worry
-
బాధలో పలికే భావాలు.. ప్రపంచమంతటా ఒక్కటే
హాంకాంగ్: పల్లెటూరు మైదానం ఆటలాడేటప్పుడు కాలికి ముల్లు గుచ్చుకుంటే పిల్లలైనా, పెద్దలైనా ఒకేలా ‘అబ్బా’అనో, ‘ఆ’అనో అరుస్తారు. ఇది తెలుగుభాషలో వచ్చే అక్షరాలేకదా అని అనకండి. ప్రపంచవ్యాప్తంగా చాలా భాషల్లోని అక్షరాలను గమనిస్తే మనిషి బాధపడినప్పుడు అసంకల్పితంగా వెలువడే చిట్టిచిట్టి పదాలు, శబ్దాల్లో తొలి అక్షరంగా ఎక్కువగా అచ్చులు ఉంటున్నట్లు ఒక అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. ఉష్ణమండల ప్రాంతాల్లో ఇంగ్లిష్‌ను చక్కగా నోరంతా తెరిచి పలికితే చలిదేశాల్లో అదే ఇంగ్లిష్‌ను సగం నోరు తెరిచి లోపల గొణుకుతున్నట్లు పలుకుతారు. ఒక్క భాషనే భిన్నంగా పలికే ప్రపంచంలో వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలు.. హఠాత్తుగా బాధపడినప్పుడు మాత్రం ఆయా భాషల అచ్చులను మాత్రమే అధికంగా పలకడం చూసి పరిశోధకులు సైతం ఆశ్చర్యపోయారు. ఏదైనా భాషలో ఒక పదం ఏమిటో తెలియాలంటే దాని అర్థం తెలిసి ఉండాలి. కానీ ఆశ్చర్యార్థకాలు, కొన్ని పదాలకు అర్థాలతో పనిలేదు. వాటిని వినగానే అవి బాధలో ఉన్నప్పుడు పలికారో సంతోషంతో పలికారో తెలుస్తుంది. బాధలో పలికే పదాల్లో ఎక్కువ అచ్చులు ఉండగా హఠాత్తుగా ఆదుర్తా, సంతోషం కల్గినప్పుడు పలికే పదాల్లో హల్లులు ఎక్కువగా ఉంటున్నాయి. సంబంధిత పరిశోధనా తాలూకు వివరాలు ‘అకౌస్టికల్ సొసైటీ ఆఫ్ అమెరికా’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 131 భాషలను ఒడబోసి బాధ, సంతోషం, అసహనం, ఆదుర్దా ఇలా హఠాత్తుగా ఏదైనా భిన్న పరిస్థితిని మనిషి ఎదుర్కొన్నపుడు భాషతో సంబంధం లేకుండా రెప్పపాటులో మనిషి గొంతు నుంచి వచ్చే శబ్దాల్లో ఎక్కువగా హల్లులు ఉంటున్నాయా లేదంటే అచ్చులు ఉంటున్నాయా అనేది కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అధ్యయనకారుల బృందం బయల్దేరింది. ఆఫ్రికా, ఆసియా, ఆ్రస్టేలియా, యూరప్‌లలో అత్యధికంగా మాట్లాడే 131 భాషల్లో జనం బాధపడినప్పుడు, అసహనంగా ఫీల్ అయినప్పుడు, సంతోషపడినప్పుడు అత్యధికంగా వాడే 500కుపైగా ఆశ్చర్యార్థకాలు, పదాలను పరిశోధకులు అధ్యయనం కోసం ఎంపిక చేశారు. వీటిల్లో సంతోషం, బాధ, ఆదుర్దా ఇలా మూడు భాగాలుగా విడగొట్టి వాటిల్లో ఏ భావానికి ఏ పదం వాడారో, ఆ పదం అచ్చుతో మొదలైందో, హల్లుతో మొదలైందో లెక్కగట్టారు. ఇంగ్లిష్ మాట్లాడే దేశాల ప్రజల్లో సంభ్రమాశ్చర్యాలకు లోనైతే ప్రస్తుత ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఎక్కువగా ఔచ్, వావ్ అనే పదాలనే ఎక్కువగా పలుకుతున్నారు. ఇలా అన్ని ఆశ్చర్యార్థకాలను పట్టికగా వేశారు. ఏం తేలింది? భాషతో సంబంధం లేకుండా జనమంతా బాధలో ఉన్నప్పుడు ఎక్కువగా పలికిన శబ్దాల్లో ఎక్కువగా అచ్చులే ఉన్నాయి. భాషలు వేరుగా ఉన్నాసరే జనం ఏదైనా ఎమోషన్‌కు లోనైనప్పుడు పలికే తొలిపలుకుల ధ్వనులు దాదాపు ఒకేలా ఉంటాయని తేలింది. మానవుడుకాకుండా ఇతర జీవులు.. అంటే పక్షులు, జంతువులు భయపడినప్పుడు, వేదనకు గురైనప్పుడు ఒకేలా శబ్దాలు చేస్తాయనే భావనకు మూలం దాదాపు తెలిసినట్లేనని పరిశోధకులు చెప్పారు. -
రానున్నది మరో మహమ్మారి.. బిల్‌గేట్స్ ఆందోళన
ప్రపంచం వచ్చే 25 ఏళ్లలో అత్యంత భారీ యుద్ధాన్నో లేక కోవిడ్ కంటే ప్రమాదకరమైన మరో మహమ్మారినో ఎదుర్కొనబోతోందని ఆందోళన చెందుతున్నారు మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్‌గేట్స్. ఇవే ఆందోళనలు తనకు నిద్ర లేకుండా చేస్తున్నాయని ఓ తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.వాతావరణ విపత్తులు, పెరిగిపోతున్న సైబర్ దాడులపై ప్రజలను హెచ్చరించిన బిల్‌గేట్స్.. తనను రెండు ఆందోళనలు అత్యంత కలవరపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అందులో ఒకటి రానున్న మహా యుద్ధం కాగా మరొకటి కోవిడ్‌ను మించిన మహమ్మారి.‘ప్రపంచంలో ప్రస్తుతం చాలా అశాంతి నెలకొంది. ఇది మహా యుద్ధాన్ని రేకెత్తించవచ్చు. ఒక వేళ ఆ యుద్ధం నుంచి బయటపడినా రాబోయే 25 సంవత్సరాలలో మరొక మహమ్మారి విజృంభించే అవకాశం ఉంటుంది’ అని బిల్‌గేట్స్ పేర్కొన్నారు.ఒకవేళ మహమ్మారి విజృంభిస్తే.. కోవిడ్‌కు మించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉటుందని, దీనికి దేశాలు సిద్ధంగా ఉన్నాయా అనే ప్రశ్న తనను వేధిస్తోందన్నారు. అమెరికా విషయాన్ని తీసుకుంటే కోవిడ్ సమయంలో మిగిలిన దేశాల కంటే మిన్నగా ఉంటుందని, ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని అందరూ భావించారని కానీ అంచనాలను అందుకోలేకపోయిందని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి..బిల్ గేట్స్ 2022లో “తదుపరి మహమ్మారిని నివారించడం ఎలా ” అనే పుస్తకాన్ని కూడా రాశారు. 2020 కోవిడ్ సమయంలో వివిధ దేశాల సన్నద్ధత లోపాలను ఆయన ఈ పుస్తకంలో ప్రస్తావించారు. బలమైన క్వారంటైన్ విధానాలు, వ్యాధి పర్యవేక్షణ, టీకా పరిశోధన, అభివృద్ధి వంటి వాటిపై దేశాలకు పలు సూచనలు సైతం చేశారు. -
జొన్నలపై జగడం..
కల్హేర్ (నారాయణఖేడ్): జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కల్హేర్ మండలం బీ బీపేటలో అదనపు కలెక్టర్ మాధురి వాహనా న్ని రైతులు మంగళవారం అడ్డుకున్నారు. వా హనం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగా రు. బీబీపేట పీఏసీఏస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించి.. రైతులు తె చ్చిన జొన్నలు దెబ్బతిన్నాయని, శుభ్రంగా లే వని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబం ధనల ప్రకారం ఉంటేనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడా ది ఇలాంటి జొన్నలే కొనుగోలు చేశారని వాదించారు. లారీలు రాకపోవడంతో కొనుగోలు నెమ్మదిగా జరుగుతున్నాయని వాపోయారు. ఆమె అక్కడి నుంచి వెళ్తుండగా, తమ గోడు పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారంటూ రైతులు మండిపడ్డారు. ఆమెను వెళ్లనీయకుండా వాహనాన్ని అడ్డుకొని బైఠాయించారు. ప్రభుత్వం, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రోల్ డబ్బాతో రైతు ఆందోళన ఫత్తేపూర్‌కు చెందిన రైతు నరేందర్ పెట్రోల్ డబ్బా పట్టుకుని ఒంటిపై పోసుకునేందుకు యత్నించాడు. మార్క్‌ఫెడ్ డీఏం శ్రీదేవి, ఆర్డీఓ అశోక్‌చక్రవర్తి వెంటనే కలుగజేసుకుని నచ్చజెప్పారు. రైతులందరి జొన్నలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. అనంతరం కల్హేర్, కృష్ణాపూర్, బోక్కస్గాంలో కొనుగోలు కేంద్రాలను కూడా అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. -
చిత్తం, చింత, చింతన
చిత్త వ్యాపారాలే చింత, చింతన. మనస్సు చేత ప్రేరేపితమైన ఇంద్రియ వ్యాపారాలను భద్రపరచేది చిత్తం. విషయాలను, అనుభవాలను, భావోద్వేగాలు మొదలైనవాటిని జ్ఞాపకాల రూపంలో భద్రపరచి దాచి ఉంచేది చిత్తం. దానిలో ప్రతి మనోవ్యాపారం ముద్రితమై ఉంటుంది. ఒకోసారి మర్చిపోయాం అనుకొన్నవి కూడా సందర్భానుసారం బయట పడుతూ ఉంటాయి. అందుకే ఏదైనా మరచిపోతే కళ్ళు మూసుకుని ఆలోచిస్తాం. అప్పుడు జ్ఞాపకాల గది తలుపు తెరుచుకుంటుంది. చింతన అంటే నిరంతరం ఒక విషయాన్ని గురించి తలచుకుంటూ, మననం చేయటం. ఇది కూడా చిత్తం చేసే పనే అయినా చింతకి చింతనకి మధ్య ఎంతో తేడా ఉంది. నక్కకి నాకలోకానికి ఉన్నంత. లౌకిక స్థాయిలోచింతన మనిషి మేథకి మెఱుగులు పెడుతుంది. ఆలోచనలకి పదును పెడుతుంది. ఒక విషయాన్ని గురించి కూలంకషంగా విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకోవటానికి తోడ్పడుతుంది. ఇది వ్యక్తిగతంగా తన సమస్యలని పరిష్కరించుకోవటానికి ఎంతో అవసరం. చింత అంటే జరిగి పోయిన లేదా జరగబోయే విషయాలను తలుచుకుంటూ బాధపడుతూ వేదన చెందుతూ ఉండటం. పైకి వ్యక్తం చేయక పోయినా మనసు లోపల నిరంతరం అదే విషయం మెదులుతూ సంతోషమన్నది లేకుండా చేస్తుంది. కొంతమంది ముఖాలు చూస్తూనే చెప్పవచ్చు వాళ్ళు ఏదో విషయంలో చాలా బాధ పడుతున్నారు అని. సాధారణంగా ఆ విషయానికి పరిష్కారం వాళ్ళకి తెలియక పోవటమో, తెలిసినా చేయగలిగే పరిస్థితిలో లేక΄పోవటమో దానికి కారణం అయి ఉంటుంది. ఆ అనిశ్చితి, అసమర్థత నిరంతరం మనసులో తిరుగుతూ వేదనని కలిగించి కుంగదీస్తాయి. పరిష్కారం దొరికితే కొంత ఉపశమనం కలుగుతుంది. దానిని అమలు చేయగల శక్తి ఉంటే ధైర్యం కలుగుతుంది. వేదన కొంత ఉపశమిస్తుంది. ఇక్కడ అర్థమయ్యే విషయం ఏమంటే ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచించ గల శక్తి మనిషి మనస్సుకి ఉంది అని. దానిని ఉపయోగపడని వాటికి వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవచ్చు. అప్పుడు అది చింతన అవుతుంది. చింతన మనిషిని తాత్త్వికుడిగా పరిణమింప చేస్తుంది. వ్యక్తిగతమైన సమస్యలు, వాటి పరిష్కారాలు అనే స్థాయి దాటి ఏదైనా ఒక అంశం గాని, సిద్ధాంతం గాని, మరేదైనా గాని – దానిని గురించి లోతుగా, అన్ని కోణాలలోనూ, పరిశీలించి, అధ్యయనం చేసి, మూల తత్త్వాన్ని తెలుసుకునేందుకు సహకరిస్తుంది. ఆధ్యాత్మికత, మతం, రాజనీతి, సాంఘిక సామాజిక పరిస్థితులు, కమ్యూనిజం వంటి ఆధునిక సిద్ధాంతాలు – ఒకటేమిటి ఏవైనా కావచ్చు, వాటి మౌలికతత్త్వం తెలుసుకోవటానికి వాటి గురించిన చింతన ఒకటే మార్గం. ఆ విషయానికి సంబంధించిన అంశాలనే నిరంతరం తలుచుకుంటూ, మననం చేస్తూ ఉంటే, పైకి కనపడే అంశానికి మూలమైన సూత్రం, అసలు లక్షణం, సరిగా చెప్పాలంటే బీజం స్ఫురిస్తుంది. దానితో విరాడ్రూపం మనోనేత్రం ముందు కదలాడుతుంది. లోతుపాతులు, మంచిచెడులు, విస్తరణ, పరిమితులు మొదలైన వన్ని చాలావరకు అర్థం అవుతాయి. ఇతరులు గుర్తించ లేని రహస్యాలు స్ఫురిస్తాయి. శాస్త్రవేత్తలని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎంతోమంది శాస్త్రవేత్తలు తాము చేసే పరిశోధనల గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు నిత్యకృత్యాలు నిర్వహిస్తూ కూడా. కొన్నిమార్లు వారికి నిద్రలో కలల రూపంలోనో, పరిసరాల్లో జరుగుతున్న సంఘటనల రూపంలోనో, ఆహారం తీసుకుంటున్నప్పుడో హఠాత్తుగా చేయవలసినది కానీ, పరిష్కారం గాని స్ఫురిస్తుంది. ఆర్కిమిడీస్ దానికి పెద్ద ఉదాహరణ. అతడికి తొట్టెలో స్నానం చేస్తుండగా నీళ్ళలో మునిగినప్పుడు పదార్థం బరువు తగ్గటానికి కారణం స్ఫురించింది. దానికి అతడు దాని గురించి చింతన చేస్తూ ఉండటమే కారణం. మనిషి దేనిని చింతన చేస్తే దానిగా మారిపోతాడు అన్నది ఆధునిక మనస్తత్వశాస్త్ర పరిశోధకులు నిర్ధారించి చెప్పిన మాట. సాధకుడు ఏమి పొందాలని అనుకుంటున్నాడో దానిని సిద్ధింపచేసేది చింతన అని ఆధ్యాత్మికవేత్తలు చెప్పేమాట. – డా. ఎన్. అనంతలక్ష్మి -
గాంధీభవన్‌లో ఉద్రిక్తత
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రాబోయే ఎన్నికల రెండవ జాబితా విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదివారం గాంధీభవన్‌లో నర్సాపూర్ అభ్యర్థిగా ఆవుల రాజిరెడ్డిని మార్చాలని కోరుతూ నియోజకవర్గ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులు మాట్లాడుతూ....కాంగ్రెస్ పార్టీ అంటే తమకు ఎంతో అభిమానమని గత కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నవారిని కాదని ఇతరులకు టికెట్లు కేటాయించడం సరికాదన్నారు. బచావో కాంగ్రెస్ హటావో పారాచూట్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త పెట్రోలు పోసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పక్కనే ఉన్న పార్టీ కార్యకర్తలు అడ్డుకుని ఆ వ్యక్తిపై నీళ్లుచల్లి నిప్పుఅంటించుకునే ప్రయత్నాన్ని ఆపివేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారుతుండటంతో పోలీసులు కలుగజేసుకుని పార్టీశ్రేణులను బయటకు పంపించివేశారు. -
ఆస్ట్రేలియా టీమ్ కి నిద్రలేని రాత్రులు ఎందుకంటే..!
-
వాళ్ళిద్దరిని అవుట్ చేస్తేనే ఆస్ట్రేలియాకి ఛాన్స్ , కీలక వ్యాఖ్యలు చేసిన రిక్కీపాంటింగ్..!
-
ఏలూరు జిల్లాలో రెచ్చిపోతున్న కలప స్మగ్లర్లు
-
మంచి మాట: సంతోషం సమగ్ర బలం
సంతోషం సగం బలం‘ అన్నది మనకు బాగా తెలిసిన మాటే. నిజానికి మనిషికి సంతోషం సమగ్ర బలం. అంతేకాదు మనిషికి సంతోషం సహజమైన బలం కూడా. ఎంత బలవంతుడికైనా సంతోషం లేనప్పుడు అతడు బలహీనుడిగా అయిపోతాడు. సంతోషం కరువైపోయిన మనుషులు మనోవ్యాధులతో శుష్కించిపోవడమూ, నశించిపోవడమూ మనకు తెలిసిన విషయమే. బావుండాలంటే మనిషికి సంతోషం ఎంతో ముఖ్యం. వర్తమానంలో మనం సంతోషంతో ఉంటే లేదా మనం వర్తమానాన్ని సంతోష భరితంగా చేసుకోగలిగితే మన భవిష్యత్తు సంతోషమయంగా ఉంటుంది. ‘సంతోషానికి మార్గం లేదు, సంతోషమే మార్గం‘ ఇది గౌతమ బుద్ధుడి ఉవాచ. సంతోషం అనేది సంపాదించుకోగలిగేదీ, సాధించుకోగలిగేదీ కాదు. సంతోషం మనలో ప్రవహించే రక్తంలాంటిది. బయటనుంచి వచ్చేది కాదు. మనలోంచి మన కోసం మనమై కలిగేది. ‘మనం మన ఆలోచనలవల్ల నిర్మితం అయ్యాం; మనం మన ఆలోచనలకు అనుగుణంగా రూపొందుతాం; మన మెదడు నిర్మలంగా ఉంటే సంతోషం వీడని నీడలా అనుసరిస్తుంది’ అని చెప్పాడు బుద్ధుడు. మనిషి సంతోషంగా ఉండడం అతడి ఆలోచనావిధానంపై ఆధారపడి ఉంటుంది. ఆలోచన ఆధారంగా కలిగే అనుభూతి సంతోషం. ఒకరికి సంతోషాన్ని ఇచ్చేది మరొకరికి సంతోషాన్ని ఇచ్చేది కాకపోవచ్చు. ‘సూర్యుడి కాంతి మనుషులకు వెలుగును ఇస్తూ ఉంటే గుడ్లగూబలకు చీకటి అవుతోంది. నీటిలో మునిగినప్పుడు మనుషులకు, పశువులకు ఆ నీరు శ్వాసకు ప్రతిబంధకం అవుతోంది. ఆ నీరే చేపల శ్వాసకు ఆటంకం అవడం లేదు. మనుషులు హాయిగా గాలి పీల్చుకునే తీరప్రదేశంలో చేపలు గాలి పీల్చుకోలేవు. అగ్ని అన్నిటినీ దహిస్తుంది. కానీ అత్తిరిపక్షులు అగ్నికణాల్ని తింటాయి. నీళ్లవల్ల నిప్పు నశిస్తుంది. కానీ బడబాగ్ని సముద్రం మధ్యలో జ్వలిస్తూ ఉంటుంది. ఇట్లా జగత్తులో విషయాలన్నీ ద్వైరూప్యంతో ఉన్నాయి అని భారతీయ తత్త్వసాహిత్యంలో అత్యున్నతమైన త్రిపురారహస్యంలో చెప్పబడింది. విషయాలనుబట్టి కాదు మనల్ని బట్టి మనకు తృప్తి కలుగుతూ ఉంటుంది లేదా మన తనివి తీరుతూ ఉంటుంది. కాబట్టి మన సంతోషానికి మనమే మూలంగా ఉన్నాం, ఉంటాం. ‘శరీరాన్ని శుష్కింపజెయ్యడంలో చింత లేదా విచారానికి సమానమైంది లేదు’ అని హితోపదేశం ఎన్నో యేళ్ల క్రితమే మనకు చెప్పింది. ‘చితి, చింత ఈ రెండిటిలో చింత ఎక్కువ దారుణమైంది. చితి నిర్జీవమైన శరీరాన్నే దహిస్తుంది కానీ చింత సజీవంగా ఉన్న శరీరాన్ని దహిస్తూ ఉంటుంది’ అని ఒక సంస్కృత శ్లోకం తెలియజేస్తోంది. నిజానికి చింత అనేది శరీరాన్ని మాత్రమే కాదు ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని, ప్రగతిని, జీవితాన్ని కూడా శుష్కింపజేస్తుంది. కాబట్టి మనకు కలిగిన చింతను వీలైనంత త్వరగా వదిలించుకోవాలి. మనకు కలిగిన చింత నుంచి మనం వీలైనంత త్వరగా విముక్తం అవ్వాలి. ‘మానవజాతిలోని చింత అంతా మనసువల్ల వచ్చిన జబ్బు’ అని తమిళకవి కణ్ణదాసన్ చెప్పారు. ఈ స్థితికి అతీతంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు మనసే కీలకం. మనసువల్ల వచ్చిన చింతను ఆ మనసువల్లే తొలగించుకోవాలి.‘గాలి తనతో తీసుకు వచ్చిన మేఘాలను తానే చెదరగొడుతుంది.’ అని ఒక సంస్కృత శ్లోకం చెబుతోంది. ఆ విధంగా మనసువల్ల వచ్చిన చింతలను మనం మనసువల్లే పోగొట్టుకోవాలి. సంతోషం మనిషిలోనే నిక్షిప్తం అయి ఉంది. దుఃఖాన్ని తొలగించుకునేందుకు తనను తాను చెక్కుకోవడం నేర్చుకుంటే మనిషి సంతోషశిల్పం అవుతాడు; మనిషి ‘సంతోషంగా’ ఉంటాడు. – శ్రీకాంత్ జయంతి -
అమ్మా.. డాడీని మర్చిపోమ్మా..
తిరుపతి క్రైమ్: భార్య, కుమార్తె ఉండగానే మరో మహిళను గుట్టు చప్పుడు కాకుండా రెండో వివాహం చేసుకొన్నాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన తిరుపతి పెద్ద కాపు వీధిలో జరిగింది. మొదటి భార్య సరస్వతిని భర్త వెంకట చలపతి ఇంటి నుంచి గెంటి వేసాడు. దీంతో సరస్వతి తన కుమారైతో కలసి న్యాయం చేయాలంటూ ఈస్ట్ పోలీస్‌స్టేషన్ ఎదుట రోడ్డు మీద బైఠాయించింది. బాధితురాలు, పోలీసుల కథనం.. స్థానిక పెద్దకాపు వీధిలో ఉన్న వెంకట చలపతితో 13 ఏళ్ల క్రితం సరస్వతికి వివాహమైంది. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి 6 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. ఈ నేపథ్యంతో తన భర్త గుట్టుగా రెండో వివాహం చేసుకున్నాడని సరస్వతి తెలుసుకుంది. అప్పటి నుంచి వీరి మధ్య తరచూ గొడవలు తలెత్తేవి. ఈ క్రమంలో వెంకట చలపతి రెండో భార్య బంధువులు అందరూ సరస్వతిని కలిసి కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు. దీనిపై ఆమె ఈస్ట్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా అక్కడే ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఆమె వారి వద్దకు వెళ్లకుండా స్టేషన్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద తన కుమార్తెతో కలిసి బైఠాయించి న్యాయం చేయాలంటూ బోరున విలపించసాగింది. ఈస్ట్ స్టేషన్ ఎస్ఐ జయచంద్ర అక్కడికి చేరుకుని మహిళకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో రెండో భార్యతో ఆమె భర్త బైక్‌పై పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నాడు. ఇది చూసిన సరస్వతి ఆగ్రహంతో ఊగిపోయింది. పరుగున భర్త వద్దకు వెళ్లి లాగే ప్రయత్నం చేసింది. రెండో భార్య మాత్రం ప్రేక్షకురాలైంది. సరస్వతి బైక్ తాళం లాక్కునేందుకు యత్నించేసరికి వెంకట చలపతి అక్కడి నుంచి రెండో భార్యతో ఉడాయించాడు. చివరకు మహిళా కానిస్టేబుల్ సహాయంతో మహిళా పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మా... డాడీని మర్చిపోమ్మా.. తండ్రిని పోలీస్ స్టేషన్ దగ్గర చూసిన ఆ చిన్నారి తల్లితో కలిసి... అతడి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించింది. డాడీ మా పక్కకు రా డాడీ... అంటూ భోరున విలపించినా తండ్రి ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మరోవైపు తల్లి నడిరోడ్డుపై ఏడుస్తుండటంతో ...ఆ చిన్నారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ... అమ్మా డాడీని మర్చిపోమ్మా, నాకు డాడీ వద్దు, ఆయన మీద కేసు వేసి విడాకులు ఇచ్చేయ్. నాకు ఇంకా డాడీ లేడు.. నువ్వు ఏడవొద్దమ్మా’ అంటూ తల్లిని ఓదార్చింది. -
ఎగ్జిట్ ఫలితాలు చూసి ఆందోళన వద్దు
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసి ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ‘రాబోయే 24 గంటలు మనకు చాలా కీలకం. అప్రమత్తంగా ఉండండి. ధైర్యాన్ని కోల్పోకండి. మనం సత్యం కోసం పోరాడుతున్నాం. తప్పుడు ఎగ్జిట్ ఫలితాలను చూసి నిరాశచెందకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ కష్టం ఎప్పటికీ వృథా కాదు’ అని బుధవారం ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు, వదంతులను చూసి నిరాశచెందవద్దని ఇటీవల ప్రియాంక గాంధీ కూడా పార్టీ కార్యకర్తలకు సూచించిన విషయం తెలిసిందే. -
ఫేక్ న్యూస్ ప్రభావం అంతంతే!
న్యూఢిల్లీ: సోషల్‌మీడియా ద్వారా నకిలీ వార్తలు, వదంతుల వ్యాప్తిపై భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ ద్వారా అందుకునే నకిలీ వార్తలు భారత్‌లోని ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయన్న విషయమై బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎస్సెక్స్ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఈ నకిలీ వార్తలు ఓటర్ల అభిప్రాయాన్ని ఎంతమాత్రం మార్చలేవనీ, అప్పటివరకూ ఉన్న ప్రజల నమ్మకాలను మరింత దృఢం చేస్తాయని పరిశోధకులు తేల్చారు. ఈ విషయమై భారత సంతతి పరిశోధకుడు సయాన్ బెనర్జీ మాట్లాడుతూ.. ‘భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నకిలీ వార్తలు, వదంతుల కారణంగా మతఘర్షణలు, జాతుల మధ్య గొడవలతో పాటు రాజకీయాలను ప్రభావితం చేస్తాయని ఇప్పటివరకూ పలు అధ్యయనాల్లో తేలింది. ఈ నేపథ్యంలో మేం భారత్‌లోని యూపీ, బిహార్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 18 లోక్‌సభ నియోజకవర్గాల్లో అధ్యయనం చేపట్టాం. ఇందులో భాగంగా 3,500 మందిని ఎంపిక చేసుకుని వారి రాజకీయ అభిరుచులను తెలుసుకున్నాం. అనంతరం వీరిలో కొందరికి సాధారణ వార్తలను, మరికొందరికి దేశభద్రత, మౌలికవసతులకు సంబంధించి నకిలీ వార్తలను పంపాం. అక్కడ రాజకీయ నేతలు, పార్టీల పేర్లను ప్రస్తావించలేదు. నకిలీ వార్తల కారణంగా ప్రజల రాజకీయ అభిప్రాయం మారకపోగా, వారిలో ప్రస్తుతమున్న భయాలు మరింత బలపడ్డాయి‘ అని తెలిపారు. వదంతులు మొదలయ్యేది ఇక్కడే.. భారత్‌లో రాజకీయ వాతావరణాన్ని నిర్దేశించేవాటిలో భద్రత, మౌలికవసతులు, ఆర్థిక రక్షణ అన్నవి కీలక పాత్ర పోషిస్తాయని సయాన్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. ‘భద్రతాపరమైన సమస్యలు అంటే కేవలం మీ కుటుంబం లేదా సామాజికవర్గానికి మాత్రమే పరిమితమైన విషయం కాదు. పౌర హక్కులతో పాటు న్యాయ, పోలీస్ సంస్థలు అందుబాటులో ఉండటం కూడా. పోలీస్‌శాఖతో పాటు న్యాయస్థానాల్లో దళితుల సంఖ్య తగినంతగా లేకపోవడంతో న్యాయం పొందడం దళితులకు కష్టసాధ్యంగా మారింది. దళిత హక్కుల పరిరక్షణ కోసం తెచ్చిన చట్టాలు, రిజర్వేషన్లు అగ్రవర్ణాల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఇక్కడి నుంచే నకిలీ వార్తల పరంపర మొదలవుతోంది’ అని తెలిపారు. ‘నకిలీ’ సంస్కృతి ఇప్పటిది కాదు.. బీజేపీలాంటి రాజకీయ పార్టీలు తీవ్రమైన ప్రభావం చూపగల సందేశాలను వాట్సాప్ గ్రూపుల్లో పంపుతోందని సయాన్ బెనర్జీ చెప్పారు. ‘ఇలాంటి సందేశాల వల్ల పెద్దగా ప్రభావం ఉండదని భావిస్తున్నా. నకిలీ వార్తలు అన్నవి కొత్తగా వచ్చినవి కావు. గతంలో ప్రభుత్వాలు ప్రజాభిప్రాయాన్ని నియంత్రించేందుకు ఈ నకిలీ వార్తలను వాడుకున్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్లో నకిలీ వార్తలు, వదంతుల్ని పర్యవేక్షించడం సవాలుగా మారింది. కొత్త ఓటర్లపై సోషల్ ప్రభావం ప్రస్తుతం దేశంలో తొలిసారి ఓటేస్తున్న 15 కోట్ల మంది యువతలో మూడోవంతు ఓటర్లు సోషల్‌మీడియాలో రాజకీయ సందేశాల ప్రభావానికి లోనయ్యారని ఏడీజీ ఆన్లైన్ అనే సంస్థ తెలిపింది. ఈ విషయమై ఏడీజీ సంస్థ చైర్మన్ అనూజ్ మాట్లాడుతూ..‘తొలిసారి ఓటుహక్కు పొందిన 15 కోట్ల మందిలో 30% మంది యువత సోషల్‌మీడియాలోని సందేశాలతో ప్రభావితులయ్యారు. కొత్త ఓటర్లలో సగం సోషల్‌మీడియా ద్వారా రాజకీయాల గురించి తెలుసుకుంటున్నారు. దేశంలో 18–24 ఏళ్ల యువతలో 40% మంది రాజకీయాల గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, షేర్‌చాట్, వాట్సాప్‌లపై ఆధారపడుతున్నారు’ అని చెప్పారు. 25 లక్షల మందిని అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించామని వెల్లడించారు. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి సోషల్‌మీడియాలో ఎన్నికల ప్రచారం పెరిగిందన్నారు. -
లంక పర్యాటకంపై పెద్ద దెబ్బే
కొలంబో: పర్యాటకానికి మారుపేరు శ్రీలంక. ప్రముఖ బౌద్ధ, హిందూ పుణ్యక్షేత్రాలకు నెలవైన శ్రీలంకను ప్రతిఏటా లక్షలాది మంది విదేశీయులు సందర్శిస్తుంటారు. వీరిలో భారతీయులే అధికంగా ఉంటారు. తాజాగా జరిగిన ఉగ్రవాద దాడులు పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూసే అవకాశం ఉందని ఇక్కడి టూర్లు ఆపరేటర్లు, హోటళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంకలో త్వరలో వేసవి సెలవులు ఆరంభం కానున్నాయి. ఈ సమయంలో విదేశీయులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పర్యాటక ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతుంటాయి. ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని శ్రీలంక అధికారులు చెబుతున్నారు. సీజన్ ప్రారంభానికి ముందే ఈ దాడులు జరగడం దురదృష్టకరమని అంటున్నారు. ఉగ్రవాద దాడులు తమ దేశంలో పర్యాటక రంగంపై పెద్ద దెబ్బేనని, పర్యాటక ఆదాయం తగ్గుముఖం పట్టవచ్చని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు. నేరుగా హోటళ్లపైనే దాడులు జరగడం దేశంలో ఇదే తొలిసారి అని లంక టూర్ ఆపరేటర్ల సంఘం హరిత్ పెరేరా చెప్పారు. 30 ఏళ్ల ఎల్టీటీఈ యుద్ధంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని గుర్తుచేశారు. తాజాగా జరిగిన దాడులతో విదేశీ యాత్రికులకు తప్పుడు సందేశం పంపినట్లయిందని అభిప్రాయపడ్డారు. పదేళ్ల కిందటి దాకా శ్రీలంక పర్యాటక రంగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ఎల్టీటీఈ ఉద్యమంలో లక్ష మంది చనిపోయారు. ఎల్టీటీఈ పతనం అనంతరం లంకలో పర్యాటక రంగం అనూహ్యంగా పుంజుకుంది. ఆసియాలోనే అగ్రశ్రేణని పర్యాటక దేశంగా అవతరించింది. భారతీయులను ఆకర్షించడానికి లంక ప్రభుత్వం రామాయణ సర్క్యూట్‌ను అభివృద్ధి చేసింది. -
నిద్రకు అష్టకష్టాలు
కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉంటే చాలు అనుకుంటారు చాలామంది అల్పసంతోషులు.డబ్బు పెడితే తిండి దొరకొచ్చేమో గాని, ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రశాంతమైన నిద్ర ఎక్కడా దొరకదు. గాఢంగా ప్రశాంతమైన నిద్రపట్టాలంటే డబ్బుతో పనిలేదు. శరీరానికి తగినంత శ్రమ, కడుపు నిండా తిండి, మానసిక ఒత్తిడి లేని జీవితం ఉంటే చాలు, పక్క మీద వాలిన నిమిషాల్లోనే నిద్ర ముంచుకొస్తుంది. దురదృష్టవశాత్తు మానసిక ఒత్తిడి ప్రస్తుతం నిత్యకృత్యంగా మారింది. జనాభాలో సగానికి సగం పైగా మనుషులు ఏదో ఒకరకంగా మానసిక ఒత్తిడికి, కుంగుబాటుకు, లేనిపోని ఆందోళనలకు లోనవుతున్నారు. వారందరూ ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నారు. ఆధునిక జీవనశైలిలో పెరిగిన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు,టీవీల వాడకం, ఆహారపు అలవాట్లలో మార్పులు వంటివి కూడా చాలామందికి నిద్రను దూరం చేస్తున్నాయి. దీర్ఘకాలం నిద్రలేమితో బాధపడేవారు నానా రకాల ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. నిద్ర ప్రాధాన్యాన్ని శతాబ్దాల కిందటే మన పూర్వీకులు గుర్తించారు. నిద్రకూ ఆరోగ్యానికీ గల సంబంధాన్ని కూడా వారు గుర్తించారు. నిజానికి అప్పటి మనుషులు బాగానే నిద్రపోయేవారు. ఆరోగ్య సమస్యలతో బాధపడే ఏ కొద్దిమందో తప్ప మిగిలిన వారంతా ప్రశాంతంగా ఆదమరచి నిద్రపోయేవారే. నిద్రకు సంబంధించిన ప్రస్తావనలు మన పురాణాల్లోనూ, ఇతర దేశాల గాథల్లోనూ కనిపిస్తాయి. రామాయణంలో కుంభకర్ణుడి నిద్ర, ఊర్మిళ నిద్ర గురించి తెలిసిందే. గ్రీకు, రోమన్ పురాణాల్లోనైతే నిద్రకు అధిదేవతలు కూడా ఉన్నారు. గ్రీకు పురాణాల్లో నిద్రకు అధిదేవత హిప్నోస్. రోమన్ పురాణాల్లో నిద్రకు అధిదేవత సోమ్నస్. గ్రీకు, రోమన్ పురాణాల్లో నిద్రకు, కలలకు సంబంధం ఉన్న మరో అధిదేవత మార్ఫియస్. సోమ్నస్కు గల వేలాది మంది కొడుకుల్లో మార్ఫియస్ ఒకడు. ప్రశాంతమైన నిద్ర కోసం, చక్కని కలల కోసం రోమన్, గ్రీకు నాగరికతలకు చెందిన ప్రజలు ఈ దేవతలను ఆరాధించేవారు. నిద్రలేమితో బాధపడేవారికి అప్పట్లో పూజారులే రకరకాల చికిత్సలు చేసేవారు. మద్యం, నల్లమందు మొదలుకొని మూలికా కషాయాల వరకు ఔషధాలుగా ఇచ్చేవారు. అయితే, మనుషులకు ఎంత నిద్ర అవసరం, మంచి నిద్ర కోసం తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి అనేదానిపై వారికి పెద్దగా అవగాహన ఉండేది కాదు. సూచనల ద్వారా మనుషులను నిద్రలోకి పంపే హిప్నోటిజమ్, నిద్రకు సంబంధించిన ఇన్సోమ్నియా (నిద్రలేమి), సోమ్నాంబులిజం (నిద్రలో నడక) వంటి రుగ్మతల పేర్లకు గ్రీకు, రోమన్ నిద్రాధిదేవత పేర్లే మూలం. నిద్ర కోసం ప్రాచీన ఔషధాలు ప్రాచీనులు సైతం నిద్రలేమిని రుగ్మతలాగానే గుర్తించారు. ఇతర రుగ్మతలను నయం చేయడానికి ఔషధాలు ఉన్నట్లే నిద్రలేమి పోగొట్టేందుకు కూడా ఔషధాలు ప్రకృతిలోనే ఉంటాయని భావించి, నానా ప్రయోగాలు చేసేవారు. ప్రాచీన ఈజిప్షియన్లు ‘లెట్యూస్’ అనే మొక్క కాండం నుంచి కారే పాలవంటి ద్రవాన్ని నిద్రలేమికి ఔషధంగా వాడేవారు. రోమన్లు మంచు ప్రాంతాల్లో తిరిగే ఎలుకల కొవ్వును నిద్రలేమికి ఔషధంగా ఉపయోగించేవారు. మంచు ప్రాంతాల్లో తిరిగే ‘డార్మైస్’ అనే ఎలుకలు శీతాకాలంలో సుదీర్ఘకాలం శీతలనిద్రలోకి జారుకుంటాయి. నిద్రలోకి జారుకునే ముందు ఇవి విపరీతంగా ఆహారం తిని కొవ్వు పెంచుకుంటాయి. అందువల్ల వీటి కొవ్వులో నిద్ర కలిగించే లక్షణం ఉంటుందని ప్రాచీన రోమన్లు నమ్మేవారు. అయస్కాంతం వాడుకలోకి వచ్చిన తర్వాత మేగ్రెటిజం చికిత్స ద్వారా నిద్రలేమిని నయం చేసేందుకు అప్పటి వైద్యులు నానా ప్రయత్నాలు చేసేవారు. నిద్రపై శాస్త్రీయమైన దృష్టి నిద్రపై శాస్త్రీయంగా దృష్టి సారించడం పన్నెండో శతాబ్ది నుంచి మొదలైంది. తొలిసారిగా స్పానిష్ వైద్యుడు, తత్వవేత్త మైమోనిడెస్ మోసెస్ రోజులో మూడోవంతు కాలం నిద్ర మనుషులకు అవసరమని క్రీస్తుశకం 1180 సంవత్సరంలో ప్రకటించాడు. మోసెస్ అంచనా ఆధునిక వైద్యుల అంచనాలకు దగ్గరగా ఉంది. ఏయే వ్యక్తులకు ఎంతెంత నిద్ర అవసరమనే దానిపై మోసెస్ ప్రత్యేకంగా దృష్టి సారించలేదు. ఆధునిక వైద్య పరిశోధకులు ఆ పనిని పూర్తి చేశారు. మనుషుల్లోనే కాదు, సమస్త జీవరాశుల్లోనూ అంతర్గత గడియారం ఒకటి పనిచేస్తూ ఉంటుందని, దానికి అనుగుణంగానే జీవుల నిద్రవేళలు ఉంటాయని ఫ్రెంచ్ శాస్త్రవేత్త జీన్ జాక్వెస్ డి ఓర్టస్ డి మైరాన్ 1729 సంవత్సరంలో తన పరిశోధనల ద్వారా నిరూపించాడు. మరో ఫ్రెంచ్ శాస్త్రవేత్త హెన్రీ పీరాన్ నిద్రలో ఎదురయ్యే సమస్యలకు గల శారీరక కారణాలపై తొలిసారిగా దృష్టి సారించి, పరిశోధనలు సాగించాడు. తన పరిశోధనలను వివరిస్తూ 1913లో ‘లె ప్రాబ్లమె ఫిజియాలజిక్’ అనే గ్రంథం రాశాడు. అంతకు ముందు ఆస్ట్రియన్ శాస్త్రవేత్త, ఆధునిక మానసిక వైద్యశాస్త్రానికి ఆద్యుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ కలలపై పరిశోధన సాగించాడు. నిద్రలో వచ్చే కలలకు అంతశ్చేతనలోని ఆలోచనలే కారణమని వివరిస్తూ ‘ది ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్’ గ్రంథాన్ని రాశాడు. మనుషులు మెలకువలో ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు వారి మెదడు పనితీరులో మార్పులను ఈఈజీ (ఎలక్ట్రో ఎన్సెఫెలోగ్రామ్) ద్వారా జర్మన్ మానసిక వైద్యుడు హాన్స్ బెర్గర్ 1924లో తొలిసారిగా గుర్తించాడు. పారిశ్రామిక విప్లవం తర్వాత మనుషుల్లో నిద్రలేమి సమస్య పెరగసాగింది. నిద్రలేమి ఇతర వ్యాధులకు దారితీయడం కూడా పెరిగింది. నిద్రలేమి, నిద్రకు సంబంధించిన ఇతర సమస్యలపై ఇరవయ్యో శతాబ్దిలో మాత్రమే వైద్య పరిశోధకులు ప్రత్యేకంగా దృష్టి సారించి పరిశోధనలు మొదలుపెట్టారు. అమెరికన్ శాస్త్రవేత్తలు ఆంథోనీ కాలెస్, అలాన్ రెషాఫెన్ తమ పరిశోధనల్లో నిద్రలోని దశలను గుర్తించారు. మనుషులు నిద్రపోయేటప్పుడు ‘ర్యాపిడ్ ఐ మూవ్మెంట్’ ఒక దశ, ‘నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్’ నాలుగు దశలు ఉంటాయని 1968లో వారు ప్రకటించారు. ఇరవయ్యో శతాబ్దిలో జరిగిన పరిశోధనలు నిద్రలేమి, నిద్రకు సంబంధించిన ఇతర సమస్యలను నయం చేసే ఔషధాలను కనుగొనడంలోను, చికిత్స పద్ధతులను మెరుగుపరచడంలోను ఇతోధికంగా దోహదపడ్డాయి. నిద్రలేమి, నిద్రకు సంబంధించిన ఇతర రుగ్మతలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి పలు పరిశోధనల్లో బయటపడిన నేపథ్యంలో నిద్రకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరగాల్సిన అవసరాన్ని శాస్త్రవేత్తలు, ప్రభుత్వాధినేతలు గుర్తించారు. ఫలితంగా 1987లో ‘వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్ అండ్ స్లీప్ మెడిసిన్ సొసైటీస్’ ఏర్పడింది. ఈ సంస్థ ‘జర్నల్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్’, ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్’ అనే రెండు పత్రికలను ప్రచురిస్తోంది. నిద్ర అంటే... మనం నిద్రపోతున్నప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆ సమయంలో మన జ్ఞానేంద్రియాలు మన చుట్టూ జరుగుతున్న మార్పులకు స్పందించడం తగ్గిపోతుంది. నిద్ర పూర్తి కాగానే మనం మామూలు స్థితిలోకి రాగలుగుతాము. అయితే నిద్ర అన్నది పూర్తిగా ఒక అచేతనావస్థ మాత్రమే కాదు. మనం నిద్రపోయే సమయంలోనూ మెదడు మన చుట్టూ జరిగే అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు నిద్రిస్తున్న తల్లి తన పక్కన పడుకున్న చిన్నారి కదలికలకు వెంటనే స్పందించి లేస్తుంది. నిద్రించే సమయంలో మనం రెండు రకాల స్థితుల్లో ఉంటాం. ఒక స్థితిలో కనుగుడ్లు వేగంగా కదలకుండా ఉంటాయి. ఈ స్థితిని నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఎన్‌ఆర్‌ఈఎం) అంటారు. రెండో స్థితిలో కనుగుడ్లు వేగంగా కదులుతుంటాయి. ఈ స్థితిని ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎం) అంటారు. రాత్రి మనం నిద్రకు ఉపక్రమించిన దగ్గరి నుంచి ఉదయం మేల్కొనే వరకు ఈ రెండు స్థితులు ఒకదాని తర్వాత మరొకటి కలుగుతాయి. ఎన్‌ఆర్‌ఈఎం, ఆర్ఈఎం అనే ఈ రెండు స్థితులూ వరుసగా మొదటిది 80 నిమిషాల పాటు, మరొకిటి 10 నిమిషాల పాటు ఉంటాయి. ఈ రెండు స్థితులు కలసిన ఒక మొత్తాన్ని ఒక సైకిల్‌గా చెబితే మొత్తం నిద్రలో ఈ సైకిల్స్ 4–5 సార్లు కలుగుతాయి. నిద్ర ముగింపునకు వచ్చే సరికి రెండో స్థితి సమయం ఎక్కువగా ఉంటుంది. మెలకువ నుంచి నిద్రకు ఉపక్రమించినప్పుడు ఎన్‌ఆర్‌ఈఎమ్ (మొదటి స్థితి)కి వెళ్తాం. ఈ ఎన్ఆర్ఈఎమ్లో మొత్తం నాలుగు భాగాలు ఉంటాయి. ఇందులో మూడు, నాలుగు భాగాలను గాఢనిద్రగా వ్యవహరిస్తారు. నిద్రించే సమయంలో మెదడులో జరిగే ఎలక్ట్రికల్ చర్యలను ఈఈజీ అనే ప్రక్రియ ద్వారా నమోదు చేయవచ్చు. (గుండె స్పందనలను ఈసీజీ ద్వారా నమోదు చేసినట్లుగా). దీర్ఘనిద్ర సమయంలో ఈఈజీ యాక్టివిటీ అతి తక్కువగా ఉంటుంది. నిద్రించాక తొలి భాగంలో దీర్ఘనిద్ర అధికంగా ఉంటుంది. ఈ సమయంలో గుండెవేగం, బీపీ, శ్వాసవేగం మొదలైనవి తక్కువగా ఉంటాయి. నిద్రలో ఈ భాగం చాలా ముఖ్యమైనది. మొదటి స్థితి (ఎన్‌ఆర్‌ఈఎం)లోని చివరి భాగమైన దీర్ఘనిద్ర నుంచి మళ్లీ రెండో స్థితి అయిన ఆర్ఈఎం స్థితిలోకి వెళ్తాం. ఈ స్థితిలో కనుగుడ్లు వేగంగా కదులుతాయి. ఈ స్థితిలో బీపీ, శ్వాస, గుండెవేగం పెరుగుతాయి. అయితే మన కండరాలు (కనుగుడ్లు, డయాఫ్రమ్ తప్ప మిగతావి) కదలికను కోల్పోతాయి. ఈ స్థితిలో మనం 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంటాం. కలలు ఎక్కువగా ఈ స్థితిలోనే వస్తాయి. కండరాల్లో కదలిక ఉండదు కనుక మనం కలల్లోని కదలికలను అనుగుణంగా ప్రవర్తించలేం. తెల్లవారు జామున రెండోస్థితి అయిన ఆర్ఈఎం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలోనే కలలు ఎక్కువగా వస్తాయి. నిద్ర నుంచి మెలకువ వచ్చాక మనకు ఎంతో ఉల్లాసంగా అనిపించాలి. నూతన ఉత్తేజం, శక్తి ఫీలవ్వాలి. అలా కలిగినప్పుడు చక్కటి నిద్ర పట్టినట్లు భావించాలి. (ఆర్ఈఎం దశ నుంచి నిద్రలేస్తే మనకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.) నిద్రలేమితో వచ్చే సమస్యలు నిద్రలేమి వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. పిల్లల్లో ఎదుగుదల లోపాలు ఏర్పడతాయి. నిద్రలేమి అధిక రక్తపోటుకు, డయాబెటిస్‌కు దారితీస్తుంది. స్థూలకాయానికి, జీర్ణకోశ సమస్యలకు కారణమవుతుంది. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల నానా మానసిక సమస్యలు ఏర్పడటం, రోగనిరోధక శక్తి క్షీణించడం, చివరకు ఆయుః ప్రమాణం కూడా తగ్గిపోవడం జరుగుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రలేమి కారణంగా వాటిల్లే తక్షణ నష్టాలు ∙ఏకాగ్రత లోపం ∙అలసట / నిస్సత్తువ ∙గుండె లయలో మార్పులు ∙పనితీరులో మందకొడితనం ∙దిగులు ∙మానసిక కుంగుబాటు ∙చిరాకు, కోపం ∙ఒంటినొప్పులు, కీళ్లనొప్పులు నిద్రలేమి వల్ల శారీరక ఇబ్బందులతో పాటు మానసిక సమస్యలూ పెరుగుతాయి. భావోద్వేగాలు అదుపు తప్పడం, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, యాంగై్జటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమితో బాధపడే పిల్లల్లో అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ), మెదడు ఎదుగుదలలో లోపం, జ్ఞాపక శక్తి లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పెద్దల్లోనైతే యాంగై్జటీ న్యూరోసిస్, డిప్రెషన్, సైకోసిస్, మాదక ద్రవ్యాలపై ఆధారపడే పరిస్థితి తలెత్తడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రపంచంలో సగం మంది నిద్రకు దూరం మనుషుల్లో నిద్రలేమి సమస్య పెరగడం పారిశ్రామిక విప్లవం నాటి నుంచి మొదలైంది. ఇక ఈ డిజిటల్ యుగంలో నిద్రలేమి బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలో సగం మందికి పైగా తగినంత నిద్రలేక అలమటిస్తున్న వారే. ‘ప్రిన్సెస్ క్రూయిసెస్’ సంస్థ ఇటీవల విడుదల చేసిన తొమ్మిదో రిలాక్సేషన్ రిపోర్ట్–2018 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 51 శాతం మంది తగినంత నిద్రలేక ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 18 శాతం మంది దీర్ఘకాలిక నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రకు సరైన వేళలు పాటిస్తూ తగినంత సేపు నిద్రపోతున్న వారు కేవలం 35 శాతం మాత్రమే. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మెలకువగా ఉంటూ ఆలస్యంగా నిద్రపోతున్నవారు 26 శాతం మంది అయితే, రాత్రి ఆలస్యంగా నిద్రపోయినా వేకువనే మేల్కొంటున్న వారు 21 శాతం మంది వరకు ఉన్నట్లు రిలాక్సేషన్ రిపోర్ట్–2018 వెల్లడించింది. రాత్రివేళ టీవీ చూసే అలవాటు కారణంగానే ఇటీవలి కాలంలో చాలామంది నిద్రలేమికి లోనవుతున్నారని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. ఇందులో వెల్లడైన కొన్ని ఆసక్తికరమైన అంశాలు... మంచి నిద్ర కోసం... ►ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రించడం / నిద్రలేవడం ► రోజూ వ్యాయామం చేయడం ►నిద్రపోయే ముందర సమస్యలను చర్చించకూడదు ►గోరువెచ్చటి నీళ్లతో స్నానం, శ్రావ్యమైన సంగీతం వినడం, పుస్తకపఠనం నిద్రకు మంచి మార్గాలు ►రాత్రిపూట పడుకునే ముందు కాఫీ, టీ వంటివి తీసుకోకూడదు. అలాగే శీతల పానీయాలు, మద్యం కూడా మంచిది కాదు. ►టీవీ చూడటం, కంప్యూటర్ పై పనిచేయడం వంటివి రాత్రిపూట వద్దు. ►పకడగదిలో మరీ ఎక్కువ కాంతి లేకుండా, చప్పుళ్లకు దూరంగా ఉండాలి. ►పడకగదిలో మరీ ఎక్కువ చల్లగా లేకుండా, వేడిగా లేకుండా చూసుకోవాలి. కొన్ని ‘నిద్రా’ణ వాస్తవాలు మనిషి ఆరోగ్యానికి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. తగినంత పోషకాహారం, వ్యాయామం ఉన్నవారికి సర్వసాధారణంగా చక్కని నిద్రపడుతుంది. ఏవైనా మానసిక ఇబ్బందులు ఉంటేనే నిద్ర కరువయ్యే పరిస్థితులు ఉంటాయి. ఎక్కువరోజులు తగినంత నిద్ర లేకుండా గడిపితే ఇతరేతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువవుతాయి. నిద్రకు సంబంధించి కొన్ని అరుదైన వాస్తవాలను అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ వెల్లడించింది. వాటిలో కొన్ని... ►స్తన్యజీవుల్లో కేవలం మనుషులు మాత్రమే ఉద్దేశపూర్వకంగా నిద్రను ఆపుకోగలరు. సృష్టిలోని పశుపక్ష్యాదులేవీ ఇలా ఉద్దేశపూర్వకంగా నిద్రను మానుకొని జాగారాలు చేయలేవు. ►ఎల్తైన ప్రదేశాల్లో నిద్ర పట్టడం కష్టమవుతుంది. సముద్ర మట్టానికి 13,200 అడుగుల ఎత్తుకు మించిన ప్రదేశాలకు చేరుకుంటే, అలాంటి ప్రదేశాల్లో తగిన ఆక్సిజన్ లేకపోవడంతో ఆరోగ్యవంతులకు సైతం నిద్రపట్టడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ►దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడుతున్న వారిలో ఒంటరి జీవితం గడుపుతున్న వారే ఎక్కువ. ►విధి నిర్వహణలో భాగంగా రకరకాల షిఫ్టుల్లో పనిచేసే వారు కూడా దీర్ఘకాలిక నిద్రలేమి, తద్వారా వచ్చే గుండెజబ్బులు, జీర్ణకోశ సమస్యల బారిన పడుతున్నారు. ►నిద్రలేమితో బాధపడేవారిలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. నిద్రకు దూరమైన వారిలో ఆకలిని నియంత్రించే ‘లెప్టిన్’హార్మోన్ పరిమాణం పడిపోవడమే దీనికి కారణం. అందుకే దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడేవారు స్థూలకాయులుగా తయారవుతారు. జాగారంలో రికార్డు మహాశివరాత్రి రోజున జాగారం ఉండటం చాలామందికి తెలిసిందే. ఒక్కరోజు జాగారం ఉంటేనే మర్నాటికి మగత మగతగా ఉంటుంది. ఎంత త్వరగా నిద్రపోదామా అనిపిస్తుంది. అలాంటిది చైనాలో ఒక సాకర్ పిచ్చోడు కేవలం సాకర్ మ్యాచ్‌లను నిరాటంకంగా చూడాలనే ఉబలాటంతో ఏకంగా పదకొండు రోజులు నిద్రను వాయిదా వేసుకున్నాడు. నిద్రలేమిని తట్టుకోలేక చివరకు మరణించాడు. ఈ సంఘటన 2012లో జరిగింది. అంతకు దశాబ్దాల ముందే.. 1964లో రాండీ గార్డెనర్ అనే యువకుడు ఏకధాటిగా పదకొండు రోజులు.. కచ్చితంగా చెప్పాలంటే 264.4 గంటల సేపు నిద్ర లేకుండా గడిపి గిన్నిస్ రికార్డుకెక్కాడు. – పన్యాల జగన్నాథదాసు నిద్ర సంబంధమైన సమస్యలు కొంతమందికి నిద్రలో నడవడం, కలవరించడం, పళ్లు కొరకడం, తరచు మెలకువ రావడం, భయంకరమైన కలలు రావడం వంటివి జరుగుతాయి. మరికొందరు నిద్రలో కాళ్లూ, చేతులు కదిలిస్తుంటారు. దీన్ని రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు. కొందరు నిద్రలో మల–మూత్ర విసర్జనలు చేస్తుంటారు. దీన్ని నాక్చర్నల్ ఎన్యురెసిస్ లేదా ఎంకోప్రెసిస్ అంటారు. కొందరికి పగటినిద్రను నిలువరించుకోవడం కష్టమవుతుంది. తమకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటుంటారు. నిద్రలో ఊపిరి సక్రమంగా లేక తరచు మెలకువ రావడం వంటి సమస్యలు కూడా కొందరిలో కనిపిస్తాయి. -
అభ్యర్థుల్లో ఆందోళన !
చుంచుపల్లి: గ్రామపంచాయతీ జూనియర్ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ హైకోర్టు ఆదేశాలతో సందిగ్ధంలో పడినట్లు కనిపిస్తోంది. అనేక ఏళ్లుగా ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అక్టోబర్ 10న రాత పరీక్ష నిర్వహించింది. ఇటీవలే ఫలితాలు కూడా వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 479 పంచాయతీల్లో ఖాళీగా ఉన్న 387 కార్యదర్శుల పోస్టులు ఈ కొత్త ఉద్యోగాలతో భర్తీ కానున్నాయి. అయితే ఇటీవల ప్రకటించిన ఫలితాలలో అవకతవకలు జరిగాయని, ఈ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా ఉందని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో నియామక ఉత్తర్వులను నిలిపివేయాలని గత బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు నియామకాలు జరుపవద్దని కోర్టు ఆదేశించింది. దీంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కొలువులకు ఎంపికైన అభ్యర్థులు ఆందోళనలో పడ్డారు. జిల్లాలో ఎంపికైన 387 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయింది. అయితే కోర్టు ఉత్తర్వులతో వారిలో కొంత నిరాశ ఎదురైంది. నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు.. జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఎంపిక జాబితాలో ఒకే అభ్యర్థి నంబరును పలుసార్లు ప్రకటించటం, కనీస అర్హత సాధించని అభ్యర్థులు పేర్లు ఎంపిక జాబితాలో ఉండడంతో మిగిలిన వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల వారీగా ర్యాంకులను ప్రకటించకుండానే మెరిట్ జాబితాను వెల్లడించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో 1:3 పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేయలేదన్న ఆరోపణలు సైతం వస్తున్నాయి. రిజర్వేషన్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 50 శాతానికి మించి పోస్టులు కేటాయించడాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టినట్టు తెలుస్తోంది. ఫలితాల ప్రకటనలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ అనంతరం ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడంతో అర్హత సాధించిన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. నిబంధన ప్రకారం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన అభ్యర్థులనే నియమించాల్సి ఉంటుంది. కానీ ఈ విషయమై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో గిరిజన అభ్యర్థులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. ఎంపిక ప్రక్రియ మరింత జాప్యం.. మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 25న ఎంపికైన అభ్యర్థులకు కలెక్టర్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందించాల్సి ఉంది. కానీ కోర్టు ఆదేశాలతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో 15 రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే ఈ ఉద్యోగాల భర్తీ ఇంకా జాప్యం జరిగే అవకాశం ఉంది. కొత్త పంచాయతీల పాలకవర్గం వచ్చే లోపైనా ఈ నియామక ప్రక్రియ పూర్తవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారంనడుచుకుంటాం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల విషయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం నియామక ఉత్తర్వులను నిలిపివేసి ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని పూర్తి చేశాం. మళ్లీ కోర్టు ఆదేశాల ప్రకారం నియామక ఉత్తర్హుల ప్రక్రియ కొనసాగిస్తాం. జిల్లాలో ఎలాంటి అవకతవకలు జరిగిన దాఖలాలు లేవు. ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – ఆర్ ఆశాలత:డీపీఓ -
ఎత్తుకు పైఎత్తు
అర్ధరాత్రి కావస్తున్నా కూతురు సునీత ఇంటికి రాకపోవడంతో డాక్టర్ శేఖర్ ఆందోళన చెందాడు. పేషెంట్లు ఎవరూ లేకపోవడంతో రాత్రి పది గంటలకే శేఖర్ తన నర్సింగ్ హోమ్ నుంచి ఇంటికొచ్చేశాడు. కానీ తొమ్మిదిన్నరకే రావాల్సిన సునీత ఇంతవరకు రాలేదు. ఆమె ఫోన్ కూడా స్విచాఫ్ అని వస్తోంది. సునీత తన ఫోన్‌ని ఎప్పుడూ స్విచాఫ్ చెయ్యదు. నగరంలో ఒక బ్యూటీ పార్లర్ నడిపే సునీత రోజూ తొమ్మిదిన్నరకల్లా ఇంటికి చేరుకుంటుంది. కానీ ఈ రోజు అర్ధరాత్రి కావస్తున్నా రాలేదు. శేఖర్ బ్యూటీ పార్లర్లో పనిచేసే వారికి కూడా ఫోన్లు చేశాడు. ఎప్పటిలాగే రాత్రి తొమ్మిదికి పార్లర్ మూసేశాక సునీత తన కారులో ఇంటికి వెళ్లిపోయిందని వారు చెప్పారు. కొంపదీసి సునీత కారు ప్రమాదానికి గురైందా అనే అనుమానంతో పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చెయ్యబోయాడు. అప్పుడే శేఖర్ సెల్ మోగింది. స్క్రీన్‌పై సునీత నంబర్ కనిపించగానే ఆత్రంగా ‘‘ఏమ్మా! ఎక్కడున్నావ్?’’ అని అడిగాడు. అవతల నుంచి సునీతకు బదులు ఇంకెవరో మాట్లాడారు.‘‘డాక్టర్ శేఖర్! మీ కూతురు ప్రస్తుతం మా బందీగా ఉంది. ఆమె ప్రాణాలతో దక్కాలంటే మీరు మేం చెప్పినట్లు చెయ్యాలి’’ అన్నాడు ఫోన్లో మాట్లాడిన వ్యక్తి కటువుగా.‘‘ఎవరు మీరు? మీకేం కావాలి? నా కూతుర్ని క్షేమంగా విడిచిపెట్టండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను’’ ఆందోళనగా అన్నాడు.‘‘మాకు డబ్బు అక్కర్లేదు. నువ్వు మాకొక చిన్న పని చేస్తే చాలు. మావాడికి భుజంలో బుల్లెట్ దిగింది. బుల్లెట్ బయటకు తీసి కట్టు కట్టాలి. ఆ పని ఇప్పుడే చెయ్యాలి. నీ వంటి సర్జన్కి ఇదొక పెద్ద పని కాదు. సర్జరీకి కావలసిన పరికరాలు తీసుకొని నువ్వు ఇప్పుడే కారులో నేరుగా గాంధీనగర్ వచ్చెయ్. ఆలోగా మేం నీకు మళ్లీ ఫోన్ చేస్తాం. ఈ విషయం పోలీసులకు చెప్పవంటే నీ కూతురు శవం కూడా నీకు దొరకదు’’ అంటూ ఫోన్ కట్ చేశాడా వ్యక్తి.డాక్టర్ శేఖర్ ఇంటి పక్కనే ఉన్న తన నర్సింగ్‌హోమ్ లోంచి సర్జరీకి కావలసిన పరికరాలు, మత్తుమందు, బ్యాండేజీ సామగ్రిని ఒక బ్యాగులో వేసుకుని కారులో బయల్దేరాడు. అతను గాంధీనగర్‌లోకి ప్రవేశించగానే ఫోన్ మోగింది. కిడ్నాపర్ మాట్లాడాడు. ‘నీ కారును రేమండ్ షోరూమ్ ముందు పార్క్ చేసి, దానికి ఎదురుగా ఉన్న సందులోకి నడుచుకుంటూ రా’’ అని ఆదేశించాడు.శేఖర్ అతను చెప్పినట్టే చేశాడు. ఫోన్లో సూచనల ద్వారా కిడ్నాపర్ శేఖర్ని నాలుగైదు సందులు తిప్పి, చివరకు నిర్మానుష్యంగా ఉన్న ఒక చీకటి ప్రదేశంలో ఆగమన్నాడు. అక్కడొక కారు నిలిపి ఉంది. కారు పక్కనే ఒక ముసుగు వ్యక్తి శేఖర్ చేతిలోని బ్యాగుతో పాటు అతని సెల్‌ఫోన్ కూడా తీసుకున్నాడు. సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసి, బ్యాగును కారులో పెట్టాడు. తర్వాత శేఖర్ కళ్లకు గంతలు కట్టి కారు వెనుక సీట్లో కూర్చోబెట్టాడు. తాను డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. కారు వేగంగా ముందుకు ఉరికింది. పావుగంట ప్రయాణం తర్వాత ఒక చోట ఆగింది. ముసుగు వ్యక్తి శేఖర్ చెయ్యి పట్టుకొని కొంత దూరం తీసుకెళ్లాడు. గమ్యం చేరాక శేఖర్ కళ్లకు కట్టిన గంతలను తీసేశాడు. తానొక గదిలో ఉన్నానని గ్రహించాడు శేఖర్. గదిలోని మంచం మీద భుజానికి తూటా దెబ్బ తగిలిన వ్యక్తి ఉన్నాడు. అతని పక్కనే మరో వ్యక్తి ఉన్నాడు. వారిద్దరి ముఖాలకు కూడా ముసుగులు ఉన్నాయి. గాయపడ్డ వ్యక్తి బాధకు విలవిల్లాడుతున్నాడు. డాక్టర్ శేఖర్ వెంటనే పని మొదలుపెట్టాడు. గాయపడ్డ వ్యక్తికి మత్తుమందు ఇచ్చి అతని భుజంలో దిగిన తూటాను చాకచక్యంగా బయటకు తీశాడు. తర్వాత గాయానికి మందు రాసి, కుట్టు కుట్టి కట్టు కట్టాడు. తర్వాత పేపర్ మీద కొన్ని మందులు రాసిచ్చాడు. ‘‘తూటా చాలా లోపలకు దిగబడింది. పైగా చాలాసేపు లోపలే ఉండిపోవడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ ఏర్పడింది. వెంటనే ఈ మాత్రలు వాడండి. వాడకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువై ప్రాణం మీదకు వస్తుంది. అందువల్ల నిర్లక్ష్యం చెయ్యవద్దు’’ అని ఆ ముసుగు వ్యక్తులతో చెప్పాడు.తర్వాత కిడ్నాపర్లు శేఖర్ని గాంధీనగర్ వరకు కళ్లకు గంతలతో తీసుకెళ్లారు. అక్కడ అతన్ని దించి, సెల్‌ఫోన్ ఇచ్చి వెళ్లిపోయారు. శేఖర్ కారులో ఇంటికి చేరుకున్నాడు. అప్పటికి వేకువ జాము నాలుగు గంటలైంది. తెలతెలవారుతుండగా సునీత ఇంటికి వచ్చింది. తనను ఎవరో దుండగులు కిడ్నాప్ చేసి, కళ్లకు గంతలు కట్టి ఎక్కడికో తీసుకెళ్లారని, రాత్రంతా ఒక గదిలో బంధించి కొద్దిసేపటి కిందటే విడిచిపెట్టారని చెప్పింది. శేఖర్ రాత్రి జరిగినదంతా కూతురికి చెప్పాడు.సునీత క్షేమంగా ఇంటికి తిరిగొచ్చింది గనుక ఇప్పుడు కిడ్నాపర్ల గురించి పోలీసులకు చెప్పడం ధర్మం అనుకున్నాడు శేఖర్. వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్‌కి ఫోన్ చేసి, జరిగినదంతా వివరంగా చెప్పాడు. అప్పుడు విజయ్ ఆ కిడ్నాపర్లు ఎవరో శేఖర్‌కి చెప్పాడు. ‘‘మీ అమ్మాయిని కిడ్నాప్ చేసిన ఈ దుర్మార్గులే నిన్న సాయంత్రం హైవేలో ఒక వజ్రాల వ్యాపారి కారును అటకాయించి, కోటి రూపాయల విలువైన వజ్రాలు దోచుకెళ్లారు. ఆ వ్యాపారి ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో దుండగుల్లో ఒకడు గాయపడ్డాడు. దుండగులు ఆ వజ్రాల వ్యాపారిని చంపి, తమ సహచరుణ్ణి కారులో ఎక్కించుకుని పరారయ్యారని మాకు తెలిసింది. వారు గాయపడ్డ తమ వ్యక్తిని నేరుగా ఆస్పత్రికి తీసుకెళితే పట్టుబడిపోతామనే భయంతో మీ కూతుర్ని కిడ్నాప్ చేసి, మీ ద్వారా అతనికి చికిత్స చేయించారని ఇప్పుడర్థమవుతోంది నాకు. నిన్న రాత్రి కిడ్నాపర్లు మిమ్మల్ని కారులో తీసుకెళ్లిన రూటును మీరు చెప్పగలిగితే మేం వారి స్థావరాన్ని కనుక్కొని వారిని అరెస్టు చేస్తాం’’ అన్నాడు విజయ్.‘‘సారీ ఇన్స్పెక్టర్. ఆ సమయంలో నా కళ్లకు గంతలు కట్టడం వల్ల నేనేమీ చూడలేకపోయాను. అయితే, వారి ఆచూకీ తెలుసుకోవడానికి నేనొక ట్రిక్కు ప్రయోగించాను. పేషెంటుకి ఇన్ఫెక్షన్ తగ్గడానికి నేను రాసిచ్చిన మాత్రలు నెహ్రూ రోడ్డులోని అపోలో ఫార్మసీ మెడికల్ షాపులో మాత్రమే దొరుకుతాయి. నగరంలో ఇంకెక్కడా ఆ మందుల స్టాక్ లేదు. ఒక డాక్టర్‌గా నాకీ విషయం బాగా తెలుసు. ఆ మెడికల్ షాపు రోజూ ఉదయం తొమ్మిది గంటల తర్వాత తెరుస్తారు. మీరు ఆ అంగడి వద్ద మాటు వేసి, ఆ మందుల చీటీ తెచ్చిన వ్యక్తిని పట్టుకుంటే చాలు మిగిలిన వారు కూడా దొరికిపోతారు’’ ధీమాగా చెప్పాడు శేఖర్.‘‘థాంక్యూ డాక్టర్. మా పోలీసుల బుర్ర కన్నా మీ బుర్రే తెలివైనది. ఆ మందుల పేర్లు చెప్పండి చాలు. ఆ దుర్మార్గుల్ని ఇట్టే పట్టుకుంటాను.’’ హుషారుగా అన్నాడు విజయ్ రాసుకున్నాడు.తర్వాత విజయ్ అపోలో ఫార్మసీ షాపు తెరవగానే షాపు ఓనరుతో మాట్లాడి తన సిబ్బందితో కలసి మఫ్టీలో షాపు బయట మాటు వేశాడు. ఊహించినట్టే కాసేపట్లో ఒక కిడ్నాపర్ శేఖర్ రాసిచ్చిన మందుల చీటీతో అంగడికి వచ్చాడు. షాపు ఓనర్ సైగ చెయ్యగానే విజయ్ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు. తర్వాత అతని ద్వారా అతని సహచరులను కూడా అరెస్టు చేసి, వజ్రాలను స్వాధీనం చేసుకున్నాడు. - డి.మహబూబ్ బాషా -
పోరు ఆగదు
ఒంగోలు టౌన్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు చేపట్టిన ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. భావి భారత పౌరులను తీర్దిదిద్దే గురువులపై దమనకాండకు దిగింది. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసిన సర్కారుపై ఉపాధ్యాయులు ఆగ్రహంతో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజైన బుధవారం సీపీఎస్ రద్దుకు సంబంధించి ఏకవాక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపించమని ఫ్యాఫ్టో నాయకత్వం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎక్కడికక్కడ ఫ్యాఫ్టో నాయకులను బైండోవర్ చేయడం, విజయవాడలో కనిపించిన ప్రతి ఒక్కరిని బలవంతంగా అరెస్టులు చేసి అక్కడి పోలీసు స్టేషన్లన్నింటికి తరలించి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఫ్యాఫ్టో నాయకత్వం చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో 8 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారని, వారి కుటుంబాల్లో 60 లక్షల ఓట్లు ఉన్నాయని, చంద్రబాబును గద్దె దించేవరకు తాము పోరాడతామంటూ హెచ్చరికలు చేశాయి. ఠాణాలకు టీచర్ల తరలింపు.. సీఎస్‌పురం: సీపీఎస్ రద్దు కోరుతూ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి మంగళవారం సీఎస్‌పురం మండలంలోని ఉపాధ్యాయులు తరలి వెళ్లారు. ఏపీటీఎఫ్, యూటీఎఫ్‌ల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రెండు బృందాలుగా వెళ్లారు. యూటీఎఫ్ సభ్యులను పెదకాకాని వద్ద, ఏపీటీఎఫ్ ఆద్వర్యంలో వెళ్లిన ఉపాధ్యాయులను గవర్నర్ పేట వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఆయా ఏరియాలలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోరాటం ఆగదు: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిర్బం«ధం విధించింది. చలో అసెంబ్లీని భగ్నం చేసేందుకు ముందస్తు అరెస్టులు చేసింది. అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చి ఫ్యాఫ్టో నాయకత్వాన్ని ఎక్కడికక్కడ అరెస్టు చేయించింది. యాభై శాతం నాయకత్వాన్ని అరెస్టు చేయించింది. మిగిలిన యాభై శాతం విజయవాడ చేరుకుంటే అక్కడ కూడా బలవంతంగా అరెస్టులు చేయించింది. ఉదయం పదిగంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అరెస్టులు జరిగాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. విజయవాడ వన్‌టౌన్ పోలీసు స్షేషన్‌లో తాము ఉపాధ్యాయులం కాదని చెప్పినా పదిమందిని అరెస్టు చేయించింది. రోడ్డుపై ఎవరూ కనిపించకూడదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించింది. సీపీఎస్ రద్దు చేస్తారా, గద్దె దిగుతారా అనేది చంద్రబాబు ప్రభుత్వం తేల్చుకోవాలి. పిల్లి రమణారెడ్డి, ఫ్యాఫ్టో జిల్లా చైర్మన్ కనబడితే అరెస్టులు: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల విచక్షణారహితంగా వ్యవహరించింది. సీపీఎస్ రద్దు చేయాలంటూ కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నాం. ఒకసారి రాష్ట్రవ్యాప్తంగా జాతా నిర్వహించాం. ఇంకోసారి విజయవాడలో మహా«ధర్నా చేపట్టాం. మరోసారి కలెక్టరేట్లను ముట్టడించి పాలనను స్తంభింప చేశాం. తప్పనిసరి పరిస్థితుల్లో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాం. ఉపాధ్యాయులు కనబడితే ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. బస్టాండులు, రైల్వే స్టేషన్లు, రోడ్లపై ఇలా ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్టులు చేశారు. ఉపాధ్యాయులు కానివారిని కూడా అరెస్టు చేశారు. ఒక్కసారి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయితే జీవితాంతం పెన్షన్ ఇస్తున్నారు. ముపై ఏళ్లపాటు పనిచేసిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. చల్లా శ్రీనివాసులు, ఫ్యాఫ్టో జిల్లా సెక్రటరి జనరల్ -
టీడీపీలో ఎయిర్ ఏషియా కలవరం
సాక్షి, అమరావతి : ఎయిర్ ఏషియా స్కాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావనకు రావడంతో టీడీపీలో కలవరం మొదలైంది. ఆ పార్టీ నాయకుడు ఆశోక్ గజపతి రాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎయిర్ ఏషియా ప్రతినిధుల మధ్య జరిగిన సంభాషణల ఆడియో టేపు సీబీఐ చేతికి చిక్కిన సంగతి తెలిసిందే. ఆ టేపులో చంద్రబాబు మనిషే కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు.. ఆయన్ని పట్టుకుంటే మనకు కావాల్సిన పని అవుతుందని వారి మధ్య సంబాషణ నడిచింది. దీంతో సమస్యను పక్కదోవ పట్టించడానికి టీడీపీ రంగం సిద్ధం చేసింది. టీడీపీ గతంలో ఓటుకు కోట్లులో విషయంపై వివరణ ఇవ్వకుండా సమస్యను దాటవేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ స్కాంలో టీడీపీ నాయకుల పేర్లు రావడంపై ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఎదురుదాడికి దిగారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ నేతల గురించి వచ్చిన ఆరోపణలపై స్పందించకుండా ఎయిర్ ఏషియాలో స్కాం నిజమైతే కేంద్రమంత్రులంతా డబ్బులు తిన్నట్టే అంటూ వింత రాగం అందుకున్నారు. చంద్రబాబు ప్రస్తావన ఎలా బయటకి వచ్చిందంటూ ప్రశ్నించారు. భారత్‌లో ఫోన్ ట్యాపింగ్ అనుమతిస్తున్నారా అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నవి బయటకెలా వచ్చాయన్నారు. ఈ అంశాన్ని కేంద్రానికి ముడిపెడుతూ.. ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేసి కేంద్రం నియంత పాలన చేస్తుందని కుటుంబరావు ఆరోపించారు. -
న్యాయం చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యం
పరకాల రూరల్ : తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ పలువురు రైతులు ఆదివారం పురుగు మందు డబ్బాలతో మండలంలోని సీతారాంపురం పరకాల–కంఠాత్మకూర్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. బాధిత రైతుల కథనం ప్రకారం.. సీతారాంపురం గ్రామానికి చెందిన పలువురు రైతులు మేల్ ఫిమేల్ వరి రకాన్ని 60 ఎకరాల్లో సాగు చేశారు. పంట పూర్తయిన అనంతరం 25 మందికి చెందిన 28 ఎకరాల వరి పంటను హార్వెస్టింగ్ చేసి మిగిలిన 32 ఎకరాల పంట విషయంలో రేపు, మాపు అంటూ కంపెనీ ఆర్గనైజర్ కాలం గడిపాడు. ఈ క్రమంలో ఈనెల మూడో తేదీన కురిసిన అకాల వర్షంతో 32 ఎకరాల్లో ధాన్యం గింజలు పూర్తిగా రాలిపోయాయి.ఈ విషయమై కంపెనీ ప్రతినిధులను అడగితే పట్టించుకోవడంలేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీడ్ ఆర్గనైజర్ రఘుపతి తమ మిషన్‌తోనే హార్వెస్టింగ్ చేసుకోవాలని షరతు పెట్టడంతోపాటు కోతకు వచ్చిన తమ పంటలను వదిలి అధిక రేట్లతో ఇతర గ్రామాల్లో హార్వెస్టింగ్ చేశాడని, దీంతో తాము నష్టపోయామని వాపోయారు. -
భావోద్వేగాలను నియంత్రించుకోగలరా?
నిద్రలో కలత చెందటం, రోజుల తరబడి నిద్ర కరవు కావడం, శూన్యంలోకి చూస్తూ అంతా కోల్పోయినట్లనుకోవటం, వారిలో వారు మాట్లాడుకోవటం, రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడటం. ఇవన్నీ వివిధరకాల భావోద్వేగాలకు లోనైనవారి లక్షణాలు. సంతోషంతో అరవటం, ఎదుటవున్నవారిని ఎత్తుకోవటం, ఆనందబాష్పాలు మొదలైనవి కూడ భావోద్వేగాలే అయితే వీటివల్ల మనిషికి సంతోషం కలుగుతుంది. ఉరుకుల పరుగుల జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన సహజమైనాయి. ఎలాంటి స్థితిలోనైనా భావోద్వేగాలను నియంత్రించుకోగలిగితే మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు. మీరు మీ ఎమోషన్స్‌ని నియంత్రించుకోగలుగుతున్నారో లేదో తెలుసుకోండి. 1. మిమ్మల్ని బాధపెట్టే, ఇబ్బందిపెట్టే ఆలోచనలకు ప్రతిస్పందించకుండా ఉండే మనస్తత్వాన్ని పెంపొందించుకుంటారు. ఎ. కాదు బి. అవును 2. మీ రియాక్షన్ వల్ల లాభం జరుగుతుందా అని ఆలోచిస్తారు. మీవల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందనుకుంటే అలాంటి ఆలోచనను మానుకుంటారు. ఎ. కాదు బి. అవును 3. మీ భావోద్వేగాలకు అనుగుణంగా మీరు ప్రవర్తిస్తే తదుపరి పర్యవసానాలు ఎలా ఉంటాయో విశ్లేషించగలరు. ఎ. కాదు బి. అవును 4. ప్రశాంతంగా, నిదానంగా ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడ చాలా హుందాగా నడుచుకోవటానికి ప్రయత్నిస్తారు. ఎ. కాదు బి. అవును 5. మాటల వల్ల కొందరు బాధపడతారు. కొందరు తీవ్రంగా రియాక్ట్ అవుతారు. అందుకే మీకు తోచిన విధంగా మాట్లాడరు. ఎ. కాదు బి. అవును 6. ఆందోళనగా ఉన్నప్పుడు సంగీతాన్ని వింటారు. డ్యాన్స్ చేస్తారు. మీ అలవాట్లు ఎలావున్నాయోనని ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటుంటారు. ఎ. కాదు బి. అవును 7. మీరెలాంటి సమయాల్లో చాలా ఆనందంగా గడుపుతారో (కుటుంబ సభ్యులతో మాట్లాడటం, టీవీ చూడటం మొదలైనవి) గుర్తిస్తారు. మీరు డిప్రెషన్లో ఉన్నప్పుడు మీకు ఆనందం కలిగించే పనులను చేయటం అలవాటుగా చేసుకుంటారు. ఎ. కాదు బి. అవును 8. ఎస్/నో, మంచి/చెడు ఇలా ప్రతి విషయానికి రెండు పార్శా్వలు ఉంటాయని మీకు తెలుసు. అందుకే మీరు భావోద్వేగాలకు లోనైనప్పుడు ఈ విషయాన్ని గుర్తిస్తారు. ఎ. కాదు బి. అవును 9. మీ ఎమోషన్స్‌ను అణచివేయడం కన్నా వాటిని మంచిగా మలచుకోవటానికే ప్రయత్నిస్తారు. ప్రతి వ్యక్తికి కొన్ని రకాల భావోద్వేగాలు అవసరమవుతాయని గ్రహిస్తారు. ఎ. కాదు బి. అవును 10. మీ సమస్య మరీ ఎక్కువైనప్పుడు సైకాలజిస్ట్ సహాయం పొందటం మరచిపోరు. ఎ. కాదు బి. అవును ‘బి’ సమాధానాలు ఏడు దాటితే ఎమోషన్స్‌ని నియంత్రించుకోగలిగే శక్తి మీకుంటుంది. ఉత్సాహం కలిగినప్పుడు ఎలా ఉంటారో ఒత్తిడిలో కూడ అలాగే ఉండగలరు. ఒడిదుడుకులలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ‘ఎ’ లు ‘బి’ ల కన్నా ఎక్కువగా వస్తే భావోద్వేగాలను నియంత్రించుకోవటంలో మీరు చాలా వీక్. ప్రతి విషయానికీ డీలా పడిపోతూ అసంతృప్తితో ఉంటారు. దీనివల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలూ మిమ్మల్ని వెంటాడతాయి. ‘బి’ లను సూచనలుగా భావించి ఎమోషన్స్‌ని నియంత్రించుకోవటానికి ప్రయత్నించండి. -
స్కూల్ టెస్ట్ టెన్షన్..?
ఎగ్జామ్స్ మొదలవుతున్నాయంటే పిల్లలు తెలియకుండానే ఒత్తిడికి లోనవుతుంటారు. ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి పిల్లలు చురుగ్గా పరీక్షలకు హాజరయ్యే పరిస్థితి కల్పిస్తున్నారా? 1. పరీక్ష ముందు రోజు రాత్రి ఎనిమిది గంటల నిద్ర తప్పని సరిగా పోయేటట్లు చూస్తున్నారు. ఎ. అవును బి. కాదు 2. టైమ్ అయిపోయిందని లేదా ఒత్తిడి కారణంగా తినాలనిపించక ఖాళీ కడుపుతో పరీక్షలకు వెళ్లిపోతుంటారు పిల్లలు. ఇది తప్పని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 3. తాజా పండ్లు, కూరగాయలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి కాబట్టి పరీక్షల సమయంలో తప్పని సరిగా వీటిని తినిపిస్తున్నారు. ఎ. అవును బి. కాదు 4. పిల్లలు ఒకింత ఆందోళన కొద్దీ అన్నం తినడానికి విముఖత చూపిస్తూ ఆర్టిఫీషియల్ షుగర్స్‌తో చేసిన స్వీట్లు, ప్రాసెస్డ్ ఫుడ్, చిప్స్, వేపుడు పదార్థాలు, మాంసం వంటి చిరుతిళ్లను ఇష్టపడతారు. ఇవి ఒత్తిడిని పెంచుతాయి కాబట్టి తిననివ్వకుండా జాగ్రత్తపడతారు. ఎ. అవును బి. కాదు 5. పిల్లలు తినకూడని వాటిని ఇంట్లో సిద్ధంగా ఉంచి తినవద్దు అని కండిషన్ పెడితే చిన్నబుచ్చుకుంటారు, ఆ మూడ్‌తో చదువు మీద దృష్టికేంద్రీకరించలేరు కాబట్టి పరీక్షల సమయంలో ఇంట్లోకి రానివ్వరు. ఎ. అవును బి. కాదు 6. ఈ సమయంలో పిల్లలకు నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువ సేపు శక్తినిచ్చే మొలకెత్తిన గింజలు, పప్పుధాన్యాలను ఆహారంలో భాగం చేస్తున్నారు. ఎ. అవును బి. కాదు 7. పరీక్షల గురించి భయపెట్టకుండా జాగ్రత్తలను మాత్రమే చెబుతున్నారు, ఎ. అవును బి. కాదు 8. ఉన్న సమయమంతా కూర్చుని చదవడమే కాకుండా రోజుకు పది నుంచి పదిహేను నిమిషాల సేపు వ్యాయా మం చేస్తే మెదడు చురుగ్గా ఉంటుందని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే పిల్లలను పరీక్షల ఒత్తిడికి లోనుకానివ్వకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు అనుకోవాలి. ‘బి’లు ఎక్కువైతే ఒకసారి మనస్తత్వ శాస్త్రవేత్తలు, విశ్లేషకులు చెప్పే విషయాలను గమనించండి. -
ఇంటర్ ‘స్పాట్’లో గొడవ
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం చేసినందుకు చెల్లించే భత్యం (డీఏ) మంజూరులో ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ అధికారులతో అధ్యాపకులు గొడవకు దిగారు. ఇందులో భాగంగా అనంతపురంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్పాట్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు మంగళవారం మధ్యాహ్నం పెన్‌డౌన్ చేసి నిరసన తెలిపారు. 50 కిలోమీటర్ల పైబడిన దూరం నుంచి స్పాట్ విధులకు వస్తున్న అధ్యాపకులకు రూ. 450 ఇవ్వాల్సి ఉందన్నారు. అలాగే 50 కిలోమీటర్ల లోపు దూరం నుంచి వచ్చేవారికి రూ. 300 ఇవ్వాల్సి ఉందన్నారు. రూ. 300ను రూ. 120కు తగ్గించినట్లు సామాజిక మాద్యమాల్లో మెసేజ్‌లు వస్తున్నాయని దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేశారు. గతంలో కంటే ధరలు పెరిగాయని ఈ పరిస్థితుల్లో ఇంకా పెంచాల్సిందిపోయి డీఏ తగ్గించడం అన్యాయమని వాపోయారు. స్థానికంగా (లోకల్) ఉంటూ స్పాట్‌కు వచ్చే అధ్యాపకులకు గతంలో రూ. 130 దాకా ఇచ్చే రెమ్యూనరేషన్ ఈసారి రద్దు చేసినట్లు తెలిసిందని దీనిపై కూడా అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు మాట్లాడుతూ పరీక్షల విధుల్లో పాల్గొన్నవారికి డీఏ మొత్తంలో తగ్గించారు తప్ప స్పాట్ విధుల్లో పాల్గొన్నవారికి తగ్గించాలనే సమాచారం తమకు రాలేదన్నారు. -
భయం ఉంటేనే వ్యవస్థ బాగుంటుంది
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పెద్ద ఎత్తున జరుగుతుండటంపై ఉమ్మడి హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మాస్ కాపీయింగ్ నేపథ్యంలో విద్యా ప్రమాణా లు పడిపోతున్నాయంది. మాస్ కాపీయింగ్‌కు సహకరించే ఉపాధ్యాయులు విద్యార్థులకు దేవుళ్లుగా, సహకరించనివారు దెయ్యాల్లా కనిపి స్తున్నారని వ్యాఖ్యానించింది. తక్కువ మార్కు లు వచ్చినా పర్వాలేదు.. నిజాయితీగా ఆ మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్న తల్లిదం డ్రులు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించింది. మాస్ కాపీయింగ్‌కు అందరూ బాధ్యులేనంది. గతేడాది 10వ తరగతి పరీక్షల సందర్భంగా మాస్ కాపీయింగ్‌కు సంబంధించి తెలంగాణలో 4 కేసులు, ఏపీలో ఓ కేసు మాత్రమే నమోదవడంపై విస్మయం వెలిబుచ్చింది. పబ్లిక్ పరీక్షల చట్టం–1997 కింద కేసులు నమోదు చేయడంతోపాటు ప్రాసిక్యూషన్ చేస్తేనే పరిస్థితులు దార్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ‘‘భయం ఉంటేనే వ్యవస్థ బాగుపడుతుంది. ఫెయిలైతే ఏమవుతుంది.. ఓ సంవత్సరం లేటవుతుంది.. ఇందుకోసం అడ్డదార్లు తొక్కా ల్సిన అవసరమేముంది?’’ అని వ్యాఖ్యానిం చింది. మాస్ కాపీయింగ్ జరగకుండా ఏదో ఒకటి చేయాల్సిన అవసరముందంటూ ఇందు కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపా లని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఉభయ రాష్ట్రాల్లోని మాస్ కాపీయింగ్, పుస్తకాలు పెట్టి రాస్తున్న రాతల్ని అడ్డుకోవడంలో విద్యాశాఖాధి కారులు దారుణంగా విఫలమవు తున్నారని, మాస్ కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పర్యవేక్షించేలా ఆదేశాలివ్వాలంటూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ గుంటుపల్లి ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీన్ని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ న్యాయవాది పేర్కొంటూ విచారణను సంక్రాంతి సెలవుల తర్వాత చేపట్టాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఘటనల్లో ఎన్ని కేసులు నమోదు చేశారు.. ఎంతమందిని ప్రాసిక్యూట్ చేశారో చెప్పాలంది. ఏపీలో ఓ కేసు, తెలంగాణలో నాలుగు కేసులు నమోదు చేసినట్లు తెలుసుకున్న ధర్మాసనం విస్మయం వెలిబుచ్చింది. చట్టాన్ని ఎందుకు సక్రమంగా అమలు చేయట్లేదని ప్రశ్నించింది. సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి నిర్వహణ పెద్ద ఆర్థిక భారమేనని, కాబట్టి ఈ ఆర్థిక భారాన్ని మోయాలని ప్రభుత్వాలను ఆదేశించే అధికారం తమకెక్కడుందో చెప్పాలని పిటిషనర్‌ను కోరింది. మాస్ కాపీయింగ్ నిరోధానికి ఏం చేస్తే బాగుంటుందో సలహాలివ్వాలని కోరింది. -
పెట్రోల్ ధర తగ్గుతుంది!
ముంబై: పెట్రోల్‌లో 15 శాతం మిథనాల్‌ను కలపడం ద్వారా ఇంధనం ధరను, కాలుష్యాన్ని కూడా తగ్గించే విధానాన్ని తమ ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. ఇందుకు సంబంధించి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తానే ప్రకటన చేస్తానన్నారు. లీటర్ పెట్రోల్ ఖరీదు దాదాపు 80 రూపాయలు ఉంటుండగా, బొగ్గు నుంచి ఉత్పత్తి అయ్యే లీటర్ మిథనాల్ మాత్రం రూ.22కే లభిస్తుందనీ, చైనాలో అయితే ఈ ధర మరీ రూ.17 మాత్రమేనని గడ్కారీ వివరించారు. స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ వోల్వో ముంబై కోసం పూర్తిగా మిథనాల్‌తో నడిచే ప్రత్యేక బస్సులను తయారుచేసిందనీ, త్వరలోనే 25 బస్సులను నగరంలో తిప్పేందుకు ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. మిథనాల్‌ను ముంబైలో ఉన్న స్థానిక పరిశ్రమల నుంచే ఉత్పత్తి చేయవచ్చనీ, వాటి నుంచి వచ్చే ఇంధనాన్నే ఈ బస్సులకు వాడతామన్నారు. పెట్రోలియం శుద్ధి పరిశ్రమలను నిర్మించేందుకు రూ.70 వేల కోట్లు ఖర్చవుతుండగా, మిథనాల్‌పై అయితే ఈ వ్యయం రూ.లక్షన్నర కోట్లుగా ఉంటున్నప్పటికీ...మిథనాల్‌పై దృష్టి పెట్టాల్సిందిగా తాను పెట్రోలియం శాఖ మంత్రికి సూచించానన్నారు. దేశంలో పెరిగిపోతున్న వాహనాల సంఖ్యపై గడ్కారీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము సగటున రోజుకు 28 కిలో మీటర్ల రహదారులను నిర్మిస్తున్నామనీ, త్వరలోనే దీనిని 40 కిలో మీటర్లకు తీసుకెళ్తామని ఆయన చెప్పారు. 2018లో 20 వేల కిలోమీటర్ల పొడవైన రహదారులను నిర్మిస్తామన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాలు నెమ్మదిగా సాగుతున్నాయనీ, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ‘జాతీయ రహదారుల, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ’ (ఎన్హెచ్ఐడీసీఎల్–నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్)ను స్థాపించామని ఆయన చెప్పారు. -
వారి ప్రాతినిధ్యం పెరగాలి
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయ వ్యవస్థలో మహిళలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉండటంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సమాజంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్న ఇతర ప్రభుత్వ సంస్థలతో పోటీపడుతూ న్యాయ వ్యవస్థ పనిచేయాలని సూచించారు. జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయ కమిషన్, నీతి ఆయోగ్ సంయుక్తంగా శనివారం నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కోవింద్ ప్రసంగించారు. ‘ఉన్నత న్యాయ వ్యవస్థలో బలహీన వర్గాలైన మహిళలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలకు అంత తక్కువగా ప్రాతినిధ్యం ఉండటం ఆమోదయోగ్యం కాదు. ఇతర సంస్థల మాదిరిగానే న్యాయ వ్యవస్థ కూడా సమాజంలోని వైవిధ్యం ప్రతిబింబించేలా అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించాలి’ అని కోవింద్ అన్నారు. ప్రతి నలుగురు జడ్జీల్లో ఒక్కరే మహిళ ఉన్నారన్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టులకు దూరంగానే పేదలు.. జిల్లా, సెషన్స్ కోర్టుల జడ్జీల నైపుణ్యాలు పెంచే గురుతర బాధ్యత ఉన్నత న్యాయ వ్యవస్థపైనే ఉందని కోవింద్ నొక్కిచెప్పారు. అలా అయితేనే చాలా మంది జిల్లా కోర్టుల జడ్జీలు హైకోర్టులు, సుప్రీంకోర్టులకు పదోన్నతులు పొందుతారని పేర్కొన్నారు. దీని వల్ల దిగువ కోర్టులపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని, ఫలితంగా హైకోర్టులపై భారం తగ్గుతుందని అన్నారు. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నా, ఖర్చు, విచారణల ఆలస్యానికి భయపడి పేదలు కోర్టుల్లో న్యాయ పోరాటం చేయడానికి వెనుకాడుతున్నారని కోవింద్ పేర్కొన్నారు. ధనికులు లొసుగులను అడ్డుపెట్టుకుని కేసులను సాగదీస్తున్నారని, కాలం చెల్లిన, పనికిరాని చట్టాలను రద్దుచేసి పాలనను సులభతరం చేయాలని చెప్పారు. సీజేఐ వర్సెస్ కేంద్ర మంత్రి న్యాయ వ్యవస్థ క్రియాశీలతపై కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాల మధ్య స్వల్ప మాటల యుద్ధం చోటుచేసుకుంది. పౌరుల ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించడం న్యాయవ్యవస్థ పవిత్ర కర్తవ్యమని జస్టిస్ దీపక్ మిశ్రా పేర్కొనగా, ప్రభుత్వ విధానపర నిర్ణయాలకు దూరంగా ఉన్నంత వరకూ న్యాయవ్యవస్థ స్వతంత్రతకు గౌరవం ఉంటుందని చౌదరి అన్నారు. అలా కాకుండా న్యాయ క్రియాశీలత, సమీక్షల పేరుతో జోక్యం చేసుకుంటే మాత్రం పరిణామాలు ఆందోళనకరంగా ఉంటాయని అన్నారు. ప్రజాస్వామ్యానికి న్యాయ స్వతంత్రత మూల స్తంభం వంటిదని, న్యాయ వ్యవస్థలోని జవాబుదారీతనం ఆ స్తంభానికి పునాది అని చెప్పారు. జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ.. పౌరుల ప్రాథమిక హక్కుల్ని ప్రభుత్వ విభాగాలు ఉల్లంఘించకూడదని, హక్కులకు భంగం కలిగిన మరుక్షణం, వాటిని అతిక్రమించే ప్రమాదకర సంకేతాలు ఉన్నప్పుడు న్యాయవ్యవస్థ పౌరుల పక్షాన నిలుస్తుందని అన్నారు. విధానపర నిర్ణయాలు చేయాలనే కోరిక న్యాయవ్యవస్థకు లేద ఆయన సమాధానమిచ్చారు. పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ, విస్తరణకు కోర్టులు చూపుతున్న చొరవను సీజేఐ సమర్థించారు. కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తదితరులు ప్రసంగించారు.