Senior Actress Radha Prasanthi Open Up About Casting Couch - Sakshi
Sakshi News home page

Radha Prasanthi : 'కాస్టింగ్‌ కౌచ్‌ ఎప్పుడూ ఉంటుంది.. కానీ బలవంతం ఉండదు'

Published Mon, May 16 2022 6:52 PM | Last Updated on Mon, May 16 2022 7:35 PM

Senior Actress Radha Prasanthi Open Up About Casting Couch - Sakshi

సీనియర్‌ నటి రాధా ప్రశాంతి కాస్టింగ్‌ కౌచ్‌పై చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం సినిమాలకు దూరమైన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ అన్నది ఇంతకు ముందు ఉంది..ఇప్పుడు ఉంది.. ఇక ముందు కూడా ఉంటుంది. అయితే అప్పట్లో ఇలాంటివి ఎదురైనా ఎవరూ పబ్లిసిటీ చేసుకోలేదు.

ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కారు. అంతే తేడా. ఇక్కడ ఎవరూ ఎవరిని బలవంతం చేయరు. సినిమా కావాలంటే కమిట్‌మెంట్‌ ఇవ్వాలి అనే పాలసీ ఉందిక్కడ. నాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఓ సినిమాలో నన్ను సెకండ్‌ హీరోయిన్‌గా పెట్టుకొని ఆ తర్వాత తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేనేజర్‌ని అడిగితే ఈ విషయం తెలిసింది. నా స్థానంలో కమిట్‌మెంట్‌ ఇచ్చిన వాళ్లని పెట్టుకున్నారు. అప్పుడు, ఇప్పుడు కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఉంది' అంటూ చెప్పుకొచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement