Hansika Motwani Casting Couch Criticism Of Telugu Hero, Deets Inside - Sakshi
Sakshi News home page

hansika motwani: 'డేట్‌కు రావాలని వెంటపడ్డాడు'.. ఆ హీరో గురించి హన్సిక షాకింగ్‌ నిజాలు

Published Tue, May 23 2023 12:46 PM | Last Updated on Tue, May 23 2023 1:40 PM

Hansika Motwani Casting Couch Criticism Of Telugu Hero - Sakshi

దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్‌ హన్సిక మోత్వానీ. తొలి సినిమాతోనే హిట్‌ అందుకున్న ఈ బ్యూటీ యూత్‌లోనూ మాంచి క్రేజ్‌ సంపాదించుకుంది. తెలుగులో వరుస సినిమా అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ అదే సమయంలో కోలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ కూడా స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.

సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే రీసెంట్‌గా ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ప్రియుడు సోహైల్‌ కతూరియాను పెళ్లాడింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ సత్తా చాటుతున్న హన్సిక తాజాగా ఓ ఇంటరవ్యూలో షాకింగ్‌ విషయాలు బయటపెట్టింది.

టాలీవుడ్‌లో ఓ ప్రముఖ హీరో తనని బాగా ఇబ్బంది పెట్టాడని, అస్తమానం డేట్‌కి వెళ్దాం వస్తావా అంటూ విసిగించేవాడని చెప్పుకొచ్చింది.అయితే ఆ హీరోకు తగిని విధంగా బుద్ది చెప్పానంటూ పేర్కొన్న హన్సిక ఆ టాలీవుడ్‌ హీరో ఎవరన్నది మాత్రం బయటకు రివీల్‌ చేయలేదు. దీంతో అతను ఎవరై ఉంటారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement