నకిలీ విత్తనాలపై మిరప రైతుల ఆందోళన
నకిలీ విత్తనాలపై మిరప రైతుల ఆందోళన
Published Wed, Sep 28 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
డోర్నకల్ : డోర్నకల్‌తో పాటు మన్నెగూడెం, వెన్నారం, ఉయ్యాలవాడ తదితర గ్రామాల్లో మిరప పంట సాగు చేస్తున్న రైతులు ఆందోళనకు చెందుతున్నారు. మిరప పంటలను సాగు చేస్తున్న పలువురు రైతులు చెట్లకు పూత, కాత తేడా ఉండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవా, సీఎస్ 333 రకం విత్తనాలతో సాగు చేసిన రైతులు చెట్లకు ఆశించినంత కాపు లేదని, కాయలు చిన్నగా లావుగా ఉండి కాపు తక్కువ ఉందంటూ ఫర్టిలైజర్ దుకాణ యజమానులతో వాగ్వాదానికి దిగుతున్నారు. పలువురి రైతుల ఫిర్యాదు మేరకు మంగళవారం ఏఓ పద్మజ ఫర్టిలైజర్ దుకాణాల్లో విచారణ చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఏఓ తెలిపారు.
నర్సింహులపేటలో
నర్సింహులపేట : నకిలీ మిరప విత్తనాలు విక్రయించారంటూ దంతాలపల్లిలోని పర్టిలైజర్ దుకాణాల ఎదుట రైతులు మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. నకిలీమిరప విత్తనాలు ఇవ్వడంతో మొక్క ఎదుగుదల, కాత, పూత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణా యజమానులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. లేని పక్ష్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మండలంలోని దాట్ల, బీరిశెట్టిగూడెం, అగపేట, తూర్పుతండా, పడమటిగూడెంలకు చెందిన రైతులు రాము, వీరన్న, లచ్చిరాం, చైతన్యరెడ్డి, వెంకట్‌రెడ్డి, రవీందర్, లచ్చిరాం, సుధాకర్, నర్సింహరావు, ప్రసాద్, సోమ్లా, ధర్మాతో పాటు పలువురు పాల్గొన్నారు.
Advertisement
Advertisement