ఆనంద్, కెమెరా: వంశీ. -
దాతలు దయచూపరూ..! నేను చదువుకుంటాను..!! విద్యార్థి సన్నీ..
మహబూబాబాద్: కడుపేదరికం.. రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబం.. కూలీకి వెళ్తేనే కూడు. లేనిపక్షంలో కుటుంబ మొత్తం ఆకలికి అలమటించుడే. ఇలాంటి పరిస్థితి ఉన్నా ఓ విద్యార్థి పట్టుదలతో చదివాడు. అనుకున్న లక్ష్యం చేరుకున్నాడు. అయితే ఉన్నత చదువుకు లక్ష్మీ కటాక్షం లేక ఓ నిరుపేద విద్యార్థి ఇబ్బందులు పడుతున్నాడు. ఎవరైన ఆర్థిక సాయం అందిస్తే ఉన్నతంగా చదువుకుంటానని పేర్కొంటున్నాడు. దాతల సాయం కోసం వేయికండ్లతో ఎదురుచూస్తున్నాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బాపునగర్ గ్రామానికి చెందిన మంతెన ప్రభుదాస్, స్వప్న దంపతులకు ముగ్గురు కుమారులు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. వ్యవసాయ కూలి పనులకు వెళ్లి కుమారులను పోషించుకుంటున్నారు. పెద్ద కుమారుడు సన్నీ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి వరకు చదువుకున్నాడు. 5వ నుంచి 10వ తరగతి వరకు మరిపెడలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకున్నాడు. ఇంటర్ ఎంపీసీ రాంపూర్‌లోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకున్నాడు. బీటెక్ చదవడానికి ఎంసెట్ రాశాడు. అలాగే, జేఈఈ మెయిన్స్ రాయడంతో పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నిట్ కళాశాలలో ప్రవేశం వచ్చినట్లు మెయిల్ద్వారా సమాచారం పంపించారు. దీంతో తనను ఎలాగైనా చదివించాలని తల్లిదండ్రులను ఒప్పించాడు. అప్పుతెచ్చి రూ. 20 వేలు ప్రవేశం కోసం ఆన్లైన్ ఫీజు చెల్లించారు. కళాశాలలో చేరగానే మరో రూ. 36 వేలు చెల్లించాలని తెలిపినట్లు చెప్పారు. అంతేకాకుండా సుమారు రూ. లక్షకు పైగా ఖర్చు అవుతుందని, చేతిలో డబ్బు లేక చదువు ఆపేయాల్సి వస్తుందని విద్యార్థి సన్నీ మనోవేదన చెందుతున్నాడు. పట్టుదలతో చదవగా సీటు వచ్చినా లక్ష్మీకటాక్షం లేకపోవడంతో కుమారుడి పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల 10 తేదీ వరకు కళా శాలలో చేరాలని సమాచారం అందించడంతో వారికి వేదన ఎక్కువైంది. దీనిపై దాతలు స్పందించి ఆర్థిక సాయం అందించాలని సన్నీతోపాటు తల్లిదండ్రులు వేడుకుకుంటున్నారు. దాతలు 9052001950 ప్రభుదాస్, చెన్నారావుపేట ఎస్బీఐ అకౌంట్ నంబర్ 62202764705, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్ 0021352 కి సాయం అందించాలని కోరారు. -
దేశవ్యాప్తంగా ఠారెత్తిస్తున్న ఎండలు
న్యూఢిల్లీ: ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం సాధారణం కంటే ఎక్కువగా 40 డిగ్రీల సెల్సియస్ చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పు, వాయవ్య భారతదేశంలో వచ్చే నాలుగు రోజుల్లో వడగాలులు వీసే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం పేర్కొంది. పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, సిక్కిం, జార్ఖండ్ రాష్ట్రాలతోపాటు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ల్లో ఈ పరిస్థితులుంటాయని వివరించింది. దక్షిణ భారతంలోని ఏపీ తీరప్రాంతంలో బుధవారం వరకు భానుడి ప్రతాపం కొనసాగుతుందని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం వరుసగా రెండో రోజు సాధారణం కంటే కనీసం 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరించింది. బుధవారం నాటికి వాతావరణం కొద్దిగా చల్లబడే అవకాశాలున్నాయంది. -
బిగ్ బాస్ విన్నర్ సన్నీ హీరోగా కొత్త సినిమా!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ సన్నీ హీరోగా కొత్త సినిమా తెరకెక్కనుంది. డైమండ్ రత్నబాబు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్నాయి. సీమశాస్త్రి, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడొరకం ఆడోరకం వంటి హిట్ చిత్రాలకు సంభాషణలు అందించిన డైమండ్ రత్నబాబు సన్నీతో సినిమా చేస్తుండడం విశేషం. సన్నీతో పాటు నటించే హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ షో ద్వారా యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సన్నీ హౌస్ నుంచి బయటికి వచ్చాక హీరోగా చేస్తున్న చేస్తున్న చిత్రమిది. కమర్షియల్ అంశాలతో పాటు ఫ్యామిలి ఆడియన్స్‌కి కావాల్సిన ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయని సమాచారం. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి. -
భానుడి భగభగలతో బతకలేం బాబోయ్! ఆరెంజ్ అలర్ట్ జారీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ఉత్తరాది రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. ఢిల్లీలోని సిరి ఫోర్ట్ కాంప్లెక్స్ వద్ద గురువారం అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. చదవండి👉🏻 విద్యార్థులకు ఫ్రీ హెయిర్ కటింగ్ చేయించిన టీచర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే! ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హరియాణా, ఒడిశాల్లో వచ్చే మూడురోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హెచ్చరికలు జారీచేసింది. మే తొలివారంలో వర్షాలు పడే వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యుత్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. బొగ్గు నిల్వలు అడుగంటడంతో థర్మల్ విద్యుత్ తయారీ సంకటంలో పడిందని మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి చెప్పడం గమనార్హం. కొరత కారణంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు షురూ అయ్యాయి. చదవండి👉 క్షణక్షణం ఉత్కంఠ.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో -
స్టేజ్‌పై సన్నీ అన్న మాటలకు ఎమోషనల్ అయిన సిరి
Bigg Boss 5 Winner Sunny Comments On Shanmukh Friendship With Siri:ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన సన్నీ టైటిల్ ఎగరేసుకుపోయాడు. టాస్కుల్లో వందశాతం ఆడటంతో పాటు హౌస్‌లో రియల్ ఎంటర్టైనర్ అనే పేరు సంపాదించాడు. దీంతో పాటు షణ్నూ-సిరిలపై నెగిటివిటి పెరగడం సన్నీకి మరింత లాభం చేకూర్చింది. మచ్చా అంటూ తనదైన మ్యానరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సన్నీ బిగ్‌బాస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా గ్రాండ్ ఫినాలేలో మాట్లాడిన సన్నీ.. సిరి, షణ్నూల రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'షణ్నూ-సిరిల రిలేషన్ గురించి ఒక క్లారిటీ ఇస్తాను. అది ఈ స్టేజ్ మీదే మాట్లాడాలి. సిరి, అండ్ షణ్ముఖ్ అలాంటి ఫ్రెండిష్ దొరకడం అదృష్టం. నాకు, మానస్‌కు మధ్య ఎలాంటి స్నేహం ఉందో వాళ్లిద్దరి మధ్య కూడా అదే ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు. సన్నీ అన్న మాటలకు సిరి ఎమోషనల్ అయ్యింది. -
Bigg Boss5 Telugu: బిగ్‌బాస్-5 విజేతగా సన్నీ?.. నెట్టింట లీకైన ఓటింగ్!
Bigg Boss Telugu 5 Grand Finale: Winner Prediction: బిగ్‌బాస్ సీజన్-5 ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం నాడు జరగనున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌తో ఈ సీజన్‌కు తెరపడనుంది. దీంతో టైటిల్ విన్నర్ ఎవరన్న దానిపై సర్వంత ఉత్కంఠ నెలకొంది. టాప్-5 కంటెస్టెంట్లలో టైటిల్ కోసం గట్టి పోటీ ఉన్నా ప్రధాన పోటీ మాత్రం సన్నీ- షణ్ముక్‌ల మధ్యే ఉండనున్నట్లు తెలుస్తుంది. యూట్యూబ్ స్టార్‌గా ఎంట్రీ ఇచ్చిన షణ్నూ ఓటింగ్‌లో మాత్రం సన్నీ కంటే వెనుక ఉన్నట్లు అన్ అఫీషియల్ పోల్స్ ద్వారా తెలుస్తుంది. ఇప్పటివరకు ఓటింగ్ పర్సంటేజీలను చూస్తే సన్నీనే టాప్‌లో ఉన్నాడని తెలుస్తోంది. 34% ఓట్లతో సన్నీ విజేతగా నిలిచాడని సోషల్‌మీడియాలో టాక్ వినిపిస్తుంది. టైటిల్ రేసులో ఉన్న షణ్నూ 31%ఓట్లతో రెండో స్థానంలో, 20% ఓట్లతో శ్రీరామ్ మూడవ స్థానంలో, 8% ఓట్లతో మానస్ నాలుగో స్థానంలో నిలవగా , అత్యల్పంగా సిరికి7%ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు లీకు వీరులు చెప్పినట్లుగానే ఎపిసోడ్ సహా ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. దీంతో ఇప్పుడు మరోసారి లీకువీరులు అందించిన ఈ సమాచారం నిజమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే ఫినాలే ప్రసారం అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే. -
బిగ్‌బాస్ బంపరాఫర్.. ‘ఫినాలే’కు చేరిందెవరు?
Bigg Boss 5 Telugu Today Promo, Ticket To Finale: బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఐదో సీజన్ దిగ్విజయంగా 12 వారాలు పూర్తి చేసుకొని 13వ వారంలోకి అడుగుపెట్టింది. హౌస్‌లో ప్రస్తుతం ఏడుగురు ఉన్నారు. వారిలో కెప్టెన్ షణ్ముఖ్, సన్నీ మినహా.. మిగతా ఇంటి సభ్యులంతా నామినేషన్లో ఉన్నారు. అయితే ఇంటి సభ్యులంతా టాప్ 5లో ఉండాలని కలలు కంటున్నారు. ఈ ఒక్కవారం సేవ్ అయితే చాలు తర్వాత ఎలాగైనా నెట్టుకురావొచ్చనే భావనలో ఇంటి సభ్యులు ఉన్నారు. ఈక్రమంలో కంటెస్టెంట్స్‌కి బంపరాఫర్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇంట్లో ఉన్న ఏడుగురిలో ఒకరు నేరుగా ఫినాలేకు చేరుకునే అవకాశం కల్పించాడు. దానికోసం ‘టికెట్ టు ఫినాలే’అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులంతా మూడు చాలెంజ్‌లు ఇచ్చాడు. వాటిలో ఎవరు ఎక్కువ పాయింట్స్ గెలిస్తే వారే నేరుగా ఫినాలేకు సెలెక్ట్ అవుతారు. తొలి చాలెంజ్‌గా ‘ఐస్’టాస్క్ ఇచ్చాడు. ఇంటి సభ్యులంతా ఐస్‌తో నింపిన టబ్‌లో నిలబడి.. వారికి ఇచ్చిన బాల్స్‌ని కాపాడుకోవాల్సి ఉంటుంది. మరి ఈ టాస్క్ గెలిచిందెవరు? మిగతా రెండు టాస్క్‌లు ఏంటి? చివరకు ‘టికెట్ టు ఫినాలే’ ను ఎవరు సొంతం చేసుకున్నారు?అనేది తెలియాలంటే బిగ్‌బాస్ షోని ఫాలో కావాల్సిందే. -
బిగ్‌బాస్: స్నేహితుల మధ్య చిచ్చుపెట్టిన బిగ్‌బాస్.. గెలుపెవరిది?
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ స్నేహితుల మధ్య చిచ్చుపెట్టింది. హౌస్‌లో మంచి స్నేహితులుగా ఉన్న మానస్-సన్నీ మధ్య విభేదాలు వచ్చినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో భాగంగా బెలూన్స్ పలగగొట్టే గేమ్‌లో ప్రియాంక, మానస్‌లో పోటీపడ్డారు. ఈ గేమ్‌లో మానస్ గెలిచి సన్నీతో పోటీ పడ్డాడు. స్విమ్మింగ్‌పూల్-టీషర్ట్ గేమ్‌లో మానస్, సన్నీ హోరా హోరీగా పోటీపడ్డారు. టీషర్ట్ ధరించి పూల్‌లోకి దూలి అవతలి వైపు వెళ్లాలి. అక్కడ టీషర్ట్ ధరించి మళ్లీ వెనక్కి రావాలి. ఇలా ఎక్కువ టీషర్ట్స్ ఎవరు ధరిస్తారో వారే విజేతలు. ఈ గేమ్‌లో సన్నీ ఇంటి సభ్యులపై ఫైర్ అయ్యాడు. తాను ధరించిన టీ షర్ట్‌కి లెబుల్ లేదంటూ రవిపై సీరియస్ అయ్యాడు. తనకు ఆడాలనే ఉత్సాహం కూడా లేదంటూ ఇంట్లోకి వెళ్లిపోయాడు. ‘గేమ్ ఆడే హడావుడిలో కూడా లెబుల్ ఉన్న టీషర్ట్‌నే ఎంచుకోవాలి. అదే గేమ్’అని కాజల్ చెప్పినప్పటికీ.. సన్నీ వినలేదు. ‘ప్రతిసారీ మీరే విజయం సాధించాలనుకుంటున్నారు. కాబట్టి మీరే ఆడుకోండి’అంటూ కాజల్, మానస్‌లపై పైర్ అయ్యాడు. మరి ఈ గేమ్‌లో ఎవరు విజయం సాధించారో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
Bigg Boss: ఇదేందిరా భయ్.. వాళ్లు చేయిపెడితే ఒకటి నేను పెడితే ఒకటా..సన్నీ ఫైర్
బిగ్‌బాస్ ఇంట్లో పత్తేపారం.. పలు గొడవలకు దారి తీస్తోంది. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం ఇంటి సభ్యులు ఓ రేంజ్లో కష్టపడుతున్నారు. బిగ్‌బాస్ ఇచ్చే బొమ్మలకు సంబంధించి రా మెటీరియల్ కోసం కంటెస్టెంట్స్ నానా పాట్లు పడుతున్నారు. నాలుగు టీమ్‌లుగా విడిపోయి.. బద్ధ శత్రువుల్లా కొట్లాడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్లో సంచాలకురాలైన సిరిపై యానీ ఒంటికాలిపై లేచింది. ఇక నేటి ఎపిసోడ్లో కూడా ఓ రేంజ్లో గొడవలు జరిగినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. సంచాలకులుగా కాజల్, సిరిలు సరిగా చేయడం లేదంటూ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు నాలుగు టీమ్‌ల సభ్యులు. కన్వేయర్ బెల్ట్‌పై నుంచి వచ్చే రా మెటీరియల్ తీసుకునే క్రమంలో సిరికి, సన్నీకి పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ‘ఇదేందిరా భయ్.. నా తొక్కలో ఆట.. వాళ్లు చేయిపెడితే ఒకటి నేను పెడితే ఒకటా.. ఇదేం రూల్స్ ’అని సన్నీ ఊగిపోగా.. ‘సంచాలకులపై ఎందుకు అలా అరుస్తున్నారు? నాకు అందరి ముందు సారీ చెప్పాలి’అని సిరి డిమాండ్ చేసింది. దీన్ని తేలిగ్గా తీసుకున్న సన్నీ.. సారీ చెప్పే ప్రసక్తే లేదన్నారు. ‘నేను సారీ చెప్పా.. ఏం చేసుకుంటావో చేస్కో పో’ అంటూ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. మరోవైపు కాజల్.. సంచాలకురాలిగా తనకు వచ్చి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇంటి సభ్యులపై పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తుంది. ‘మేం పెట్టిన రూల్‌ని అధిగమించిన కారణంగా గ్రీన్ టీం నుంచి ఒకరు ఎల్లో టీం నుంచి ఒకరు ముందు నిలబడాలి’ అంటూ రూల్ పెట్టింది. దీనికి మేం ఒప్పుకోం అని ప్రియ విభేదించింది. అంతేకాదు ‘ నిన్న చాలామంది లైన్ క్రాస్ చేశారు.. మరి ఈ సంచాలకులు ఏం పీకుతున్నారు’ అంటూ ప్రియ సీరియస్ అయింది. ఈ సమయంలో సన్నీ విజిల్స్ వేస్తూ ‘అటు బస్సూ.. ఇటు బస్సూ ’అనే పాట పాడాడు. మరోవైపు బాగా డిస్టర్బ్ అయిన సిరిని గట్టిగా హత్తుకొని ఓదార్చాడు షణ్ముఖ్. సిరిపై సన్నీ ఎందుకు ఫైర్ అయ్యాడు? కాజల్ అలాంటి రూల్ ఎందుకు పెట్టింది? తెలియాలంటే.. నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
Bigg Boss 5 Telugu: చర్రితలోనే ఫస్ట్ టైమ్ ఇలాంటి బ్రేకప్!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఐదో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఐదు వారాలను దిగ్విజయంగా ముగించుకొని ఆరో వారంలోకి అడుగుపెట్టింది. నిన్న జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారు. దీంతో హౌస్ అంతా గంభీరంగా మారిపోయింది. ప్రతి సోమవారం బిగ్‌బాస్ ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉండడం కామన్. అయితే ఈ వారం గొడవల మోతాదు కాస్త ఎక్కువైంది. దీంతో బిగ్‌బాస్ ఇంటి సభ్యులను కూల్ చేసే పనిలో పడినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. నామినేషన్ ప్రక్రియ ముగియగానే ఇంటి సభ్యులంతా మళ్లీ ఒక్కటైనట్లు తెలుస్తోంది. సన్నీ అయితే ఎప్పటి మాదిరే తనదైన పంచులతో ఇంటి సభ్యులను నవ్వించాడు. శ్రీరామ్‌ను ఇమిటేట్ చేస్తూ పలకించిన హావభావాలు హౌస్‌లో నవ్వులు పూయించాయి. అలాగే హమిదా ఎలా అరుస్తుందో చేసి చూపించేసరికి అందరూ పెద్ద ఎత్తున నవ్వుకున్నారు. మరోవైపు కాజల్, శ్రీరామ్‌లు మధ్య నామినేషన్ ప్రక్రియ చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. నిన్నటి నామినేషన్‌కి బాగా హర్ట్ అయిన కాజల్.. శ్రీఆమ్ని ఉద్దేశిస్తూ.. ‘బ్రేకప్ బ్రో.. చరిత్రలో బ్రదర్ అండ్ సిస్టర్ బ్రేకప్ ఫస్ట్ టైమ్ కదా’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక త్రిమూర్తులు (షణ్ముఖ్, జెస్సీ, సిరి) ఎప్పటి మాదిరే ఇతర సభ్యులపై పంచులేశారు. ‘ఐన్‌స్టీన్ E=mc2 ఎందుకు కనిపెట్టాడో కూడా కనుక్కోవచ్చు. కానీ ఎలిమినేషన్స్ అర్థంకావు’అని షణ్నూ చేసిన ఫన్నీ కామెంట్‌కి జెస్సీ, సిరి పగలబడి నవ్వారు. -
బిగ్‌బాస్ 5: కంటెస్టెంట్స్ కొత్త జాబితా, ఈసారి వీళ్లే నో డౌట్!
ప్రముఖ రియాలిటీ షో తెలుగు బిగ్‌బాస్ 5 త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సీజన్‌కు స్పందించిన బయటకు వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ షో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే సెప్టెంబర్‌లో ఈ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో అగష్టు 22 నుంచి కంటెస్టెంట్స్‌ను క్వారంటైన్ పంపించనున్నారని వినికిడి. కానీ బిగ్‌బాస్ 5 సీజన్ కంటస్టెంట్స్కు సంబంధించిన ఖచ్చితమైన జాబితాపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. చదవండి: బిగ్‌బాస్ 5: బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన యాంకర్, సింగర్! ఈ సీజన్ కంటెస్టెంట్స్ వీరే అంటూ ఇప్పటికే పలువురు టీవీ నటీనటులు, యాంకర్లు, యూట్యూబ్ స్టార్ల పేర్లు వినిపించాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో జాబితా బయటకు వచ్చింది. అయితే ఇందులో కొంతమంది కొత్తవాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ కొత్త జాబితాలో యాంకర్ రవి, ఆర్జే కాజల్, శ్వేతా వర్మ, లహరి షారి, కమెడియన్ లోబో, సిరి హన్మంతు, నటి ప్రియ, కార్తీకదీపం ఉమాదేవి, 7 ఆర్ట్స్ సరయు, నటుడు మానస్ షా, మోడల్ జస్వంత్, నటుడు సన్నీ, విశ్వ, టీవీ9 యాంకర్ ప్రత్యూష్, ఆట సందీప్/రఘు మాస్టర్ల పేర్లు ఉన్నాయి. చదవండి: బిగ్‌బాస్ 5 తెలుగు: బిగ్‌బాస్ బజ్ హోస్ట్‌గా అరియాన గ్లోరీ! ఇంతకుముందు వచ్చిన జాబితాలో యాంకర్ వర్షిణీ, ట్రాన్స్‌జెండర్ ప్రియాంక, యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్, యానీ మాస్టర్, యూట్యూబర్ నిఖిల్ల పేర్లు ఉండగా.. ఈ కొత్త లిస్టులో వారి పేర్లు లేకపోవడం గమనార్హం. దీంతో ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 5లో హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చేది వీరే అని, అందులో డౌట్ లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల బిగ్‌బాస్ ప్రోమో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ షో హోస్ట్ ఎవరనే దానిపై ఉన్న అనుమానాలకు చెక్ పెడుతూ నాగార్జున ‘బోర్‌డమ్‌కు చెప్పేయ్ గుడ్‌బై.. వచ్చేసింది బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5’ అంటూ సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్స్ కొత్త జాబితా: యాంకర్ రవి ఆర్జే కాజల్ శ్వేతా వర్మ లహరి షారి కమెడియన్ లోబో సిరి హన్మంతు నటి ప్రియ కార్తీకదీపం ఉమాదేవి 7 ఆర్ట్స్ నటి సరయు నటుడు మానస్ షా మోడల్ జస్వంత్ నటుడు సన్నీ విశ్వ టీవీ9 యాంకర్ ప్రత్యూష్ ఆట సందీప్/రఘు మాస్టర్లు -
సుశాంత్ సింగ్ స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చా: హీరో సన్ని
‘నా ప్రయాణం మీడియా నుంచే ప్రారంభమైంది. నేను సినిమాల్లోకి రావడానికి హీరో సుశాంత్ సింగ్ రాజపుత్గారే స్ఫూర్తి. ముందు సీరియల్లో లీడ్ ఆర్టిస్ట్‌గా చేశాను. ఆ తర్వాత హీరోగా ‘సకల గుణాభి రామ’ చిత్రం చేశాను. ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని హీరో వీజే సన్ని అన్నాడు. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సకల గుణాభి రామ’. వీజే సన్నీ, శ్రీతేజ్, ఆషిమా నర్వాల్, తరుణి హీరో హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని వి. సంజీవ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘భార్యా భర్తల మధ్య ఎమోషన్స్, రొమాన్స్‌తో పాటు కామెడీ నేపథ్యంలో జరిగే సినిమా ఇది’ అని చెప్పాడు. త్వరలోనే తమ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత సంజీవ రెడ్డి తెలిపాడు. -
ఆ వేసవి తిరిగి రానీ...
మిట్ట మధ్యాహ్నం ఎండను కసిరి వేపచెట్టు నీడ ఏసీ గాలులు వీస్తుంది. పెంకుటింటి వసారాలోని తాటాకు పందిరి చల్లగా... చలచల్లగా అని రాగం తీస్తుంది. కి టికీలకు కట్టిన గోతంపట్టాలు మగ్గు నీళ్లు ఒంపితే చాలు వేడిపై దండెత్తే కాలకేయులవుతాయి. మధ్యాహ్నం భోం చేశాక కబుర్లు రాత్రిళ్లు ఆరుబయట సందళ్లు వచ్చే పోయే చుట్టాలు పక్కాలు పిల్లలకు అనుదిన ఆటల పరమాన్నాలు ఎక్కడమ్మా ఎక్కడ ఆ వేసవి ఎక్కడ? కరోనా కరోనా ప్లీజ్ గో అవే. మా వేసవి మాకు ఇచ్చి పోవే. వీకెండ్ స్పెషల్. వానాకాలం కలిసే కాలం కాదు. శీతాకాలం ముడుక్కునే కాలం. కాని వేసవి కాలమే నలుగురినీ కలిపే కాలం. నలుగురూ కలిసే కాదు. ఎండ భళ్లున కాసి రాత్రిళ్లు వెన్నెలను ఆరబోసే కాలం. పగళ్లు ఉబ్బరింత కలిగించి రాత్రిళ్లు వెన్నవీవెనలను వీచే కాలం. వేసవి కాలం మనోహరం. వేసవి కాలం ప్రేమ మయం. ఈ కాలం గత సంవత్సరం మిస్సయ్యింది. ఈ సంవత్సరమూ మిస్సవుతోంది. కరోనాపై మెటికలు విరవాలా? దేవుడికి మొరపెట్టుకోవాలా? సంవత్సరం పొడుగూతా ఏవో పనులు. పిల్లల చదువులు. ఇంకేవో ఆరాటాలు. అటెండ్ కాలేని పోరాటాలు. వేసవి వస్తే అన్నీ పక్కకు వెళతాయి. వేసవి వస్తే అందరూ దగ్గర అవుతారు. వేసవిలో మన ఇంట్లో మనం మాత్రమే గడపడం నామోషీ గా భావిస్తారు. వేసవిలో మన ఇంటికి ఎవరో రావాలి... ఎవరింటికో మనం పోవాలి. అప్పుడే మనకు అయినవారు ఉన్నట్టు. అసలు ఆ మాటలు ఎక్కడ? మిద్దె మీద నీళ్లు కుమ్మరించి చల్లపడ్డాక పరిచే పక్కల మీద చేరి చెప్పుకునే కబుర్ల సంబరమెక్కడ? వెంట్రుకలు పొడువైన బుజ్జాయికి పూల జడ ఫలానా రోజు వేద్దామని నిశ్చయించుకున్నాక అబ్బో... ఆ హడావిడి.. ఉరుకులు పరుగులు... అంతా అయ్యాక ఫొటో తీసి ఆనెక దిష్టి తీసి... తిన్న తియ్య మామిడి టెంకెను మట్టిలో నాటి చెట్టు మొలిస్తే నా పేరు పెట్టు అనుకునే బాల్యం ఎక్కడ. ఆ నీళ్ల తొట్లలో పెద్దలు వారిస్తున్నా బుడుంగున దూకే గడుగ్గాయిలు ఏరి? గడ్డివాముల్లో ఆటలేవి. పొలం గట్ల మీద పరుగులేవి. ఏదీ ఆ సువర్ణ వేసవి. అదిగో వీధిలోకి పాలైసు బండి వచ్చింది. ద్రాక్షా ఐసు కూడా అమ్ముతారట. జేబులో చక్కెర పొట్లం స్మగుల్ చేసి నిమ్మరసం చేసుకుని రహస్యంగా పెదాలకు అంటించుకున్న తీపి. వి.సి.పి అద్దెకు తెస్తారు పెద్దవాళ్లు. సెకండ్ షో సినిమాలకు బయల్దేర తీస్తారు. ఇప్పుడైతే మినిమమ్ ఒక ఓటిటి చానల్‌కైనా చందా పడుతుంది. అవకాయ పెట్టడాన్ని చూడటానికి మించిన షో ఉండదు. వడియాలకు కావలి కాయడానికి మించిన పెద్ద బాధ్యత ఉండదు. బంధువుల్లో ఫలానా అబ్బాయి అమ్మాయికి స్నేహం కుదురుతుంది. బంధువుల్లో ఫలానా పిల్లలూ పిల్లలూ కలిసి మనం ఆజన్మాంతం కలిసి మెలిసి ఉందాం అని గట్టిగా అనేసుకుంటారు. బాదం చెట్టు వారిని చూసి కొన్ని కాయలను రాలుస్తుంది. సీమచింతగుబ్బలు గొంతు నస పెట్టించినా రుచిని ఇస్తాయి. జీడిమామిడి కాయలు ఉప్పును గుచ్చి తినమని పసుపురంగులో, ఎర్రరంగులో దోసిట్లో పడతాయి. ఇంట్లో చేసిన ఐస్‌క్రీమ్ ఫ్లాప్ అవుతుంది. చేసినమ్మ ఉసూరుమని ఐదు, పది రూపాయల వెనిల్లా కొనుక్కోమని పైసలు ఇస్తుంది. గోరింటాకు చెట్టు ఉంటే కనుక అబ్బాయి అరచేతుల్లో చందమామ దిద్దుకుంటుంది. అమ్మాయిలు ఎలా పండిందో చూసి కాబోయే మొగుడి గురించి కబుర్లాడితే సిగ్గుపడి తుర్రుమంటారు. వేసవి పండుగ ను ఇస్తుంది. వేసవి బాల్యాన్ని పండిస్తుంది. పోయిన సంవత్సరం కదలడానికి లేకుండా పోయింది. ఈ సంవత్సరం కదలకపోవడమే మంచిదనిపిస్తోంది. పిల్లలు చిన్నబుచ్చుకుంటున్నారు. ఇల్లాళ్లు తమకు దొరికే ఈ పాటి ఆటవిడుపును జార్చుకుంటున్నందుకు విసుక్కుంటున్నారు. ఆనందం పండే సమయంలో చుట్టూ భయం వ్యాపించి ఉంది. ఇలా ఎంత కాలం? తప్పదు. ఇంకొంత కాలం. మరికొంత కాలం. అంతే. ఈ వేసవి పోతే ఏముంది. ఆరోగ్యంగా ఉంటే ఆయుష్షుతో ఉంటే మరో వేసవి వస్తుంది. ఇంకో వేసవిని తెస్తుంది. ఈ సమయంలో జ్ఞాపకాలను పంచుకోవాలి. దూరంగా ఉన్నా సాంకేతికతతో దగ్గరగా ఉన్నామని కలిసి ఉన్నామని ఒకరికి ఒకరం ఉన్నామని చెప్పుకోవాలి. పెద్దలే పిల్లలకు పిల్లలు కావాలి. ఇద్దరికి నలుగురై ఆటలాడుకోవాలి. కాలం విసిరిన సవాలుకు బెంగటిల్లి లాభం లేదు. వచ్చే వేసవి కోసం మనం సంతోషాలను సంబరాలను దాచుకుందాం. క్షేమంగా ఉండండి. క్షేమం ఆశించండి. – సాక్షి ఫ్యామిలీ -
కాలేజీలో మొదలై ఆకాష్ అంబానీ పెళ్లి వరకు అతడే..
హిమాయత్‌నగర్: ఆ యువకుడు మైక్ పట్టుకుంటే స్టేడియంలోని క్రీడాభిమానుల్లో జోష్ పెరగాల్సిందే. వేడుకల్లో వేసే పంచ్‌లకు అతిథులు కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. కాలేజీలో జరిగిన చిన్న ఈవెంట్‌తో మొదలైన ప్రయాణం ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ పెళ్లిలో యాంకరింగ్ చేసే స్థాయికి ఎదిగాడు. కాలేజీ క్రికెట్ కామెంట్రీనుంచి మొదలైన జర్నీ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున యాంకరింగ్ చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకునేంతగా ఎదిగాడు. అతడే ‘సన్నీ ఖండేల్వాల్’.. మన నగర యువకుడు. క్రికెటర్స్ బ్యాటింగ్, బౌలింగ్‌లో టెన్షన్‌గా ఉన్నప్పుడు వారికి నచ్చిన మ్యూజిక్‌ని ట్యూన్ చేస్తూ.. స్టెప్పులేస్తూ వారిని ఒత్తిడి నుంచి దూరం చేస్తూ ‘ది ఫోర్త్ అంపైర్’గా గుర్తింపు పొందాడు మన సిటీ కుర్రాడు. నగరానికి చెందిన రమేష్ ఖండేల్వాల్, సీమ ఖండేల్వాల్ కుమారుడు సన్నీ ఖండేల్వాల్. అమీర్‌పేటలోని సిస్టర్ నివేదిత స్కూల్లో అక్షరాభ్యాసం చేసిన ఇతడు.. సెయింట్ మేరీస్‌లో కాలేజీ విద్యను పూర్తి చేశాడు. కాలేజీ రోజుల్లో నుంచే మంచి యాంకర్ అవ్వాలనే అభిలాష ఇతడిలో పెరిగింది. కాలేజీలో జరిగే చిన్నా, చితకా పార్టీలు, ఈవెంట్లకు సన్నీనే యాంకరింగ్ చేసేవాడు. కొడుకులోని తపనను చూసిన తండ్రి.. భవిష్యత్‌లో యాంకరింగ్‌కు మంచి అవకాశం ఉంటుందని భరోసా ఇవ్వడంతో సన్నీ ఈవెంట్స్ కోర్సు కూడా చేశాడు. మిస్టర్ వలంటైన్ విన్నర్ ఏటా ప్రముఖ దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నిర్వహించే ‘మిస్టర్ యూత్’ ప్రోగ్రాంకి కాలేజీ నుంచి సన్నీ పాల్గొన్నాడు. ఢిల్లీలో జరిగిన ఈవెంట్లో దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పోటీ పడగా ‘వీజే హంట్’ విభాగంలో, ‘స్టేజ్ అప్పీరెన్స్’లో సౌత్ ఇండియా–20గా నిలిచాడు. అంతేకాదు.. హైదరాబాద్ నుంచి ‘మిష్టర్ వలంటైన్’ టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు మన హైదరాబాదీ. దుబాయ్‌లో సైతం.. దుబాయ్‌లో నిర్వహించే టీ–10 క్రికెట్ పోటీలకు సైతం సన్నీ యాంకరింగ్ చేస్తుడండం గమనార్హం. ఇందుకోసం అక్కడి నిర్వాహకులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ యాంకర్లను ఆహ్వానించగా.. సన్నీ మాత్రమే ఎంపికయ్యాడు. దుబాయ్ లీగ్‌లో మన సన్నీ యాంకరింగ్ చూసిన అక్కడి అపర కుబేరుల్లో ఒకరైన రిజ్వాన్ నిజాన్ మంత్రముగ్ధుడై సన్నీని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆటా.. పాటా.. మాటలతో మైమరపించే సన్నీ ఖండేల్వాల్, ప్రొ కబడ్డీ పోటీల్లో సుస్మితాసేన్‌తో.. సచిన్‌నే మైమరిపించాడు మూడేళ్ల క్రితం నగరంలోని ఇనార్బిట్ మాల్లో జరిగిన ఓ ఈవెంట్‌కు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హాజరయ్యాడు. ఆవేడుకను సన్నీనే యాంకర్. సచిన్ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఈ ఈవెంట్‌కు పోటెత్తారు. వారందికీ ‘టైన్ టైంస్ సచిన్..సచిన్’.. అన్న నినాదాన్ని వారందరిలోకీ ఎక్కించాడు. సచిన్ వేదిక ఎక్కిన వెంటనే అభిమానులంతా ఒక్కసారిగా అదేవిధంగా స్పందించారు. ఆ కాంప్లిమెంట్‌కు ఫిదా అయిపోయాడు. ఐపీఎల్ సమయంలో యాంకరింగ్ చేస్తూ ముంబై ఇండియన్స్‌ను గెలుపుదిశగా ప్రోత్సహిస్తున్న తనపై సచిన్ చూపించే అభిమానాన్ని వర్ణించలేనంటూ సన్నీ తన ఆనందాన్ని వ్యక్తం పరిచాడు. సన్నీ ప్రొ కబడ్డీలోనూ అదే జోష్ చూపుతున్నాడు. బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్‌కు చెందిన కబడ్డీ టీమ్‌కి సన్నీ యాంకరింగ్ చేస్తూ తనకు మాత్రమే సొంతమైన చతురత.. చలోక్తులతో జట్టు సభ్యులను, యజమాని అక్షయ్ కుమార్ మన్ననలు అందుకున్నాడు. ఐపీఎల్‌లోకి అలా.. కాలేజీ ఈవెంట్లు, వేడుకల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సన్నీ.. ‘ఇండియన్ క్రికెట్ లీగ్’కు 2005–2006లో యాంకరింగ్ చేశాడు. ఇది చేస్తుండగా 2006లో ప్రారంభమైన ‘ఐపీఎల్’కి అనుకోకుండా యాంకరింగ్ చేసే అవకాశం దక్కింది. మూడేళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్, అనంతరం పూణేకి ప్రాతినిధ్యం వహించాడు. వీటిలో సన్నీ ప్రతిభను గుర్తించిన ముంబై ఇండియన్స్ ఆరో సీజన్‌కు యాంకరింగ్ చేసేందుకు ఆహ్వానించింది. అప్పటి నుంచి ముంబై ఇండియన్స్‌కు యాంకరింగ్ చేస్తూ ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల కుటుంబానికి ‘సన్ని’హితుడిగా మారిపోయాడు. ఆకాష్ అంబానీ వివాహాన్ని ఎంత అట్టహాసంగా చేశారో దేశమంతా తెలిసిందే. ఆ పెళ్లిల్లో నీతూ అంబానీకి ఇష్టమైన ‘కృష్ణ రాసలీల’ గురించి తెలుసుకున్న సన్నీ.. ఆ థీమ్‌ను ‘ఎయిర్–వాటర్–ఎర్త్’ రూపంలో కళాకారులతో ప్రదర్శించి ఆ పెళ్లి వేడుకకు వచ్చిన అతిథుల దృష్టిలో నిలిచిపోయాడు. ‘ఈ ప్రదర్శనకు ముఖేష్, నీతూ అంబానీలు సైతం ఆశ్చర్యంతో పులకించిపోయారు’ అంటూ చెప్పుకొచ్చాడు సన్నీ. -
ఎండకు పార్క్ చేసిన బైక్‌లో మంటలు
-
మధ్యాహ్నపుటెండ
ఉన్నట్టుండి ‘భౌ’మని ఎగిరిపడి వెనక్కి పరుగెత్తింది. యువకుడు ఆసక్తిగా గమనిస్తున్నాడు. మళ్లీ కుక్క నీళ్ల దాకా వెళ్లింది. వెళ్లింది వెళ్లినట్టుగా ‘భౌ’ అని అరుస్తూ వెనక్కి వచ్చింది. ఒక యువకుడు చెరువు వైపు నడుచుకుంటూ పోతున్నాడు. అది మిట్ట మధ్యాహ్నం. ఎండ తీవ్రంగా ఉంది. అతడు చాలా దిగులుగా ఉన్నాడు. తాను అనుకున్నది ఏమీ చేయలేకపోతున్నాననే వేదన అతడిని వెంటాడుతోంది. అదే చింతిస్తూ గట్టున ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడో కుక్క అటుగా వస్తోంది. ఎండకు అకరు కొడుతోంది. గట్టు దిగి చెరువు దగ్గరికి వెళ్లింది. అది దప్పికతో ఉన్నట్టుగా అర్థమవుతోంది. నీళ్ల దాకా వెళ్లింది. ఉన్నట్టుండి ‘భౌ’మని ఎగిరిపడి వెనక్కి పరుగెత్తింది. యువకుడు ఆసక్తిగా గమనిస్తున్నాడు. మళ్లీ కుక్క నీళ్ల దాకా వెళ్లింది. వెళ్లింది వెళ్లినట్టుగా ‘భౌ’ అని అరుస్తూ వెనక్కి వచ్చింది. అది దాని నీడను చూస్తోంది, అది మరో కుక్క అని భ్రమించి, భయపడుతోంది. ఏం జరుగుతుందా అని యువకుడు మరింత కుతూహలంతో చూస్తున్నాడు. కుక్క మళ్లీ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ, నీటి దాకా పోయింది. ఈసారి అరుపులో అంత తీవ్రత లేదు. దానికదే ఒక రహస్యాన్ని అర్థం చేసుకున్నట్టుగా, ముందు కొంచెం అనుమానంగా, తర్వాత తాపీగా నీళ్లను తాగి వెనక్కి వెళ్లిపోయింది. తన నీడను శత్రువుగా భావించిన కుక్క దాన్ని జయించగలిగింది. తాను సాధించవలసిన దానికి తానే అడ్డంకిగా ఉన్నానని నిశ్చయానికి వచ్చిన యువకుడు స్థిరంగా లేచి నిలబడ్డాడు. -
పసుపుపచ్చ దాహం
దాహానికి రంగుండదు. కాని దాహం తీర్చేవాటికి రంగు ఉంటుంది. పుచ్చ ఎర్రన... కీర పచ్చన... కొబ్బరి తెల్లన... వీటన్నింటిలో నిమ్మరసం కలిపితే... పసుపు పచ్చ నిమ్మ నుంచి కొన్ని చుక్కలను పిండి రుచి తెస్తే.... ఆ దాహం పుల్లపుల్లగా తియ్యతియ్యగా తీరుతుంది. ఎర్రటి ఎండను హాయిగా మార్చుతుంది. కీర దోస లెమనేడ్ కావలసినవి: కీర దోస – 2; పుదీనా – పావు కప్పు; నిమ్మ చెక్క తురుము – అర టీ స్పూను; నిమ్మ రసం – పావు కప్పు; వేడి నీళ్లు – నాలుగు కప్పులు; పంచదార – 5 టేబుల్ స్పూన్లు గార్నిషింగ్ కోసం: ఐస్ క్యూబ్స్ – అర కప్పు; సన్నగా తరిగిన కీర దోస చక్రాలు – 10; తాజా పుదీనా ఆకులు – కొద్దిగా తయారీ: కీర దోసను శుభ్రంగా కడిగి, తొక్క తీసి, సన్నగా తురిమి పక్కన ఉంచాలి ♦ పుదీనా ఆకులు, నిమ్మ చెక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, బాణలిలో వేసి కొద్దిగా వేయించి తీసేసి, పల్చటి వస్త్రంలో వడబోసి, ఒక పాత్రలోకి రసం తీసుకుని పక్కన ఉంచాలి ♦ వేడి నీళ్లలో పంచదార, నిమ్మ రసం వేసి, స్టౌ మీద ఉంచి, పంచదార కరిగే వరకు కలిపి దింపేయాలి ♦ కీర దోస రసానికి ఈ మిశ్రమం జత చేయాలి ∙గంటసేపు ఫ్రీజర్‌లో ఉంచి తీశాక, ఒక గ్లాసులో కొద్దిగా రసం పోసి, ఐస్ క్యూబ్స్, పుదీనా ఆకులు, కీర దోస చక్రాలు జత చేసి అందించాలి. పుచ్చకాయ అల్లం లెమనేడ్ కావలసినవి: పుచ్చకాయ ముక్కలు – 4 కప్పులు; పంచదార – ఒక కప్పు; నీళ్లు – ఒక కప్పు; అల్లం తురుము – అర టీ స్పూను; సబ్జా గింజలు – టీ స్పూను; కీర దోస చక్రాలు – అర కప్పు (గింజలు తీసేయాలి); సోడా – ఒక కప్పు; నిమ్మ రసం – టేబుల్ స్పూను తయారీ: కీర దోస చక్రాలను సోడాలో వేసి పక్కన ఉంచాలి. ♦ పుచ్చకాయ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా ప్యూరీలా అయ్యేవరకు మిక్సీ తిప్పాక, సన్నని రంధ్రాలున్న జల్లెడతో పెద్ద పాత్రలోకి వడ పోయాలి ♦ ఒక పాన్‌లో పంచదార, నీళ్లు, అల్లం తురుము వేసి స్టౌ మీద సన్నని మంట మీద ఉంచి, పంచదార కరిగి, కొద్దిగా తీగ పాకంలా అవుతుండగా దింపేయాలి ♦ ఒక కప్పులో పొడి చేసిన ఐస్, కొద్దిగా పంచదార మిశ్రమం సిరప్, కొద్దిగా నిమ్మ రసం, నాలుగు టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసం పోసి బాగా కలపాలి ♦ సబ్జా గింజలు జత చేయాలి ♦ సోడాలో నానబెట్టిన కీరదోస ముక్కలు సహా సోడాను జత చేసి, బాగా కలిపి చల్లగా సర్వ్ చేయాలి. కమలా – దానిమ్మ లెమనేడ్ కావలసినవి: చల్లటి గ్రీన్ టీ – ముప్పావు కప్పు; తాజా కమలాపండు రసం – అర కప్పు; దానిమ్మ రసం – అర కప్పు; నిమ్మ రసం – టేబుల్ స్పూను; గార్నిషింగ్ కోసం – కమలా పండు చక్రం; ఐస్ – తగినంత తయారీ: ఒక గ్లాసులో చల్లటి గ్రీన్ టీ, దానిమ్మ రసం, కొద్దిగా ఐస్ వేసి కలిపి, కమలాపండు రసం ఉన్న గ్లాసులో పోయాలి నిమ్మరసం జత చేయాలి ♦ కమలాపండు చక్రంతో గ్లాసును అలంకరించి అందించాలి ♦ ఇది మంచి డిన్నర్ డ్రింక్. సోడా బదులు ఈ లెమనేడ్ వాడటం ఆరోగ్యానికి మంచిది. స్ట్రాబెర్రీ లెమనేడ్ కావలసినవి: స్ట్రాబెర్రీలు – ఒక కప్పు (శుభ్రంగా కడిగి, బాగు చేసి ముక్కలు చేయాలి); పంచదార – 2 టేబుల్ స్పూన్లు; తాజా నిమ్మ రసం – ఒక కప్పు; నీళ్లు – 5 కప్పులు తయారీ: ఒక పాత్రలో స్ట్రాబెర్రీ ముక్కలు, పంచదార వేసి స్టౌ మీద ఉంచి, బాగా ఉడికే వరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి ♦ దింపిన తరవాత గరిటెతో మెత్తగా మెదిపి, వడపోయాలి ♦ ఒక పాత్రలో నిమ్మ రసం, నీళ్లు, స్ట్రాబెర్రీ రసం వేసి బాగా కలపాలి ♦ ఐస్ జత చేసి గ్లాసులలో అందించాలి. కొబ్బరి నీళ్ల లెమనేడ్ కావలసినవి: కొబ్బరి నీళ్లు – 4 కప్పులు; నిమ్మ రసం – 5 టేబుల్ స్పూన్లు; తేనె లేదా పంచదార – 3 టేబుల్ స్పూన్లు; నిమ్మ కాయలు – 2 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి); ఐస్ క్యూబ్స్ – 2 కప్పులు; పుదీనా ఆకులు – గార్నిషింగ్‌కి సరిపడా తయారి: ఒక గిన్నెలో కొబ్బరి నీళ్లు, నిమ్మ రసం, పంచదార /తేనె వేసి పంచదార కరిగేవరకు బాగా కలపాలి ♦ నిమ్మ ముక్కలు, ఐస్ క్యూబ్స్ వేసి మరోమారు బాగా కలిపి, గ్లాసులలో పోయాలి ♦ పుదీనా ఆకులతో అలంకరించి సర్వ్ చేయాలి. ♦ నిమ్మకాయను ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా అవసరం. శరీరానికి అవసరమైన సి విటమిను నిమ్మలో పుష్కలంగా ఉంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను నిమ్మకాయ బాగా తగ్గిస్తుంది. ♦ నిమ్మలో ఉండే విటమిన్ సి... ఎముకలు క్యాల్షియంను స్వీకరించేలా చేస్తుంది. అందువల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. నిమ్మరసంలోని ఫ్లావనాయిడ్లు క్యాన్సర్ కారక కణాలను నిరోధిస్తాయి. ♦ కొద్దిగా నిమ్మరసాన్ని గ్రీన్ టీ కి జత చేసి తాగితే, టీలోని 80 శాతం యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. ♦ తరచుగా నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగి, బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ♦ శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపే శక్తి నిమ్మరసంలో పుష్కలంగా ఉంది. ♦ మానసిక ఒత్తిడి తగ్గించి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే లక్షణం నిమ్మలో మెండుగా ఉంది. ♦ కాలేయంలో పేరుకుపోయే విషపదార్థాలను తొలగించి, కాలేయం చురుకుగా పనిచేసేలా చేస్తుంది. ♦ వయసు పెరుగుతున్నా చర్మం ముడతలు పడనీయదు. ♦ పంటి నొప్పిని తగ్గిస్తుంది. పళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని అడ్డుకుంటుంది. - సుజాత స్టీఫెన్ ,న్యూట్రిషనిస్ట్ -
సూరీడు@ 44.50
మరో నాలుగు రోజులు సెగలే జిల్లాలో అల్లాడుతున్న జనం తిరుపతి తుడా: భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం తిరుపతి లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధికం. ఈశాన్య వడగాడ్పులతోపాటు బంగా ళాఖాతం నుంచి వేడిగాలులు అధికంగా వీస్తున్నాయి. ఈ నేప«థ్యంలోనే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పెరిగిన ఎండల వల్ల ఉక్కపోత అధికమయింది. దీంతో మరో నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత ఇలానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తిరుపతి.. చిత్తూరు గంగ జాతర వేడుకల్లో ఎండ ప్రభావం కనిపించింది. మంగళవారం మధ్యాహ్నం వేళ రహదారులన్నీ పలుచగా మారాయి. పాదచారులు మండుటెండల్లో నరకం చూశారు. చిరు వ్యాపారులు ఇంటికే పరిమితమయ్యారు. వడదెబ్బకు జిల్లాలో మంగళవారం ఐదుగురు చనిపోయారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పెరుగుతున్న ఎండలు, తీవ్ర ఉక్కపోత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో 38.5 డిగ్రీలకు తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు 10 రోజుల వ్యవధిలోనే 44.5కు చేరాయి. ద్రోణి కారణంగా తగ్గుముఖంపట్టిన ఎండలు మళ్ళీ తీవ్రరూపం దాల్చాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పదిరోజుల్లోనే ఏకంగా ఆరు డిగ్రీల అధికంగా నమోదైంది. వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క మునుపెన్నడూ లేనివిధంగా జనం వడదెబ్బ బారిన పడుతున్నారు. -
ఎండా, వానలతో జాగ్రత్త: రైల్వే జీఎం వినోద్
సాక్షి, హైదరాబాద్: ఎండ తీవ్రత అధికంగా ఉండే మే నెల, వచ్చే వానాకాలాలను దృష్టిలో ఉంచుకు ని నిరంతరం జాగరూకతతో వ్యవహ రించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ సూచించారు. సోమవారం రైల్ నిలయంలో అన్ని డివిజన్ల డీఆర్ఎంలు, ఉన్నతాధి కారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే 20 రోజుల్లో ఎండ తీవ్రత గరిష్టంగా ఉండనున్నందున పట్టాల పగుళ్లు, జాయింట్ల వెల్డింగులు పరిశీలించాలన్నారు. వానాకాలంలో మెరుపు వరదలను అధిగమించేం దుకు ప్రణాళికలు అవసరమని పేర్కొ న్నారు. అప్రమత్తంగా వ్యవహరించి నందుకు గాను విజయవాడ డివిజన్ తాడేపల్లి గూడేనికి చెందిన ఉద్యోగి శ్రీనివాసరావుకు జీఎం ప్రశంసాపత్రం అందజేసి సన్మానించారు. -
ఒకవైపు వర్షాలు.. మరోవైపు ఎండలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా, మరోవైపు కొన్నిచోట్ల ఎండలు కొనసాగుతున్నాయి. వడగాడ్పుల హెచ్చరికలు లేకపోవడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. రానున్న 4 రోజులు అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంట ల్లో కొత్తగూడెంలో 2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నవాబుపేట, అశ్వారావుపేట, చంద్రు గొండ, టేకుల పల్లి, మద్దూరు, మోమినిపేట, నారాయణపేట్‌లలో ఒక సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌లో 43 డిగ్రీలు, నిజామా బాద్‌లో 42.5, రామగుండంలో 42.4, నల్లగొండలో 42, మెదక్, మహబూబ్‌నగర్, ఖమ్మంలలో 41, హైదరాబాద్‌లో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. -
సన్ డే..గరిష్టం 41.2 డిగ్రీలు..
సిటీబ్యూరో: నగరంపై భానుడి ప్రతాపం తగ్గడంలేదు. ఆదివారం గరిష్టంగా 41.2 డిగ్రీలు, కనిష్టంగా 27.6 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడిమికి తోడు వేడిగాలులు సిటీజనులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని, వేడిగాలుల తీవ్రత ఉంటుందని బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. -
వడదెబ్బతో ఇద్దరు మృతి
కోడుమూరు రూరల్: ఎండవేడిమితో వడదెబ్బకు గురై జిల్లాలో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన కుర్నూరు రాముడు (66) శనివారం ఉపాధి పనులకు వెళ్లాడు. అక్కడ తీవ్రమైన ఎండను తట్టుకోలేక అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు అదేరోజు సాయంత్రం కోడుమూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం తెలవారుజామున మృతి చెందాడు. మృతుడికి భార్య చెన్నమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. గని కార్మికుడు మృతి గడివేములకు చెందిన గని కార్మికుడు ఎస్. వెంకటేశ్వర్లు (40) సోమవారం ఉదయం గనికి వెళ్లాడు. మధ్యాహ్నం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా ఎండ వేడిమితో అస్వస్థతకు గురై మార్గమధ్యంలో సొమ్మసిల్లి పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఆర్ఎంపీకి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నాడు. -
ఎండలు@ 44
-
ఎండలు@ 44
మంచిర్యాలలో అత్యధిక ఉష్ణోగ్రత హాజిపూర్ (మంచిర్యాల), హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. సోమవారం మంచిర్యాల జిల్లాలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వారం రోజులుగా 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం గమనార్హం. సోమవారం ఏకంగా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు పలు వాతావరణ వెబ్సైట్లు పేర్కొనగా.. అధికారులు మాత్రం 41 డిగ్రీల మేర నమోదైనట్లు వెల్లడించారు. మంచిర్యాల జిల్లాలో సింగరేణి బొగ్గు గనులు, విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు కాస్త అటూఇటుగా నమోదవుతున్నాయి. ఇంకా మే రాక ముందే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. అక్కడక్కడా వడగాడ్పులు వీస్తున్నాయి. దాంతో పగటిపూట బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. చాలా చోట్ల మధ్యాహ్నం పూట కర్ఫ్యూ తరహా వాతావరణం కనిపిస్తోంది. వాతావరణంలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉంటుండటంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు వడదెబ్బకు సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి చెందారు. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన పశువుల కాపరి మారుపాక కృష్ణయ్య(55), యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్మీదేవిగూడెంకు చెందిన ఉల్లెంతల బిచ్చయ్య(70), సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగకు చెందిన పండపాక రాజేందర్, కవిత దంపతుల కూతురు భానుజ (16 నెలలు)లు మృతి చెందారు. -
నేటి నుంచి 3 రోజులు తీవ్ర ఎండలు
-
ప్రచండ భానుడు
నేటి నుంచి 3 రోజులు తీవ్ర ఎండలు - భారత వాతావరణ శాఖ హెచ్చరిక - ఇప్పటికే నిప్పుల కుంపటిలా రాయలసీమ - రాష్ట్రంలో పెరుగుతున్న వడగాడ్పుల మరణాలు - 42.2 శనివారం కర్నూలులోఅత్యధిక ఉష్ణోగ్రత (డిగ్రీల సెల్సియస్) - వడదెబ్బతో మృతి చెందిన వారు 9 సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ప్రచండ భానుని ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదే సమయంలో ఆదివారం నుంచి మూడు రోజులపాటు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తాజాగా శనివారం రాత్రి హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా రాయలసీమలో ఈ ఎండల తీవ్రత బాగా అధికంగా ఉంటుందని తెలిపింది. రెండు, మూడు డిగ్రీల వరకు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే వీలున్నట్టు వెల్లడించింది. దీంతో ఇప్పటికే నిప్పులకుంపటిలా మారిన రాయలసీమలో రాబోయే మూడురోజులపాటు ఎండ భగభగలు మరింత తీవ్ర స్థాయిలో ఉండనున్నాయి. ఇదిలా ఉంటే శనివారం కర్నూలులో అత్యధికంగా 42.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురంలో 41.9, కడపలో 41.5, జంగమేశ్వరపురంలో 41.2, తిరుపతిలో 40.6, విజయవాడలో 39.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తమ్మీద కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. వడదెబ్బతో 9 మంది మృతి రాష్ట్రంలో ఎండల తీవ్రతకు వడగాడ్పులు తోడవడంతో వడదెబ్బ మరణాలు అధికమయ్యాయి. వడదెబ్బకు గురై తాజాగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా వైఎస్సార్ జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. చింతకొమ్మదిన్నె మండలం ఇప్పెంట పంచాయతీ పరిధిలోని బోడెద్దులపల్లె గ్రామవాసి పఠాన్ జమాల్‌ఖాన్(68), నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె మేజర్ పంచాయతీ పరిధిలోని దళితవాడకు చెందిన కొండా రామలక్షుమ్మ(70), ఎర్రగుంట్ల పట్టణంలో వెంకటయ్య(55) వడదెబ్బ కారణంగా చనిపోయారు. గుంటూరులోని పల్నాడు బస్టాండ్ సమీపంలో చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తున్న 60 ఏళ్ల వృద్ధుడు వడదెబ్బతో మృతిచెందాడు. ఇతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని సుగాలీ కాలనీకి చెందిన దివ్యాంగుడు మేఘావతు బ్రహ్మనాయక్(45) శనివారం వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయాడు. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం బసినికొండ పంచాయతీకి చెందిన భీమన్నగారి రామన్న(65) శుక్రవారం మధ్యాహ్నం పొలానికి నీళ్లు కడుతూ ఎండ తీవ్రత తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. శ్రీకాళహస్తికి చెందిన షేక్ రమీజాబీ(52) ఎండల తీవ్రతకు పదిరోజులక్రితం అనారోగ్యానికి గురైంది. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంది. శనివారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూసింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం తురకపల్లికి చెందిన పెయింటర్ శ్రీనివాసులు(45), గుత్తి పట్టణంలోని ఎస్సీ కాలనీవాసి మాతాంగి రామకృష్ణ(28) వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. -
నిప్పులకొలిమి
- పెరుగుతున్న ఉష్ణోగ్రతలు - అల్లాడుతున్న ప్రజలు - అవుకులో గరిష్టంగా 43.98 డిగ్రీలు నమోదు - ఎమ్మిగనూరులో 14.93 కిలోమీటర్ల వేగంతో వడగాల్పులు కర్నూలు(అగ్రికల్చర్): రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో జిల్లా ప్రజలు విలవిలలాడుతున్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. గరిష్టంగా అవుకులో 43.98 డిగ్రీల నమోదైంది. కర్నూలు నగరంతో సహా జిల్లా మొత్తం దాదాపు ఇదే స్థాయిలో ఎండలు ఉన్నాయి. మరో వైపు వడగాలుల తీవ్రత పెరిగింది. ఎమ్మిగనూరులో 14.93 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీచడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గోనెగండ్లలో 12.35, కొలిమిగుండ్లలో 11.19, కర్నూలు (దిన్నెదేవరపాడు)లో 11.17 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీచాయి. ఒకవైపు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాలుల తీవ్రతతో వడదెబ్బకు గురయ్యే వారిసంఖ్య పెరిగిపోతోంది. వదడెబ్బ మృతులు పెరిగిపోతున్నారు. మొన్నటి వరకు ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42.8 డీగ్రీలు ఉన్నాయి. శనివారం ఒక్కరోజులోనే ఒక డిగ్రీకి పైగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. రోజురోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతుండటంతో వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు అల్లాడుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. జిల్లా సగటున ఫిబ్రవరి నెలలో 9.19 మీటర్లలోతులో ఉన్న భూగర్భ జలాలు 10.69 మీటర్ల అడుగుకు పడిపోయాయి. నెల రోజుల వ్యవధిలోనే ఒకటిన్నర మీటర్ల మేర భూగర్బ జలాలు పడిపోయాయి. భూగర్భ జలాలు పడిపోతుండటంతో నీటి సమస్య తీవ్రం అవుతోంది. వారానికి ఒక రోజు కూడ నీళ్లు సరఫరా కాని గ్రామాలు వందల్లో ఉన్నాయి. నీటి ఎద్దడి ఏర్పడటంతో మినరల్ వాటర్‌కు డిమాండ్ పెరిగింది. గ్రామాల్లో మినరల్ వాటర్ అమ్మకాలు మూడు, నాలుగు రెట్లు పెరగడం గమానార్హం. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఇలా మండలం ఉష్ణోగ్రతలు అవుకు 43.98 కోవెలకుంట్ల 43.93 మద్దికెర 43.47 చాగలమర్రి 43.28 సి.బెలగల్ 43.17 రుద్రవరం 43.17 ఆళ్లగడ్డ 43.01 సంజామల 42.88 పగిడ్యాల 42.71 మిడుతూరు 42.69 ఎమ్మిగనూరు 42.66 కర్నూలు 42.20 -
వడదెబ్బతో ఐదుగురు మృతి
సాక్షి నెట్వర్క్: మండు ఎంతున్న ఎండలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు వడదెబ్బతో మృత్యువాత పడుతున్నారు. శనివారం జిల్లాలో ఐదుగురు వడదెబ్బతో మృతి చెందారు. జిల్లాలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బకు గురికాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎండకు బయటకు వెళ్లకూడదని..ఎండలో తిరగాల్సి వస్తే టోపీగాని, గొడుగుగాని ధరించాలని సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తాగాలని, చల్లని ప్రదేశంలో సేద తీరాలని చెబుతున్నారు. జిల్లాలో వడదెబ్బ మృతులు.. పేరు(వయస్సు) ఊరు మండలం కారణం తొట్ల లక్ష్మమ్మ (69) లద్దగిరి కోడుమూరు పొలంలో చౌళకాయలు తెపేందుకు వెళ్లి సిద్ధయ్య(31) హాల్వి కౌతాళం వ్యవసాయ పనులకు వెళ్లి.. వెంకటేశ్వర్లు(50) బలపనూరు పాణ్యం పొలం పనికి వెళ్లి.. బోయ కిష్టమ్మ(65) చనుగొండ్ల గూడూరు పొలం పనికి వెళ్లి.. వెంకటేశ్వరమ్మ(52) తెర్నెకల్ దేవనకొండ పొలం పనికి వెళ్లి.. -
రికార్డు ఎండ.. 40.5
సిటీబ్యూరో: ఉగాది పర్వదినం రోజున నగరంలో మండుటెండ సిటీజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ సీజన్లోనే ఇప్పటివరకు అత్యధికంగా బుధవారం గరిష్టంగా 40.5 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్టంగా 23.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే 3.6 డిగ్రీలు అధికమని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లిన వాహనదారులు, పాదచారులు ఎండవేడిమికి విలవిల్లాడారు. ఎండవేడిమికి తోడు ఉత్తర, వాయువ్య దిశల నుంచి నగరంవైపు వీస్తున్న వేడిగాలులు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. -
రాష్ట్రంలో మండుతున్న ఎండలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఎండలు మండాయి. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే నిజామాబాద్‌లో 41, హైదరాబాద్‌లో 40.5, మహబూబ్‌నగర్, నల్లగొండ, రామగుండంలలో 40 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం కూడా రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని హెచ్చరించింది. -
మండే..@ 40
సిటీబ్యూరో: నగరంలో ఎండలు భగ్గుమంటున్నాయి. సోమవారం గరిష్టంగా 40 డిగ్రీలు, కనిష్టంగా 23.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండతీవ్రతకు తోడు వాయువ్య, ఉత్తరదిశ నుంచి వీస్తున్న వేడిగాలులు సిటీజన్లను ఇబ్బందిపెడుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండ ప్రభావం కన్పిస్తోంది. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని, వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. -
రేపట్నుంచే ఒంటిపూట బడులు
సాక్షి, హైదరాబాద్: ఎండల నేపథ్యంలో బుధవారం (15వ తేదీ) నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులు నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. డీఈవోలకు పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త విద్యా సంవత్సరాన్ని ఈ నెల 21 నుంచే మొదలు పెట్టాలని పేర్కొన్నారు. ‘‘మండల పాయిం ట్‌కు చేరుకున్న పాఠ్యపుస్తకాల్లో తమ స్కూళ్లకు అవసరమైన వాటిని ప్రధానోపాధ్యాయులు 16– 20 తేదీ ల్లోపు తీసుకెళ్లాలి. ఆలోగా వార్షిక పరీక్షల ఫలితాలను వెల్లడించి, చదువులో వెనుకబడిన విద్యార్థులకు 21నుంచి ప్రత్యా మ్నాయ బోధన కార్యక్రమం చేపట్టాలి. ఏప్రిల్ 3–13 మధ్య బడిబాటకు ఏర్పాట్లు చేయాలి’’ అని ఆదేశించారు. -
అందరూ‘చల్ల’గా ఉండాలి... అందులో నేనుండాలి
భానుడి ప్రతాపం మొదలైంది..సూర్య కిరణాలకు నగరవాసి విలవిల్లాడుతున్నాడు.. చల్లటి పానీయం కోసం తహతహలాడుతున్నాడు. అందరికీ వాటర్క్యాన్లను సరఫరా చేసే ఓ యువకుడు ఎండకు తాళలేక శీతలపానీయం తాగుతూ ఎస్ఆర్నగర్లో కనిపించాడు. -
ఎండగా ఉన్న ఉదయం
న్యూఢిల్లీ: ఢిల్లీలో శనివారం ఉదయం దాదాపుగా 13.5 డిగ్రీల సెల్సియస్‌గా కనిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ అధికారి తెలపారు. ఈ సీజన్లో ఆకాశంలో గరిష్ట ఉష్ణోగ్రత రోజుంతా స్పష్టంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రోజు మొత్తంలో దాదాపుగా ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని వాతావరణ శాఖ అదికారి తెలిపారు. శనివారం ఉదయం 8.30 గంటలకూ వాతావరణంలో తేమ 62 శాతంగా ఉంది. శుక్రవారం ఉన్న గరిష్ట ఉష్ణోగ్రత కన్నా శనివారం ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగి 26 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. -
భగ్గుమన్న సూరీడు
భగ్గుమన్న సూరీడు..ఈ సీజన్లో రికార్డు 37.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు సాధారణం కంటే ఐదు డిగ్రీలు అధికం.. మరో నాలుగైదు రోజులు మండుటెండలే.. సిటీబ్యూరో: గ్రేటర్లో ఎండ మండిపోయింది. సోమవారం ఈ సీజన్లోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర, పశ్చిమ దిశ నుంచి గ్రేటర్వైపు వీస్తున్న వేడిగాలులు నగరాన్ని అప్పుడే నిప్పుల కుంపటిగా మార్చేస్తున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు డిగ్రీలు అధికమని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. మరో నాలుగైదు రోజులపాటు నగరంలో మండుటెండలు తప్పవని వాతావరణ శాఖ పేర్కొంది. మధ్యాహ్నం ఎండలో బయటికి వెళ్లే పాదచారులు, వాహనచోదకులు ఎండబారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండవేడిమి పెరగడంతో సిటీలో శీతలపానీయాలు, కొబ్బరిబోండాలకు గిరాకీ అమాంతంపెరిగింది. శివరాత్రి పర్వదినం కంటే ముందుగానే ఎండలు మండిపోవడం పట్ల సిటీజనులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా గతేడాది ఫిబ్రవరి 23న నగరంలో 38.7 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం విశేషం. -
నిస్సాన్.. ‘సన్నీ’ కొత్త వేరియంట్
ప్రారంభ ధర రూ.7.91 లక్షలు న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ‘నిస్సాన్’ తాజాగా తన సెడాన్ కారు ‘సన్నీ’లో కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.7.91 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. అధిక ఇంధన సామర్థ్యం, సౌకర్యవంతమైన డ్రైవింగ్, అదిరిపోయే ఇంటీరియర్ డిజైన్ వంటి పలు ప్రత్యేకతలతో ఈ కొత్త వేరియంట్‌ను తయారుచేశామని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా తెలిపారు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనున్న ఈ కొత్త సన్నీలో 1.4 లీటర్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ పేర్కొంది. పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ వేరియంట్ ధర రూ.7.91 లక్షలు–రూ.10.89 లక్షల శ్రేణిలో... డీజిల్ ఇంజిన్ ఆప్షన్ వేరియంట్ ధర రూ.8.8 లక్షలు–రూ.10.76 లక్షల శ్రేణిలో ఉందని తెలిపింది. కొత్త వేరియంట్లో పుష్ బటన్ స్టార్ట్ సహా యాంటీ–లాక్ బ్రేకింగ్ (ఏబీఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ), బ్రేక్ అసిస్ట్ (బీఏ), డ్యూయెల్ ఫ్రంట్/సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి మెరుగైన భద్రతా ఫీచర్లు ఉన్నాయని వివరించింది. కాగా కంపెనీ భారత్‌లో నిస్సాన్, డాట్సన్ అనే బ్రాండ్ల కింద కార్లను విక్రయిస్తోంది. -
మా సినిమాపై నమ్మకం ఉంది
సన్ని, అక్షిత, ప్రశాంత్, ప్రసన్న ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘ఇంకేంటి నువ్వే చెప్పు’. శివ శ్రీ దర్శకత్వంలో వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై డా. మళ్ల విజయ్ ప్రసాద్ నిర్మించారు. వికాస్ స్వరాలందించిన ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. చిత్ర నిర్మాత మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. వినోదం పంచుతూనే సందేశం ఇచ్చేలా ఉంటుంది. మా బ్యానర్ విలువకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుంది. ఈ నెలలో పెద్ద చిత్రాల విడుదల ఉన్నప్పటికీ, మా సినిమాపై ఉన్న నమ్మకంతో మేం కూడా ఈ నెలలోనే రిలీజ్ చేస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘కొత్త వాళ్లతో సినిమా తీయాలంటే ధైర్యం ఉండాలి. విజయ్‌ప్రసాద్ ఆ ధైర్యంతోనే ఈ చిత్రం తీశారు. అనుభవం ఉన్నవాడిలా దర్శకుడు ఈ చిత్రం తెరకెక్కించారు’’ అని ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. చిత్ర దర్శకుడు శివ శ్రీ, నిర్మాత కె.ఎస్.రామారావు, సన్ని, అక్షిత, ప్రశాంత్, ప్రసన్న, వికాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇంకేంటి నువ్వే చెప్పు’ ఆడియో లాంచ్
-
ఇంకేంటి నువ్వే చెప్పు!
‘‘మంచి చిత్రాలను నిర్మించే సంస్థగా మాకున్న పేరు, విలువ ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రమిది’’ అన్నారు నిర్మాత మళ్ల విజయప్రసాద్. ప్రశాంత్, సన్ని, అక్ఛిత, ప్రసన్నలను హీరో హీరోయిన్లుగా, శివశ్రీ దర్శకత్వంలో వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘ఇంకేంటి నువ్వే చెప్పు’. వికాస్ సంగీతమందించిన పాటలను విశాఖ ఆర్కే బీచ్‌లో విడుదల చేశారు. ‘‘అందరూ కొత్తవాళ్లతో తీసిన ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత . వెల్ఫేర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మళ్ల అరుణకుమారి, నటుడు సుమన్, సహ నిర్మాత విద్యార్థి వెంకట్రావ్ పాల్గొన్నారు. -
తస్కీన్, సన్నీలకు గ్రీన్‌సిగ్నల్
దుబాయ్: బంగ్లాదేశ్ బౌలర్లు తస్కీన్ అహ్మద్, అరాఫత్ సన్నీలకు ఐసీసీ నుంచి తీపి కబురు అందింది. బౌలింగ్ వేసేటప్పుడు వారి యాక్షన్ ఐసీసీ నిబంధనలను అనుగుణంగా లేదని ఆరోపణలు రావడంతో అంతర్జాతీయ క్రికెట్లో వాళ్లు బౌలింగ్ చేయకుండా గతంలో ఐసీసీ నిషేధం విధించింది. వారిద్దరికి అనేక పరీక్షలు నిర్వహించిన ఐసీసీ.. ప్రస్తుతం వారి బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు అనుగుణంగానే ఉందని తేల్చింది. దాంతో వాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బౌలింగ్ వేసేందుకు మార్గం సుగమమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ సందర్భంగా వారి బౌలింగ్ యాక్షన్‌పై సందేహాలు తలెత్తాయి. దాంతో చెన్నైలో తొలిసారి వారికి పరీక్షలు నిర్వహించారు. తాజాగా సెప్టెంబర్ 8న బ్రిస్బేన్‌లో మరోసారి పరీక్షలు నిర్వహించగా.. ప్రస్తుతం వాళ్లు బౌలింగ్ వేసేటప్పుడు తమ మోచేతిని 15 డిగ్రీలకు మించి వంచడం లేదని తేలింది. దాంతో ఐసీసీ వారికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. -
ఖరీఫ్‌కు సన్‌స్ట్రోక్!
♦ పంటల సాగుకు కరుణించని వరుణుడు ♦ ఎండ, వడగాడ్పులకు సాగు చేసిన పైర్లు సైతం ఎండుముఖం ♦ విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం ఆందోళనలో అన్నదాతలు జూలై మాసం.. రైతన్నకు ఎంతో కీలకం. జూన్ నెల సగంలోనే నైరుతీ రుతుపవనాల రాకతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. జూలై నెలంతా పంటల సాగులో అన్నదాతలు బిజీబిజీగా ఉంటారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం పరుగులు తీస్తుంటారు. కానీ, ఈ ఏడాది జిల్లాలో ఎక్కడా ఆ హడావిడి కనిపించడం లేదు. తొలకరికి ముందే మండుటెండల్లో వచ్చిపోరుున వరుణుడు.. రుతుపవనాలు వచ్చినాగానీ మొహం చాటేశాడు. జూలై నెల సగం గడిచిపోతున్నా.. జిల్లాపై కనికరం చూపడం లేదు. పైగా, భానుడి ప్రతాపం, వడగాడ్పులు వెరసి ఇప్పటికే సాగుచేసిన పంటలను ఎండుముఖం పట్టిస్తున్నారుు. అన్నదాతకు నిద్ర లేకుండా చేస్తున్నారుు. ఒంగోలు టూటౌన్ : జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సన్‌స్ట్రోక్ తగులుతోంది. వర్షాలు కురవాల్సిన సమయంలో వేడిగాలులతో రైతులకు షాక్ కొడుతోంది. వరుణుడి దోబూచులాటకుతోడు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో నిత్యం అంతరాయం పంటలపై పగతీర్చుకుంటూ అన్నదాతను ఆందోళనకు గురిచేస్తున్నారుు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలరోజులైనా.. నేటికీ సక్రమంగా వర్షాలు కురవలేదు. అరకొరగా సాగుచేసిన లేతపైర్లు సైతం ఈదురుగాలులు, వడగాడ్పులతో విలవిల్లాడుతున్నాయి. గత రెండేళ్ల కరువు పరిస్థితులు ఈ ఏడాది కూడా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నారుు. కొత్తగా పంటల సాగు సంగతి అటుంచితే.. ఇప్పటికే వేసిన పంటలైనా చేతికొస్తాయో లేదోనని రైతులకు బెంగపట్టుకుంది. 2,35,857 హెక్టార్లకుగానూ 27,500 హెక్టార్లలోనే సాగు... జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలదాటింది. ప్రారంభంలో ముందస్తుగా మురిపించిన వర్షాలు పంటల సాగుపై రైతులకు ఆశలు పెంచారుు. అన్నదాతలు వెంటనే పలు రకాల పంటలు సాగుచేశారు. కానీ, అనంతరం వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్ సాగు చతికిలపడింది. ప్రస్తుత సీజన్లో 2,35,857 హెక్టార్లలో వివిధ పంటలు సాగు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు సుమారు 27,500 హెక్టార్లలో సాగయ్యూరుు. వరి 32,185 హెక్టార్లకుగానూ 20 హెక్టార్లలోనే సాగైంది. జొన్న 220 హెక్టార్లకుగానూ అసలు సాగుకే నోచుకోలేదు. సజ్జ 17,030 హెక్టార్లకుగాను కేవలం 600 హెక్టార్లలోనే సాగైంది. రాగి, మొక్కజొన్న, అలసంద, సొయాచిక్కుడు పంటల సాగు ఎక్కడా కనిపించడంలేదు. సాగుచేసిన పంటల పరిస్థితి అగమ్యగోచరం... ఖరీఫ్‌లో పూర్తిస్థారుులో పంటల సాగు సంగతి అటుంచితే, సాగుచేసిన పంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెసర 4,145, మినుము 600, కంది 1,191, వేరుశనగ 1,661 హెక్టార్లలో సాగుచేశారు. 4,579 హెక్టార్లకుగానూ 8,856 హెక్టార్లలో భారీగా నువ్వు సాగుచేశారు. ఈ సీజన్లో 6,008 హెక్టార్లకుగాను కేవలం 485 హెక్టార్లలోనే కూరగాయలు సాగు చేశారు. జీలుగ కూడా మరో 100 హెక్టార్లలో సాగైంది. సాగుచేసిన పంటలన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని పంటలు పూత, కాయ దశలో ఉండగా, వర్షాలు లేక ప్రతికూల పరిస్థితులు వాటిని వేధిస్తున్నారుు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై నెలలో వడగాడ్పులు, ఎండలకు తోడు విద్యుత్ అంతరాయంతో సాగునీటి కష్టాలు పంటలను నాశనం చేస్తున్నారుు. తీరప్రాంతంలో ఎండుతున్న వేరుశనగ... జిల్లాలోని తీరప్రాంతంలో ఇప్పటికే విస్తారంగా సాగైన వేరుశనగ వడగాడ్పుల దెబ్బకు విలవిల్లాడుతోంది. తరచూ విద్యుత్ అంతరాయంతో బోర్లు సైతం పనిచేయక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ఈదురుగాలుల దెబ్బకు కరెంటు నిలవకపోవడంతో రైతులు విద్యుత్ మోటార్ల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ కష్టాలు చాలవన్నట్లు అడుగంటిన భూగర్భజలాలతో బోర్లలో నీరు రావడం గగనమవుతోంది. విద్యుత్ మోటార్లు తరచూ మొరాయిస్తున్నారుు. పంట చేతికందే పరిస్థితి లేకపోవడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండాపోతోంది. జిల్లావ్యాప్తంగా రోజూ కారుమబ్బులు.. కటిక చీకట్లు తప్ప.. చుక్క వానపడని పరిస్థితి నెలకొనడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఆకాశంవైపు చూస్తున్నారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో అరుుతే ఖరీఫ్ పంటల సాగు దాదాపు నిలిచిపోయినట్టు చెప్పాలి. ఎటుచూసినా ఎడారిని తలపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది తీవ్ర కరువు తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
''సురక్షిత శృంగారాన్ని ప్రోత్సహిస్తా..''
బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీ లియోన్ ఏం చెప్పినా అభిమానులకు సెక్సీగానే ఉంటుంది. ఒకప్పుడు అడల్ట్ స్టార్ గా ఉన్న సన్నీ లియోన్.. బాలీవుడ్ స్టార్ గా మారిపోవడమే కాదు ఇటీవల కొన్ని యాడ్స్ లోనూ తనదైన రీతిలో ప్రచారం చేస్తోంది. అవాంఛిత గర్భం నుంచి తప్పించుకొనేందుకు, లైంగిక వ్యాధులు నిరోధించేందుకు, కండోమ్ ఉపయోగించడం ఎంతో శ్రేయస్కరమంటూ.. సురక్షిత సెక్స్ పై సన్నీ లియోన్ ఫ్యాన్స్ లో స్ఫూర్తిని నింపుతోంది. సురక్షిత సెక్స్ పై నాకు ఎంతో నమ్మకం ఉందని, అందుకే నేను కండోమ్ బ్రాండ్ ప్రకటనను ఎంచుకున్నానని సన్నీలియోన్ చెప్తోంది. ప్రముఖ కండోమ్ బ్రాండ్ ప్రమోషన్ కు ఏమాత్రం సంకోచించకుండా ముందుకు వచ్చినవారిలో సన్నీలియోన్ ఒకరు. అవాంఛితన గర్భాలను నివారించేందుకు, వివిధ సుఖ వ్యాధులనుంచీ దూరంగా ఉండేందుకు కండోమ్ ను ఉపయోగించమని ఆమె తన అభిమానులను అభ్యర్థిస్తోంది. అంతేకాదు.. తాను సురక్షిత శృంగారాన్ని ప్రోత్సహిస్తానని కూడా చెప్తోంది. కొందరు ఏ కేటగిరీ నటీమణులు కండోమ్స్ ను ప్రోత్సహించరెందుకని అడిగి ప్రశ్నకు.. అది వారి వ్యక్తిగత సౌకర్యం, స్థాయిలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. కొందరు జీవితంలో ఎదగాల్సిన పరిస్థితులు, వారి గోల్స్ కు సంబంధించి కూడా వారు తీసుకునే నిర్ణయాలు ఉంటాయని సన్నీ చెప్పింది. ప్రముఖ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నాని చిత్రించి, తాను స్వయంగా నటించిన ఓ ప్రత్యేక బికినీ క్యాలెండర్ ను సన్నీ లియోన్ ప్రారంభించిన సందర్భంలో సురక్షిత సెక్స్ పై ఆమె సదరు వ్యాఖ్యలు చేసింది. -
ఒబామా పెట్ డాగ్స్ కూడా బిజీ!
వాషింగ్టన్: పెట్ డాగ్స్ పట్ల యజమానులు ప్రేమానురాగాలు కురిపించడం చూస్తుంటాం. అబ్బో అవి ఎంత రాజభోగం అనుభవిస్తున్నాయో అంటూ వాటి అదృష్టాన్ని కొనియాడుతాం. అటువంటిది ఏకంగా ఓ దేశాధ్యక్షుడి ఇంట్లో పెట్ డాగ్స్ గా స్థానం పొందిన ఆ శునకాల అదృష్టాన్నేమనాలి? అటువంటి స్థానంలో ఉండటమేకాక, అక్కడ రాజ భోగాలు అనుభవించడంతోపాటు ఆ కుటుంబ సభ్యుల అమితమైన ప్రేమను అందుకుంటున్నాయి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెంచుకుంటున్న పెట్ డాగ్స్ బో అండ్ సన్నీలు. మరి త్వరలో ఒబామా పదవీకాలం ముగిసిన తర్వాత వాటి స్థానం ఎక్కడ? సాధారణంగా శునకాలు చేసే పని ఏముంటుంది? తినడం పడుకోవడం. ఇంకా చెప్పాలంటే యజమాని ఇంటికి కాపలా కాయడం. కొన్ని జాతి శునకాలు దొంగలను గుర్తించడంలో ఆరితేరి పోలీసులకు సహకరిస్తుంటాయి. అయితే ఒబామా వైట్ హౌస్ లో నివసిస్తున్న బో మరియు సన్నీలు మాత్రం ప్రెసిడెంట్ ఒబామాతోపాటు ఎంతో బిజీ బిజీ షెడ్యూల్ కలిగి ఉంటాయని తెలుసా? వైట్ హౌస్ అంబాసిడర్లుగా వ్యవహరించే ఆ శునకాల షెడ్యూల్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒబామా కుటుంబం వైట్ హౌస్ లో పెంచుకుంటున్న పోర్చుగీస్ వాటర్ డాగ్స్ జాతికి చెందిన రెండు శునకాల్లో పెద్దది బో. ఏడేళ్ళ వయసున్న బో కు ఫస్ట్ డాగ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ టైటిల్ కూడ ఉంది. ఇక రెండవది సన్నీ. ప్రతి ఒక్కరూ తమ పెంపుడు శునకాలను చూసేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తారని, వాటితో ఫొటోలు తీయించుకోవాలని ఆశ పడతారని సాక్షాత్తూ మిచెల్లే ఒబామాయే చెప్పడం విశేషం. అందుకే వాటి షెడ్యూల్ ను సైతం నెల ప్రారంభంలోనే ఖరారు చేస్తారట. దాని ప్రకారమే వాటిని ప్రదర్శనకు ఆమోదిస్తామని కూడ ఆమె అంటారు. ఈస్టర్ సమయంలో సందర్శనకు వచ్చిన వారికి వినోదాన్ని అందించడంలో బో, సన్నీలు ఎంతో బిజీగా ఉంటాయి. ప్రెసిడెంట్ ఇనాగరేషన్ సందర్భంలో కూడ పర్యాటకులను స్వాగతించే మెచెల్లేకు పక్కనే బో ఉంటుంది. అలాగే ప్రతియేటా క్రిస్మస్ ముందు ఆస్పత్రిలో ఉన్నవారిని పరామర్శించేందుకు వెళ్ళే సమయంలో కూడ మిచెల్లే తో పాటు ఆ రెండు శునకాలు ఉండాల్సిందే. అసలు బో, సన్నీలు ఎంత గుర్తింపు పొందాయో చెప్పడానికి గతంలో వాటిపై జరిగిన కిడ్నాప్ ప్రయత్నమే పెద్ద నిదర్శనం. ప్రస్తుతం ఏడేళ్ళ వయసున్న బో.. ఒబామా కుటుంబంలోకి 2009 లో అడుగు పెట్టింది. 2008 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఒబామాకు మంచి మద్దతుదారుడగా ఉండటమే కాక, ఆయన కుటుంబానికి సైతం సన్నిహితుడుగా ఉండే మాజీ సెనేటర్ ఎడ్వార్డ్ ఎం కెన్నడీ... 'బో' ను ఒబామాకు బహుమతిగా ఇచ్చారు. అనంతరం నాలుగేళ్ళ వయసున్న సన్నీ 2013 ఆగస్టు లో ఒబామా కుటుంబ సభ్యురాలైంది. బో అప్పటికే వైట్ హౌస్ గ్రౌండ్స్ కీపర్ హెడ్ గా ఉన్న డేల్ హానీ కి హెల్పర్ గా విధులు నిర్వహిస్తోంది. ప్రతిరోజూ ఉదయం డేల్ తో పాటు నేషనల్ పార్క్ సేవల్లో ములిగిపోయే బో... నేషనల్ పార్క్ క్రూ సిబ్బందితో పాటు వాకింగ్ చేయడం, అక్కడి మొక్కలను పరీక్షించడం వంటివి తన బాధ్యతగా ఉన్నట్లే కనిపిస్తుందని, అలాంటి సమయంలో అసలు తమనుసైతం పట్టించుకోకుండా సీరియస్ గా విధులు నిర్వహిస్తున్నట్లు ఉంటుందని మిచెల్లే చెప్తుంటారు. అయితే తమ ఇంట్లో తమతోపాటు ఉంటున్న పెంపుడు జంతువులైన బో, సన్నీలు తమ కుటుంబ సభ్యులుగానే పెరుగుతున్నాయని, ఒక్కోసారి అవి నా ఒళ్ళోనూ, నా కుర్చీమీద కూర్చుంటాయని, నేను కూడ వాటిని ఎంతో ప్రేమగా నిమిరుతూ ఉంటానని, అవి మాకు ఎంతో ప్రేమను అందించడంతోపాటు, ఎంతో అందమైన జీవితాన్ని అనుభవిస్తున్నాయని మిచెల్ చెప్తారు. ముఖ్యంగా అధ్యక్ష పదవిలో ఉన్నవారి పెంపుడు జంతువులు ప్రజాదరణ పొందడం, వారికి సహచరులుగా ఉండటం సాధారణమే. అయితే వచ్చే ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడుగా పదవీ కాలం ముగియనున్న బరాక్ ఒబామా... గతేడాది ఓ సందర్భంలో తన పెంపుడు జంతువులైన బో, సన్నీల గురించి కూడ ప్రస్తావించారు. తాను వైట్ హౌస్ ఖాళీ చేసే ముందు తన పెంపుడు జంతువులు చించేసిన కాగితాలతో సహా ప్రతి చిన్న విషయాన్నీ క్లియర్ చేసి వెడతానంటూ హామీ ఇవ్వడం ఆయనకు వాటిపై ఉన్న ప్రేమతోపాటు... పదవిపట్ల ఆయనకున్న బాధ్యతను కూడ వెల్లడించింది. -
ఎండా .. వాన.. మేకప్!
బ్యూటిప్స్ వేసవిలో అక్కడక్కడా వర్షాలూ పడుతున్నాయి. ఎండ, ఉక్కపోత, వర్షం.. ఈ కాలం మేకప్ వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. చెమట వల్ల అసౌకర్యంగా ఉండటమే కాకుండా ముఖసౌందర్యం కోల్పోతామేమో అనే సమస్య కూడా తలెత్తుతుంది. ఈ కాలం మేకప్ వేసుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.... మేకప్ చేసుకునేముందు ఫేస్ వాష్‌తో ముఖాన్ని ఒకసారి శుభ్రం చేస్తే చాలు. ఒకటికి మూడు సార్లు కడిగి, మరీ చర్మం పొడిబారేలా చేయకూడదు.ఈ కాలం చెమట అధికం కనుక వాటర్‌ప్రూఫ్ మేకప్ సామగ్రిని ఎంచుకోవాలి. నప్పుతుందో మీ చర్మం రంగును బట్టి మీకు నప్పే స్కిన్ షేడ్‌ను, ఫౌండేషన్, ప్రైమర్, కన్సీలర్లను ఎంచుకోవాలి.ముందు బేస్‌గా ప్రైమర్‌ని ముఖమంతా రాయాలి. దీని వల్ల పోర్స్ వెడల్పు అవుతాయి. మొటిమల వల్ల అయిన మచ్చలు, ఫైన్ లైన్స్, ముడతల ు కనిపించవు. ఫౌండేషన్‌కి మాయిశ్చరైజర్‌గా ప్రైమర్ పనిచేస్తుంది. మేకప్ ఎక్కువ సమయం పాడవకుండానూ ఉంటుంది. ఫౌండేషన్ ప్యాచులుగా చర్మానికి పట్టే సమస్య కూడా ఉత్పన్నం అవదు. నిద్రలేమి, ఒత్తిడి కారణంగా కళ్లకింద చర్మం ఉబ్బు ఉంటే మేకప్ వేసుకోకూడదు. ఆ వాపు తగ్గడానికి గోరువెచ్చని టీ బ్యాగ్‌తో కొద్దిసేపు కాపడం పెట్టాలి. డార్క్ ఐ లైనర్‌తో కళ్లను తీర్చిదిద్దాలి. లిప్‌స్టిక్ తర్వాత లిప్‌గ్లాస్‌ను కూడా ఉపయోగించాలి.ఈ కాలం మెరుపుల కోసం ఏ ఇతర గ్లిటర్స్ని ఉపయోగించకపోవడమే మంచిది. ముఖంలో కనిపించేవి ముందు పెదాలు, కళ్లు మాత్రమే. అందుకే లిప్‌స్టిక్, ఐ షాడో, మస్కారాలను ఉపయోగించేటప్పుడు శ్రద్ధ తీసుకోవాలి. -
భానుడు
ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు వేడిగాలులతో జనం ఇబ్బందులు అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు రోహిణీలో 45 డిగ్రీలకు చేరుతుందంటున్న వాతావరణ నిపుణులు రోను తుపాను ప్రభావంతో మండే ఎండల నుంచి ఉపశమనం పొందిన జిల్లా వాసులను భానుడు మళ్లీ బెంబేలెత్తిస్తున్నాడు. ఆదివారం ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఓ వైపు ఎండ, మరోవైపు వడగాలుల స్థాయి పెరగటంతో జనం ఆపసోపాలు పడ్డారు. విజయవాడ (గుణదల) : భానుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రోను తుపాను ప్రభావంతో నాలుగు రోజుల పాటు వాతావరణం చల్లబడినా ఆదివారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఉదయం నుంచి క్రమేణా పెరిగిన ఎండ వేడిమి మధ్యాహ్నానికి 43.5 డిగ్రీలకు చేరింది. దీనికితోడు గాలిలో తేమ ప్రభావం తక్కువగా ఉండటం వల్ల ఉక్కపోత ఎక్కువైంది. దీంతో విజయవాడ నగర వాసులు అల్లాడిపోయారు. వివిధ పనులపై బయటకు వెళ్లేవారు ఎండ నుంచి రక్షణకు తువాళ్లు, టోపీలు ధరించక తప్పలేదు. దీనికితోడు అసలే ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు విద్యుత్ శాఖాధికారులు మరింత పరీక్ష పెట్టారు. నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అప్రకటిత విద్యుత్ కోత విధించారు. దీంతో చంటిబిడ్డలు, గర్భిణులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా అంతటా భారీగా ఉష్ణోగ్రతల నమోదు... ఆదివారం నాటి ఎండ తీవ్రతతో జిల్లా అంతటా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. విజయవాడ, నూజివీడుల్లో అత్యధికంగా 43.5 డిగ్రీలు, జగ్గయ్యపేటలో 43.4, నందిగామలో 43.1, గుడివాడలో 43, మచిలీపట్నంలో 42.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఒకేసారి పెరిగిన ఉష్ణోగ్రతలతో జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. మరింత పెరగనున్న ఎండ వేడి సోమవారం ఉదయం నుంచే 30 డిగ్రీల ఉష్ణోగ్రతతో మొదలై మధ్యాహ్నానికి 44 డిగ్రీలకు చేరుకుంటుందని, రాత్రివేళలో కూడా 35 డిగ్రీలు ఉండే అవకాశముందని, దీనికితోడు ఉక్కపోత కూడా తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 25 నుంచి రోహిణీ కార్తె ప్రారంభమవుతుందని, వాతావరణంలో వేడి ప్రభావం మరింతగా పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు. గరిష్టంగా 45 డిగ్రీలకు చేరే అవకాశముందని అంటున్నారు. వేడిగాలులు కూడా పెరిగే అవకాశముందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పెరుగుతున్న వడగాలులు... రోహిణీ కార్తె ప్రభావంతో నగరంలో వడగాలులు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. సగటున గంటకు 25 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వరకు వేడిగాలులు వీస్తాయని, మధ్యాహ్నం వేళలో బయటకువెళ్లేవారు ఎండ నుంచి రక్షణ పొందేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని, రాత్రివేళలో కూడా వడగాలులు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ విశ్లేషకులు సూచిస్తున్నారు. -
సింగరేణికి సన్‌స్ట్రోక్
తగ్గుతున్న కార్మికుల హాజరు శాతం ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల్లో విపరీతమైన వేడి బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం ఒకవైపు మండుతున్న ఎండలు. మరో వైపు విపరీతమైన వడగాల్పులు. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి కాలుబయటపెట్టలేని పరిస్థితి. వీటికి తోడు బొగ్గు ఉత్పత్తిలో కీలకంగా ఉపయోగపడే భారీ యంత్రాల్లో ఏసీలు పనిచేయడం లేదు. ఓసీల్లో అధిక వేడికి యంత్రాలు సైతం అగ్నిప్రమాదాలకు గురవుతున్నారుు. దుమ్ము, ధూళితో ఊపిరి సలపని పరిస్థితి. దీంతో కార్మికుల హాజరు శాతం తగ్గి బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. కొత్తగూడెం(ఖమ్మం) : సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల కారణంగా కార్మిక ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంటోంది. పగటివేళ వడగాలుల తీవ్రత కారణంగా విధులకు వెళ్లడానికి కార్మికు లు జంకుతున్నారు. భూగర్భగనుల్లో రోజుకు మొదటి, రెండవ, నైట్ షిఫ్టుతోపాటు ప్రీషిఫ్టులు నడుస్తున్నారుు. మొదటిషిఫ్టు కార్మికులు ఉద యం 6 గంటలకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 2 గంటలకు, నైట్‌షిఫ్ట్ రాత్రి 10 గంటలకు, ప్రీషిఫ్ట్ కార్మికులు ఉదయం 9 గంటలకు విధులకు వెళ్లాల్సి ఉంటుంది. మధ్యాహ్నం షిఫ్టు కార్మికులు విధులకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. తీవ్రమైన ఎండ, వడగాల్పు ల కారణంగా అలిసిపోరుు పనులు చేయలేని పరిస్థితులు నెలకొంటున్నారుు. ఓసీలపై తీవ్ర ప్రభావం అసలే ఎండులు మండుతున్నారుు. ఓపెకాస్టు ల్లో బయటికన్నా రెండు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. అటు బొగ్గు వేడి, ఇటు వడగాలులు తట్టుకోలేని విధంగా ఉంటున్నారుు. పైగా యూజమాన్యం కల్పించిన ఉపశమన చర్యలు ఏమాత్రం సరిపోవడం లేదు. బొగ్గు ఉత్పత్తికి ఉపయోగపడే భారీ యంత్రాలు, వాహనాల్లో ఏసీలు సక్రమంగా పనిచేయడంలేదు. కొన్ని పాత యంత్రాల్లో పూర్తిగా పనిచేయడం లేదు. దీంతో మధ్యాహ్నం షిఫ్టు కార్మికు లు విధులకు వెళ్లాలంటే ధైర్యం చేయలేక పోతున్నారు. కొందరు కార్మికులు అనారోగ్యాని కి గురవుతామనే భయంతో విధులకు గైర్హాజరవుతున్నారు. దీంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. ఉత్పత్తిలో వెనుకబాటు మే నెలలో ఓపెన్‌కాస్టు గనులు ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నాయి. కంపెనీ వ్యాప్తంగా ఈనెల ఒకటి నుంచి 15వ తేదీ వరకు 24.45 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయూల్సి ఉండగా 23.3 లక్షల టన్నుల ఉత్పత్తి నమోదైంది. భూగర్భగనుల్లో 12.2 లక్షల టన్నులకు 11.5 లక్షల టన్ను లు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో 19.26 లక్షల టన్నుల కు 18.50 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. ముఖ్యంగా ఒక ఓసీలో ఒక షిఫ్టునకు సుమారు 300 మంది కార్మికులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఈనెలలో ఎండల తీవ్రత అధికంగా ఉండడం వల్ల 20 నుంచి 30 మంది గైర్హాజరవుతున్నట్లు తెలుస్తోంది. 45 రోజుల్లో 9లక్షల టన్నుల వెనుకబాటు ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ ఒకటి నుంచి మే 15వ తేదీ వరకు కంపెనీ వ్యాప్తంగా 75లక్షల టన్నులకు 67 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరిగింది. భూగర్భగనుల్లో 16 లక్షల టన్నులకు 13 లక్షల టన్నులు, ఓపెన్‌కాస్టుల్లో 50లక్షల టన్నులకు 54 లక్షల టన్నుల ఉత్పత్తి నమోదైంది. మొత్తం 11 ఏరియాల్లో కేవలం 3 ఏరియాలు మాత్రమే ఇప్పటివరకు 100 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదు చేయగలిగాయి. -
కౌబాయ్.. ‘రాస్’
జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ గురువారం సదాశివపేట పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఎండ వేడిమిని తట్టుకునేందుకు ఆయన తలకు ధరించిన ప్రత్యేక టోపీ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఇక్కడ మూతపడిన మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను తెరిపిస్తామని స్థానికులకు హామీనిచ్చారు. - సదాశివపేట -
నిప్పుల కొలిమి
నందిగామలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు బెజవాడలో 42.7 డిగ్రీలు అల్లాడిపోయిన నగరవాసులు విజయవాడ : జిల్లాలో ఎండవేడి రోజురోజుకూ పెరిగి నిప్పుల కొలిమిగా మారుతోంది. నందిగామ, విజయవాడలో ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం తల్లడిల్లిపోయారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎండవేడిమి తీవ్రంగాఉండటంతో జనం ఆపసోపాలు పడ్డారు. ఉదయం ఆరు గంటలకే 31 డిగ్రీలతో ఎండవేడిమి ప్రారంభమై 10 గంటల సమయానికి 32 డిగ్రీలకు చేరింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటలకు ఎండ వేడిమి 42.7 డిగ్రీలకు పెరిగింది. మూడు గంటల నుంచి క్రమేపీ తగ్గుతూ వచ్చి సాయంత్రం ఆరు గంటలకు కూడా 39 డిగ్రీలకు చేరింది. ఎండ వేడిమి తాళలేక జనం ఇళ్ల నుంచి బయటకు రాలేదు. దీంతో నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. జన సంచారం, వాహనాల రాకపోకలు లేక బందరు రోడ్డు వెలవెలబోయింది. ఏలూరు రోడ్డు, పోలీసు కంట్రోల్ రూమ్ ఏరియాల్లో కనీసం పిట్ట కూడా కనిపించలేదు. చిట్టినగర్, మొగల్రాజపురం, గుణదల తదితర కొండ ప్రాంత ఇళ్లలో నివసించే కుటుంబాలవారు ఎండవేడిమి తాళలేక నానా అగచాట్లు పడ్డారు. అత్యవసర పనులపై బయటకు వచ్చేవారు గొడుగులు, తలలకు మాస్కులు వేసుకుని ఎండ వేడిమితో అవస్థలు పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఎం డవేడిమి, ఉక్కపోతకు అల్లాడిపోయారు. రోడ్లపై వేడి సెగలు వ్యాపించాయి. వాహనాల్లో కూడా జనం ప్రయాణించలేకపోయ ూరు. నందిగామలో శుక్రవారం గరిష్టంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
మరణశయ్యపై మిత్రుడు ఆదుకుందాం.. ఆదరిద్దాం..
ఎండలకు విలవిల్లాడుతున్న పక్షులు కాపాడాలంటున్న పర్యావరణ వేత్తలు సిటీబ్యూరో: చెలరేగుతున్న ప్రచండ భానుడు నగరాన్ని నిప్పుల కొలిమిగా మార్చేస్తున్నాడు. ఎండకు తట్టుకోలేక మనుషులు పిట్టల్లా రాలుతున్నారు. ఇక నేల రాలుతున్న పిట్టలైతే లెక్కే లేదు. నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తట్టుకునే శక్తి ఆ చిరు ప్రాణికి లేదు. గుక్కెడు నీళ్ల కోసం నగరంలోని పక్షులు అలమటిస్తున్నాయి. మండుడెండలో బతికే దారిలేక, నీడనిచ్చే దిక్కు లేక విలవిల్లాడుతున్నాయి. వడదెబ్బకు నేల రాలుతున్నాయి. ఒకప్పుడు వందల సంఖ్యలో ఉన్న పక్షి జాతులు ఇప్పుడు పదుల సంఖ్యకు పడిపోయింది. ఉన్నవాటిని కాపాడుకోలేకుంటే.. ఒకప్పుడు కిచకిచలతో అలరించిన పిచ్చుకల్లాగే చాలా జాతులను గూగుల్‌లో వెతికే దుస్థితి తప్పదంటున్నారు పర్యావరణవేత్తలు. మండుతున్న ఎండల్లో పక్షుల రక్షణపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. పక్షుల ప్రాణం ప్రశ్నార్థకం..! ఇళ్లముందు వాలి కిచకిచమంటూ సందడి చేసే పిచ్చుకలు, ఎక్కడో చెట్టు కొమ్మపైన వాలి సందడి చేసే పక్షుల గుంపులు, కోకిల కూజితాలు క్రమంగా దూరమవుతున్నాయి. అంతరించిపోతున్న జీవజాలానికి ప్రస్తుత ఉష్ణోగ్రతలు మరింత ప్రమాదకరంగా పరిణమించాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్న నేపథ్యంలో గ్రేటర్లో పక్షుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని పేర్కొంటున్నారు. సహజమైన పొదలు, మర్రి, రావి చెట్లు లేకపోవడం, పక్షుల కోసం ప్రత్యేకమైన పార్కులు ఏర్పాటు చేయకపోవడం వల్ల కూడా వాటి ఉనికికి ముప్పు ఏర్పడింది. దీంతో ఎండ దెబ్బకు పక్షులు చనిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 450 పక్షి జాతులు మనుగడలో ఉంటే హైదరాబాద్‌లో 40 రకాల పక్షులు ఉన్నట్లు అంచనా. వీటిలో చాలా వరకు ప్రస్తుతం ప్రమాదంలోనే ఉన్నాయి. అతిథుల్లా ఆదరించండి.. నగరీకరణ, వాతావరణ కాలుష్యం, అపార్ట్మెంట్ కల్చర్ పక్షుల పాలిట శాపంగా మారింది. ముళ్ల పొదల్లాంటి సహజమైన చెట్లు కానీ, గూళ్లు కానీ లేకపోవడంతో అవి ఎక్కడ నీడ కనిపిస్తే అక్కడ వాలిపోతున్నాయి. ఆహారం, తాగునీరు దొరక్క అల్లాడుతున్నాయి. ఇంటి బాల్కానీలు, ఇంటి నీడల్లో కనిపించే పక్షుల కోసం కోసం గూళ్లు ఏర్పాటు చేయాలి.చిన్న చిన్న నీటి తొట్టెల్లో తాగునీరు అందుబాటులో ఉంచితే.. ఆ చిరుప్రాణికి అదే అమృతం. నగరంలో పిచ్చుకలు, చిలుకలు, గోరువంకలు, చిన్న సైద, తేనెపిట్ట, జమురు కాకి, కోయిల, గద్ద, డేగ, గువ్వలు, నెమళ్లు వంటి జాతి పక్షులు ప్రమాదకర పరిస్థితుల్లో బతుకుతున్నాయి. అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ఆ ప్రమాదం తారాస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో వాటిని చేరదీసి గింజలు, నీళ్లు, గూళ్లు అందుబాటులో ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి. రేపటి తరాన్ని పరిరక్షించుకోవడమే.. అభివృద్ధి కోసం భారీ నిర్మాణాలు చేపట్టడం అనివార్యం. కానీ పక్షుల మనుగడకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పెద్ద పెద్ద భవనాలు కట్టిన చోట తప్పనిసరిగా పక్షుల కోసం పార్కులు, చెట్లు పెంచాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడితేనే రేపటి తరానికి ఉన్నతమైన పర్యావరణాన్ని అందజేయగలం. - వక్కలంక రజని, సిటిజన్స్ ఫర్ లోకల్ బయోడైవర్సిటీ అవేర్నెస్ అండ్ కన్జర్వేషన్ వ్యవస్థాకులు -
ఉదయం 11 వరకే తరగతులు
నిబంధనలు అతిక్ర మించే పాఠశాలలపై చర్యలు డీఈవో నాగేశ్వరరావు హెచ్చరిక చిత్తూరు(గిరింపేట): జిల్లాలో ప్రస్తుతమున్న ఎండ తీవ్రత దృష్ట్యా అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఉదయం 11 వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని డీఈవో నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరగనుందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఆదేశాలను జారీ చేశామని తెలిపారు. నిబంధనలను అతిక్రమించి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మంగళవారం ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను త నిఖీ చేయడానికి ప్రత్యేకంగా అధికారులను నియమించామని తెలిపారు. వారు 11 గంటలపై అన్ని పాఠశాలలను తనిఖీ చేస్తార న్నారు. రెండో పేపర్ పరీక్ష ఉన్న తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రం 11 గంటలకుపైన పరీక్షలను రాయించాలన్నారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే సంబంధిత ప్రదేశాల్లో వున్న ఎంఈవోలకు, డీవైఈఓలకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
బెజవాడలో వేడి తగ్గిందట!
బ్లేజ్‌వాడగా పేరొందిన విజయవాడలో ఏటా ఎండలు మెండుగానే ఉంటాయి. కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే వస్తున్న విషయం జిల్లావాసులకు ఎరుకే. ఈ ఏడాది మార్చిలోనే భానుడు చండ్రప్రచండుడయ్యాడు. వడదెబ్బ బారిన పడి ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డారు. సీన్ కట్ చేస్తే.. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు ఎండల గురించి కూల్‌గా మాట్లాడారు. తాను విజయవాడ వచ్చిన తర్వాత చెట్లు బాగా పెంచి వాతావరణాన్ని చల్లబరిచానని చెప్పారు. అందుకే నగరంలో ఉష్ణోగ్రతలు గతంకన్నా తగ్గిపోయాయని పేర్కొన్నారు. -సాక్షి ప్రతినిధి, విజయవాడ -
ఎండ..ఠండా
సిటీబ్యూరో: ఉదయం, మధ్యాహ్నం మండుటెండ... ఉక్కపోత..సాయంత్రం ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన జల్లులు. నగరంలో ఆదివారం సాధారణం కంటే భిన్నమైన వాతావరణం ఏర్పడింది. మండుటెండతో విలవిల్లాడిన సిటీజనులు జల్లులతో స్వల్ప ఉపశమనం పొందారు. కాగా మధ్యాహ్నం గరిష్టంగా 42.2 డిగ్రీలు, కనిష్టంగా 28.6 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసినట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశాలున్నాయన్నారు. ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని ప్రకటించారు. -
ఎండ ప్రచండం
చిత్తూరు: ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోందా? సూర్యుడు ప్రజలపై పగబట్టడా? అనేలా ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా మూడు నాలుగు రోజులుగా ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా నమోదవుతోంది. ఉదయం 10 గంటలకే జనం భానుడి ప్రకోపానికి బయటకు రాలేని దుస్థితి. తిరుపతి, చిత్తూరుతో పాటు ప్రధాన పట్టణాల్లో మధ్యాహ్నం అయితే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఫుట్‌పాత్ వ్యాపారులకు (చిరువ్యాపారులు) అవస్థలు తప్పడం లేదు. శీతలపానీయాలుకు గిరాకీ పెరిగింది. ఎండవేడికి విద్యార్థులు మరింతగా ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణా ప్రభుత్వం శనివారం నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ఏపీలో ఏప్రిల్ 23వతేదీ వరకు పాఠశాలలు నడపనున్నారు. మరోవైపు సాయంత్రం 5 గంటలకు కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంటోంది. జిల్లావ్యాప్తంగా 45 మంది మృతి వడదెబ్బతో ఏప్రిల్ 15నాటికి జిల్లావ్యాప్తంగా 45 మంది మృత్యువాత పడినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మరింత మంది ప్రాణాలు కోల్పోయే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉపాధి కూలీలకు రక్షణ కరువు మరోవైపు జిల్లావ్యాప్తంగా లక్ష మంది వరకు ఉపాధి కూలీ పనులు చేస్తున్నారు. ఎండలోనే పనిచేయాల్సి రావడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఉపాధి కూలీలకు షామియానాలు, మంచినీటి సౌకర్యంతో పాటు వడదెబ్బకు గురైన వారికి తక్షణం వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఇక నగరాలు, పట్టణాల్లో చలివేంద్రాలు విరివిగా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటనలిస్తున్నా క్షేత్రస్థాయిలో అవి కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. గత ఏడాది 162 మంది మృతి గత ఏడాది వడదెబ్బకు 162 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మదనపల్లె డివిజన్లో 10 మంది, తిరుపతి డివిజన్లో 67, చిత్తూరు డివిజన్లో 85 మంది మరణించారు. ఈ ఏడాది ఏప్రిల్ 15 నాటికే 45 మంది మృతిచెందడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. -
నీళ్లు జల్లకుంటే మంటేగా
సొంతిల్లు కట్టుకుంటున్నారనగానే... ఫ్లోరింగ్ మార్బులా? టైల్సా? సీలింగ్‌కి ప్లాస్టరాఫ్ పారిసా? థర్మాకోల్తోనా? మెయిన్‌డోర్ సంగతేంటి? ఇంటీరియర్స్ ఎలాంటివి చేయిస్తున్నారు?.. అన్నీ ఇలాంటి ప్రశ్నలే తప్ప ఇంట్లో మొక్కలకు స్థలం ఉందా? టైపైన గార్డెన్ ఏర్పాటు చేస్తున్నారా? అని అడిగేవారే లేరు.. ఆ విషయం గురించి ఆలోచించే వారూ లేరు. ఓ వైపు ఆకాశహర్మ్యాలతో సిటీని కాంక్రీట్ జంగిల్లా మారుస్తున్నాం. మరోవైపు పచ్చదనం వర్ధిల్లాల్సిన అవసరాన్ని విస్మరిస్తున్నాం. ఆ ధోరణే మండే ఎండలకు రెడ్ కార్పెట్ వేస్తోంది. అయితే సిటీలో ఈ విషయంలో కొందరు మాత్రం తమ వంతు కృషి చేస్తున్నారు. ఆధునికంగా ఇంటిని తీర్చిదిద్దుకుంటూనే పచ్చదనానికి కూడా పెద్ద పీట వేస్తూ మండే ఎండల బారి నుంచి ఉపశమనం పొందుతున్నారు. చుట్టుపక్కల వారంతా బాబోయ్ న‘గరం’ అంటున్నా, వీరు మాత్రం పచ్చదనమే సాక్షిగా ఎండలకి నో ఎం‘ట్రీ’ బోర్డు పెట్టేశారు. -
మలమల..మార్చి!
మార్చిలోనే ఎండలు మలమల మాడ్చేస్తున్నాయి. మేనాటి ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతున్నాయి. జిల్లాలో ఆదివారం కాసిన ఎండలకు జనం బెంబేలెత్తిపోయారు. నూజివీడులో అత్యధిక ఉష్ణోగ్రత 41 డిగ్రీలుగా నమోదైంది. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే.. మేలో ఇంకెలా ఉంటుందోనని జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. -
విశాఖలో 38 డిగ్రీలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
జనం విలవిల విశాఖపట్నం: కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న భా నుడు ఒక్కసారిగా విజృంభిస్తున్నాడు. ఆదివా రం తీవ్ర ఉష్ణోగ్రతలతో జనాన్ని బెదరగొట్టా డు. ఈ సీజనులో జిల్లాపై తొలిసారిగా 38 డిగ్రీల ఉష్ణోగ్రతలను వెదజల్లాడు. ఆది వారం ఉదయం నుంచే వేడి సెగలు మొదలయ్యాయి. అది సాయంత్రమయ్యే దాకా కొనసాగాయి. భా నుడి ప్రతాపానికి జనం తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. మధ్యాహ్నం అయ్యే సరికి తట్టుకోలేకపోయారు. ముఖానికి దుస్తులు చుట్టుకుని కొందరు, గొడుగులు వేసుకుని ఇంకొంద రు రాకపోకలు సాగించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించిన వారు, రోడ్ల పక్కన చిరు వ్యాపారులు ఎండ తీవ్రతకు నానా అగచాట్లు పడ్డారు. విశాఖలో ప్రస్తుతం సాధారణ ఉష్ణోగ్రత 34 డిగ్రీలు నమోదు కావలసి ఉంది. కానీ ఆదివారం నాలుగు డిగ్రీలు అధికంగా నమోదై 38కి చేరుకుంది. శనివారం విశాఖలో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. శనివారంతో పోల్చుకుంటే ఒక్కరోజులోనే 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. దీంతో ఈ ఉష్ణతాపాన్ని భరించ లేక జిల్లా వాసులు నానా అవస్థలు పడ్డారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి కొన్నాళ్లు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
తస్కిన్,సన్నీలపై నిషేధం
న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ పేసర్ తస్కిన్ అహ్మద్, ఎడమ చేతి స్పిన్నర్ అరాఫత్ సన్నీలు నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేయడంతో వారిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిషేధం విధించింది. ఈ మేరకు ఆ బౌలర్ల బౌలింగ్ శైలిని పరీక్షించిన అనంతరం శనివారం ఐసీసీ ఓ నివేదిక విడుదల చేసింది. తస్కిన్, సన్నీలు తమ మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువ వంచి బౌలింగ్ చేయడం నిబంధనలకు విరుద్ధంగా కావడంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. వీటిని దేశవాళీ లీగ్‌లు కూడా గుర్తించాలని ఐసీసీ తెలిపింది. టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరి బౌలింగ్ శైలిపై అంపైర్ల నుంచి మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ తస్కిన్ 14 వన్డేలు ఆడి 21 వికెట్లు తీయగా,13 టీ20ల్లో 9 వికెట్లు సాధించాడు. ఇక సన్నీ 16 వన్డేల్లో 24 వికెట్లు, 10 టీ 20ల్లో 12 వికెట్లు తీశాడు. -
ఎండ కన్నెరుగనివ్వని జబ్బు
మెడిక్షనరీ శరీరానికి కాస్తంత ఎండ పొడ సోకాలి. లేలేత సూర్యకిరణాలు సోకితేనే శరీరంలో విటమిన్-డి తయారవుతుంది. అయితే, అత్యంత అరుదుగా కొందరికి సూర్యరశ్మి ఏమాత్రం సరిపడదు. వాళ్ల చర్మానికి కొద్దిసేపు ఎండ సోకినా, ఎండ తాకిన ప్రదేశమంతా మచ్చలు, దద్దుర్లు ఏర్పడతాయి. ఒక్కోసారి అగ్నిప్రమాదానికి గురైన స్థాయిలోనే చర్మమంతా కమిలిపోయి చూడటానికే భయంకరంగా మారుతుంది. ఎండ కన్నెరుగనివ్వని ఈ జబ్బును ‘జీరోడెర్మా పిగ్మెంటోసమ్’ అంటారు. జన్యువుల్లోని డీఎన్ఏలో తలెత్తే లోపాల వల్ల చాలామందికి బాల్యంలోనే ఈ వ్యాధి వస్తుంది. ఈ జబ్బు సోకిన వారు పగటివేళ ఆరుబయట సంచరించలేరు. రాత్రివేళల్లో మాత్రమే సురక్షితంగా సంచరించగలరు. అందుకే ఈ జబ్బు సోకిన చిన్నారులను ‘చిల్డ్రన్ ఆఫ్ నైట్’ అంటారు. -
ఎండ తగలనివ్వం!
♦ ఎండ తీవ్రతనుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్రం సన్నద్ధం ♦ అహ్మదాబాద్ ప్లాన్ అమలుకు రాష్ట్ర విపత్తు శాఖ ఏర్పాట్లు ♦ మార్చి నుంచి అమలయ్యేలా ప్రణాళిక ♦ ఈసారి మరింత తీవ్రం కానున్న ఎండలు హెచ్చరికలు రెడ్ అలర్ట్ : అత్యంత తీవ్రమైన ఎండలతో కూడిన వడగాలులు ఉన్నప్పుడు చేసే హెచ్చరిక ఆరెంజ్ అలర్ట్ : తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు.. ఎల్లో అలర్ట్ : సాధారణంగా ఎండాకాలంలో వేడిగా ఉంటే వైట్ అలర్ట్ : సాధారణం కంటే తక్కువ ఎండలు ఉన్నప్పుడు చేసే హెచ్చరిక. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి ఎండలు మరింత మండనున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి నెలాఖరు వరకు చలికాలం ఉంటుంది. కానీ అప్పుడే సాధారణం కంటే ఐదారు డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తీవ్రమైన ఎల్‌నినో కారణంగా వాతావరణంలో భారీ మార్పులు సంభవించి అదనపు ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయని, వచ్చే వేసవిలో పరిస్థితి మరింత తీవ్రం కానుందని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. వచ్చే వేసవిలో గత ఏడాది కంటే రెండు మూడు డిగ్రీల అదనంగా నమోదవుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత నుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అహ్మదాబాద్ కార్యాచరణ ప్రణాళికను అమలుచేయాలని నిర్ణయించింది. అహ్మదాబాద్ బాటలో... గత వేసవిలో ఖమ్మంలో అత్యధికంగా 47.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదుకాగా, అనేక చోట్ల 45 డిగ్రీలకు మించింది. ఈసారి 49 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వై.కె.రెడ్డి చెబుతున్నారు. గతంలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు 10 రోజుల వరకు మాత్రమే ఉంటే... వచ్చే వేసవిలో ఏకంగా నెల రోజులపాటు సుదీర్ఘ కాలం వడగాలులు ఉంటాయన్నారు. గత ఏడాది రాష్ట్రంలో 500 మందికి పైగా వడదెబ్బతో చనిపోయారు. ఈ పరిస్థితిని నివారించేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రణాళికే దేశంలో ఆదర్శంగా ఉన్నందున దాని ఆధారంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని విపత్తు నిర్వహణశాఖ అసిస్టెంట్ కమిషనర్ వినోద్ చెప్పారు. మార్చి నుంచి అమలు చేసేందుకు ఇప్పటికే ముసాయిదా తయారుచేశారు. అహ్మదాబాద్ ప్రణాళిక ఇదీ... ♦ రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఎల్ఈడీ స్క్రీన్స్ పెట్టి ఉష్ణోగ్రతల వివరాలు ప్రదర్శించడం. ♦ టీచర్లకు శిక్షణ ఇచ్చి విద్యార్థులకు వడదెబ్బ నుంచి రక్షణ తీసుకునేలా చేయడం. ♦ పాఠశాలల వేళలను మార్పు చేయడం. ♦ ఎఫ్ఎం రేడియోతో అప్రమత్తం చేయడం. ♦ ఐస్ ప్యాక్స్, ఐవీ ఫ్లూయిడ్స్‌ను, 108 సర్వీసును అందుబాటులో ఉంచడం. ♦ ఆరోగ్య కేంద్రాల వేళలను పెంచడం. ♦ ఆరు బయట శ్రమ చేసేవారికి నీడ కల్పిం చడం. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఐదింటి వరకు పని లేకుండా చూడటం. ఫ్యాక్టరీల్లో ఏసీ ఏర్పాటు చేయడం. ♦ ట్వీటర్, ఫేస్బుక్, వాట్సాప్‌ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడం. మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపడం. ♦ అత్యంత ఎండ తీవ్రతలున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం. ♦ అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి తాగునీరు, వైద్య వసతి, నీడ కల్పించడం. ♦ వడదెబ్బకు గురైన వారికోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను నెలకొల్పడం. -
సన్నీతో ఫొటోకి ప్రియాంక నో!
‘‘ఆహా! ప్రియాంక ఎంత బాగా ప్లేట్ ఫిరాయించింది... నటిగా మాత్రమే నంబర్ వన్ కాదు.. మాట మార్చడంలో కూడా నంబర్ వన్నే.. ఎంతైనా బాగా తెలివైన పిల్లే...’’ అని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రియాంకా చోప్రా తెలివితేటలు గురించి అందరూ మాట్లాడుకోవడానికి కారణం ఇటీవల జరిగిన ఓ ఆడియో వేడుక. ఆ వేడుకలో పలువురు తారలు పాల్గొన్నారు. వాళ్లల్లో ప్రియాంకా చోప్రా, సన్నీ లియోన్ ఉన్నారు. ఈ ఇద్దరూ ఒకేసారి వేడుక ప్రాంగణంలో ప్రత్యక్షం కావడంతో, ఇద్దర్నీ కలిపి ఫొటో తీద్దామనుకున్నారు ఫొటోగ్రాఫర్లు. ‘ఒక్క ఫొటో’ అని ప్రియాంకను వాళ్లు అడిగితే, ‘ఆమెతో ఫొటో వద్దు’ అని హిందీలో అన్నారట. సన్నీతో ఫొటో దిగితే తన రేంజ్ పడిపోతుందని ప్రియాంక భావించినట్లున్నారు. సన్నీకి హిందీ అర్థం కాదు కాబట్టి, ఆ భాషలో చెప్పారని పరిశీలకులు ఊహిస్తున్నారు. కానీ, సన్నీకి అర్థం చెప్పేవాళ్లు ఉంటారు కదా.. వాళ్లు ఈ హాట్ బ్యూటీ చెవిలో అసలు విషయం పడేశారు. దాంతో సన్నీ మనసు గాయపడింది. ఏదైతేనేం చివరకు సన్నీ, ప్రియాంక ఇద్దరూ కలిసి ఫొటో దిగారు. కానీ, సన్నీ పట్ల ప్రియాంక అలా వ్యవహరించినందుకు కొంతమంది తూలనాడారట. మౌనంగా ఉంటే బ్యాడ్ అయిపోతానని గ్రహించిన ప్రియాంక ‘‘సన్నీ అందం ముందు నేనెందుకూ పనికిరాను. అందుకే ఆమెతో ఫొటో దిగనన్నాను. అంతే కానీ ఇష్టంలేక కాదు. సంచలనం కోసం నా స్టేట్మెంట్ని మీడియావాళ్లు వక్రీకరించారు’’ అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. అందుకు బదులుగా ‘‘నీ మాటలకు అర్థం నాకు తెలిసింది. మీడియానే ఏవేవో సృష్టించింది’’ అని సన్నీ ట్వీట్ చేశారు. ముందు నోరు జారి, అభాసుపాలవుతానని గ్రహించిన ప్రియాంక తెలివిగా తప్పంతా మీడియాపై నెట్టేశారని పరిశీలకులు గ్రహించారు. కానీ, ఆ మాట ప్రియాంకతో అంటే ఒప్పుకుంటారా? -
కొత్త పరిశోధన
ఎండ సోకకుంటే కండరాల నొప్పులు.. ఎండ కన్నెరుగకుండా రోజుల తరబడి గడిపేస్తే కండరాల నొప్పులు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, కండరాల నొప్పులకు ఐరన్ లోపం కూడా కారణమేనని వారు చెబుతున్నారు. శరీరానికి కాస్త ఎండ తగలనిస్తే, ఎముకల పటిష్టతకు కావలసిన విటమిన్-డి తయారవుతుందని, తద్వారా వ్యాయామానంతరం కండరాల నొప్పులు రాకుండా ఉంటాయని వివరిస్తున్నారు. విటమిన్-డి లోపిస్తే ఎముకల పటుత్వం తగ్గి, కొద్దిపాటి శ్రమకే ఎముకలు, కండరాల్లో నొప్పులు మొదలవుతాయని, సూర్యరశ్మి సోకనివ్వడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చని లండన్‌కు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ డెయో ఫాముబోని చెబుతున్నారు. అలాగే, ఐరన్ లోపించిన మహిళలు కూడా తరచు ఒంటినొప్పులతో బాధపడుతుంటారని, తగిన పోషకాలతో కూడిన ఆహారం, కాసేపు ఎండలో గడపడం ద్వారా ఇలాంటి పరిస్థితిని అధిగమించవచ్చని ఆయన సూచిస్తున్నారు. గింజ ధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, పుట్టగొడుగులు, గుడ్లు, చేపలు వంటి వాటిలో విటమిన్-డి, ఐరన్.. రెండూ పుష్కలంగా ఉంటాయని, ఒంటినొప్పులతో బాధపడేవారు ఆహారంలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకుంటే చాలని డాక్టర్ ఫాముబోని వివరిస్తున్నారు. -
చెట్నీ అడిగితే 'పచ్చడి' కింద కొట్టాడు
న్యూఢిల్లీ: హోటల్లో అయినా.... రోడ్డు పక్కన బండి దగ్గర టిఫిన్ చేస్తూ... కొంచెం పచ్చడి వేయమంటే మళ్లీ ఎవరైనా వేస్తారు. అది సహజం. కానీ చేస్తున్న టిఫిన్‌లో మరోసారి పచ్చడి వేయమని అడిగి... కాకా హోటల్ యజమాని ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి ఆసుపత్రి ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన తూర్పు న్యూఢిల్లీలోని త్రిలోక్ పూరి బ్లాక్ 31లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. సన్నీ అనే యువకుడు అతని స్నేహితులు రోడ్డు పక్కనే ఉన్న కాకా హోటల్లో టిఫిన్ తింటున్నారు. ఆ క్రమంలో సన్నీ ప్లేట్లో పచ్చడి అయిపోయింది. మళ్లీ పచ్చడి కావాలని హోటల్ యజమాని కమల్ని కోరాడు. దాంతో కమల్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సన్నీపై ఐరన్ రాడ్‌తో దాడి చేసి... విచక్షణరహితంగా కొట్టి 'పచ్చడి' చేశాడు. దాంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కమల్‌పై కేసు నమోదు చేశారు. సన్నీని చికిత్స నిమిత్తం లాల్ బహదూర్ శాస్త్రీ ఆసుపత్రికి తరలించారు. అయితే మరింత మెరుగైన వైద్య చికిత్స కోసం అతడిని మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో అతడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా పచ్చడిని సన్నీ వృద్ధా చేశాడని... అలా చేయవద్దని చెప్పినందుకు అతడితోపాటు అతడి స్నేహితులు తనతో ఘర్షణకు దిగారని కమల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతే కాకుండా అతడి స్నేహితులకు ఫోన్ చేస్తే.. వారు కూడా వచ్చి తనతో వాదనకు దిగారని ఆ ఫిర్యాదులో కమల్ పేర్కొన్నాడు. దాంతో సన్నీపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పట్నంలో నీటి గోస!
మొత్తం నగరాలు, పట్టణాలు.. 67 18 నగరాలు, పట్టణాల్లో రోజూ సరఫరా 28 చోట్ల రెండు రోజులకోసారి నీళ్లు 13 పట్టణాల్లో మూడు రోజులకు ఒకసారి 5 చోట్ల నాలుగు రోజులకోసారి 3 పట్టణాల్లో ఏడు రోజులకోసారి సరఫరా పట్టణాల్లో తాగునీటి పథకాల సామర్థ్యం, తగ్గుదల, సరఫరా వివరాలు పథకాల గరిష్ట సామర్థ్యం : 747 ఎంఎల్డీ ప్రస్తుత సరఫరా సామర్థ్యం : 459 ఎంఎల్డీ (61.5 శాతం) తరుగుదల : 287 ఎంఎల్డీ (38.5 శాతం) రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో తాగునీటి తీవ్ర కటకట తాగునీటి సరఫరాలో 30-60 శాతం తరుగుదల రాష్ట్రంలో పురజనుల గొంతెండుతోంది.. దాహం దాహం అంటూ పట్టణవాసులు అల్లాడిపోతున్నారు.. గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఎండలు ముదరడంతో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య మరింత పెరిగింది. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కాకపోవడంతో పరిస్థితి మరింత దుర్భరంగా మారుతోంది. నిధులు లేక నగర, పురపాలక సంస్థలు తాగునీటి సరఫరా చేయలేక చేతులెత్తేస్తున్నాయి. దీంతో వందల కోట్లు కుమ్మరించి నిర్మించిన నీటి సరఫరా పథకాలు నిరుపయోగంగా మారిపోయాయి. మరోవైపు... ప్రైవేటు నీటి శుద్ధి కేంద్రాలు కోట్లాది రూపాయల దందాకు తెరలేపాయి. - సాక్షి, హైదరాబాద్ ‘కొత్త’ సమస్యలు నగరాలు, పట్టణాల పరిధిలోని 26.85 శాతం ప్రాంతాలకు అసలు నీటిసరఫరా వ్యవస్థే లేదు. ప్రధానంగా శివారు ప్రాంతాలు, 25 కొత్త నగర పంచాయతీల్లో ఈ పరిస్థితి ఉంది. నల్లగొండ జిల్లా దేవరకొండలో ఆరు రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సైతం 4 రోజులకోసారి నీళ్లు ఇస్తున్నారు. కోరుట్ల, మెట్పల్లి, హుస్నాబాద్, వేములవాడ, హుజూరాబాద్, మధిర, దేవరకొండ, బడంగ్‌పేట, ఐజ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, షాద్‌నగర్ పట్టణాల పరిధిలోని 50 శాతానికిపైగా ప్రాంతాలకు నీటి సరఫరా వ్యవస్థే లేదు. ట్యాంకర్ల ద్వారా సరఫరాకు ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయలేకపోయింది. నీటిని విడుదల చేస్తేనే.. నీటి నిల్వలు తగ్గిపోవడంతో పట్టణాల్లో సరఫరా క్లిష్టంగా మారింది. పలుచోట్ల తక్షణమే సంబంధిత ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఖమ్మం-పాలేరు రిజర్వాయర్ నుంచి మునేరుకు నీటిని విడుదల చేయాలి. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి పట్టణాలకు నీరందించడం కోసం ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాల్వ ద్వారా ఎస్ఎస్ ట్యాంకులు, వెంకటరావుపేట చెరువుకు నీళ్లు వదలాల్సి ఉంది. సగం మందికి దాహమే! నీటి సరఫరా నాణ్యత ప్రమాణాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో సగటున ఒకరికి రోజుకు 140 లీటర్ల (ఎల్పీసీడీ) నీటిని సరఫరా చేయాల్సి ఉండగా.. రాష్ట్రంలో 40 నుంచి 100 లీటర్లలోపు మాత్రమే సరఫరా అవుతున్నాయి. సాధారణ పరిస్థితిలో ఒక రోజులో 43.11 శాతం జనాభాకే తాగునీరు అందుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, వేసవి నిల్వ ట్యాంకుల్లో నీటిమట్టాలు తరిగిపోవడంతో.. ఈ పరిస్థితి తలెత్తింది. రాష్ట్రంలోని 67 పట్టణాల్లో నీటి సరఫరా పరిస్థితి ఇలా ఉంది.. ►18 పట్టణాల్లో నీటి సరఫరా 44 -100 ఎల్పీసీడీలు ఉండగా.. వేసవి ప్రభావంతో 30 శాతం తగ్గిపోయింది. ► 28 పట్టణాల్లో 8-56 ఎల్పీసీడీల మధ్య ఉన్న సరఫరా ప్రస్తుతం 40 శాతం తగ్గింది. ► 13 చోట్ల మూడు రోజులకోసారి 5-49 ఎల్పీసీడీలుగా ఉన్న సరఫరా.. ఇప్పుడు సగానికి పడిపోయింది. ► 5 పట్టణాల్లో నాలుగు రోజులకోసారి 11-17 ఎల్పీసీడీల నీటిని సరఫరా చేసేవారు. కానీ గత మూడు నెలల్లో సరఫరా 60 శాతం తగ్గింది. ► మిగతా 3 చోట్ల వారానికోసారి మాత్రమే సరఫరా చేస్తున్నారు. ‘నీరు’గారిన పథకాలు రాష్ట్రంలోని పట్టణ తాగునీటి పథకాల ‘సరఫరా సామర్థ్యం’ దాదాపు 40 శాతం తగ్గిపోయింది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 67 నగరాలు, పట్టణాలకు తాగునీటిని సరఫరా చేసే పథకాల పనితీరుపై ఇంజనీరింగ్ నిపుణులతో చేయించిన సమగ్ర సర్వేలోనే ఈ విషయం బయటపడింది. తుప్పుపట్టిన ప్రధాన పైప్లైన్లు, లికేజీలు, శిథిలమైన ఓవర్‌హెడ్ ట్యాంకులు, మొరాయిస్తున్న పంపింగ్ స్టేషన్లతో నీటి పథకాలు సరిగా పనిచేయడం లేదు. ఈ పథకాలన్నీ తిరిగి పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకోవాలంటే ఏకంగా రూ.624.33 కోట్లతో మరమ్మతులు చేయాల్సి ఉందని ప్రజారోగ్య, ఇంజనీరింగ్ విభాగం తేల్చింది. -
ఎండకు ఐస్ ప్యాక్...
సమ్మర్ రక్షణ ఎండతాకిడికి లోనైన చర్మం బాగా ఎర్రబడి, మండుతుంటుంది. ఆ తర్వాత కమిలి నలుపురంగుకు మారుతుంటుంది. ఈ సమస్యనే ట్యాన్ అంటారు. ఎండబారిన చర్మానికి కూల్ ప్యాక్ సరైన ఎంపిక. ఎండనుంచి ఇంటికి వచ్చాక ఐస్ క్యూబ్‌తో ఎండ ప్రభావానికి లోనైన చర్మంపై మృదువుగా రబ్ చేయాలి. చల్లగా ఉండటంతో పాటు, ట్యాన్ సమస్య బాధించదు. చెమట వాసన రాకుండా ఉండేందుకు డియోడరెంట్లు, పెర్ఫ్యూమ్లు ఈ కాలంలో ఎక్కువగా వాడుతుంటారు. ఇవి చర్మానికి నేరుగా స్ప్రే చేయడం వల్ల దురద పెట్టే అవకాశం ఉంది. దద్దుర్లూ రావచ్చు. అందుకని ధరించిన బట్టలపై మాత్రమే స్ప్రే చేసుకోవాలి. ఎన్ని నీళ్లు తాగినా ఎండతాకిడికి లోనైన చర్మం త్వరగా పొడిబారుతుంది. దీని వల్ల చర్మం ముడతలు పడే అవకాశమూ ఉంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఇ-విటమిన్ శాతం ఎక్కువ ఉన్న బాడీ లోషన్ లేదా మాయిశ్చరైజర్ తప్పక వాడితే చర్మం పొడిబారదు. టీ స్పూన్ తేనె, 10-15 చుక్కల నారింజ రసం, టేబుల్ స్పూన్ ఓట్స్, టేబుల్స స్పూన్ రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి, చల్లబడ్డాక ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఎండ ప్రభావం నుంచి ముఖచర్మం త్వరగా విశ్రాంతి పొందుతుంది. -
చుర్రుమంటోంది..
ఠారెత్తిస్తున్న ఎండలు ఉష్ణోగ్రతలు ఉధృతం గాలులతో కాస్త ఉపశమనం ఎండలు ఠారెత్తించడంతో జిల్లాలో కాక పుడుతోంది. ఉదయం నుంచి ఉడుకు మొదలవుతోంది. వేసవి ఊపందుకోవడంతో దాని ఉధృతి కూడా పెరుగుతోంది. ఏప్రిల్ మొదటి వారంలోనే సాధారణంకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. మరోవైపు విశాఖపై ఎలాంటి ద్రోణులూ ప్రభావం చూపడం లేదు. అందువల్ల ఆకాశంలో మేఘాలు లేవు. దీంతో భానుడి ప్రతాపం నేరుగా భూమిపై పడి సత్వరమే వేడెక్కుతూ సెగలకు కారణమవుతోంది. విశాఖపట్నం: జిల్లా గరంగరంగా మారిపోతోంది. ఉదయం 9 గంటలకే చుర్రుమంటోంది. వీథుల్లోకి అడుగు పెట్టడానికి జనం భయపడుతున్నారు. హుద్‌హుద్ దెబ్బకు లక్షల చెట్లు నేలకూలాయి. ఫలితంగా ఆ ప్రభావం కూడా ఇప్పుడు ఇటు విశాఖపైన, అటు జిల్లాపైన పడుతోంది. వాహనాలు, పరిశ్రమలు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ను చెట్లు పీల్చుకుంటాయి. ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అయితే హుద్‌హుద్‌కు జిల్లాలో చెట్లు చాలావరకు ధ్వంసమయ్యాయి. దీనివల్ల విడుదలవుతున్న కార్బన్ డయాక్సైడ్ గాలిలో అలాగే ఉండిపోతోంది. దీంతో భూతాపం పెరిగిపోతూ ఉష్ణ తీవ్రతకు కారణమవుతోంది. విశాఖలో ఆదివారం 36 డిగ్రీల పగటి (గరిష్ట) ఉష్ణోగ్రత రికార్డయింది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువ. గాలులతో మేలు.. : వేసవి వచ్చిందంటే విశాఖ వాసులకు ఉక్కపోత బెడద వెంటాడుతుంది. ఇతర ప్రాంతాల కంటే విశాఖలో గాలిలో తేమ అధికంగా ఉంటుంది. గాలి కూడా తగ్గుతుంది. చెట్లు లేకపోతే తేమ శాతం మరింత పెరుగుతుంది. వెరసి ఉక్కపోతకు దారితీస్తుంది. అదృష్టవశాత్తూ ప్రస్తుతం దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయి. అందువల్ల గాలిలో తేమను ఒక చోట ఉంచకుండా ఉక్కపోత లేకుండా చేస్తున్నాయి. కొద్దిరోజులపాటు గాలులు వీస్తాయని, గాలులు తగ్గితే ఉక్కపోత మొదలవుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. -
ప్రయాణం
ఆ సాయంకాలపు ఆఖరి ఎండ దూరంగా రైలు పట్టాల వద్ద నీడల్తో కలిసి మలుపు తిరుగుతున్నప్పుడు ఊరి చివరి ఆ చిన్న రైల్వేప్లాట్‌ఫాం మీద అమోఘమైన ఒంటరితనం హఠాత్తుగా కలిగించిన ఉత్సాహవంతమైన దిగులను నువ్వు అనుభవిస్తున్నప్పుడు నిన్ను పలకరించిన ప్రత్యేకమైన ఆ గాలిస్పర్శను బాగా గుర్తు పెట్టుకో. ఎందుకంటే ‘అతడు భూమ్మీద పడీ పడగానే మొదటిసారీ- ఇదిగో చాలా ఏళ్ల తర్వాత ఈ సాయంత్రం రెండోసారీ- జీవితపు అరుదైనరంగు అతడి హృదయంలో విచ్చుకుంటోన్న సమయంలో పలకరించాను. భవిష్యత్‌లో ఆ స్థితి మళ్లీ అతడికి సంప్రాప్తిస్తే మూడోసారైనా నన్ను గుర్తు పడతాడో లేదో చూడాలి’ అంటూ నిన్ను తాకివెళ్లిన గాలి బాగా చీకటి పడ్డాక రాత్రితో చెప్పడం నక్షత్రాలు విన్నాయి.... - భగవంతం 9399328997 -
జనంపై జలభారం
గ్రేటర్ వాసులకు నీటి కష్టాలు ట్యాంకర్లే ఆధారం ఒక్కో కుటుంబంపైసుమారు రూ.2 వేల అదనపు భారం ఈ నెల 1 నుంచి 18 వరకు 30 వేల ట్రిప్పులకు బుకింగ్ {పైవేటు ట్యాంకర్ యజమానుల దోపిడీ సిటీబ్యూరో: గ్రేటర్లో పెరుగుతున్న ఎండలు.. అడుగంటుతున్న భూగర్భ జలాలు... వట్టిపోతున్న బోరు బావులతో గ్రేటర్ శివార్లు తాగునీటికి ట్యాంకర్లపైనే ఆధార పడాల్సిన దుస్థితి తలెత్తింది. జలమండలి పరిధిలో మార్చి ఒకటి నుంచి 18వ తేదీ వరకు ఏకంగా 30 వేల ట్రిప్పులకు ట్యాంక్‌లు బుక్ కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇలా బుక్ చేసుకున్న వారిలో 15 వేల మందికి 24 గంటల్లోగా.. మరో పదివేల మందికి 48 గంటల్లోగా ట్యాంకర్ నీటిని సరఫరా చేస్తున్నట్టు జలమండలి వర్గాలు తెలిపాయి. మరో 2500 మందికి మాత్రం వారం రోజులైనా ట్యాంకర్ నీళ్లు అందకపోవడం గమనార్హం. ఇదే అదనుగా ప్రైవేటు ట్యాంకర్ ఆపరేటర్లు వినియోగదారుల అవసరాలను భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. జలమండలి ట్యాంకర్‌కు (ఐదువేల లీటర్ల నీటికి) రూ.450 వసూలు చేస్తుండగా.. ప్రైవేటు ఆపరేటర్లు ప్రాంతాన్ని, డిమాండ్‌ను బట్టి రూ.750 నుంచి రూ.వెయ్యి వరకు దండుకుంటున్నారు. ఇక బస్తీలకు ఉచితంగా మంచినీటిని సరఫరా చేయాల్సిన జలమండలి ట్యాంకర్లు సైతం పక్కదారి పడుతున్నాయి. పేదల గొంతు తడపాల్సిన నీటిని కొందరు ట్యాంకర్ యజమానులు హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్‌లకు సరఫరా చేసి జేబులు నింపుకుంటున్నారు. కొన్ని బస్తీల్లో జలమండలి ఉచిత ట్యాంకర్ల వద్ద మహిళలు ఖాళీ బిందెలతో యుద్ధాలు చేస్తున్న దృశ్యాలు ఇటీవల బాగా పెరిగాయి. అదనంగా ట్యాంకర్ ట్రిప్పులను సరఫరా చేయని కారణంగానే ఈ పరిస్థితి తలెతోంది. టాం్యకర్ల పక్క దారి... జలమండలి పరిధిలో నీటి సరఫరాకు 6,674 ట్యాంకర్లున్నాయి. ఇందులో బస్తీలకు ఉచితంగా సరఫరా చేయాల్సినవి 125 ఉన్నాయి. కొన్ని బస్తీలకు ఉచితంగా మంచినీటిని సరఫరా చేయాల్సిన ట్యాంకర్లు పక్కదారి పడుతున్నట్లు ఇటీవల ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిపై బోర్డు అధికారులు దృషి ్టపెట్టి ట్యాంకర్ యజమానులను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వేసవిలో అదనంగా 500 ట్యాంకర్లతో గ్రేటర్ శివార్లలో మంచినీటి పైప్లైన్లు లేని వెయ్యి కాలనీలు, బస్తీలు, ఎగువ ప్రాంతాలకు ఉచితంగా నీటిని సరఫరా చేయాలని కాలనీ సంఘాలు, రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. గొంతెండుతోంది... గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని మండలాల్లో గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం భూగర్భ జలాలు పాతాళంలోకి వెళ్లిపోయాయి. ఎండలు తీవ్రమవుతుండడంతో నీటి సమస్య పెరుగుతోంది. మల్కాజ్గిరి, బోడుప్పల్, కాప్రా, శేరిలింగంపల్లి, చందానగర్ తదితర ప్రాంతాల్లో వెయ్యి అడుగుల లోతునకు బోరుబావులు తవ్వినా నీళ్లు లేక బావురుమనాల్సి వస్తోంది. జలమండలి మంచినీటి సరఫరా నెట్వర్క్ లేని సుమారు వెయ్యి కాలనీలు, బస్తీల్లో పానీపరేషాన్ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఒక ఇల్లు లేదా ఫ్లాట్ యజమాని నెలకు ట్యాంకర్ నీళ్లకు రూ.2 వేల నుంచి రూ.5 వేలు వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. ఇదీ లెక్క... గ్రేటర్ పరిధిలోని అపార్ట్మెంట్లు: సుమారు 25 వేలు ఒక్కో ఫ్లాట్ లేదా ఇంటి యజమాని ట్యాంకర్ నీళ్ల కోసం నెలవారీ చేస్తున్న ఖర్చు: ప్రాంతాన్ని బట్టి సుమారు రూ.2వేలు గ్రేటర్ పరిధిలోని మొత్తం భవంతులు: సుమారు 20 లక్షలు జలమండలి నల్లా కనెక్షన్లు: 8.64 లక్షలు జలమండలి సరఫరా నెట్వర్క్ లేని కాలనీలు, బస్తీలు: సుమారు వెయ్యి జలమండలి ట్యాంకర్లు: 674 {పైవేటు నీటి ట్యాంకర్లు: సుమారు నాలుగు వేలు. ఈ నెల 1 నుంచి 18 వరకు ట్యాంకర్ ట్రిప్పులు: 30 వేలు వారం రోజులుగా పెండింగ్‌లో ఉన్న ట్రిప్పులు: 2500 {పైవేటు ట్యాంకర్ నీళ్లకు (ప్రతి ఐదువేల లీటర్లకు) చెల్లిస్తున్న ధర: రూ.750 నుంచి రూ.1000 జలమండలి ట్యాంకర్ నీటికి: రూ.450(గృహవినియోగానికి) -
అడవిలో మంటలు
మంచిర్యాల రూరల్ : ఎండలు ముదురుతున్నకొద్దీ అడవుల్లో అగ్గి రాజుకుంటోంది. ఇప్పటికే అడవుల్లో మంటలు చెలరేగి సగం అడవులు అగ్ని ఆహుతి కాగా.. మరికొన్ని చోట్ల రాత్రి, పగలు తేడా లేకుండా అడవులు మండుతూనే ఉన్నారుు. అరుునా అటవీశాఖ అధికారుల్లో చలనం రావడం లేదు. అడవుల్లో నుంచి రహదారులు ఉండడం వల్ల వీటి వెంట నిత్యం వేలాది మంది ప్రయూణం చేస్తుంటారు. కొందరు బీడీ, చుట్ట, సిగరేట్ వంటివి కాల్చి రోడ్డు పక్కన పడేస్తుడడంతో అవి ఎండిన ఆకులు, గడ్డిపై పడి మంటలు అంటుకుని అడవిని దహించి వేస్తున్నారుు. దీంతో పచ్చని అడవులు ఇట్టే కాలిపోతున్నాయి. మంచిర్యాల మండలం గఢ్‌పూర్ గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న అడవిలో ప్రతి రోజూ మధ్యాహ్నం సమయంలోనే ఎక్కువగా మంటలు అంటుకుంటున్నాయి. అయినా.. అటవీ శాఖ అధికారులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడం లేదు. దీంతో కొంత మోడుబారిన చెట్లకు మంటలు అంటుకుని అవి చిగురించని పరిస్థితికి చేరుతున్నాయి. జనవరి చివరిలోనే అడవి మార్గంలోని రోడ్ల పక్కన మూడు మీటర్ల వరకు ఎండిన ఆకులు, ముళ్లకంపలు, గడ్డి చెత్తాచెదారం తొలగించాల్సి ఉంది. కానీ అధికారులు అలాంటి పనులేవీ చేపట్టలేదు. రోడ్డుకిరువైపులా పేరుకుపోయిన ఎండిన చెత్తలో, రోడ్డుపై వెళ్లే వారు బీడీ, సిగరెట్టు వంటివి తాగి పడేయడంతో అడవిలో అగ్గి రాజుకుని అడవినే దహించి వేస్తుంది. పచ్చగా ఉండాల్సిన అడవులు ఎండుబారడంతో, అగ్ని ప్రమాదంతో చెట్లకు నష్టం కలుగుతుండగా, అడవిలోని జంతువులకు సైతం ప్రాణనష్టం తప్పడం లేదు. గుంపులు గుంపులుగా తిరిగే వన్యప్రాణులు, అగ్ని వల్ల కలిగే వేడితో చెల్లాచెదురు అవుతున్నాయి. రూ.కోట్ల విలువైన కలప బుగ్గి జిల్లా విస్తీర్ణం దాదాపుగా 16.21 లక్షల హెక్టార్లు. ఇందులో 7.15 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అడవులను కాపాడటానికి ప్రభుత్వం ఆదిలాబాద్, నిర్మల్, జన్నారం(వన్యప్రాణి సంరక్షణ విభాగం), మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ అటవీ డివిజన్లను ఏర్పాటు చేసింది. కానీ ప్రతి ఏడాది వేసవి కాలం వచ్చిందంటే చాలు అడవుల్లో మంటలు ఎగసిపడుతున్నాయి. ఏటా వేలాది ఎకరాల్లో రూ.కోట్ల విలువైన కలప బుగ్గి అవుతోంది. వన్యప్రాణులకు ఆహారం దొరకని పరిస్థితి. అటవీశాఖ వీఎస్‌ఎస్‌ల ద్వారా రూ.లక్ష వ్యయం తో అడవుల రక్షణకు ఏర్పాటు చేసిన కంచెలు, అడవుల్లో నాటే మొక్కలు అగ్గి పాలవుతున్నాయి. అసలే వేసవి ఎండలు గత కొన్ని రోజులుగా విశ్వరూపం చూపిస్తుండడంతో అడవి అంతా మోడువారింది. ఇలా అడవులు కాలుతుండడంతో ఎండుగడ్డి కూడా దొరుకక వన్యప్రాణులు అంతరించే ప్రమాదం ఉంది. పశువులు, గొర్రెలు, మేకల మందలు ఉన్న వారు మేత కోసం అడవులకు వెళ్లలేక ఇంటి వద్ద మేత పెట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఔషధ మొక్కలు కూడా కాలిపోతున్నాయి. అడవులు ప్రమాదవశాత్తు కాలుతున్నాయా? ఎవరైనా అగ్గి రాజేస్తున్నారా? అనేది అంతుచిక్కడం లేదు. ఎండిన కట్టెలు తెచ్చుకునేందుకు సమీప గ్రామాల్లోని వారే అడవిలో అగ్గి రాజేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా అడవులను కాపాడాల్సిన ఆ శాఖ అధికారులు స్పందిస్తే, అడవులను అగ్ని నుంచి కొంత వరకైనా కాపాడుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే హరితహారం పేరుతో రాష్ట్రం లో చెట్లను లక్షల సంఖ్యలో పెంచేందుకు సిద్ధమైంది. కొత్తగా మొక్కల పెంపకం మాటేమో గానీ ఉన్న చెట్లను కాపాడుకోవాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. -
కూల్‌గా ఎండకు చెమట పట్టించండి...
స్టయిల్ సన్‌గ్లాస్ అంటే ఎండను తట్టుకోవడానికి ఉపయోగపడే అద్దాలు మాత్రమే కాదు...ఇంకా చాలా! ముఖ్యంగా చెప్పాలంటే మన ‘పర్సనల్ స్టైయిల్’ అందులో ప్రతిఫలిస్తుంది. ముఖాన్ని బట్టి సన్‌గ్లాస్‌లు సూట్ అవుతుంటాయి. కాబట్టి కొనే ముందు సలహా తీసుకోండి. మీ ముఖారవిందానికి నప్పే చలువ అద్దాలను ఎంపిక చేసుకుండి. ఎండను షేక్ చేయండి. ఇక్కడ కొన్ని మోడల్స్ ఉన్నాయి. మీకు సూటయ్యే అద్దాల గురించి ఒక అంచనాకు రండి. -
మండే ఎండ
40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ఉక్కపోతతో అల్లాడుతున్న జనం పెరుగుతున్న వడగాలులు సాక్షి, విశాఖపట్నం : ఎండ.. ఉక్కబోత.. వడగాలులు.. కరెంట్ కోత మూకుమ్మడిగా నగరవాసిపై దాడి చేస్తున్నాయి. దీంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతంలో ఎన్న డూ లేనంతగా.. దాహంతో గొంతు తడారిపోతోందని గగ్గోలు పెడుతున్నారు. వారం రోజులుగా పరిస్థితులే ఇలా ఉంటే.. రానున్న వేసవిలో మరెంత నరకం చవిచూడాల్సి వస్తుందోనని ఇప్పటి నుంచే భయపడుతున్నారు. వడగాలులు తీవ్రం : సోమవారం విశాఖ విమానాశ్రయంలో గరిష్ట ఉష్ణోగ్రత 40.6 డిగ్రీలుగా నమోదయినట్టు వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. గత రెండు రోజుల మాదిరిగానే ఉష్ణోగ్రతలున్నప్పటికీ వడగాలులు పెరగడం, గాలిలో తేమ(65 శాతం) కూడా ప్రభావం చూపడంతో ఉక్కబోత, గొంతు పొడిబారడం జరుగుతోందని వెల్లడించారు. రాత్రిపూట కంటే..పగటిపూట వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. కోస్తాంధ్రలో పలు చోట్ల ఇవే పరిస్థితులున్నట్టు వెల్లడించారు. -
చెల్లి పెళ్లికి డుమ్మా!
ముంబై: ధర్మేంద్ర, హేమామాలిని చిన్న కూతురు అహనా డియోల్ పెళ్లికి బాలీవుడ్ పెద్దలంతా వచ్చేసినా, సవతి సోదరులు సన్నీ, బాబీ డియోల్ మాత్రం కనిపించలేదు. ఢిల్లీకి చెందిన వ్యాపారి వైభవ్ వోరాతో అహనా పెళ్లిని ముంబైలోని ఐదు నక్షత్రాల హోటల్లో ఆదివారం నిర్వహించారు. దక్షిణాది, పంజాబీ పద్ధతిలో పెళ్లి జరిపించారు. బాలీవుడ్ బాసులు షారుఖ్ ఖాన్, అమితాబ్, జయా బచ్చన్, ఐశ్వర్యరాయ్, అభిషేక్, రేఖతోపాటు జావెద్ అఖ్తర్, షబానా ఆజ్మీ, జితేంద్ర, దీపికా పదుకొణే, రణ్వీర్ సింగ్, జుహీచావ్లా, సాహిల్ సంఘా, దియామీర్జా, సోనాక్షి సిన్హా, ఆశాభోస్లే తదితరులు పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. అయితే 2012లో జరిగిన ఈశా డియోల్ పెళ్లికి కూడా సన్నీ, బాబీ డియోల్ రాలేదు. ధర్మేంద్ర సోదరుని కొడుకు అభయ్ డియోల్ మాత్రం పెళ్లిలో కనిపించాడు. విశేషమేమంటే ఈశా పెళ్లిలోనే అహనా, వోరాకు పరిచయమయిందట. అందంగా అలంకరించిన గుర్రపుబండిలో వోరా వివాహ వేదికకు చేరుకోవడంతో పెళ్లి లాంఛనంగా ప్రారంభయింది. పెళ్లి, విందును ముంబై ఐటీసీ మరాఠా హోటల్లోనే ఏర్పాటు చేశారు. ఈ ఏడాది బాలీవుడ్లో జరిగిన అతి పెద్ద పెళ్లి ఇదే కావడంతో తారలతోపాటు వ్యాపార ప్రముఖులు అనిల్ అంబానీ, ఆయన తల్లి కోకిలాబెన్, యోగాగురువు బాబా రామ్‌దేవ్ వంటి వాళ్లు కూడా వచ్చారు. రాజకీయ నాయకులు అమర్‌సింగ్, శివసేన అధిపతి ఉద్ధవ్‌ఠాక్రే, ఆయన సతీమణి రష్మి అహనా వివాహ విందులో కనిపించారు. సన్నీ, బాబీ రాకపోవడంపై మాట్లాడడానికి ధరే ్మంద్ర కుటుంబ సభ్యులెవరూ ఆసక్తి చూపలేదు.