Ramya Krishna
-
రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1990ల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటిస్తోంది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు సినిమాల్లో రాణించిన రమ్యకృష్ణ నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, మూడు నంది అవార్డులు అందుకున్నారు.అయితే తాజాగా రమ్యకృష్ణ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. క్యాస్టింగ్ కౌచ్ సమస్య సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఇతర రంగాల్లోనూ ఉందన్నారు. అయితే సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలే ఎక్కువగా తెరపైకి రావడంతో అందరిదృష్టి సినిమావారిపైనే ఉందని తెలిపారు. కొంతమంది తప్పుడు వార్తలను ప్రచారం చేయడం కూడా నిజమేనని అన్నారు. సినిమాల్లో స్టార్‌గా ఎదగాలంటే హీరోయిన్స్ కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందేనని షాకింగ్ కామెంట్స్ చేసింది. కానీ నా విషయంలో మాత్రం అలా జరగలేదని రమ్యకృష్ణ వెల్లడించింది. కాగా.. రమ్యకృష్ణ 14 ఏళ్ల వయసులో 1948లో వైజీ మహేంద్రతో కలిసి 'వెళ్లి మిందాన' అనే తమిళ చిత్రంలో నటించింది. 1986లో విడుదలైన 'భలే మిత్రులు' ఆమె తొలి తెలుగు చిత్రం. 1990లో సౌందర్య, మీనా, రోజా, నగ్మా లాంటి హీరోయిన్లలో గుర్తింపు సాధించింది. ఎన్టీ రామారావు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు, జగపతి బాబు, రాజశేఖర్, రజనీకాంత్ లాంటి స్టార్స్‌తో సినిమాలు చేసింది. కన్నడలో రవిచంద్రన్, పునీత్ రాజ్‌కుమార్, ఉపేంద్ర సరసన నటించారు. -
Guntur Kaaram Review: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ
టైటిల్: గుంటూరు కారం నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరీ, జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తదితరులు నిర్మాణ సంస్థ: హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత: ఎస్ రాధాకృష్ణ(చినబాబు) రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, పీఎస్ వినోద్ సంగీతం:తమన్ ఎడిటింగ్: నవీన్ నూలి విడుదల తేది: జనవరి 12, 2024 కథేంటంటే.. జనదళం పార్టీ అధినేత వైరా వెంకట సూర్య నారాయణ(ప్రకాశ్ రాజ్) కూతురు వైరా వసుంధర(రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. కూతుర్ని మంత్రి చేయాలని సూర్య నారాయణ భావిస్తాడు. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాటా మధు(రవి శంకర్) కూడా మంత్రి పదవి ఆశిస్తాడు. తనను కాదని కూతురికి మంత్రి పదవి ఇస్తే.. ఆమెకు రెండో పెళ్లి అయిన విషయాన్ని.. అలాగే మొదటి భర్తతో కలిగిన సంతానం గురించి బయటపెడతా అని బెదిరిస్తాడు. అయినా కూడా కుతూరినే మంత్రి చేస్తాడు సూర్యనారాయణ. ముందుచూపుగా వసుంధర మొదటి కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ(మహేశ్ బాబు)ను పిలిపించి తల్లితో తనకు ఎలాంటి సంబంధం లేదని రాసిన బాండ్ పేపర్స్ మీద సంతకం పెట్టించాలని ప్రయత్నిస్తాడు. అయితే రమణ మాత్రం సంతకం చేయడానికి అంగీకరించడు. తండ్రి రాయల్ సత్యం(జయరామ్) చెప్పినా వినకుండా.. గుంటూరులోనే ఉంటూ మిర్చి యార్డ్‌ని నడిపిస్తుంటాడు. అసలు వసుంధర మొదటి భర్త రాయల్ సత్యంకు ఎందుకు విడాకులు ఇచ్చింది? పదేళ్ల కొడుకును వదిలేసి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? పాతికేళ్ల కొడుకు ఇంటి ముందుకు వచ్చినా.. చూడడానికి ఎందుకు నిరాకరించింది? అముక్త మాల్యద అలియాస్ అమ్ము(శ్రీలీల)తో రమణ ఎలా లవ్‌లో పడ్డాడు? మరదలు మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏమిటి? చివరకు రమణ తల్లి ప్రేమను ఎలా పొందాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. త్రివిక్రమ్ సినిమాల్లో బంధాలు, భావోద్వేగాలది ప్రధాన పాత్ర ఉంటుంది. కథంతా ఓ ప్యామిలీ చుట్టూ తిరుగుతుంది. గుంటూరు కారం సినిమా కూడా అదే పంథాలో సాగుతుంది. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్ల చెదురైన ఓ మంచి కుటుంబం.. మళ్లీ ఎలా కలిసింది? దూరమైన తల్లి, కొడుకు చివరకు ఎలా దగ్గరయ్యారు అనేది ఈ సినిమా కథ. ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు... ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాసే ఈ తరహా కాన్సెప్ట్‌లో సినిమాలను తెరకెక్కించాడు. అల.. వైకుంఠపురములో, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల తాలుకు ఛాయలు ఇందులో కనిపిస్తాయి. అంతేకాదు త్రివిక్రమ్ సంభాషణల్లోనూ కొత్తదనం కొరవడింది. అయితే కామెడీ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గలేదు. పంచ్ డైలాగ్స్, పరుగులు పెట్టించే స్క్రీన్‌ప్లేతో బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు. సినిమా ప్రారంభంలోనే అసలు కథ ఏంటి? కథనం ఎలా సాగబోతుందనేది రివీల్ చేసేశాడు. మహేశ్ బాబు ఎంట్రీ అదిరిపోతుంది.తనదైన కామెడీ టైమింగ్‌తో ఇరగదీశాడు. ఇక ‘నాది నెక్లెస్ గొలుసు’ పాటకు మహేశ్, శ్రీలీల వేసే స్టెప్పులు ఫ్యాన్స్‌ని అలరిస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్, ఎమోషనల్ సీన్ ఆకట్టుకుంటుంది. హీరోకి తల్లి ఎందుకు దూరమైందనే విషయాన్ని మాత్రం ఫస్టాఫ్‌లో రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ.. సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేలా చేశాడు. ఫస్టాఫ్‌లో కథేమి ఉండడు. ‘కిటికిలో నుంచి చూసే నాన్న.. తలుపులు మూసుకునే అమ్మ.. రోడ్డు మీద తిరిగే కొడుకు’ సింపుల్‌గా చెప్పాలంటే ఇదే ఫస్టాఫ్ కథ. ఇక సెకండాఫ్ కాస్త హిలేరియస్‌గా సాగుతుంది. లేడిస్‌తో హీరో చేసే యాక్షన్ ఎపిసోడ్, అజయ్ క్యారెక్టర్‌తో పండించే కామెడీ బాగానే వర్కౌట్ అయింది. అయితే సినిమాకు ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించొచ్చు. చెప్పుకోవడానికి పెద్ద ట్విస్టులు కూడా లేవు. తల్లి కొడుకులు విడిపోయేలా పన్నాగం పన్నిన వ్యక్తి, దానికి గల కారణం ఏంటనేది చివరి వరకు పసిగట్టకుండా జాగ్రత్త పడ్డాడు. చివర్లో తల్లి-కొడుకు( రమ్యకృష్ణ- మహేశ్‌బాబు) మధ్య జరిగే సంభాషణలు హృదయాలను హత్తుకుంటాయి. కొడుకుని ఎందుకు దూరం పెట్టారనేది కూడా కన్విన్సింగ్‌గానే అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. రమణ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు మహేశ్ బాబు. యాక్షన్‌తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. డైలాగ్ డెలివరీలోనూ కొత్తదనం చూపించాడు. తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. అమ్ము పాత్రలో శ్రీలీల ఒదిగిపోయింది. ఎప్పటి మాదిరే డ్యాన్స్ ఇరగదీసింది. చీరకట్టులో తెరపై చాలా అందంగా కనిపించింది. ఇక వైరా వసుంధరగా రమ్యకృష్ణ మరోసారి గుర్తిండిపోయే పాత్రలో నటించింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్ర సాదాసీదాగా ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో మాత్రం తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో మరదలుగా మీనాక్షి చౌదరి నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఏదేమైనా గుంటూరు కారం ఘాటు మాత్రం కాస్త తగ్గిందనే చెప్పాలి. -
మహేశ్ బాబు ‘గుంటూరు కారం, HD మూవీ స్టిల్స్
-
రమ్యకృష్ణ నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా..?
-
దేవి పాత్రలలో జేజేలు అందుకున్న హీరోయిన్స్
విజయ దశమి అంటే...కొత్త బట్టలు, పిండివంటలు, బంధు మిత్రుల కోలాహలం గుర్తుకు వస్తుంది. చిన్నా పెద్ద దసరాను సంబరంగా జరుపుకుంటారు. నవరాత్రులలో దుర్గామాత 9 అవతారాలను పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోటానికి పూజాలు చేస్తారు. ఇక ఈ దేవి రూపంలో టాలీవుడ్ వెండితెర మీద కొందరు హీరోయిన్స్ కనిపించడమే కాకుండా ప్రేక్షకులతో నీరాజనాలు అందుకున్నారు. వారెవరో ఈ కథనంలో చూసేద్దాం.. మొదట గుర్తొచ్చేది ఆవిడే.. అప్పట్లో వెండితెర మీద దేవత పాత్రలు వేసిన నటీమణులలో కె.ఆర్ విజయ పేరు మొదటి వరసలో ఉంటుంది.ఎన్టీఆర్ పేరు చెబితే కృష్ణుడు, రాముడు లాంటి వారు గుర్తుకు వస్తారు. ఇక దేవతల క్యారెక్టర్ల గురించి మాట్లాడితే.. కె ఆర్ విజయ పేరు మనసులో మెదలుతుంది. అమ్మ వారి పాత్ర వేసినప్పుడు ఎంతో నిష్టగా ఉండేవారట. శాఖాహారం మాత్రమే తీసుకునేవారట. శభాష్ అనిపించుకున్న విజయశాంతి లేడి సూపర్ స్టార్‌గా విజయ శాంతి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు నేషనల్ అవార్డు సైతం కొల్లగొట్టింది. ఈ సీనియర్ తార కూడా మహా చండి అవతారంలో విశ్వరూపం చూపించింది. దేవత పాత్రలో కనిపించి శభాష్ అనిపించుకుంది. రోమాలు నిక్కబొడుచుకునే అమ్మోరు సీన్.. శరదృతువు ఆరంభంలో వచ్చే పండగ కనక నవరాత్రి, శరన్నవరాత్రి అనే పేరు వచ్చింది. పండగ మొదటి మూడు రోజులు పార్వతి దేవికి, ఆ తరువాత మూడు రోజులు లక్ష్మీ దేవికి.. ఆ తరువాత మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఇక అమ్మోరు తల్లి గ్రామంలో వెలిసి.. దుష్ట శక్తులను పారదోలుతుంది. ఈమె విశ్వరూపం చూసే భాగ్యం అందరికీ దక్కదు. అలాంటి అవకాశం దక్కే సీన్ అమ్మోరు సినిమాలో చూపించారు. వెండితెర మీద ఈ సన్నివేశాన్ని చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మహా కనక దుర్గగా రమ్యకృష్ణ రమ్య కృష్ణ అమ్మోరు సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో దేవతగా కనిపించి వెండితెర మీద కనికట్టు చేసింది. దేవుళ్లు సినిమాలో భక్తితో వేడుకుంటే ఆ మహా కనక దుర్గ కూడా కదిలి వస్తుంది అనే సన్నివేశాలలో మానవరూపం దాల్చిన దేవతగా కనిపించింది. నిండు మనసుతో అమ్మ ఉందని నమ్మిన వారికి కళ్లముందు కనిపించే దైవం అవుతుంది.లేదనుకునే అల్పులకీ కళ్లు తెరిపిస్తుంది. అమ్మోరు తల్లిగా, భక్తురాలిగా రోజా అమ్మోరు తల్లిగా కనిపించిన వారి లిస్ట్‌లో మరో సీనియర్ తార రోజా కూడా ఉంది. భక్తురాలిగా, అమ్మోరు తల్లిగా రెండు పాత్రలలో అమ్మోరు తల్లి సినిమాలో మెప్పించింది. శ్రీవెంకటేశునికి చెల్లెలివమ్మా, చిట్టి చెల్లిలి వయ్యా అని ఈ దేవతను పొగుడుతూ భక్తు రాలిగా పాట పాడి మెప్పించింది. భక్తురాలిగా సావిత్రి జననీ శివ కామిని దరి చేరితే భయాలు తొలుగిపోతాయి. అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మ దయ దొరికితే జయాలు కలుగుతాయి. ఎన్టీఆర్, సావిత్రి నటించిన నర్తన శాల మూవీలో అమ్మ దయ కోసం...సావిత్రి జననీ శివ కామినీ అనే పాట పాడి ఆకట్టుకుంది. ‘‘ఇక్కడ క్లిక్ చేసి సాక్షి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా?: రమ్యకృష్ణ
ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై సినీనటి రమ్యకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మంత్రి రోజాకు పలువురు ప్రముఖులు అండగా నిలవగా, తాజాగా రమ్యకృష్ణ సైతం స్పందించారు. ‘మంత్రి రోజాని మాజీ మంత్రి బండారు అసభ్యంగా దూషించడం దారుణం.మన దేశంలో మాత్రమే భారత మాతాకి జై అని గర్వంగా చెప్తాం. అలాంటి దేశంలో ఓ మహిళ పై ఇంత నీచంగా మాట్లాడతారా?, బండారు సత్యనారాయణని క్షమించకూడదు. pic.twitter.com/fsuJ7aa9Wk — Ramya Krishnan (@meramyakrishnan) October 7, 2023 మనదేశం ప్రపంచంలోనే ఐదవ అత్యుత్తమ ఆర్థిక దేశంగా అవతరిస్తోంది. అలాంటి దేశంలో ఓ మహిళ మంత్రిని ఇంత దారుణంగా మాట్లాడతారా?, కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్‌తో సంబంధం లేకుండా బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు ఖండించాలి. నేను ఓ మహిళ గా, నటిగా , స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటా. ఈ దేశంలో మహిళలపై రేప్ లు, దాడులు, గృహ హింస, బహిరంగ దూషణ ఇప్పటికీ కొనసాగడం బాధాకరం. మంత్రి రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ కఠినమైన చర్యలు తీసుకోవాలి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బండారు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు రమ్యకృష్ణ. బండారు.. మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా?: నటి, ఎంపీ నవనీత్ కౌర్ -
రమ్యే ఆర్డర్ ఇస్తే నేను చేయాల్సిందే : దర్శకుడు కృష్ణ వంశీ
-
జీవితంలో అదొక్కటే పర్మినెంట్: రమ్యకృష్ణ
‘నిన్ను రోడ్డు మీద చూసినది..’ అంటూ కుర్రాళ్లు ఫ్లాట్ అయ్యేంత గ్లామర్...మితి మీరిన ఆత్మవిశ్వాసానికి.. అహంభావానికి చిరునామా... ఓ నీలాంబరి. భక్తులను రక్షించే తల్లి... ఓ అమ్మోరు. నా మాటే శాసనం.. ఓ శివగామి... ఇలా ఏ పాత్ర చేస్తే అందులో ఒదిగిపోయారు రమ్యకృష్ణ. గ్లామరస్ రోల్స్ చేస్తున్నప్పుడే ‘నరసింహ’లో నెగటివ్ షేడ్ ఉన్న నీలాంబరి, ‘అమ్మోరు’లో అమ్మవారిగా మెప్పించారామె. ఇక ‘బాహుబలి’లో శివగామిగా కనబర్చిన నటన అద్భుతం. ఇటీవల రిలీజైన ‘జైలర్’లో రజనీకాంత్ భార్యగా నటించారు. అలాగే భర్త కృష్ణవంశీ డైరెక్షన్లో ‘రంగ మార్తాండ’ చేశారు. ఇక ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం. ► ‘పడయప్ప’ (‘నరసింహ’)లో నీలాంబరిగా నరసింహ (రజనీకాంత్ పాత్ర)ని ఎదిరించారు. చాలా ఏళ్ల తర్వాత ‘జైలర్’లో రజనీ కాంబినేషన్లో సాఫ్ట్ క్యారెక్టర్ చేయడం గురించి.. ఇన్నేళ్ల తర్వాత రజనీగారి కాంబినేషన్లో ‘జైలర్’ చేయడం, అది సూపర్ హిట్ కావడం నా జీవితంలో మరచిపోలేను. ‘జైలర్’లో ఎందుకంత సున్నితమైన పాత్ర చేశారని అందరూ అనుకోవచ్చు. అయితే మళ్లీ రజనీగారితో నీలాంబరిలాంటి పాత్ర వస్తేనే చేయాలనుకుని ‘జైలర్’లో విజయలాంటి మంచి పాత్రని వదులుకోలేను కదా. ► ఈ 24 ఏళ్లలో రజనీగారు, మీరు ఆర్టిస్టులుగా ఎదిగారు.. వ్యక్తులుగా మారారు. ఆయనలో మీరు గమనించిన మార్పు? ‘జైలర్’ షూటింగ్ మొదటి రోజే ‘పడయప్ప’ చేసి అప్పుడే 24 ఏళ్లు అయిపోయిందా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తే.. అవునన్నాను. అప్పటికీ, ఇప్పటికీ ఆయనలో అదే ఉత్సాహం, అదే నిరాడంబరత, అంతే నిశ్శబ్దం. ► ‘జైలర్’ తెలుగు–తమిళంలో చాలా పెద్ద హిట్ అయింది. ఈ హిట్ మీ కెరీర్‌కి ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది? యాక్టర్స్ కెరీర్‌కి హిట్ అనేది వంద శాతం అవసరం, తప్పనిసరి. అయితే హిట్ మాత్రమే కెరీర్ కాదు. మంచి పాత్రలు కూడా కావాలి. కొన్నిసార్లు మంచి పాత్రలుంటాయి. అభినందనలు వస్తాయి కానీ వసూళ్లు ఉండవు. అలాగే ఓ కాంబినేషన్ మన కెరీర్‌కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అన్నది ముఖ్యం. వంద శాతం నా కెరీర్‌కి రజనీకాంత్‌గారి కాంబినేషన్, ‘జైలర్’ హిట్ ఉపయోగపడతాయి. ► ‘రంగ మార్తాండ’, ‘జైలర్’ సినిమాల్లో పాత్ర పరంగా మీకు సంతృప్తి ఇచ్చిన మూవీ ఏది? ‘రంగ మార్తాండ’ లాంటి నటనకు ఆస్కారం ఉన్న సినిమా హిట్ అయినా, అవకపోయినా మనసుకు సంతృప్తి ఉంటుంది. అయితే ‘జైలర్’లాంటి హిట్స్ వస్తే ‘రంగ మార్తాండ’ లాంటి సినిమాలు చేసే అవకాశాలు మరిన్ని వస్తాయి.. నా కెరీర్ కూడా మరింత విస్తరిస్తుంది. అయితే ‘రంగమార్తాండ’ లాంటి సినిమాలు కూడా హిట్ కావాలి. కొన్నిసార్లు అలాంటి సినిమాలకు ఎక్కువ అభినందనలు వస్తాయి.. వసూళ్లు రాకపోవచ్చు. ఆర్టిస్ట్‌లకు అభినందనలూ కావాలి.. కలెక్షన్స్ కూడా కావాలి (నవ్వుతూ). ► ఓటీటీ ΄్లాట్‌ఫామ్‌లో ‘క్వీన్’ వెబ్ సిరీస్ తర్వాత కొత్త సిరీస్‌లు చేయడం లేదు. ఎందుకు? ‘క్వీన్’ తర్వాత ‘క్వీన్ 2’ షూటింగ్ 70 శాతం పూర్తి చేశాం. మిగిలిన 30 శాతం షూటింగ్ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతోంది. ‘క్వీన్’ కంటే ‘క్వీన్ 2’ అద్భుతంగా వచ్చింది. ఇక సినిమాలతో బిజీగా ఉండటంవల్ల వేరేవి ఒప్పుకోలేకపోతున్నాను. ► అప్పట్లో మీ తరం వాళ్లకి సినిమాలు తప్ప వేరే ఏమీ లేవు. కానీ, ఈ తరం వాళ్లకి సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్, టీవీ షోలు.. ఇలా చాలా ఉన్నాయి. ఈ మార్పు మీకు ఎలా అనిపిస్తోంది? సోషల్ మీడియాలోని చాలామంది ఇన్ఫ్లుయర్స్లో నటీనటులకంటే ఎక్కువ పాపులర్ అవుతున్నవాళ్లు ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రపంచం ఎంతలా మారింది? అనిపిస్తోంది. మనం కూడా మారుతున్న ప్రపంచంతో ΄ోటీ పడుతూ ముందుకు సాగాలి. ► అయితే ఇప్పుడొస్తున్న కథానాయికలకు మీలా 20, 25 ఏళ్లు లాంగ్విటీ ఉండటంలేదు కూడా... మాకు తప్పులు చేయడానికి, దిద్దుకోవడానికి టైమ్ ఉండేది. ఇప్పుడు ఆ టైమ్ లేదు. వస్తున్నారు.. వెళుతున్నారు.. కానీ మేం అన్ని సంవత్సరాలకు సంపాదించుకున్నది ఇప్పుడు సక్సెస్ అయితే తక్కువ టైమ్‌కే సంపాదించుకుని వెళ్లిపోతున్నారు. టైమ్ ఎలా మారుతుందో దాన్నిబట్టి అన్నీ మారుతున్నాయి. దాంతో పాటు మనం మారాలి. జీవితంలో స్థిరమైనది ఏది అంటే.. అది మార్పు మాత్రమే. ఆ మార్పుకి మనం అడ్జస్ట్ అవ్వాలి. దాంతో పాటు కొనసాగాలి. మనం హ్యాపీగా ఉన్నామనుకోండి అది మారుతుంది. ఒకవేళ దుఃఖంలో ఉన్నాం అనుకోండి అది కూడా మారుతుంది. సో.. ఏదీ నిరంతరంగా ఉండదు.. మార్పు సహజం. ► మీ అబ్బాయి రుత్విక్ ఏం చేస్తున్నాడు... హీరో అవుతాడా? తన నాన్న (కృష్ణవంశీ)లా డైరెక్టర్ అవుతాడా? రుత్విక్‌కి ఇప్పుడు 18 ఏళ్లు. ప్రస్తుతానికి ఫోకస్ అంతా చదువు మీదే. వాడికేం అవ్వాలో వాడికే తెలియదు.. నాకేం తెలుస్తుంది (నవ్వుతూ). తనేం కావాలో రుత్విక్ తెలుసుకుని, మాతో చెబితే మేం స΄ోర్ట్ చేస్తాం. ► ఈ మధ్య రోజాగారు, మీరు కలుసుకున్నారు.. మీ ఇద్దరి అనుబంధం గురించి? రోజా నాకు ఎప్పట్నుంచో తెలుసు. అప్పట్లో ఎలా ఉండేవాళ్లమో ఇప్పుడూ అలానే ఉన్నాం. చాలా సంవత్సరాల తర్వాత నేను తిరుపతి వెళ్లాను. తనే నాకు దర్శనం ఏర్పాటు చేసింది. అద్భుతమైన దర్శనం దక్కింది. సో.. తనకి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్లాను. ► ఇద్దరూ సినిమాలు, రాజకీయాల గురించి మాట్లాడుకున్నారా? రెండింటి గురించి మాట్లాడుకోలేదు. లైఫ్ గురించి మాట్లాడుకున్నాం. నా అబ్బాయి ఏం చేస్తున్నాడు.. తన పిల్లలు ఏం చేస్తున్నారు? అనే విషయాలు మాట్లాడుకున్నాం. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి ఇంత బిజీగా ఎలా ఉండ గలుగుతున్నావ్ అని అడిగాను. ఇలాంటివే... ► రోజాగారితో మాట్లాడాక మీక్కూడా పాలిటిక్స్ పై ఏమైనా ఆసక్తి కలిగిందా? మీరూ పాలిటిక్స్‌లోకి వచ్చే అవకాశం ఉందా? పాలిటిక్స్ పై ఇంట్రస్ట్ అనేది ఒకర్ని చూసి వచ్చేది కాదు. ఎవరికి వాళ్లకి ఉండాలి. కొందరికి ఇంట్రస్ట్ ఉంటుంది.. కొందరికి ఉండదు. బట్.. రోజా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. నేను కళ్లారా చూశాను. ► భవిష్యత్తులో ఏదైనా పార్టీ నుంచి మీకు ఆఫర్ వస్తే పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవుతారా? ఏమో.. నాకు తెలియదు. వచ్చినప్పుడు చూద్దాం. -
ఆ ఆపజయాల వల్లే తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ: రమ్యకృష్ణ
రమ్యమైన నటి రమ్యకృష్ణ. తొలి రోజుల్లో గ్లామరస్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈమె ఆ తర్వాత నటనకు ప్రాముఖ్యత కలిగిన పాత్రలో మెప్పించారు. రజినీకాంత్‌తో కలిసి నటించిన 'నరసింహ' చిత్రానికి ముందు వరకు కథానాయకిగా నటించిన రమ్యకృష్ణ ఆ చిత్రంలో ప్రతినాయకి పాత్రలో రజనీకాంత్‌కు దీటుగా నటించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికీ ఆ చిత్రంలోని నీలాంబరిగా రమ్యకృష్ణ నటనను ఎవరు మర్చిపోలేరు. ఆ తర్వాత బాహుబలి చిత్రంలో రాజమాత శివగామిగా జీవించారు. (ఇదీ చదవండి: శ్రీహరి కట్టిన తాళి మాత్రమే మిగిలింది.. ప్రస్తుతం మా పరిస్థితి ఇదే: డిస్కో శాంతి) తాజాగా జైలర్ చిత్రంలో రజనీకాంత్‌కు భార్యగా అత్యంత సహజంగా నటించారు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ సినీ రంగ ప్రవేశం చేసిన తొలి రోజుల్లో తనకు సరిగ్గా నటించడం తెలియలేదు అన్నారు. నటిగా తన తొలి చిత్రం తమిళంలో 'వైళ్లె మనసు' అని చెప్పారు.1988లో తమిళ్లో నటించిన ముదల్ వసంతం చిత్రాన్ని ఇటీవల చూసిన తన తల్లి నువ్వు ఇలాంటి నటనతో ఎంతకాలం ఎలా నిలబడగలిగావు అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారన్నారు. దీంతో అప్పట్లో తన నటన ఎలా ఉండేది అన్నది అర్థం చేసుకోండి అని అన్నారు. అలా తాను తమిళంలో నటించిన పలు చిత్రాలు అపజయాన్ని చూడడంతో తెలుగు చిత్రంపై దృష్టి సారించానని అన్నారు. అయితే తెలుగులో లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నటిగా కొంచెం కొంచెం ఎదుగుతూ వచ్చానని రమ్యకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈమె ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. -
రజినీకాంత్ 'జైలర్'.. సగం బడ్జెట్ ఆయనకే ఇచ్చేశారుగా!
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ నటించిన చిత్రం జైలర్. ఆగస్టు 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి దాదాపు 225 కోట్ల రూపాయలతో రూపొందించిట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో నటీనటుల రెమ్యునరేషన్‌పై కూడా అంతేస్థాయిలో చర్చ నడుస్తోంది. రజినీకాంత్‌తో పాటు మోహన్ లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, తమన్నా పారితోషికంపై ఎంతన్న విషయమైన పెద్దఎత్తున కోలీవుడ్‌లో చర్చ మొదలైంది. భారీ తారాగణం ఉండడంతో అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: 'ఆలియా భట్ తండ్రి అసభ్య ప్రవర్తన'.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏమందంటే?) ఓ ప్రముఖ సంస్థ నివేదికల ప్రకారం.. రజనీకాంత్ తన పాత్ర కోసం రూ.110 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. సినిమా మొత్తం బడ్జెట్లో 48 శాతం పారితోషికమే ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఇకపోతే మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ కూడా పెద్దమొత్తంలోనే తీసుకున్నట్లు తెలుస్తోంది. మోహన్‌లాల్‌కు రూ.8 కోట్లు, శివరాజ్‌కుమార్‌కు రూ.4 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్‌కు రూ.4 కోట్లు, హీరోయిన్ తమన్నా భాటియాకు రూ.4 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చిత్రంలో రజినీకాంత్ భార్యగా నటించిన రమ్య కృష్ణ రూ. కోటి రూపాయలు చెల్లించినట్లు కోలీవుడ్ టాక్. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో కనిపించారు. కాగా.. ఇప్పటికే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: జైలర్ మరో రికార్డ్.. సూపర్ హిట్ చిత్రాన్ని వెనక్కినెట్టి!) -
చెమటతో తడిసిపోయిన పాయల్.. బీచ్ ఒడ్డున అతుల్య
కెనడా ట్రిప్‌లో హీరోయిన్ రీతూవర్మ వర్కౌట్ దెబ్బకు పాయల్‌కు చెమటలు పలుచటి చీరలో మీనాక్షి మెరుపులు బీచ్ ఒడ్డున హీరోయిన్ అతుల్య పోజులు పొట్టి స్కర్ట్‌లో అరియానా హాట్ స్టిల్స్ తమన్నా పాటకు రమ్యకృష్ణ స్టెప్పులు ఐశ్వర్యా రాజేశ్ హీటెక్కించే ఫొటోలు కేజీఎఫ్ బ్యూటీ కనువిందు చేసే పోజుల్లో View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) #payalrajput pic.twitter.com/DimV0vWESL — 🎭 (@MrXholic69) July 29, 2023 View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by ✨Prakruthi Ananth 💄🎨✨ (@prakatwork) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) -
హీరోలా ఉన్న రమ్యకృష్ణ కొడుకు...!
-
రమ్యకృష్ణ అందరి ముందు నా మీద అరవడం కరెక్ట్ కాదు..
-
మూడు పెళ్లిళ్లు.. అందుకే విడాకులు నయనతార రమ్యక్రిష్ణ తో విబేదాలు
-
‘రంగమార్తాండ’ క్లైమాక్స్ అలా ఉండి ఉంటే మరింత బాగుండేది
పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన రివ్యూలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవలే విడుదలైన సూపర్ హిట్ టాక్ అందుకున్న 'రంగమార్తాండ' చిత్రంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, అనసూయ ప్రధానపాత్రల్లో నటించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..'సినిమా గురించి నేను ఎక్కువ చెప్పడం లేదు. ఈ సినిమాలో జీవితం గురించి ఉంది కాబట్టి చెబుతున్నా. ప్రస్తుత సమాజంలో ఎక్కడైనా ఏదైనా జరుగుతూ ఉంటే చూసి కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఒక అమ్మాయిని చంపుతుంటే ఎవరు పట్టించుకోకుండా వీడియోలు తీసే సీన్‌తోనే సినిమా ప్రారంభమైంది. ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, రాహుల్, అనసూయ, శివాత్మిక, ఆదర్శ్ అద్భుతంగా నటించారు. శివాత్మిక పాత్ర అద్దం పట్టేలా ఉంటుంది. ఒక కూతురు తన తండ్రిని సెల్లార్లో పడుకోమని చెప్పినప్పుడు ప్రేక్షకులకు తప్పకుండా కన్నీళ్లు వచ్చేస్తాయి. ఈ సినిమాలో బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బ్రహ్మానందం అంటే నవ్విస్తాడనుకుంటాం. కానీ ఆయన ఏడిపించగలడని ఈ సినిమాలో నిరూపించారు. మన అమ్మా, నాన్నలను మించినది ఏది లేదు. మనకు ఏది రాదు కూడా. అందుకే వారిని పదిలంగా చూసుకుందాం. ఈ సినిమా చూశాక ఎవరైనా తమ అమ్మా, నాన్న దగ్గరకు వెళ్లి ఉంటే కృష్ణవంశీ జన్మ ధన్యమైనట్లే. కళాభారతిని చూసి రాఘవరావు అంటే ప్రకాశ్ రాజ్ కన్న మూయడం. పిల్లలందరూ వచ్చి చూడడంతో క్లైమాక్స్ చూపించారు. కళాభారతిని పునర్ నిర్మాణం చేయించి.. రాఘవరావు సౌజన్యంతో అని పెట్టి క్లైమాక్స్ సీన్ తీసి ఉంటే ఇంకా బాగుండేది. ఈ విషయాన్ని కృష్ణవంశీతో చెప్పా. కానీ ఒరిజినల్ కథలో అలా లేదు. అందుకే పెట్టలేదన్నారు. ప్రకాశ్‌రాజ్‌కు, బ్రహ్మనందానికి మధ్య ఉండే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. అంతే కాకుండా ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం నటనా ప్రావీణ్యాన్ని తెలిసేలా ఇంకొన్ని షాట్స్ పెట్టి ఉంటే మరిన్ని వసూళ్లు రాబట్టేది. కన్నీళ్లు రావు అనుకున్న వాళ్లకు కూడా కన్నీళ్లు తెప్పించే సినిమా ఇది.' అని పరుచూరి వివరించారు. -
ఆ సినిమాలో చేస్తే అవకాశాలు రావన్నారు: శివాత్మిక రాజశేఖర్
జీవిత రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి శివాత్మిక. 'దొరసాని' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు శివాత్మిక. ఆ తరువాత కూడా తనకి తగిన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన 'రంగమార్తాండ'లో శివాత్మిక చేసిన పాత్రతో మరింత ఫేమ్ వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ చూసిన సినీ ప్రేక్షకులు శివాత్మిక పాత్రను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూతురిగా నటించి కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లు తెప్పించింది. తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారామె. శివాత్మిక మాట్లాడుతూ.. ‘రంగమార్తాండలో నాది మెయిన్ రోల్ కాదు. అందుకే సినిమాకు అంగీకరించినప్పుడే నాకు చాలా మంది వద్దని చెప్పారు. ఆ సినిమా చేస్తే నీకు అవకాశాలు రావన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చెయ్యొద్దని సలహా ఇచ్చారు. అలాంటి సినిమాలు ఎవరూ చూడరని చెప్పారు. చాలా భయపడతారు. కానీ ఇప్పుడు ఆ సినిమానే మంచి హిట్ అయి పేరు తీసుకొచ్చింది. కానీ దొరసాని సినిమా సమయంలో నేను చాలానే ఊహించుకున్నా. ఇక వరుసగా ఒక్కో సినిమా చేసుకుంటూ వెళ్లిపోవడమే అనుకున్నా. కానీ ఆ తరువాత గ్యాప్ వచ్చింది. దీంతో నేను అనుకున్నంత ఈజీ కాదన్న విషయం అప్పుడర్థమైంది.' అంటూ చెప్పుకొచ్చింది. -
'నీ బంగారు నిన్ను దొంగ అంటోంది'.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్
ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రంగమార్తాండ'. దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఉగాది కానుకగా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను హౌల్ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ చూస్తే కుటుంబంలో జరిగే సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించినట్లు కనిపిస్తోంది. కుటుంబ నేపథ్యంలో సాగే ఎమోషన్స్, డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ముఖ్యంగా రమ్యకృష్ణ-ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం-ప్రకాశ్ రాజ్ మధ్య సాగే ఎమోషన్స్ ఈ చిత్రంలో హైలెట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్లో బ్రహ్మనందం సీరియస్ లుక్ సినిమాకే హైలెట్‌గా మారనుంది. జీవితంలో నటనను ప్రాణంగా భావించే ఒక రంగస్థల కళాకారుడి జీవిత అనుభవాలను సినిమాగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కూడా ఈ చిత్రంలో నటించారు. ఇప్పటికే సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ షోను ప్రదర్శించగా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. -
'రేయ్.. నువ్వొక చెత్త నటుడివిరా'.. ఆసక్తిగా టీజర్
ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. రంగమార్తాండ టీజర్ ఫుల్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నేను ఒక నటుడిని అనే చిరంజీవి వాయిస్‌తో టీజర్ మొదలైంది. 'రేయ్.. నువ్వు ఒక చెత్త నటుడివిరా.. మనిషిగా అంతకంటే నీచుడివిరా' అనే బ్రహ్మనందం డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. 'నేను సహస్త్ర రూపాల్లో సాక్షాత్కారించిన నటరాజు విరాట స్వరూపాన్ని.. రంగమార్తాండ రాఘవరావుని' అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పె డైలాగ్‌తో టీజర్ అదిరిపోయింది. ఈ నెల 22న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం రంగమార్తాండుడి జీవన నాటకమని దర్శకుడు కృష్ణవంశీ పేర్కొన్నారు . ఈ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషించగా.. ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు తెలుగు రీమేక్‌గా ‘రంగమార్తాండ’ చిత్రాన్ని తెరకెక్కించారు. -
ఆమాత్రం దానికి మేమెందుకు?: రమ్యకృష్ణ ఫైర్
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారం అవుతున్న డాన్స్ ఐకాన్ షో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తూ దూసుకుపోతుంది. ఈ షో లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ వచ్చీ రావడంతోనే మాటల యుద్ధం మొదలయ్యింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకి అసిఫ్ అండ్ రాజు కలిసి చేసిన డ్యాన్స్‌కు సోహైల్ రెడ్ బోర్డు చూపించాడు. దాంతో హర్ట్ అయిన శ్రీముఖి.. అది మోనాల్ కూర్చున్న సీట్ ప్రభావం అంటూ గొడవ మొదలుపెట్టింది. దానికి సోహైల్ వాళ్ళిద్దరి మధ్య కో ఆర్డినేషన్ లేదని చెప్పాడు. తర్వాత గోవింద్, సౌమ్య డ్యాన్స్ చేసినప్పుడు యష్ మాస్టర్, శ్రీముఖి పెదవి విరిచారు. దీంతో సోహైల్ డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించడంతో శ్రీముఖి వెటకారం స్టార్ట్ చేసింది. ఈ లోగా రమ్యకృష్ణ కూడా మీరు చెప్పినట్టు చెప్పడానికి ఈ సీట్లో మేము కూర్చోవడం ఎందుకు అంటూ సీరియస్ అయ్యింది. మరి ఈ డాన్స్ రియాలిటీ షోలో ఇంకా ఎన్ని ట్విస్టులు, టర్నులు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ వారం డాన్స్ ఐకాన్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే. చదవండి: కృష్ణ సినిమాల్లోకి రావడానికి కారణమెవరో తెలుసా? అదే సూపర్‌స్టార్ కృష్ణ చివరి సినిమా! -
బహు భాషా కోవిదురాలు రమ్యకృష్ణ గోవర్ధన్‌పై ప్రశంసలు
హైదరాబాద్ బాలిక రమ్యకృష్ణ గోవర్ధన్‌పై తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. దశాబ్దకాలంగా తెలంగాణ, దక్షిణ కొరియా భాష, సంస్కృతి, సంగీత, చలనచిత్రాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ నుంచి మొట్ట మొదటి విద్యార్థిగా ‘తూర్పు ఆసియా - కొరియన్ భాష, సాహిత్య, చరిత్ర అధ్యయనం’ చేసేందుకు అమెరికాకు చెందిన ఆరు యూనివర్సిటీలు రమ్యకు స్కాలర్షిప్లు అందించేందుకు ముందుకు వచ్చాయి. రమ్యకష్ణ ప్రతిభాపాటవాలపై మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. ఆమె 11 సంవత్సరాల వయస్సు నుండి కొరియన్ భాషను అనర్గళంగా మాట్లాడే నైపుణ్యాన్ని సంపాదించారని చెప్పారు. 13 సంవత్సరాల వయస్సులో హైదరాబాద్‌లో ‘హైదరాబాద్ కెపాపర్స్’ పేరుతో భారత- తెలంగాణ- కొరియా సాంస్కృతిక సంస్థను స్దాపించడం గొప్ప విషయమని తెలిపారు. తెలంగాణ - భారత- కొరియా సంస్కృతిని ప్రోత్సహించడానికి ఎనలేని కృషి చేసిన ఆమె బహు భాష కోవిదురాలని అన్నారు. చైనీస్, జాపనీస్, ఫ్రెంచ్ భాషలలో ప్రావీణ్యం సంపాదించారని కొనియాడారు. ప్రభుత్వ ప్రోత్సాహం మరువ లేనిది తెలంగాణలో కొరియన్ భాష, సంస్కృతి, కళల ప్రోత్సాహానికి మామిడి హరికృష్ణ అండగా నిలిచారని రమ్యకృష్ణ చెప్పారు. తనకు తోడ్పాటు అందించిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. -
ఓటీటీలోకి రమ్యకృష్ణ అరంగేట్రం, ఆ డాన్స్ షోలో ‘శివగామి’ సందడే సందడి..
ప్రేక్షకులకు వందశాతం వినోదం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా. ప్రేక్షకులు వందశాతం వినోదం అందించేందుకు ఆహా సరికొత్త కథలు, షోలతో ముందుకు వస్తోంది. అన్‌స్టాపబుల్ టాక్ షో విత్ ఎన్బీకే, తెలుగు ఇండియన్ ఐడల్ వంటి రియాలిటీ షోలతో ప్రేక్షకులను అలరించిన ఆహా తాజాగా డాన్స్ ఐకాన్ షోతో సిద్ధమైంది. ఆహా ప్లాట్‌ఫాంపై తాజాగా గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ షోతో లేడీ సూపర్ స్టార్, ‘శివగామి’ రమ్యకృష్ణ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా? ప్రముఖ యాంకర్ ఓంకార్ హొస్ట్‌గా చేయనున్న ఈ షోకి ఆమె జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు కింగ్ ఆఫ్ హుక్ స్టెప్స్ శేఖర్ మాస్టర్ కూడా న్యాయనిర్ణేతగా ఉండబోతున్నాడు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ.. ‘డ్యాన్స్ ఐకాన్ వంటి షోతో ఆహాలో జడ్జిగా అరంగేట్రం చేస్తుండడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక ఫార్మాట్ ఈ మధ్య కాలంలో ఎవ్వరూ చేయనిది. ఈ షో ద్వారా ఎవరూ చూడని ఒక కొత్త రమ్యని చూడబోతున్నారు. అందరూ ఈ షో ని ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. చదవండి: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న కార్తికేయ 2! ఎప్పుడు, ఎక్కడంటే.. అదే విధంగా ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘డ్యాన్స్ ఐకాన్‌తో ఆహా ఫ్యామిలీకి రమ్యకృష్ణని మేము స్వాగతిస్తున్నాము. రమ్య ఎంతో మందికి ఒక రోల్ మోడల్. డ్యాన్స్‌పై ఆమెకున్న అవగాహన అసమానమైనది. డాన్స్ ఐకాన్‌కు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. అనంతరం యాంకర్, ఈ షో ప్రొడ్యూసర్ ఓంకార్ “రమ్యకృష్ణ గారు ఈ షో కి జడ్జి గా వ్యవహరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. రమ్య గారితో పనిచేయాలి అనే నా కల, ఆహ టీం ద్వారా సాకరమైంది. డాన్స్ ఐకాన్ షో ద్వారా అందరికీ నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ దొరకనుంది’ అని తెలిపారు. ఈ షో సెప్టెంబర్ 17 నుండి ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ఆహాలో అందుబాటులో ఉండనుంది. -
రమ్యకృష్ణ చెన్నైలో ఉంటుంది, నేనేమో హైదరాబాద్‌లో..: కృష్ణవంశీ
టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్‌గా కృష్ణవంశీకి పేరుంది. గులాబీ, సింధూరం, ఖడ్గం, అంతఃపురం వంటి సినిమాలతో ఇండస్ట్రీకి హిట్స్ ఇచ్చిన కృష్ణవంశీ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా 'రంగమర్తాండ'. నక్షత్రం సినమా తర్వాత దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు కృష్ణవంశీ. ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆయన సినిమాకు సంబంధించిన విశేషాలతో పర్సనల్ లైఫ్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'రమ్యకృష్ణ రేంజ్‌ని మ్యాచ్ చేయాలనే టెన్షన్ నాకు ఉంటుంది. నాకు ఆమెతో కాంపిటిషన్ ఉంటుంది. కొడుకుతో కలిసి రమ్యకృష్ణ చెన్నైలో ఉంటోంది. నేనేమో హైదరాబాద్‌లో ఉంటున్నా. ఎప్పుడూ ఖాళీ దొరికినా నేను అక్కడికి వెళ్తుంటా. లేదా వాళ్లే నా దగ్గరికి వస్తుంటారు. ఇక మా అబ్బాయి రిత్విక్ చాలా యాక్టివ్. ఎంతైనా క్రాస్‌బ్రీడ్ కదా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రమ్యకృష్ణ, మీరు వేరేవేరుగా ఉంటే పుకార్లు వస్తుంటాయి కదా అని అడగ్గా.. అలాంటివి తాము పట్టించుకోమని, ఇండస్ట్రీలో ఇలాంటి గాసిప్స్ కామన్' అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అందరికీ గాసిప్స్ అంటేనే ఇంట్రెస్ట్ కదా అంటూ సమాధానమిచ్చారు. -
‘లైగర్’ మూవీకి రమ్యకృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య నిన్న(ఆగస్టు 25న) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. రిలీజ్‌కు ముందు చేసిన ప్రచార కార్యక్రమాలు, పాటలు, ట్రైలర్‌తో సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. అయితే అదేక్కడ సినిమాలో కనిపించలేదని అంటున్నారు ప్రేక్షకులు. చదవండి: అనసూయ, విజయ్ ఫ్యాన్స్ మధ్య ట్విటర్ వార్, తగ్గేదే లే అంటున్న యాంకరమ్మ ఇక ఏదేమైన పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ క్రమంలో మూవీ బడ్జెట్, హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ లైగర్‌ను భారీ తారాగణంతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. లీడ్ రోల్స్‌తో పాటు లైగర్‌లో ప్రధాన పాత్రలు పోషించిన సీనియర్ నటి రమ్యకృష్ణ, మైక్ టైసన్‌ల పారితోషికంపై కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకు విజయ్ రూ. 35 కోట్లు తీసుకున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. చదవండి: ఒక్క సినిమాకే భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన ‘సీత’? అవాక్కవుతున్న నిర్మాతలు! ఈ రూమర్స్ ప్రకారం విజయ్ ఈ మూవీకి రూ. 35 కోట్ల పారితోషికం తీసుకున్నాడట. ఇక విజయ్ తల్లిగా.. పవర్ఫుల్ మదర్‌గా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన రమ్యకృష్ణ కోటీ రూపాయలు తీసుకోగా.. కోచ్‌గా కనిపించిన రోనిత్ రాయ్ రూ. 1.5 కోట్లు తీసుకున్నాడట. ఇక హీరోయిన్గా ఈ సినిమాలో అందాలు ఆరబోసిన అనన్య పాండే కూడా బాగానే చార్జ్ చేసిందట. ఈ సినిమాకు ఆమె రూ. 3 కోట్లు అందుకుందని సమాచారం. ఇక సినిమాకు హైలెట్ రోల్‌గా మొదటి నుంచి పేరు తెచ్చుకు మైక్ టైసన్ విజయ్ కంటే ఎక్కువగా రూ. 40 కోట్లు అందుకున్నాడని తెలుస్తోంది. -
చీరకట్టులో రమ్యకృష్ణ ఇబ్బందులు.. అయినా ఫొటోలకు పోజులు
Ramya Krishnan Gets Irritated With Saree Video Goes Viral: ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ అందం, నటన, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నీలాంబరిగా.. శివగామిగా.. ఇలా ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్‌కే కొత్త అర్థం తీసుకొస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న రమ్యకృష్ణ ప్రస్తుతం ప్రాధాన్యత గల పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. బాహుబలిలో శివగామిగా అలరించిన రమ్య కృష్ణ 'బంగార్రాజు', 'రొమాంటిక్' సినిమాల్లో కీలక పాత్రల్లో సందడి చేసింది. తాజాగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగ్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లైగర్' మూవీలో మరో పవర్ఫుల్ పాత్రతో ముందుకు రానుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జోడీగా నటించిన ఈ మూవీ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌ను భారీగా నిర్వహిస్తోంది చిత్రబృందం. ఇందులో భాగంగానే ముంబైలో పలు ఇంటర్వ్యూలూ నిర్వహిస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ ప్రమోషన్స్‌లో రమ్యకృష్ణ పాల్గొంది. ఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ కనువిందు చేసింది. స్టూడియో బయట ఫొటోగ్రాఫర్లకు పోజులిస్తూ సందడి చేసింది. సన్నని గాలి తాకుతుంటే పలుచని చీరలో రమ్యకృష్ణ అందం మతిపోగెట్టాల ఉంది. గాలికి చీర సర్దుకుంటూ, జుట్టు సవరించికుంటూ కొంచెం ఘాటుగానే దర్శనమిచ్చింది శివగామి. అయితే అలా గాలికి చీర జరగడంతో రమ్యకృష్ణ కాస్త ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. చదవండి: నా సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్ ఎక్కువ ఫ్లాప్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరని గూగుల్ చేసేవాడిని: నితిన్ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు నీలాంబరికి ఇంకా వయసు అవ్వలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 'లైగర్'లో విజయ్ దేవరకొండకు తల్లిగా రమ్యకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే. మరీ ఈ పాత్రతో రమ్యకృష్ణ ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
రమ్యకృష్ణతో విడాకులు? స్పందించిన కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రంగమర్తాండ'. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు కృష్ణవంశీ. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న ఆయన సినిమాకు సంబందించిన విశేషాలతో పాటు మ్యారేజ్ లైఫ్‌పై వస్తోన్న రూమర్స్‌పైనా స్పందించారు. గత కొన్నాళ్లుగా కృష్ణవంశీ- నటి రమ్యకృష్ణ విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ ఈ వార్తలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. 'బాధ్యతలంటే భయంతో అసలు పెళ్లే వద్దునుకున్నా. కానీ చివరకు రమ్యకృష్ణతో వివాహం జరిగింది. ఇదంతా లైఫ్ డిజైన్ అని భావిస్తాను. పెళ్లి తర్వాత నా జీవితంలో పెద్దగా మార్పులు రాలేదు. రమ్యకృష్ణ నన్ను నన్నులా ఉండనిచ్చింది. ఇక ఆమెతో విడాకులు అంటారా? ఇందులో నిజం లేదు. పబ్లిక్ ఫిగర్స్‌గా ఉన్నప్పుడు ఇలాంటి పుకార్లు వస్తుంటాయి. కానీ మేం పెద్దగా పట్టించుకోం. అందుకే ఖండించాలని కూడా అనుకోము. జస్ట్ నవ్వి ఊరుకుంటాం' అంతే అంటూ చెప్పుకొచ్చారు.