టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేశ్ ఈసారి సంక్రాంతి రేసులో ఉన్నారు. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా పేరు ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.
‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే ఈ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఈ పాటను ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్‌ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 2025 సంక్రాంతికి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment