Naari Movie
-
నారి:చిన్మయి నోట స్త్రీ శక్తిని చాటే పాట
ఓ విద్యార్థిని తన టీచర్‌తో అమ్మాయిలు ఈ సమాజంలో ఎదుర్కొనే కష్టాలు, సమస్యల గురించి చెబుతూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో 7 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ క్లిప్ నారి చిత్రంలోనిదే అని తెలుసుకుని స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేసి చిత్రయూనిట్‌ను మెచ్చుకున్న సంగతి తెలిసిందే. హైకోర్టు జస్టిస్ శ్రీమతి రాధారాణి గారు, ఐఏఎస్ పూనం మాలకొండయ్య, ఐపీఎస్ జయచంద్ర గార్ల చేతుల మీదుగా ర్యాప్ సింగర్ సీషోర్ పాడిన ‘ఈడు మగాడేంట్రా బుజ్జి’ పాట 8 మిలియన్ల వ్యూస్‌తో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.షి ఫిల్మ్స్, హైదరాబాద్ స్టూడియోస్ బ్యానర్ల మీద శ్రీమతి శశి వంటిపల్లి నిర్మాతగా సూర్య వంటిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘నారి’. ఈ చిత్రంలో ఆమని, వికాస్ వశిష్ట, మౌనిక రెడ్డి, కార్తికేయ దేవ్, ప్రగతి, సునయన, ప్రమోదిని, నిత్య శ్రీ, కేదార్ శంకర్, రాజమండ్రి శ్రీదేవీ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.మహిళా దినోత్సవం సందర్భంగా నారి చిత్రాన్ని మార్చి 7న రిలీజ్ చేయబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే శనివారం(ఫిబ్రవరి 15 ) సాయంత్రం నారి చిత్రం నుంచి ఓ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను చిన్మయి శ్రీపాద ఆలపించారు. వినోద్ కుమార్ విన్ను బాణీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. మహిళా సాధికారత, స్త్రీ శక్తిని చాటేలా ఈ పాటను ప్రసాద్ సానా రచించారు.పాట విడుదల సందర్భంగా దర్శకుడు సూర్య వంటిపల్లి మాట్లాడుతూ.. ‘ఎప్పుడూ ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు, మహిళల సమస్యల మీద తీస్తున్న చిత్రాలను ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. ఈ చిత్రంలో ఆమని గారి నట విశ్వరూపం చూస్తారు. క్లైమాక్స్ కంటతడి పెట్టించేలా ఉంటుంది. అందరినీ ఆలోచింపజేసేలా ఈ సినిమా ఉంటుంద’ని అన్నారు.నిర్మాత శశి వంటిపల్లి మాట్లాడుతూ.. ‘షి ఫిల్మ్, హైదరాబాద్ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాం. ప్రతీ పురుషుడు తన ఫ్యామిలీనీ తీసుకు వచ్చి ఈ చిత్రాన్ని చూపించాలి. అందరూ చూడాల్సిన చిత్రమిది’ అని అన్నారు. -
మహిళల్ని గౌరవించాలనే గొప్ప కాన్సెప్ట్‌తో ‘నారి’
ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా "నారి". మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్ తో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. "నారి" సినిమా 2025, జనవరి 24వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగాదర్శకుడు సూర్య వంటిపల్లి మాట్లాడుతూ - అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మంచి ఫ్యామిలీ డ్రామా కథతో "నారి" సినిమాను రూపొందించాము. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 24న గ్రాండ్ గా థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. మా సినిమాలో ప్రముఖ సంగీత దర్శకులు రమణ గోగుల, ఆర్పీ పట్నాయక్ మా "నారి" సినిమాకు తమ వాయిస్ అందించారు. మహిళా సాధికారత మీద రూపకల్పన చేసిన పాటను ప్రముఖ సింగర్ చిన్మయి అద్భుతంగా పాడారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న సీషోర్ అనే యువకుడు ఒక మంచి పాట పాడారు. మా "నారి" సినిమా ఆడియో దివో కంపెనీ ద్వారా త్వరలోనే రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. మహిళల్ని గౌరవించాలనే గొప్ప కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మహిళల పట్ల మనం ఎలా వ్యవహరించాలి. వారికి ఎలా సపోర్ట్ చేయాలనే అంశాలు ప్రతి ఒక్క ప్రేక్షకుడినీ ఆకట్టుకుంటాయి. "నారి" సినిమా ఘన విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. అన్నారు. -
సీతక్క చేతుల మీదుగా "నారి" సినిమా పోస్టర్ రిలీజ్ (ఫొటోలు)
-
‘నారి’ లాంటి సినిమాలు రావాలి: మంత్రి సీతక్క
ఆమని, వికాస్ వశిష్ఠ,మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా నారి. మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్ తో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నారి సినిమా డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క ఈ సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ .. మహిళలు ఎన్నో రంగాల్లో ఎదుగుతున్నారు. అయినా వారి పట్ల వివక్ష, చిన్నచూపు తగ్గడం లేదు. సమాజ నిర్మాతలు మహిళల అనే నిజాన్ని మనమంతా గుర్తుపెట్టుకోవాలి. ఆడ పిల్లలు ఎదిగేందుకు ప్రతి ఒక్కరు తోడ్పాడు అందించాలి. మహిళల్ని గౌరవించాలి. ఇలాంటి గొప్ప కాన్సెప్ట్ తో నారి సినిమా చేసిన సూర్య వంటిపల్లి గారికి అభినందనలు. ఈ సినిమా పోస్టర్, గ్లింప్స్ నా చేతుల మీదుగా విడుదల చేసుకోవడం సంతోషంగా ఉంది. నారి సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి. మహిళల గురించి వారి మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అన్నారు. ‘మహిళల పట్ల మనం ఎలా వ్యవహరించాలి. వారికి ఎలా సపోర్ట్ చేయాలనే మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాను’ అన్నారు దర్శకుడు సూర్య వంటిపల్లి.