పోర్న్‌ స్టార్‌గా రమ్యకృష్ణ..! | Ramya Krishna to Act As A Porn Star Super Deluxe | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 19 2019 1:40 PM | Last Updated on Sat, Jan 19 2019 1:40 PM

Ramya Krishna to Act As A Porn Star Super Deluxe - Sakshi

బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ఆకట్టుకున్న సీనియర్‌ నటి రమ్యకృష్ణ మరో సాహసం చేస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫుల్‌ బిజీగా ఉన్న రమ్య, ఓ తమిళ సినిమా కోసం పోర్న్‌స్టార్‌ పాత్రలో కనిపించనున్నారు. విజయ్‌ సేతుపతి, సమంత జంటగా త్యాగరాజన్‌ కుమారరాజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సూపర్‌ డీలక్స్‌. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు.

ఇదే సినిమాలో రమ్యకృష్ణ.. లీలా అనే శృంగార తారగా కనిపించనుంది. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలు వెల్లడించారు. ముందుగా ఈ పాత్రకు నదియాను సంప్రదించగా ఆమె తిరస్కరించడంతో రమ్యకృష్ణను తీసుకున్నామని తెలిపారు. ఈ సినిమాలో సమంత కూడా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement