రైతులు తెచ్చిన జొన్నలుబాగోలేదన్న అదనపు కలెక్టర్
రైతుల ఆగ్రహం.. గతేడాది ఇలాంటి జొన్నలే కొన్నారని వాదన
వాహనం ఎదుట బైఠాయించి ఆందోళన
కొనుగోలు చేస్తామన్న హామీతో శాంతించిన రైతులు
కల్హేర్ మండలం బీబీపేటలో సంఘటన
కల్హేర్ (నారాయణఖేడ్): జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కల్హేర్ మండలం బీ బీపేటలో అదనపు కలెక్టర్ మాధురి వాహనా న్ని రైతులు మంగళవారం అడ్డుకున్నారు. వా హనం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగా రు. బీ
బీపేట పీఏసీఏస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించి.. రైతులు తె చ్చిన జొన్నలు దెబ్బతిన్నాయని, శుభ్రంగా లే వని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబం ధనల ప్రకారం ఉంటేనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతేడా ది ఇలాంటి జొన్నలే కొనుగోలు చేశారని వాదించారు. లారీలు రాకపోవడంతో కొనుగోలు నెమ్మదిగా జరుగుతున్నాయని వాపోయారు. ఆమె అక్కడి నుంచి వెళ్తుండగా, తమ గోడు పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారంటూ రైతులు మండిపడ్డారు. ఆమెను వెళ్లనీయకుండా వాహనాన్ని అడ్డుకొని బైఠాయించారు. ప్రభుత్వం, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పెట్రోల్ డబ్బాతో రైతు ఆందోళన
ఫత్తేపూర్‌కు చెందిన రైతు నరేందర్ పెట్రోల్ డబ్బా పట్టుకుని ఒంటిపై పోసుకునేందుకు యత్నించాడు. మార్క్‌ఫెడ్ డీఏం శ్రీదేవి, ఆర్డీఓ అశోక్‌చక్రవర్తి వెంటనే కలుగజేసుకుని నచ్చజెప్పారు.
రైతులందరి జొన్నలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. అనంతరం కల్హేర్, కృష్ణాపూర్, బోక్కస్‌గాంలో కొనుగోలు కేంద్రాలను కూడా అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment