సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1990ల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటిస్తోంది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు సినిమాల్లో రాణించిన రమ్యకృష్ణ నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, మూడు నంది అవార్డులు అందుకున్నారు.
అయితే తాజాగా రమ్యకృష్ణ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. క్యాస్టింగ్ కౌచ్ సమస్య సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఇతర రంగాల్లోనూ ఉందన్నారు. అయితే సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలే ఎక్కువగా తెరపైకి రావడంతో అందరిదృష్టి సినిమావారిపైనే ఉందని తెలిపారు. కొంతమంది తప్పుడు వార్తలను ప్రచారం చేయడం కూడా నిజమేనని అన్నారు. సినిమాల్లో స్టార్‌గా ఎదగాలంటే హీరోయిన్స్ కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందేనని షాకింగ్ కామెంట్స్ చేసింది. కానీ నా విషయంలో మాత్రం అలా జరగలేదని రమ్యకృష్ణ వెల్లడించింది.
కాగా.. రమ్యకృష్ణ 14 ఏళ్ల వయసులో 1948లో వైజీ మహేంద్రతో కలిసి 'వెళ్లి మిందాన' అనే తమిళ చిత్రంలో నటించింది. 1986లో విడుదలైన 'భలే మిత్రులు' ఆమె తొలి తెలుగు చిత్రం. 1990లో సౌందర్య, మీనా, రోజా, నగ్మా లాంటి హీరోయిన్లలో గుర్తింపు సాధించింది. ఎన్టీ రామారావు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు, జగపతి బాబు, రాజశేఖర్, రజనీకాంత్ లాంటి స్టార్స్‌తో సినిమాలు చేసింది. కన్నడలో రవిచంద్రన్, పునీత్ రాజ్‌కుమార్, ఉపేంద్ర సరసన నటించారు.
Comments
Please login to add a commentAdd a comment