
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. బెంగళూరులో ఓ ఈవెంట్‌కు హాజరైన ముద్దుగుమ్మ మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదికపై స్పందించింది. చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. అయితే తనకు మాత్రం ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని వెల్లడించింది.
శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ..' నా వరకు అయితే ఇండస్ట్రీలో సురక్షితంగా ఉన్నా. అయితే ఇది అందరికీ వర్తిస్తుందని నా ఉద్దేశం కాదు. నేను సేఫ్‌గానే ఉన్నప్పటికీ.. పనిచేసే చోట అభద్రతగానే ఉండొచ్చని నా అభిప్రాయం. గత ఎనిమిదేళ్లుగా నేను సినిమాల్లో ఉన్నా. ఇండస్ట్రీలో నాకు ఎలాంటి ఇబ్బంది కలగకపోవటం నా అదృష్టం. కానీ అందరి విషయాల్లో ఇలా ఉంటుందని మాత్రం చెప్పను. కొందరు ఇండస్ట్రీలో ఇబ్బందులు పడతూనే ఉన్నారని' చెప్పుకొచ్చింది. అయితే ఈ వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి..సెట్‌లో మహిళలకు భద్రత కల్పించాలని కోరారు.
కాగా.. శ్రద్ధా శ్రీనాథ్ 2015లో మలయాళ చిత్రం కోహినూర్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో నాని సరసన జెర్సీతో అరంగేట్రం చేసింది. అంతేకాకుండా యు-టర్న్, విక్రమ్ వేద చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన వెంకటేష్ నటించిన సైంధవ్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం తెలుగులో విశ్వక్ సేన్ సరసన మెకానిక్ రాకీలో కనిపించనుంది. అంతేకాకుండా హిందీలో లెటర్స్ టు మిస్టర్ ఖన్నా, కోలీవుడ్‌లో కలియుగం సినిమాల్లో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment