సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్‌.. మీనాక్షికి బదులుగా! | Sankranthiki Vasthunnam: Anil Ravipudi Chit Chat with Meenakshi Chaudhary, Aishwarya Rajesh | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్‌ ఎంతంటే? ఐశ్వర్య, మీనాక్షికి బదులు ఆ హీరోయిన్లతో సినిమా..

Published Sun, Jan 19 2025 1:21 PM | Last Updated on Sun, Jan 19 2025 2:16 PM

Sankranthiki Vasthunnam: Anil Ravipudi Chit Chat with Meenakshi Chaudhary, Aishwarya Rajesh

సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunnam Movie)తో వెంకటేశ్‌ ఖాతాలో మరో విక్టరీ పడింది. ఈ సినిమాకు ఎవరూ ఊహించని రేంజ్‌లో వసూళ్లు వస్తున్నాయి. పొంగల్‌కు రిలీజైన గేమ్‌ ఛేంజర్‌, డాకు మహారాజ్‌ సినిమాలతో పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం తక్కువ బడ్జెట్‌ చిత్రం. కానీ బలమైన కామెడీ కంటెంట్‌.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్ల ముందు క్యూ కట్టించేలా చేస్తోంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఐదు రోజుల్లోనే రూ.161 కోట్లు వసూలు చేసింది.

రూ.200 కోట్లకు చేరువలో..
అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్‌ఈవెన్‌ దాటేసి లాభాల బాట పట్టినట్లు చిత్రయూనిట్‌ అధికారిక పోస్టర్‌ ద్వారా వెల్లడించింది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు సినిమా యూనిట్‌ తాజాగా చిట్‌చాట్‌ నిర్వహించింది. ఈ చిట్‌ చాట్‌లో దర్శకుడు అనిల్‌ రావిపూడి, హీరోయిన్‌ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌, సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో పాల్గొన్నారు. ఈ భేటీలో ఒకరినొకరు ప్రశ్నలు అడుక్కున్నారు.

మీనాక్షి స్థానంలో..
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చేయకపోతే ఆ పాత్ర ఇంకెవరు చేసేవారు? అలాగే నేను చేయకపోతే నా స్థానంలో ఇంకెవర్ని తీసుకునేవారు? అని ఐశ్వర్య.. అనిల్‌ రావిపూడిని ప్రశ్నించింది. అందుకు అనిల్‌.. ఐశ్వర్య చేయకపోతే నిత్యామీనన్‌, మీనాక్షి స్థానంలో పూజా హెగ్డే చేసేదన్నారు. ఆ పాత్రల్లో మమ్మల్ని తప్ప ఎవర్నీ ఊహించుకోలేదంటారేమోనని ఎదురుచూశాను అని ఐశ్వర్య పంచ్‌ వేసింది.

ప్రభాస్తో నటించాలనుందన్న మీనాక్షి
దీంతో అనిల్‌.. నిజం చెప్పాలంటూ భాగ్యం పాత్రను ఐశ్వర్య రాజేశ్‌ తప్ప ఇంకెవరూ అలా చేయలేరు, అలాగే పోలీస్‌ పాత్ర చేసిన మీనాక్షిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ టైమింగ్‌ ఉందని కవర్‌ చేశాడు. ఏ హీరోతో పని చేయాలని ఉందన్న ప్రశ్నకు మీనాక్షి.. అందరు హీరోలతో నటించాలనుందని.. అందులో ప్రభాస్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటాడంది. ఐశ్వర్య.. జూనియర్‌ ఎన్టీఆర్‌తో పని చేయాలనుందని తెలిపింది. అనిల్‌ రావిపూడి.. చిరంజీవితో చేయాలనుందని, వేరే భాషల్లో అయితే విజయ్‌ను డైరెక్ట్‌ చేయాలనుందన్నాడు.

 

 

చదవండి: 'పాతాళ్‌ లోక్‌'తో ట్రెండ్‌ అవుతున్న నగేశ్‌ కుకునూర్‌ ఎవరో తెలుసా..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement