మహిళల్ని గౌరవించాలనే గొప్ప కాన్సెప్ట్‌తో ‘నారి’ | Naari Movie Release Date Out | Sakshi
Sakshi News home page

మహిళల్ని గౌరవించాలనే గొప్ప కాన్సెప్ట్‌తో ‘నారి’.. రిలీజ్‌కి రెడీ!

Published Tue, Dec 24 2024 10:46 AM | Last Updated on Tue, Dec 24 2024 11:18 AM

Naari Movie Release Date Out

ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా "నారి". మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్ తో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. "నారి" సినిమా 2025, జనవరి 24వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా

దర్శకుడు సూర్య వంటిపల్లి మాట్లాడుతూ - అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మంచి ఫ్యామిలీ డ్రామా కథతో "నారి" సినిమాను రూపొందించాము. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 24న గ్రాండ్ గా థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. మా సినిమాలో ప్రముఖ సంగీత దర్శకులు రమణ గోగుల, ఆర్పీ పట్నాయక్ మా "నారి" సినిమాకు తమ వాయిస్ అందించారు. 

మహిళా సాధికారత మీద రూపకల్పన చేసిన పాటను ప్రముఖ సింగర్ చిన్మయి అద్భుతంగా పాడారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న సీషోర్ అనే యువకుడు ఒక మంచి పాట పాడారు. మా "నారి" సినిమా ఆడియో దివో కంపెనీ ద్వారా త్వరలోనే రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. మహిళల్ని గౌరవించాలనే గొప్ప కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మహిళల పట్ల మనం ఎలా వ్యవహరించాలి. వారికి ఎలా సపోర్ట్ చేయాలనే అంశాలు ప్రతి ఒక్క ప్రేక్షకుడినీ ఆకట్టుకుంటాయి. "నారి" సినిమా ఘన విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. అన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement