Ramana Gogula
-
ఐ యామ్ టెక్నికల్ మ్యాన్..
సాక్షి, సిటీబ్యూరో, హైదరాబాద్: రమణ గోగుల.. ఈ పేరు చెబితే టాలీవుడ్లో ప్రముఖ సంగీత దర్శకుడిగా, గాయకుడిగానే తెలుగువారికి పరిచయం. కానీ ఆయన అంతకుముందే వ్యాపారవేత్త.. సామాజిక పారిశ్రామికవేత్త. ఎన్నో స్టార్టప్ కంపెనీలను ప్రారంభించడమేగాక విజయవంతంగా నడిపించారు. అంతేగాక వందలాది గ్రామాలకు సోలార్ ఎల్ఈడీ కాంతులు అందించారు. ప్రస్తుతం అంతర్జాతీయ సంస్థ స్టాన్లీ బ్లాక్ అండ్ డెక్కర్‌కు చెందిన క్లీన్ టెక్నాలజీ విభాగం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ ద్వారా సౌరశక్తి ద్వారా రైతులుకు విస్తృత సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈనెల 28న హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ పారిశ్రమికవేత్తల సదస్సులో రమణ సౌరశక్తి సాంకేతిక సాధనాల రూపకల్పనతో రైతులకు ఎలా తోడ్పడవచ్చనే అంశంపై రమణ మాట్లాడబోతున్నారు. ఈ సందర్భంగా తన మనసులో మాటలను శనివారం ‘సాక్షి’తో పంచుకున్నారు. భవిష్యత్తు సోలార్ పవర్‌దే.. ప్రపంచ భవిష్యత్తు సౌరశక్తి మీదే ఆధారపడి ఉంది. ఆదే ‘క్లీన్ ఎనర్జీ’. దీని వల్ల కాలుష్యం ఉండదు.. ఏ నష్టం కలుగదు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ శక్తిని గ్రహించవచ్చు. భవిష్యత్తులో వాహనాలు కూడా సోలార్ శక్తితోనే నడుస్తాయి. సోలార్ శక్తి మూలం అయితే దానిని వాడుకునే రకరకాల అప్లికేషన్స్ తయారవతాయి. చాలా స్టార్టప్స్ వీటిపై పనిచేస్తున్నాయి. సౌర శక్తితో రైతులకు ఉపయోగపడే అనేక సాధనాలు రూపొందిచాలనేది మా లక్ష్యం. మేఘాలు, నేల, లిఫ్ట్ ఇరిగేషన్, స్టోరేజ్.. ఇలా అన్నింట్లో సాంకేతిక పరిజ్ఞానం జోడించి రైతులుకు ఉపయోగపడే అప్లికేషన్లు తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం. క్లీన్ టెక్నాలజీ ద్వారా సోలార్ అగ్రికల్చర్ పంప్స్‌ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. రైతులకు అండగా.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, రైతుల పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించాం. ఇందుకు టీ–హబ్‌తో ఒప్పందం చేసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న స్టార్టప్ కంపెనీలతో కూడా పనిచేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. వ్యాపార రంగంలో మహిళలు.. నేడు దేశమంతా స్టార్టప్స్‌పైనే దృష్టి పెట్టింది. అందునా మహిళా పారిశ్రామిక వేత్తలపై ప్రముఖంగా దృష్టి సారిస్తున్నారు. మన ప్రభుత్వాలు దేశ, విదేశాల్లో çమహిళా పారిశ్రామిక వేత్తలకు సహకారం అందించడం శుభ పరిణామం. స్త్రీ సాధికరత కుటుంబం నుంచి ప్రారంభమవుతుంది. మహిళలు వారు ఏం చేయాలనుకుంటున్నారో ఆ అంశంలో కుటుంబం తోడ్పడాలి. చాలా కుటుంబాలు ప్రోత్సహిస్తున్నాయి కూడా. సాంకేతిక, సామాజిక రంగాల్లో మహిళా పారిశ్రామిక వేత్తలు వస్తున్నారు. అయితే వీరి సంఖ్య ఇంకా పెరగాలన్నది నా అభిప్రాయం. ప్రపంచంలో విజయవంతమైన వ్యక్తుల జాబితాలో అంతర్జాతీయ కంపెనీల చీఫ్ ఆఫీసర్లు, గ్లోబల్ ప్రాతినిధ్యం వహిస్తున్న లీడర్లలో స్త్రీలే కనిపిస్తున్నారు. ఇప్పుడు చాలా రంగాలను స్త్రీలు ముందుండి నడిపే ట్రెండ్ కొనసాగుతోంది. అది అన్ని రంగాలకు విస్తరించాలి. వారి ప్రాతినిధ్యం, ప్రాముఖ్యత పెరినప్పుడే దేశ సంపద పెరిగుతుంది. హైదరాబాద్ వైబ్రెంట్ సిటీ.. మన నగరం ఎన్నో అంశాల్లో ప్రగతి సాధిస్తోంది. సామాజిక పరిశ్రమలు, టెక్నికల్, ఇన్నోవేటివ్.. ఇలా అనేక రంగాల్లో పారిశ్రామిక వేత్తలను ఇక్కడ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామిక సమ్మిట్ జరగడం మనకు గర్వకారణం. నేను ఎప్పడూ టెక్నాలజిస్ట్‌నే.. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి సాలోర్ ఎనర్జీలోను, అమెరికాలోని లూసియానా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేశాను. నేను ఎప్పడూ టెక్నాలజిస్ట్‌నే. ఈ విషయం సినిమా రంగం వారికి తెలియదు. నా రక్తంలో టెక్నాలజీ, నా మనసంతా మ్యూజిక్ అవి సమాంతరంగా సాగుతుంటాయి. ఒక సమయంలో సంగీతం అందించాను.. చాలా తృప్తిగా ఉంది. ఇప్పుడు నా జీవితం సామాజిక లక్ష్యాలు సాధించడానికి వెచ్చిస్తాను’ అంటూ ముగించారు. -
మామిడిపండ్లు,పులిబొంగరాల కోసం ఎదురుచూపులు...
జ్ఞాపకం వేసవి... పిల్లల హుషారుకు కొత్త రెక్కలు తొడుగుతుంది. వారిని ఊహల గుర్రం ఎక్కిస్తుంది. పెద్దవారినైనా మళ్లీ బాల్యంలోకి తీసుకెళుతుంది. జ్ఞాపకాల కొమ్మల్లో దాగిన మిఠాయి పొట్లాన్ని విప్పి తియ్యని కబుర్లెన్నో చెబుతుంది. సంగీత దర్శకుడు, గాయకుడు అయిన రమణ గోగుల వేసవి జ్ఞాపకాలలో దాగున్న తియ్యటి బాల్యంలోకి ఇలా ప్రయాణించారు. ‘‘ఇప్పటి పిల్లలకు వేసవి ఎలా ఉంటుందో కానీ ఎండాకాలం వస్తోందంటే చాలు నేటికీ చిన్నతనంలో నేను వెళ్లిన ఊరు, అక్కడ చేసిన అల్లరి, ఇంట్లోవారికి తెలియకుండా కొనుక్కున్న పులిబొంగరాలు, ఆడిన కోతికొమ్మచ్చి, క్రికెట్ ... అన్నీ ఒకదాని వెంట ఒకటి పోటీపడి గుర్తుకొచ్చేస్తాయి. మాది విశాఖపట్టణం. నాన్నకు అక్కడే ఉద్యోగం. మా బాబాయి వాళ్లది నెల్లూరు జిల్లాలోని కావలి. పరీక్షలు అయిపోగానే ప్రతి వేసవికి కావలి వెళ్లిపోయేవాళ్లం. మా కోసం చిన్నమ్మ బోలెడు పిండివంటలు చేసి ఉంచేది. కొత్తబట్టలు కుట్టించి ఉంచేవారు. రోజూ మామిడిపండ్లు.. ఎంత తిన్నా ఇంకా తినాలపించే తియ్యటి రుచి వాటిది. సాయంత్రం ఐస్‌క్రీమ్ బండి దగ్గర ఐస్ప్రూట్ కొనాల్సిందే! కాసేపు ఆటలు. ఆ తర్వాత సోంపాపిడి. అటూ ఇటూ చూస్తే ఒక చిన్నగల్లీలో ఓ ముసలావిడ పులిబొంగరాలు చేసేది. వాటి రుచి ఇప్పుడు తలుచుకున్నా నోట్లో నీళ్లూరాల్సిందే! నోటికి ఖాళీ, కాళ్లకు అలసట ఉండేదే కాదు. అంత సంబరం వేసవి అంటే!! సినిమాకు వెళ్లేటప్పుడైతే పెద్ద పండగే! అప్పుడన్నీ సైకిల్ రిక్షాలు. రెండు, మూడు సైకిల్ రిక్షాల మీద అంతా కలిసి సినిమాకు వెళ్లేవాళ్లం. సెలవులు అయిపోయాక మళ్లీ వేసవి కోసం ఎదురుచూస్తూ విశాఖపట్టణం చేరేవాళ్లం. అప్పుడప్పుడు వేసవికి మా చిన్నమ్మ వాళ్ల కుటుంబం వచ్చేది. వస్తూ వస్తూ చిన్నమ్మ సున్నుండలు తెచ్చేది. రోజూ సాయంత్రం అందరం కలిసి బీచ్‌కి వెళ్లేవాళ్లం. మా ఇల్లు ఆంధ్రా యూనివర్శిటీకి దగ్గరి కాలనీలో ఉండేది. కాలనీలోనే పార్క్.. అందులో పేద్ద మామిడిచెట్టు. మా స్నేహితులతో కలిసి అక్కడే కోతికొమ్మచ్చి ఆటలు ఆడేవాళ్లం. మామిడికాయలు కోసి ఉప్పు-కారం పెట్టి తినేవాళ్లం. అక్కడ ఏర్పాటుచేసిన రేడియో నుంచి క్రికెట్ కామెంట్రీ వింటూ మేమూ క్రికెట్ ఆడేవాళ్లం. రాత్రి పూట మేడపైన కూర్చొని ఆకాశంలోకి చూస్తూ నక్షత్రాలు లెక్కపెట్టేవాళ్లం. బోలెడన్ని కథ లు చెప్పుకునేవాళ్లం. అప్పుడు ఎక్కువగా విషయాలు వినడం వల్ల ఎక్కువగా ఊహించుకోవడం ఉండేది. అదే నేను సృజనాత్మక రంగంలోకి అడుగుపెట్టడానికి దోహదపడింది. జీవితకాలంలో చిన్నప్పటి వేసవి సెలవుల ఆనందాన్ని లెక్కేస్తే అత్యంత స్వల్పం. కానీ అదే జీవితాంతం వెంట వచ్చే ఓ తీపి జ్ఞాపకం. సృజనకు అతి పెద్ద వేదిక వేసవి.’’ -
గీత స్మరణం
అతడు: ఏమో ఎక్కడుందో కూసే కోయిల... నాతో ఏవిటందో ఊహించేదెలా ఎదలో ఊయల ఊగే సరిగమ ఏదో మాయలా అల్లే మధురిమ ఆమె: లలలా లాలలా లాలాలాలలా (2) పల్లవి : అతడు: నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా ఆమె: ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా ఊ... అంటానుగా అ: మనమే చూడగా ఎవరూ లేరుగా మనసే పాడగా అడ్డే లేదుగా చరణం : 1 అ: ఇద్దరికీ ఒద్దిక కుదరగ ఇష్టసఖి వద్దని బెదరక ఆ: సిద్ధపడే పద్ధతి తెలియక తలొంచి తపించు తతంగమడగక ॥ఉన్న॥ చరణం : 2 ఆ: రెప్పలలో నిప్పుల నిగనిగ నిద్దరనే పొమ్మని తరమగ అ: ఇప్పటికో ఆప్తుడు దొరకగ వయ్యారి వయస్సు తయారైందిగా ॥ఉన్న॥ పల్లవి : ఆమె: వయసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలిపాఠం అతడు: సొగసా చేరుకో వరసే అందుకో నీకిది తొలిగీతం ఆ: ఆగనన్నది ఆశ ఎందుకో తెలుసా? అ: ఓ... ఊహకందని భాష నేర్చుకో మనసా ఆ: ఓ... సామిరారా ప్రేమంటే ఇదేరా! అ: నా సితార ప్రేమంటే ఇదేరా..! ॥ చరణం : 1 ఆ: రేయిభారం రెట్టింపయ్యింది లేవయ్యారం నిట్టూరుస్తుంది అ: రాయబారం గుట్టే చెప్పంది హాయి బేరం గిట్టేలాగుంది ఆ: మాయలేని ప్రేమంటే ఇదేరా! అ: సాయమడిగే ప్రేమంటే ఇదేరా..! ॥ చరణం : 2 అ: తేనె మేఘం కాదా నీ దేహం వానరాగం కోరే నా దాహం ఆ: గాలివేగం చూపే నీమోహం తాకగానే పోదా సందేహం అ: ప్రాణముంది ప్రేమంటే ఇదేరా! ఆ: ప్రాయమంది ప్రేమంటే ఇదే... ॥ చిత్రం : ప్రేమంటే ఇదేరా (1998), రచన : సిరివెన్నెల సంగీతం : రమణగోగుల, గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర -
వందో తప్పు చేయకుండా..?
‘‘శిశుపాలుడు వంద తప్పులు చేస్తే శ్రీకృష్ణుడు శిక్షిస్తాడు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని తయారు చేసిన కథ ఇది’’ అన్నారు మేర్లపాక గాంధీ. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సందీప్‌కిషన్ హీరోగా కిరణ్ నిర్మించిన చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘వంద తప్పులు చేస్తే కొడుకుని ఇంట్లోంచి పంపించడానికి రెడీగా ఉంటాడు ఓ తండ్రి. 99 తప్పులు చేసిన ఆ కొడుకు ఒక్క తప్పు చెయ్యకుండా ఉండటానికి ఏం చేశాడు? అనే కథతో ఈ చిత్రం సాగుతుంది. కిరణ్‌గారు ఈ కథ వెంటనే సినిమా చేద్దామన్నారు. ఛోటాగారు కూడా ఈ కథ విని బాగా ఎంజాయ్ చేశారు. ఈ కథలో ఎగ్జయిట్మెంట్ ఉంది కాబట్టే, వీరితో పాటు ఇతర చిత్రబృందానికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నన్ను, కథను నమ్మి సందీప్ ఈ చిత్రం అంగీకరించాడు. రమణ గోగులగారు స్వరపరచిన పాటలు విజయం సాధించాయి. మూడు పాటలూ సందర్భానుసారంగా సాగుతాయి. కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు. -
తమాషా సినిమా ప్రారంభోత్సవం
‘ఈరోజుల్లో’ ఫేం శ్రీ, నీలం ఉపాధ్యాయ, సునీత మార్షియా ప్రధాన పాత్రధారులుగా శ్రీనివాస్ బల్లా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తమాషా’. ఎం.విజయవర్దన్‌రావు, శివారెడ్డి నీలపు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి రమణ గోగుల కెమెరా స్విచాన్ చేయగా, శ్రీకాంత్ అడ్డాల క్లాప్ ఇచ్చారు. అనిల్‌కుమార్ యాదవ్ గౌరవ దర్శకత్వం వహించారు.