నారి:చిన్మయి నోట స్త్రీ శక్తిని చాటే పాట | Women Empowerment Song Out From Naari Movie | Sakshi
Sakshi News home page

నారి:చిన్మయి నోట స్త్రీ శక్తిని చాటే పాట

Feb 16 2025 5:30 PM | Updated on Feb 16 2025 5:30 PM

Women Empowerment Song Out From Naari Movie

 ఓ విద్యార్థిని తన టీచర్‌తో అమ్మాయిలు ఈ సమాజంలో ఎదుర్కొనే కష్టాలు, సమస్యల గురించి చెబుతూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో 7 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ క్లిప్ నారి చిత్రంలోనిదే అని తెలుసుకుని  స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క గ్లింప్స్, టీజర్‌ రిలీజ్ చేసి చిత్రయూనిట్‌ను మెచ్చుకున్న సంగతి తెలిసిందే. హైకోర్టు జస్టిస్ శ్రీమతి రాధారాణి గారు, ఐఏఎస్ పూనం మాలకొండయ్య, ఐపీఎస్ జయచంద్ర గార్ల చేతుల మీదుగా ర్యాప్ సింగర్ సీషోర్ పాడిన ‘ఈడు మగాడేంట్రా బుజ్జి’ పాట 8 మిలియన్ల వ్యూస్‌తో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.

షి ఫిల్మ్స్, హైదరాబాద్ స్టూడియోస్ బ్యానర్ల మీద శ్రీమతి శశి వంటిపల్లి నిర్మాతగా సూర్య వంటిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘నారి’. ఈ చిత్రంలో ఆమని, వికాస్ వశిష్ట, మౌనిక రెడ్డి, కార్తికేయ దేవ్, ప్రగతి, సునయన, ప్రమోదిని, నిత్య శ్రీ, కేదార్ శంకర్, రాజమండ్రి శ్రీదేవీ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.మహిళా దినోత్సవం సందర్భంగా నారి చిత్రాన్ని మార్చి 7న రిలీజ్ చేయబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే శనివారం(ఫిబ్రవరి 15 ) సాయంత్రం నారి చిత్రం నుంచి ఓ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను చిన్మయి శ్రీపాద ఆలపించారు. వినోద్ కుమార్ విన్ను బాణీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. మహిళా సాధికారత, స్త్రీ శక్తిని చాటేలా ఈ పాటను ప్రసాద్ సానా రచించారు.

పాట విడుదల సందర్భంగా దర్శకుడు సూర్య వంటిపల్లి మాట్లాడుతూ.. ‘ఎప్పుడూ ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు, మహిళల సమస్యల మీద తీస్తున్న చిత్రాలను ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. ఈ చిత్రంలో ఆమని గారి నట విశ్వరూపం చూస్తారు. క్లైమాక్స్ కంటతడి పెట్టించేలా ఉంటుంది. అందరినీ ఆలోచింపజేసేలా ఈ సినిమా ఉంటుంద’ని అన్నారు.

నిర్మాత శశి వంటిపల్లి మాట్లాడుతూ.. ‘షి ఫిల్మ్, హైదరాబాద్ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాం. ప్రతీ పురుషుడు తన ఫ్యామిలీనీ తీసుకు వచ్చి ఈ చిత్రాన్ని చూపించాలి. అందరూ చూడాల్సిన చిత్రమిది’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement