
విశ్వ కార్తికేయ హీరోగా ఆమని మేనకోడలు హ్రితికా శ్రీనివాసన్ కథానాయికగా చలపతి పువ్వల దర్శకత్వం వహించిన చిత్రం ‘అల్లంత దూరాన’. కోమలి సమర్పణలో తెలుగు, తమిళ భాషల్లో ఎన్. చంద్రమోహన్‌రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలోని ‘కొక్కొరొకో...’ అనే పాటను నిర్మాత కె.ఎస్. రామారావు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ సినిమా కాన్సెప్ట్, పాటలు చాలా బాగున్నాయి.. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి’’ అన్నారు.
‘‘ఫీల్ గుడ్ లవ్ స్టోరీ’ చిత్రమిది’’ అన్నారు చలపతి పువ్వల. ‘‘మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.. త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు ఎన్. చంద్ర మోహన్‌రెడ్డి. ‘‘ఈ చిత్రం నా కెరీర్‌కు మంచి మలుపు అవుతుంది’’ అన్నారు విశ్వ కార్తికేయ. గీత రచయిత రాంబాబు గోశాల మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్, కెమెరా: కల్యాణ్ బోర్లగాడ్డ.
Comments
Please login to add a commentAdd a comment