గీత స్మరణం | Today song premante idera | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Mon, Dec 30 2013 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM

గీత స్మరణం

గీత స్మరణం

అతడు: ఏమో ఎక్కడుందో కూసే కోయిల...
 నాతో ఏవిటందో ఊహించేదెలా
 ఎదలో ఊయల ఊగే సరిగమ
 ఏదో మాయలా అల్లే మధురిమ
 ఆమె: లలలా లాలలా లాలాలాలలా     (2)
 పల్లవి : అతడు: నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
 నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా
 ఆమె: ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా
 సరదా తీరగా ఊ... అంటానుగా
 అ: మనమే చూడగా ఎవరూ లేరుగా
 మనసే పాడగా అడ్డే లేదుగా
 
 చరణం : 1
 
 అ: ఇద్దరికీ ఒద్దిక కుదరగ ఇష్టసఖి వద్దని బెదరక
 ఆ: సిద్ధపడే పద్ధతి తెలియక
   తలొంచి తపించు తతంగమడగక    ॥ఉన్న॥


 చరణం : 2


 ఆ: రెప్పలలో నిప్పుల నిగనిగ నిద్దరనే పొమ్మని తరమగ
 అ: ఇప్పటికో ఆప్తుడు దొరకగ
   వయ్యారి వయస్సు తయారైందిగా    ॥ఉన్న॥
 
 పల్లవి :
 
 ఆమె: వయసా చూసుకో చెబుతా రాసుకో
   ఈడుకి తొలిపాఠం
 అతడు: సొగసా చేరుకో వరసే అందుకో
   నీకిది తొలిగీతం
 ఆ: ఆగనన్నది ఆశ ఎందుకో తెలుసా?
 అ: ఓ... ఊహకందని భాష నేర్చుకో మనసా
 ఆ: ఓ... సామిరారా ప్రేమంటే ఇదేరా!
 అ: నా సితార ప్రేమంటే ఇదేరా..!    ॥
 
 చరణం : 1
 
 ఆ: రేయిభారం రెట్టింపయ్యింది
   లేవయ్యారం నిట్టూరుస్తుంది
 అ: రాయబారం గుట్టే చెప్పంది
   హాయి బేరం గిట్టేలాగుంది
 ఆ: మాయలేని ప్రేమంటే ఇదేరా!
 అ: సాయమడిగే ప్రేమంటే ఇదేరా..!     ॥
 చరణం : 2 అ: తేనె మేఘం కాదా నీ దేహం
   వానరాగం కోరే నా దాహం
 ఆ: గాలివేగం చూపే నీమోహం
   తాకగానే పోదా సందేహం
 అ: ప్రాణముంది ప్రేమంటే ఇదేరా!
 ఆ: ప్రాయమంది ప్రేమంటే ఇదే...    ॥
 
 చిత్రం : ప్రేమంటే ఇదేరా (1998), రచన : సిరివెన్నెల
 సంగీతం : రమణగోగుల, గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement