Bigg Boss 5 Telugu: Conflicts Between Manas And Sunny - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: స్నేహితుల మధ్య చిచ్చుపెట్టిన బిగ్‌బాస్‌.. గెలుపెవరిది?

Published Wed, Nov 17 2021 3:54 PM | Last Updated on Wed, Nov 17 2021 4:25 PM

Bigg Boss 5 Telugu: Conflicts Between Manas And Sunny - Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌ స్నేహితుల మధ్య చిచ్చుపెట్టింది. హౌస్‌లో మంచి స్నేహితులుగా ఉన్న మానస్‌-సన్నీ మధ్య విభేదాలు వచ్చినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌లో భాగంగా బెలూన్స్‌ పలగగొట్టే గేమ్‌లో ప్రియాంక, మానస్‌లో పోటీపడ్డారు. ఈ గేమ్‌లో మానస్‌ గెలిచి సన్నీతో పోటీ పడ్డాడు. స్విమ్మింగ్‌పూల్‌-టీషర్ట్‌ గేమ్‌లో మానస్‌, సన్నీ హోరా హోరీగా పోటీపడ్డారు. టీషర్ట్‌ ధరించి పూల్‌లోకి దూలి అవతలి వైపు వెళ్లాలి. అక్కడ టీషర్ట్‌ ధరించి మళ్లీ వెనక్కి రావాలి. ఇలా ఎక్కువ టీషర్ట్స్‌ ఎవరు ధరిస్తారో వారే విజేతలు.

ఈ గేమ్‌లో సన్నీ ఇంటి సభ్యులపై ఫైర్‌ అయ్యాడు. తాను ధరించిన టీ షర్ట్‌కి లెబుల్‌ లేదంటూ రవిపై సీరియస్‌ అయ్యాడు. తనకు ఆడాలనే ఉత్సాహం కూడా లేదంటూ ఇంట్లోకి వెళ్లిపోయాడు. ‘గేమ్‌ ఆడే హడావుడిలో కూడా లెబుల్‌ ఉన్న టీషర్ట్‌నే ఎంచుకోవాలి. అదే గేమ్‌’అని కాజల్‌ చెప్పినప్పటికీ.. సన్నీ వినలేదు.  ‘ప్రతిసారీ మీరే విజయం సాధించాలనుకుంటున్నారు. కాబట్టి మీరే ఆడుకోండి’అంటూ కాజల్‌, మానస్‌లపై పైర్‌ అయ్యాడు. మరి ఈ గేమ్‌లో ఎవరు విజయం సాధించారో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement