
ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ కీలక పాత్రల్లో నటించిన సినిమా "నారి". మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి.. ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో 13-20 ఏళ్ల పిల్లలు ప్రమాదంలో ఉన్నారనే విషయాన్ని చెబుతూ దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. "నారి" సినిమా (Naari: The Women) మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న విడుదల కానుంది.
బుధవారం (ఫిబ్రవరి 26న) మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ సినిమా నుంచి 'గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే' పాట (Na Gunde Lona Song)ను రిలీజ్ చేశారు. వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డిపై ఈ పాటను చిత్రీకరించారు. రీసెంట్‌గాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని గోదారి గట్టు మీద.. పాటతో సెన్సేషన్ సృష్టించిన రమణ గోగుల 'గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే' పాటను పాడటం విశేషం. వినోద్ కుమార్ విన్ను ఈ పాటను బ్యూటిఫుల్‌గా కంపోజ్ చేశారు.
మహిళా సాధికారత గొప్పదనం చెప్పే కథాంశంతో తెరకెక్కుతున్న "నారి" సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన 'ఈడు మగాడేంట్రా బుజ్జి..', 'నిశిలో శశిలా..' సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. 'గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే' పాట కూడా అందర్నీ అలరించనుంది. ఆర్పీ పట్నాయక్, సునీత, చిన్మయి శ్రీపాద వంటి పేరున్న గాయనీ గాయకులు "నారి" చిత్రంలోని సాంగ్స్ పాడారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment