Samantha Kanmani Rambo Khatija Movie Lock OTT Platform: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, లేడీ సూపర్ స్టార్ నయన తార, విలక్షణ నటుడు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కలిసి నటించిన చిత్రం 'కాతు వాకుల రెండు కాదల్'. రొమాంటిక్, కామెడీ ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాను రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
చదవండి: హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం
నేడు (ఏప్రిల్ 28) సమంత పుట్టినరోజు సందర్భంగా 'కణ్మనీ రాంబో ఖతీజా' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. అయితే ఈసినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదనే చెప్పాలి. దీంతో థియేటర్లో ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇదిలా ఉంటే అప్పుడే ఈ మూవీ ఓటీటీ స్ట్రిమింగ్‌పై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అఖండ, భీమ్లా నాయక్ వంటి పెద్ద సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.
చదవండి: 'కణ్మనీ రాంబో ఖతీజా' మూవీ రివ్యూ
అయితే వీటి ప్రభావం ఈ మూవీపై పడే అవకాశం ఉంది. దీంతో ఈ సినిమాను కాస్తా ఆలస్యంగానే స్ట్రీమింగ్ చేయాలని హాట్‌స్టార్ నిర్వహకులు అనుకుంటున్నారట. లేదంటే సాధారణంగా ఏ సినిమా అయిన థియేటర్లో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలోకి వస్తుంది. అలాగే ‘కాతు వాక్కుల రెండు కాదల్’(కణ్మనీ రాంబో ఖతీజా) కూడా నాలుగు వారాల తర్వాత అంటే మే చివరి వారంలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment