డైరెక్టర్‌ నన్ను ఒంటరిగా రమ్మన్నాడు: ఆమని | Actress Aamani About Her Casting Couch Experience | Sakshi
Sakshi News home page

Aamani: మేకప్‌ టెస్ట్‌ అని చెప్పి నన్ను ఒంటరిగా రమ్మన్నాడు.. ఎందుకో తర్వాత అర్థమైంది

Published Wed, Feb 22 2023 8:50 PM | Last Updated on Wed, Feb 22 2023 9:06 PM

Actress Aamani About Her Casting Couch Experience - Sakshi

కలలు అందరూ కంటారు, కానీ కొందరే అది నెరవేర్చుకునేందుకు కృషి చేస్తారు, అందులో కొందరే సఫలీకృతులవుతారు. ఆ కొద్దిమందిలో నటి ఆమని ఒకరు. నటి అవ్వాలనుకున్న ఆమె ఒడిదుడుకులెదురైనా జంకలేదు. పట్టు వీడకుండా తన ప్రయత్నాలు కొనసాగించింది. చివరకు నటిగా ఛాన్స్‌ పట్టేయడమే కాదు, తన యాక్టింగ్‌ స్కిల్స్‌తో అద్భుత నటిగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె కెరీర్‌ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది.

'ఇండస్ట్రీలోకి రావడానికి నేను కూడా ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాను. ఆడిషన్స్‌ కోసం కంపెనీలకు వెళ్లేదాన్ని. కొన్ని కంపెనీల్లో సెలక్ట్‌ అయ్యేదాన్ని. కొన్నింటిలో రిజెక్ట్‌ చేసేవాళ్లు. అయితే కొందరు చెప్పి పంపిస్తామనేవాళ్లు. అంటే ఏంటో మొదట నాక్కూడా అర్థం కాలేదు. మేడమ్‌, డైరెక్టర్‌గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పేవాళ్లు. ఎందుకు? అని అడిగితే మేకప్‌ టెస్ట్‌ చేయాలంట అని చెప్పారు. సరే, అమ్మతో కలిసి వస్తా అన్నాను. ఆయన మాత్రం అమ్మగారు వద్దు, మీరు ఒంటరిగా రావాలి అన్నాడు.

వెంటనే అమ్మ.. తను ఒంటరిగా రాదు, ఇద్దరం కలిసే వస్తామని చెప్పింది. దీంతో ఆయన వద్దులెండి, డైరెక్టర్‌ గారు వద్దంటున్నారు అని ఫోన్‌ కట్‌ చేసేవాళ్లు. నాకు పోనుపోనూ అర్థమైంది. అమ్మ లేకుండా నన్నొక్కదాన్నే ఎందుకు రమ్మంటున్నారో తర్వాత తెలిసొచ్చింది. ఇలా చాలా జరిగాయి. కానీ ఎక్కడా నేను కాంప్రమైజ్‌ కాలేదు. అడ్డదారిలో సినిమాల్లోకి రావడం నాకిష్టం లేదు. అందుకే వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికి రెండేళ్లు పట్టింది' అని క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాన్ని చెప్పుకొచ్చింది ఆమని.

చదవండి: కొన్ని అంగుళాల దూరంలో నా చావు కనిపించింది: ఆమని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement