
మలమల..మార్చి!
మార్చిలోనే ఎండలు మలమల మాడ్చేస్తున్నాయి. మేనాటి ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతున్నాయి. జిల్లాలో ఆదివారం కాసిన
ఎండలకు జనం బెంబేలెత్తిపోయారు. నూజివీడులో అత్యధిక ఉష్ణోగ్రత 41 డిగ్రీలుగా నమోదైంది. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే.. మేలో ఇంకెలా ఉంటుందోనని జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు.