aamani
-
మీరు ఒక్కరే రండి అనేవారు.. నాకు అర్థమయ్యేది కాదు: ఆమని
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమని. తెలుగులో జంబలకిడిపంబ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్లాం సినిమాలో ఆమనికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకుంది. తెలుగుతో పాటు తమిళంలో చాలా సినిమాల్లో నటించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమని.. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ నటనలో అడుగుపెట్టింది. ఈ ఏడాదిలో వినరో భాగ్యము విష్ణుకథ, అల్లంత దూరాన చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమని కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. (ఇది చదవండి: చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందంటే?) ఆమని మాట్లాడుతూ..'హీరోయిన్లలకు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయి. అప్పుడు సోషల్ మీడియా లేదు. అందుకే ఎవరికీ తెలియకపోయేది. ఏ వృత్తిలోనైనా సరే మంచి, చెడు రెండు ఉంటాయి. హీరోయిన్స్‌గా అది మనం డెసిషన్ తీసుకోవాలి. తమిళంలో ఇలాంటి పరిస్థితి నాకు ఎదురైంది. కొన్ని చిన్న సంస్థల్లో ఇలాంటివీ జరిగేవి. నాకు ఒకసారి స్విమ్మింగ్ పూల్ సీన్ కోసమని డ్రెస్సు తీసి ఏమైనా స్ట్రెచ్ మార్కులు ఉన్నాయేమో చూడాలి అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఇలాంటి వారు కేవలం వాటి కోసమే వస్తారు. నేను వెంటనే అలాంటి క్యారెక్టర్‌ను వద్దనేదాన్ని. ఈ విషయంలో హీరోయిన్స్ వ్యక్తిగత నిర్ణయం. మనం ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కొందరు అడ్వాన్స్ ఇచ్చినా వెంటనే ఫోన్ చేసేవారు. డైరెక్టర్ స్టోరీ గురించి మాట్లాడాలన్నారు. మీరు రావాలంటా అని మేనేజర్ ఫోన్ చేసేవారు. కానీ ఈ విషయాలు నాకు చాలా రోజులకు అర్థమయ్యేవి. ' అని అన్నారు. ఆమని ఓ సంఘటనపై మాట్లాడుతూ..' అప్పుడు సెల్‌ఫోన్స్ లేవు కదా. డైరెక్ట్‌గా మేనేజర్ వచ్చి మాట్లాడేవారు. డైరెక్టర్ స్టోరీ గురించి మాట్లాడాలని అన్నారు. అది కూడా ఓ బీచ్ దగ్గర అని చెప్పారు. అక్కడికి మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. ఫైనాన్షియర్ వస్తున్నారు మిమ్మల్ని చూడాలంటా అన్నారు. అసలు ఫైనాన్షియర్ నన్ను ఎందుకు చూడాలి? డైరెక్టర్, నిర్మాత చూస్తే చాలు కదా. ఇంకా ఎక్కువ అనుకుంటే హీరో చూడాలి. ఎందుకంటే ఆయన పక్కన నటించేవారు కాబట్టి తప్పదు. కానీ ఫైనాన్షియర్ చూడటమేంటి? అని అనుమానం వచ్చేది. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది. ఒక్కోసారి మమ్మీ వద్దండీ.. మీరు మాత్రమే రండి అని కారు తీసుకొచ్చే వారు. అక్కడే నాకు వారి మైండ్‌సెట్ అర్థమయ్యేది. ఐ యామ్ సారీ.. నేను రాను అని చెప్పేదాన్ని. ' అంటూ సమామాధానమిచ్చింది. (ఇది చదవండి: భార్యతో స్టార్ హీరో విడాకులు.. కానీ మామతో ప్రత్యేక అనుబంధం!) -
‘నారాయణ & కో’ మూవీ రివ్యూ
టైటిల్: ‘నారాయణ & కో’ నటీనటులు: సుధాకర్ కోమకుల, ఆర్తిపొడి, దేవి ప్రసాద్, ఆమని, పూజ కిరణ్, సప్తగిరి తదితరులు నిర్మాత: పాపిశెట్టి బ్రదర్స్, సుధాకర్ కోమకుల దర్శకత్వం: చిన్నా పాపిశెట్టి సంగీతం: సురేశ్ బొబ్బిలి, డాక్టర్ జోస్యభట్ల, నాగవంశి, జోశ్యభట్ల శర్మ సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాస్తవ్ విడుదల తేది: జూన్ 30, 2023 కథేంటంటే.. నారాయణ(దేవి ప్రసాద్), జానకి(ఆమని) మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు. నారాయణ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. పెద్ద కొడుకు ఆనంద్(సుధాకర్ కోమకుల) క్యాబ్ డ్రైవర్. క్రికెట్లో బెట్టింగ్ పెడుతుంటాడు. దీంతో అతనికి రూ.10 లక్షల వరకు అప్పు అవుతుంది. చిన్న కొడుకు సుభాష్ (జై కృష్ణ) కెమెరామెన్. ఓ చావు ఇంటికి ఫోటోలు తీయడానికి వెళ్లి ఓ అమ్మాయిని పరిచయం చేసుకుంటాడు. వారిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోని పంపి, రూ. 10 లక్షలు ఇవ్వకుంటే ఆది వైరల్ చేస్తానని బెదిరిస్తాడు ఓ అజ్ఞాత వ్యక్తి. మరోవైపు నారాయణ పని చేసే బ్యాంకులో రూ.25 లక్షల దొంగతనం జరుగుంది. అది నారాయణ మీదకు వస్తుంది. రూ.25 లక్షలు తిరిగి ఇవ్వకుంటే పోలీసు కేసు పెడతానని మేనేజర్ బెదిరిస్తాడు. దీంతో నారాయణ ఫ్యామిలీ అంతా డబ్బు కోసం ఎవరినైనా కిడ్నాప్ చేయాలని భావిస్తారు. నారాయణ మేనకోడలు నళిని(పూజా కిరణ్)తో కలిసి కిడ్నాప్‌కి ప్లాన్ చేస్తే వర్కౌట్ కాదు. ఇదే సమయంలో వారికి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న రౌడీ శంకర్(తోటపల్లి మధు) తరపున ఓ డీల్ వస్తుంది. ముంబైకి వెళ్లి ఓ పిల్లి బొమ్మను తీసుకువస్తే.. రూ. కోటి ఇస్తామని ఆఫర్ ఇస్తారు. దీంతో నారాయణ ఫ్యామిలీ వెంటనే ఆ డీల్ ఒప్పుకుంటారు. మరి ఒప్పందం ప్రకారం పిల్లి బొమ్మను నారాయణ& కో తీసుకొచ్చిందా? పిల్లి బొమ్మను తీసుకొచ్చే క్రమంలో నారాయణ ఫ్యామిలీకి ఎదురైన సమస్యలు ఏంటి? అసలు ఆ పిల్లి బొమ్మలో ఏం ఉంది? బ్యాంకులో డబ్బులు కొట్టేసింది ఎవరు? సుభాష్‌ని బ్లాక్ మెయిల్ చేస్తున్నదెవరు? ఎస్సై అర్జున్(అలీ రెజా) వారిని ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ. విశ్లేషణ అనుకోకుండా వచ్చిన ఆర్థిక సమస్యల నుంచి బయట పడేందుకు ఓ కుటుంబం అంతా కలిసి చేసే తింగరి పనులే ‘నారాయణ అండ్ కో మూవీ కథ. అందుకే ఈ చిత్రానికి ‘ది తిక్కల్ ఫ్యామిలీ ’ట్యాగ్ లైన్ పెట్టారు. దానికి తగ్గట్టే కథనం సాగుతుంది. కానీ ప్రతి సన్నివేశం గత సినిమాలను గుర్తుకు తెస్తుంది. కథ-కథనంలో ఎలాంటి కొత్తదనం లేకపోగా చాలా వరకు సీన్స్ బోర్ గా కొనసాగుతాయి. నారాయణ ఫ్యామిలీ పాత్రల పరిచయాలతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరోహీరోయిన్లు పబ్‌లో కలసుకోవడం.. ప్రెగ్నెంట్ అయ్యానంటూ పెళ్లి చేసుకోవడం.. చకచకా జరిగిపోతుంది. అయితే హీరోపై హీరోయిన్‌కి లవ్ పుట్టే రీజన్ కన్విసింగ్‌గా అనిపించలేదు. కొన్ని కామెడీ సన్నివేశాలతో ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇక సెకండాఫ్ మాత్రం రొటీన్‌గా సాగుతుంది. కథ-కథనమే బోరింగ్ అనుకుంటే.. సంబంధం లేకుండా వచ్చే పాటలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. ఓవరాల్‌గా ‘నారాయణ అండ్ కో’ ప్రేక్షకులను నవ్వించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయింది. ఎవరెలా చేశారంటే.. ఆనంద్ పాత్రకు సుధాకర్ న్యాయం చేశాడు. ఈ సినిమాలో డ్యాన్స్ కూడా అదరగొట్టాడు. హీరో తమ్ముడు సుభాష్‌గా జైకృష్ణ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కొత్తదనం ఎంటంటే.. దేవీ ప్రసాద్, ఆమని పూర్తిగా కామెడీ రోల్ ప్లే చేయడం. నారాయణగా దేవీ ప్రసాద్, జానకిగా ఆమని చేసే కొన్ని కామెడీ సీన్స్ అలరిస్తాయి. సినిమాలో వీరిద్దరికే ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. ఎస్సై అర్జున్‌గా అలీ రెజా, ప్రీతిగా ఆర్తిలు ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే వీరి పాత్రల నిడివి చాలా తక్కువ. సప్తగిరి కామెడీ వర్కౌట్ కాలేదు. పూజ కిరణ్, తోటపల్లి మధుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాకొస్తే సురేశ్ బొబ్బిలి, డాక్టర్ జోస్యభట్ల, నాగవంశి, జోశ్యభట్ల శర్మ సంగీతం పర్వాలేదు. ‘దండక డన్ డన్’ మినహా మిగతా పాటలేవి ఆకట్టుకోలేవు. బీజీఎం ఓకే. రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాత విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
‘నారాయణ & కో’ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ సినిమాలో నిజంగానే నాతో బీర్ తాగించారు: ఆమని
నటి ఆమని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో శుభలగ్నం, మావిడాకులు, మిస్టర్ పెళ్ళాం.. వంటి సినిమాల్లోని ఆమె పాత్రల్లో ఎప్పటికీ గుర్తిండిపోతాయి. అనేక హిట్ చిత్రాల్లో నటించి సహజమైన తన నటనతో అందరి మన్ననలు అందుకున్నారు. కెరీర్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సినిమాల నుంచి తప్పుకొని వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయారు. అయితే చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమని ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ఫస్ట్ మూవీ ‘జంబలకిడి పంబ’ షూటింగ్‌లోని ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. ఈ సినిమాలో మందుకొట్టే సీన్ ఉంటుందని డైరెక్టర్ ముందు నాకు చెప్పలేదు. డైరెక్ట్‌గా షూటింగ్ స్పాట్‌కు వెళ్లాక ఆ సీన్ చేయాలన్నారు. బాటిల్లో ఏదైనా కూల్‌డ్రింక్ కలిపి ఇస్తారేమో అనుకున్నా. కానీ నిజంగానే బీర్ ఇచ్చి జస్ట్ ఒక సిప్ చేయమన్నారు. అప్పుడు హీరో నరేష్ కూడా ఏం కాదమ్మ తాగు అని అన్నారు. అలా మొదటి సినిమాలోనే మందుతాగే సీన్ చేశాను అంటూ చెప్పుకొచ్చారు. -
డైరెక్టర్ నన్ను ఒంటరిగా రమ్మన్నాడు: ఆమని
కలలు అందరూ కంటారు, కానీ కొందరే అది నెరవేర్చుకునేందుకు కృషి చేస్తారు, అందులో కొందరే సఫలీకృతులవుతారు. ఆ కొద్దిమందిలో నటి ఆమని ఒకరు. నటి అవ్వాలనుకున్న ఆమె ఒడిదుడుకులెదురైనా జంకలేదు. పట్టు వీడకుండా తన ప్రయత్నాలు కొనసాగించింది. చివరకు నటిగా ఛాన్స్ పట్టేయడమే కాదు, తన యాక్టింగ్ స్కిల్స్‌తో అద్భుత నటిగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. 'ఇండస్ట్రీలోకి రావడానికి నేను కూడా ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాను. ఆడిషన్స్ కోసం కంపెనీలకు వెళ్లేదాన్ని. కొన్ని కంపెనీల్లో సెలక్ట్ అయ్యేదాన్ని. కొన్నింటిలో రిజెక్ట్ చేసేవాళ్లు. అయితే కొందరు చెప్పి పంపిస్తామనేవాళ్లు. అంటే ఏంటో మొదట నాక్కూడా అర్థం కాలేదు. మేడమ్, డైరెక్టర్‌గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పేవాళ్లు. ఎందుకు? అని అడిగితే మేకప్ టెస్ట్ చేయాలంట అని చెప్పారు. సరే, అమ్మతో కలిసి వస్తా అన్నాను. ఆయన మాత్రం అమ్మగారు వద్దు, మీరు ఒంటరిగా రావాలి అన్నాడు. వెంటనే అమ్మ.. తను ఒంటరిగా రాదు, ఇద్దరం కలిసే వస్తామని చెప్పింది. దీంతో ఆయన వద్దులెండి, డైరెక్టర్ గారు వద్దంటున్నారు అని ఫోన్ కట్ చేసేవాళ్లు. నాకు పోనుపోనూ అర్థమైంది. అమ్మ లేకుండా నన్నొక్కదాన్నే ఎందుకు రమ్మంటున్నారో తర్వాత తెలిసొచ్చింది. ఇలా చాలా జరిగాయి. కానీ ఎక్కడా నేను కాంప్రమైజ్ కాలేదు. అడ్డదారిలో సినిమాల్లోకి రావడం నాకిష్టం లేదు. అందుకే వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికి రెండేళ్లు పట్టింది' అని క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని చెప్పుకొచ్చింది ఆమని. చదవండి: కొన్ని అంగుళాల దూరంలో నా చావు కనిపించింది: ఆమని -
‘నువ్వే కావాలి అమ్మ’ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సాంగ్ షూటింగ్.. నా కళ్లముందే మంటల్లో కాలిపోయాడు: ఆమని
అమ్మదొంగ, మిస్టర్ పెళ్లాం, శుభలగ్నం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది ఆమని. ఒకప్పుడు హీరోయిన్గా వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం హీరోహీరోయిన్ల తల్లి, అత్త పాత్రల్లో నటిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కళ్లముందు జరిగిన ఘోరాన్ని చెప్పుకొచ్చింది. 'నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇది. కెమెరామన్ లోక్ సింగ్ గారు నా కళ్లముందే మంటల్లో కాలిపోయారు. ఆ రోజు జూబ్లీహిల్స్‌లో ఓ పాట షూట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద బండలపై పెట్రోల్ పోశారు. ఆ మంటల మధ్యలో మేము డ్యాన్స్ చేస్తున్నాం. లోక్‌నాధ్‌గారు పైన క్రేన్‌లో ఉన్నారు. ఫస్ట్ టేక్ ఓకే అయింది. కానీ ఆయనకు మంటలు ఇంకాస్త ఎక్కువుండాలంటూ వన్ మోర్ అన్నాడు. అప్పుడు చలికాలం కావడంతో మేము దుప్పటి పట్టుకుని ఓ పక్కన కూర్చున్నాం. తిరిగి లొకేషన్లో మంటలు అంటిస్తున్నారు. ఆ క్రేన్‌లో ఉన్న వ్యక్తి కిందకు దిగి వచ్చి మీరు సరిగా పెట్రోల్ పోయడం లేదంటూ చెంబు అందుకున్నాడు. ఓ బండపైన పెట్రోల్ పోశాడు. అంతే ఆ పక్కనున్న ఫైర్ ఒక్కసారిగా లేచి ఈయనకు కూడా మంటలంటుకున్నాయి. మా కళ్ల ముందే ఆయన నిలువునా కాలిపోయాడు. మరణం ఆయన్ను పిలిచింది. లేదంటే ఎక్కడో కూర్చున్న వ్యక్తి పెట్రోల్ పోయడమేంటి? అది అంటుకోవడమేంటి? చాలా భయంకరమైన మరణమిది' అని గుర్తు చేసుకుంది ఆమని. చదవండి: ఆ ఒక్క సినిమా వల్ల నేను హీరోయిన్ కాలేకపోయా -
సౌందర్య బదులు నేను చనిపోయినా బాగుండేదనుకున్నా: ఆమని
సీనియర్ నటి ఆమని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకం పరిచయం అక్కర్లేని పేరు. 'జంబలకిడిపంబ’ ,‘మిస్టర్ పెళ్లాం’, ‘శుభలగ్నం’ వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఆమని ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో తల్లి, అత్త పాత్రల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఇక దివంగత హీరోయిన్ సౌందర్యకు ఆమని బెస్ట్‌ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆమె సౌందర్యపై తనకున్న ప్రేమను మరోసారి బయటపెట్టింది. 'సౌందర్య చనిపోయింది అని విన్నప్పుడు నా గుండె ముక్కలైపోయింది. దేవుడ్ని చాలా తిట్టుకున్నా. ఆమె స్థానంలో నేను చనిపోయినా బాగుండేది అని అనుకున్నాను. ఎందుకంటే, అప్పటికి నాకు పిల్లలు లేరు.. జీవితం చూసేశాను. సౌందర్యకు అప్పుడే పెళ్లయి ఏడాదే అయ్యింది. అప్పుడప్పుడే లైఫ్ స్టార్ట్ చేసింది. అందుకే ఆమె స్థానంలో నేను పోయినా బాగుండు అనుకున్నాను. ఇక యాక్సిడెంట్ సమయానికి సౌందర్యప్రెగ్నెంట్ అని వార్తలు రాశారు. కానీ అందులో నిజం లేదని స్వయంగా సౌందర్య అమ్మ చెప్పింది. ఒకనొక సమయంలో సౌందర్య అన్నయ్య అమర్‌ను పెళ్లి చేసుకోవాలనే ప్రపోజల్ వచ్చింది. కానీ అప్పటికీ నా ఫోకస్ అంతా కేవలం సినిమాలపైనే ఉండేది. ఒకవేళ అమర్‌ని పెళ్లి చేసుకుంటే, ఎలాగూ సౌందర్య కూడా వెళ్తోందిగా నేను వస్తాను అని ఫ్లైట్ ఎక్కేదాన్ని లేదా అతని జ్ఞాపకాలతో మిగిలిపోయేదాన్నేమో. అంతా విధి. ఎవరికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది' అంటూ చెప్పుకొచ్చారు. -
ఆ డైరెక్టర్లతో పని చేయాలని ఉంది: ఆమని
‘‘అల్లంత దూరాన’ సినిమా కళాశాల నేపథ్యంలో నడిచే మంచి ప్రేమకథ. యువతరానికి బాగా నచ్చేలా ఉంటుంది’’ అని నటి ఆమని అన్నారు. విశ్వ కార్తికేయ, హ్రితిక శ్రీనివాస్ జంటగా ఆమని అతిథి పాత్రలో నటించిన చిత్రం ‘అల్లంత దూరాన’. చలపతి పువ్వల దర్శకత్వంలో కోమలి సమర్పణలో ఎన్. చంద్రమోహనరెడ్డి నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఆమని మాట్లాడుతూ– ‘‘నా మేనకోడలు హ్రితిక పెద్ద డైలాగ్‌ని కూడా సింగిల్ టేక్‌లో చెప్పడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఒక నటికి ఎన్ని పాత్రలు చేసినా సంతృప్తి రాదు. ఇంకా ఏదో చేయాలనే తపన ఉంటుంది. మణిరత్నం, రాజమౌళి, సుకుమార్, పూరీ జగన్నాథ్‌గార్ల చిత్రాల్లో నటించాలనుంది’’ అన్నారు. ‘‘అల్లంత దూరాన’ వంటి మంచి సినిమాతో తెలుగులో పరిచయమవుతుండటం హ్యాపీ’’ అన్నారు హ్రితిక శ్రీనివాస్. ‘‘త్వరలో మా సినిమా రిలీజ్ తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు కోమలి. -
‘ఫీల్ గుడ్ లవ్ స్టోరీ’ లాంటి సినిమా ఇది...
విశ్వ కార్తికేయ హీరోగా ఆమని మేనకోడలు హ్రితికా శ్రీనివాసన్ కథానాయికగా చలపతి పువ్వల దర్శకత్వం వహించిన చిత్రం ‘అల్లంత దూరాన’. కోమలి సమర్పణలో తెలుగు, తమిళ భాషల్లో ఎన్. చంద్రమోహన్‌రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలోని ‘కొక్కొరొకో...’ అనే పాటను నిర్మాత కె.ఎస్. రామారావు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ సినిమా కాన్సెప్ట్, పాటలు చాలా బాగున్నాయి.. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి’’ అన్నారు. ‘‘ఫీల్ గుడ్ లవ్ స్టోరీ’ చిత్రమిది’’ అన్నారు చలపతి పువ్వల. ‘‘మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.. త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు ఎన్. చంద్ర మోహన్‌రెడ్డి. ‘‘ఈ చిత్రం నా కెరీర్‌కు మంచి మలుపు అవుతుంది’’ అన్నారు విశ్వ కార్తికేయ. గీత రచయిత రాంబాబు గోశాల మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్, కెమెరా: కల్యాణ్ బోర్లగాడ్డ. -
‘ది ట్రిప్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
ఆమని, గౌతమ్ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో వీడీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుర్గం రాజమౌళి నిర్మిస్తున్న చిత్రం ది ట్రిప్. వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రబృందం. ది ట్రిప్ పేరుతో వచ్చిన ఈ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. పోస్టర్ చూస్తుంటే రొటీన్‌కు కాస్త భిన్నంగానూ అనిపిస్తుంది. కచ్చితంగా ఈ సినిమా అందర్నీ అలరిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. కార్తిక్ కొడకండ్ల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. -
అందగత్తెను కాదని ఎగతాళి చేశారు: నటి భావోద్వేగం
సీనియర్ నటి ఆమని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకం పరిచయం అక్కర్లేని పేరు. జంబలకిడిపంబ’ వంటి కామెడీ చిత్రంతో మంచి హిట్ అందుకున్న అందుకున్న ఆమని ‘మిస్టర్ పెళ్లాం’, ‘శుభలగ్నం’, ‘అమ్మదొంగ’ వంటి ఎన్నో చిత్రాలతో తెలుగుంటి ఆడపడుచుగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ఎన్నో సనిమాల్లో నటించిన ఆమె ఆ తర్వాత తెరపూ కనుమరుగయ్యారు. చాలా గ్యాప్ తర్వాత ఆ నలుగురు మూవీతో సెకండ్ ఇన్నింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి సహాయ పాత్రలు పోషిస్తూ అలరిస్తున్న ఆమె ఇటీవల బుల్లితెరపై కూడా అరంగేట్రం చేశారు. చదవండి: తన ఫస్ట్‌లవ్‌ను పరిచయం చేసిన వర్మ ఈ నేపథ్యంలో ఓ టీవీ షోకు నటి ఇంద్రజతో హజరయ్యారు. ఈ షోలో ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే పిచ్చి. జయసుధ, శ్రీదేవిలను చూసి నేను కూడా వారిలా ఎప్పుడు నటిస్తానా అని అనుకునేదాన్ని. ఇక పెద్దాయ్యాక ఈ విషయాన్ని ఇంట్లో చెప్పినప్పుడు బంధువులంతా ఎగతాళి చేశారు. నేను సినిమాల్లో నటించడమేంటీ, అంత పెద్ద అందగత్తె ఏం కాదు కదా అని విమర్శించారు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం ఆమని ‘ముత్యమంతా ముద్దు’ అనే సీరియల్లో డబ్బు ఆశ ఉండే అత్తగా నటిస్తున్నారు. చదవండి: తొలిసారి తన ఆస్తులపై స్పందించిన సుడిగాలి సుధీర్ -
సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటి ఆమని
సీనియర్ నటి, ఒకనాటి టాప్ హీరోయిన్ ఆమని చిన్నితెరపై దర్శనమివ్వనున్నారు. తొలిసారిగా ఆమె నటించిన తెలుగు సీరియల్ జీ తెలుగులో శనివారం (ఆగస్టు 21,2021) నుంచి ప్రసారం కానుంది. అదే విధంగా ఉప్పెన ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైన కృతి శెట్టి తొలిసారిగా ఈ సీరియల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుండడం మరో విశేషం. ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ... తొలిసారిగా తెలుగు చిన్నితెరకు పరిచయం అవుతున్నందుకు, కుటుంబ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. వినూత్న కధాంశంతో తెరకెక్కిన ఈ సీరియల్లో కధానాయిక పాత్ర కీలకం. సంప్రదాయాలకు విలువనిచ్చే నవతరం యువతి ఆలోచనల నేపధ్యంలో ఈ సీరియల్ సాగుతుందని రూపకర్తలు తెలిపారు. పెళ్లయ్యాక తనతో పాటు మెట్టినింటికి తల్లీదండ్రులను కూడా తీసుకెళ్లాలని ఆశించే గీత పాత్రలో నటి నిషామిలన్ కనిపిస్తారు. ఈ సీరియల్ రాత్రి 7.30గంటలకు ప్రసారం అవుతుందని జీ తెలుగు ప్రతినిధులు తెలిపారు. చదవండి : 'డైరెక్టర్ కంటే డిజైనర్‌గానే ఎక్కువ సంపాదించా' చిరు బర్త్‌డే : స్పెషల్ సాంగ్‌తో చాటుకున్న అభిమానం -
కార్తీక్ రాజు హీరోగా హారర్ మూవీ.. కీలక పాత్రలో ఆమని
కార్తీక్ రాజు, మిస్తీ చక్రవర్తి, ప్రశాంత్ కార్తి ప్రధాన తారణంగా తేజస్వి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై సందీప్ గోపి శెట్టి దర్శక నిర్మాణంలో ఓ హారర్ సినిమా తెరకెక్కుతోంది. కరనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ తాజాగా రీస్టార్ట్ అయ్యింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత సందీప్ గోపిశెట్టి మాట్లాడుతూ ‘‘డైరెక్టర్‌గా ఇది నా తొలి చిత్రం. సినిమాపై ఉన్న ఆసక్తితో దర్శకుడిగా మారాను. కానీ నా మీద, కథపై నమ్మకంతో ఎంటైర్ యూనిట్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావుగారు అందిస్తోన్న సహకారం గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే హీరో కార్తీక్, ప్రశాంత్, మిస్తీ చక్రవర్తిలతో పాటు పోసాని కృష్ణమురళి, భీమినేని శ్రీనివాస్, దేవీ ప్రసాద్‌గా, ఆమని ఇలా పేరు పేరునా అందరికీ థాంక్స్ చెప్పుకుంటున్నాను’అని అన్నారు. భీమినేని, దేవీ ప్రసాద్‌తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉందన్నారు హీరో కార్తీక్ రాజు. సీనియర్ నటి ఆమని మాట్లాడుతూ.. ‘సినిమా బాగా వచ్చింది. మంచి పాత్ర చేస్తున్నాను. ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూసే సినిమా. తొలి సినిమానే అయినా మంచి అనుభవం ఉన్న దర్శకుడిలా తెరకెక్కిస్తున్నారు. తనకు మంచి పేరుని తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను’అన్నారు. -
అందుకే సౌందర్య ఎక్స్పోజింగ్ చేయలేదు : ఆమని
సౌందర్య.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు ఇది. ఈ పేరు వినబడగానే చీరకట్టులో ఓ అందమైన యువతి రూపం కళ్లముందు కదులుతుంది. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న ఈ మహానటి.. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ చనిపోయే వరకు నెంబర్ వన్ హీరోయిన్గా కొనసాగింది. కానీ దురదృష్టవశాత్తు కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది. మరణించి 17 ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఆమెను మరిచిపోలేకపోతున్నారు అభిమానులు. దానికి కారణం ఆమె ఆందం కాదు కేవలం నటన మాత్రమే. ఎలాంటి గ్లామర్ ఎక్స్పోజింగ్ ఇవ్వకుండా.. కేవలం యాక్టింగ్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకుంది సౌందర్య. ఒకవైపు.. రమ్యకృష్ణ, మీనా లాంటి స్టార్ హీరోయిన్లు తమ అందాలను బయటపెడుతూ గట్టి పోటీ ఇచ్చినా.. సౌందర్య మాత్రం కేవలం చీరకట్టులో తెరపై కనిపించి మెప్పించింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వందల చిత్రాల్లో నటించిన సౌందర్య ఎక్స్‌పోజింగ్‌కు ఎందుకు దూరంగా ఉందో ఆమె స్నేహితురాలు, సీనియర్ నటి ఆమని ఇటీవల వెల్లడించింది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా..’. ఈ మూవీలో ఆమని కీలక పాత్రలో నటించింది. మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్యూ ఇచ్చిన ఆమని.. సౌందర్యతో తనకు ఉన్న అనుబంధం, ఆమె ఎక్స్పోజింగ్ ఎందుకు చేయలేదనే విషయాన్ని తెలిపింది. ‘ఒకసారి ఇద్దరమే షూటింగ్లో ఉన్నపుడు.. ఎక్స్పోజింగ్ గురించి అడిగాను. వెంటనే.. ఎందుకే ఎక్స్పోజ్ చేయాలి? రేపు పెళ్లై భర్త పక్కనే ఉన్నపుడు మన సినిమాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? మన ఫ్యామిలీకి ఎలా అనిపిస్తుంది? డబ్బుల కోసం ఇలా చేస్తే రేపు ఎలా? అని తిరిగి తననే ప్రశ్నించేదని ఆమని చెప్పుకొచ్చింది. ఒక నియమం పెట్టుకొని ఎక్స్‌పోజింగ్‌కు సౌందర్య దూరంగా ఉందని, అందులో తప్పులేదని ఆమెని తెలిపింది. చదవండి: వరుణ్ పెళ్లిపై నాగబాబు కామెంట్.. ఆ అమ్మాయి అయినా ఓకేనట జెనీలియా చేతికి గాయం: భర్త సపర్యలు -
నరేష్‌తో లిప్‌లాక్‌పై నటి ఆమని కామెంట్
నటి ఆమని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో శుభలగ్నం, మావిడాకులు, మిస్టర్ పెళ్ళాం.. వంటి సినిమాల్లోని ఆమె పాత్రల్లో ఎప్పటికీ గుర్తిండిపోతాయి. అనేక హిట్ చిత్రాల్లో నటించి సహజమైన తన నటనతో అందరి మన్ననలు అందుకున్నారు. కెరీర్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సినిమాల నుంచి తప్పుకొని వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయారు. అయితే చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమని.. ఇప్పుడు మళ్లీ వరస సినిమాలు చేస్తున్నారు. ఇటీవల శ్రీకారం సినిమాలో శర్వానంద్ తల్లిగా నటించారు. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లోనూ నటిస్తున్నారు. అలాగే అల్లు శిరీష్, నవీన్ చంద్రకు మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమని చావు కబురు చల్లగా సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. యంగ్ హీరో కార్తీకేయ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమని హీరో తల్లిగా కనిపించనున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముదుకు రానుంది. ఈ క్రమంలో ఆమని ఇటీవల ఓ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె లిప్ లాక్స్, బోల్డ్ సీన్స్, సినిమాల్లో తల్లి పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చందమామ కథలు సినిమాలో నటుడు నరేష్‌తో ఆమె చేసిన ఓ బోల్డ్ సీన్ గురించి చర్చించారు. చిత్రంలో సన్నివేశం డిమాండ్ చేసినప్పుడు బోల్డ్ సన్నివేశాల్లో నటించడం తప్పేం కాదన్నారు. ‘నేను నా వృత్తిలో భాగంగా చేశాను. నరేష్ గారు సీనియర్ నటుడు, ధైర్యంగా సన్నివేశాన్ని చేయటానికి అంగీకరించి ఆయన తన గౌరవాన్ని చాటుకున్నారు.’ అని పేర్కొన్నారు. కాగా చందమామ కథలు చిత్రంలో ఆమని.. నరేష్‌తో లిప్ లాక్ సీన్ లో నటించి అందరినీ షాక్‌కు గురిచేసింది. చదవండి: జెనీలియా చేతికి గాయం: భర్త సపర్యలు వరుణ్ పెళ్లిపై నాగబాబు కామెంట్.. ఆ అమ్మాయి అయినా ఓకేనట -
శుభలగ్నం మేడమ్ అని పలకరిస్తుంటారు
‘‘ప్రస్తుతం నటిగా చాలా బిజీ. మంచి సినిమాలు, మంచి పాత్రలు వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు ఆమని. ఆమె ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘అమ్మ దీవెన’. శివ ఏటూరి దర్శకత్వంలో లక్ష్మి సమర్పణలో ఎత్తరి మారయ్య, ఎత్తరి చినమారయ్య, ఎత్తరి గురవయ్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని శివ బాగా తెరకెక్కించాడు. ఐదుగురు పిల్లల తల్లి వాళ్లను ప్రయోజకుల్ని చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? తన కుటుంబాన్ని తీర్చిదిద్దడం కోసం ఎలాంటి త్యాగాలు చేసింది? అనే అంశాలతో ఈ సినిమా ఉంటుంది. కష్టాలు ఎదురైనప్పుడు ఎదిరించి పోరాడాలి కానీ ఆత్మహత్యతో జీవితాన్ని ముగించకూడదని మహిళలకు మంచి సందేశాన్నిచ్చే చిత్రం ఇది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఇప్పటికీ చాలామంది నన్ను గుర్తు పట్టి ‘శుభలగ్నం’ మేడమ్ అని పలకరిస్తుంటారు. ఇప్పటి జనరేషన్ అమ్మాయిలు కూడా ‘శుభలగ్నం’లో బాగా చేశారు అంటుంటే సంతోషంగా అనిపిస్తుంటుంది. ప్రస్తుతం మా అబ్బాయికి 6 ఏళ్లు, అమ్మాయికి 4ఏళ్లు. ఈ లాక్డౌన్లో పిల్లలతో గడిపే అవకాశం దక్కడం చాలా సంతోషంగా అనిపించింది. ప్రస్తుతం ‘చావుకబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, అల్లు శిరీష్‌కి తల్లిగా ఓ సినిమా, గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే మూడు సినిమాలు చేస్తున్నాను. సాయికుమార్‌గారితో ఓ సినిమా, వాళ్ల అబ్బాయి ఆదితో ‘బ్లాక్’ సినిమా చేశాను. జగపతిబాబుగారితో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను’’ అన్నారు. -
భర్తే విషమిచ్చి హతమార్చాడు
-
ఆమని హత్యకేసులో సంచలన విషయాలు
మదనపల్లె టౌన్: రోజుకో మలుపు తిరిగిన మదనపల్లె బరోడా బ్యాంకు మేనేజర్ చేబోలు రవిచైతన్య భార్య ఆమని(27) అనుమానాస్పద మృతి కేసు చిక్కుముడి వీడింది. సైనైడ్ తాగడంతోనే ఆమె మృతి చెందినట్లు పోస్టుమార్టమ్ నివేదికలో తేలడం, నిందితుడు రవిచైతన్యను అరెస్టు చేసి విచారించడంతో ఈ విషయం బయటపడింది. పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. నిందితుడు రవిచైతన్య (35)ను, అతని తల్లిదండ్రులను అరెస్టు చేశారు. డీఎస్పీ రవిమనోహరాచారి, ఎస్ఐ వెంకటేష్ ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. వారి కథనం మేరకు..మదనపల్లె శేషప్పతోటలో నివాసం ఉంటున్న బరోడా బ్యాంకు మేనేజర్ చేబోలు రవిచైతన్య భార్య సీహెచ్ ఆమని గత నెల 27న ఉదయం ఇంట్లో మృతి చెందింది. స్పృహ లేకుండా ఉన్న ఆమనిని ...రవిచైతన్య ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. బాత్రూమ్లో కిందపడి పోయి ఉందని పొరుగింటి వారు ఫోన్ చేయగా ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు డాక్టర్లకు చెప్పాడు. డాక్టర్లు ప్రథమ చికిత్స అందించినా కోలుకోకపోవడంతో, మెరుగైన వైద్యం కోసం స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగం వైద్యులు ప్రథమ చికిత్స అందిస్తుండగా ఆమె మృతి చెందింది. ఆమని మరణవార్త తెలియగానే కృష్ణా జిల్లా ఒంటిమిట్ట మండలం ఇందులూరు నుంచి తల్లిదండ్రులు లక్ష్మీదేవి, జోగి నాగేంద్రరావు మదనపల్లెకు చేరుకున్నారు. తన బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయని టూటౌన్లో ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి హతమార్చారని, బాత్రూంలో పడి చనిపోయినట్లు చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు ఆమనిది అనుమానాస్పద మృతి, అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు వేధింపుల కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మరుసటి రోజు పోస్టుమార్టమ్ నివేదికలో సైనైడ్ ఇవ్వడంతోనే చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించడంతో నిందితుడు రవిచైతన్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు విచారణలో తానే సైనైడ్ తాగించినట్లు నిందితుడు అంగీకరించాడు. భార్యకు సైనైడ్ ఇచ్చి చంపినందుకు రవి చైతన్యను, అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడినందుకు రేణిగుంటకు చెందిన రవిచైతన్య తల్లిదండ్రులను కూడా అరెస్టు చేసినట్లు డీఎస్పీ, ఎస్ఐ వివరించారు. -
అమ్మ దీవెన
నటుడు సత్యప్రకాశ్ తనయుడు నటరాజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అమ్మ దీవెన’. శివ ఏటూరి దర్శకుడు. ఎత్తరి గురవయ్య నిర్మాత. ఆమని, పోసాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఒక్క పాట మినహా పూర్తయింది. ‘‘ప్రతి తల్లి కుటుంబం కోసం పడే కష్టం, తపన ప్రధానాంశాలుగా తీసుకుని చేస్తున్న చిత్రం ఇది. మదర్ సెంటిమెంట్‌తో పాటు యూత్‌ను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి’’ అన్నారు. ‘‘మా కుటుంబంలో జరిగిన వాస్తవ సంఘటనలతో తీస్తున్న చిత్రం ఇది. ఆమనిగారి పాత్రలో ప్రతి కొడుకు తన తల్లిని చూసుకుంటాడు. త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.వి.హెచ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవన్. -
నటనలో మేనత్తను మించాలి!
తమిళ సినిమా: నటి ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తమ నటి అన్న పదానికి చిరునామా ఆమె. తెలుగులో కథానాయికగా పలు చిత్రాల్లో నటించి జాతీయ అవార్డులను గెలుచుకున్న నటీమణి.. తెలుగుతోపాటు తమిళంలోనూ నటించిన ఆమె.. తమిళ నిర్మాత కాజామైదీన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత నటనకు దూరంగా ఉన్న ఆమని ఇటీవల మళ్లీ నటించడం మొదలెట్టారు. ఆమె భర్త కాజామైదీన్ రోజా కంబైన్స్ పతాకంపై చుట్టికుళందై, గోపాలా గోపాలా గొపాలా, పోర్కాలం, పూందోట్టం, వాంజినాథన్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు ఆమని మేనకోడలు, ఆమె సోదరుడి కుమార్తె హృతిక కథానాయికగా సినీ రంగంలోకి అడుగుపెడుతోంది. కరుప్పయ్య మురుగన్ దర్శకత్వంలో అశోక్ కథానాయకుడిగా నటిస్తున్న ‘విడయాద ఇరవొండ్రు వేండుం’ అనే చిత్రం ద్వారా ఆమె కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఎన్నో కలలు, ఆశలతో రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ.. ఆమనిని మించి మంచిపేరును చిత్రసీమలో తెచ్చుకోవాలని భావిస్తున్నట్టు తెలిపింది. ‘మా అత్త ఆమనికి నటిగా తెలుగులో మంచి పేరు ఉంది. ఆమె అవార్డులను సైతం గెలుపొందారు. అలాంటి అత్తను చూస్తూ పెరిగిన నేను నటనలో ఆమెలా పేరు తెచ్చుకోవాలన్నది చిన్నప్పటి నుంచే ఆశించా’ అని హృతిక తెలిపింది. తన మామ కాజామైదీన్ నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారని, పాఠశాల విద్యను పూర్తిచేసిన తరువాత సినిమాల్లోకి రమ్మని వారిద్దరూ తనకు సూచించారని, వారి ఆశీస్సులతో ఈ రంగంలోకి వచ్చానని పేర్కొంది. సినిమాల కోసం భరతనాట్యంతోపాటు డాన్స్‌ను నేర్చుకున్నానని చెప్పింది. తన పూర్వీకులు ఆంధ్రావారేనని, కానీ, పెరిగింది తమిళనాడులో, ప్రస్తుతం చదువుతోంది బెంగళూర్‌లో అని తెలిపింది. నటుడు అశోక్‌కు జంటగా నటించే అవకాశం రావడంతో ఓకే చెప్పేశానని, చిత్ర నిర్మాణం పూర్తి కావచ్చిందని తెలిపింది. ఇకపై వరుసగా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానని, తన మేనత్త కంటే అధిక చిత్రాల్లో నటించి, ఆమె కంటే అధిక అవార్డులు పొంది వాటిని అత్తకు కానుకగా సమర్పించాలని ఆశిస్తున్నానని హృతిక తన మనసులోని మాటను తెలిపింది. -
ఉదయం ఆట ఉచితం
‘‘దర్శకత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం కలిగిన నేను ‘ఐపీసీ సెక్షన్ భార్యాబంధు’ వంటి మంచి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతుండడం గర్వంగా ఉంది. మహిళల రక్షణ కోసం చేసిన చట్టాలను కొందరు మహిళలు ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే అంశం ఆధారంగా రూపొందిన సందేశభరిత వినోదాత్మక చిత్రమిది’’ అని దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ అన్నారు. శరత్ చంద్ర, నేహా దేశ్‌పాండే జంటగా ఆమని ముఖ్య పాత్రలో రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మించిన ‘ఐపీసీ సెక్షన్ భార్యాబంధు’ రేపు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా రెట్టడి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాని విడుదల రోజు ఉదయం ఆటను అందరికీ ఉచితంగా ప్రదర్శిస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ మినహా మా చిత్రం ఆడుతున్న అన్ని థియేటర్స్‌లో ఇది వర్తిస్తుంది. సినిమాపై నమ్మకంతో పాటు చూసిన ప్రతి ఒక్కరూ పదిమందికి చెబుతారనే ఆలోచనతో సాంబశివరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమనిగారి పాత్ర హైలైట్. మా సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. -
మగవాళ్లను రక్షించండి
ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఓ ముఖ్యమైన సెక్షన్ ఆధారంగా రూపొందిన కుటుంబ కథా చిత్రం ‘ఐపీసీ సెక్షన్.. భార్యాబంధు’. ‘సేవ్ మెన్ ఫ్రమ్ ఉమెన్’ అన్నది స్లోగన్. శరశ్చంద్ర, నేహా దేశ్‌పాండే జంటగా ఆమని ముఖ్య పాత్ర చేస్తున్నారు. రెట్టడి శ్రీనివాస్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆలూరి క్రియేషన్స్ పతాకంపై ఆలూరి సాంబశివరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ (గోపి), ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ ముత్యాల రాందాసు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ– ‘‘కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఒక సున్నితమైన అంశానికి సునిశిత హాస్యాన్ని జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ప్రస్తుతం సెన్సార్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలో సినిమా రిలీజ్ చేస్తాం. విడుదలయ్యాక ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చర్చించిన అంశం గురించి మాట్లాడుకుంటారు’ అన్నారు ఆలూరి సాంబశివరావు. ‘‘నాకు దర్శకుడిగా చాన్స్ ఇచ్చి, మంచి సినిమా తీసేలా ప్రోత్సహించిన సాంబశివరావుగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అన్నారు రెట్టడి శ్రీనివాస్. సంగీత దర్శకుడు విజయ్ కురాకుల, పాటల రచయిత మౌనశ్రీ మల్లిక్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పి.శ్యామ్. -
మూడు తరాల కథ
‘‘తండ్రీ, కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రం ఇది. చక్కని ఫీల్ ఉన్న సినిమా. ఇలాంటి మంచి చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉంది’’ అని సీనియర్ నరేశ్ చెప్పారు. మధు మహంకాళి దర్శకత్వంలో నరేశ్, ఆమని ముఖ్య తారలుగా రూపాదేవి మహంకాళి నిర్మించిన చిత్రం ‘పరంపర’. అర్జున్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని నరేశ్ ఆవిష్కరించి, అతిథిగా పాల్గొన్న దర్శకుడు ప్రవీణ్ సత్తారుకి అందజేశారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘మూడు తరాలకు చెందిన కథ ఇది. తన ముందు తరంవాళ్లు చేసిన తప్పును తాను చేయకూడదని తనకు జరిగిన నష్టం తన కొడుక్కి జరగకూడదని ఓ తండ్రి పడే తపనే ఈ చిత్రం’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఇదే వేదికపై మరో రెండు చిత్రాల ఆడియో ఆవిష్కరణలు జరపడం విశేషం. అవి ‘దేవ్’, ‘మళ్లీ రాదోయ్ లైఫ్’. చార్మి ప్రధాన పాత్రలో ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వంలో డా. శిల్ప రమేష్ రమణి ‘దేవ్’ నిర్మించారు. జెస్సీ గిఫ్ట్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఆవిష్కరించి, డిజిక్వెస్ట్ బసిరెడ్డికి అందించారు. ‘మళ్లీ రాదోయ్ లైఫ్’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రఘు బెల్లంకొండ నిర్మించారు. విజయ్ కురాకుల స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని తమ్మారెడ్డి భరద్వాజ్ ఆవిష్కరించి, సునీల్‌కుమార్ రెడ్డికి ఇచ్చారు. -
పరంపర మూవీ స్టిల్స్, పోస్టర్స్