Samantha Ruth Prabhu Kaathuvaakula Rendu Kaadhal Movie: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తన తాజా చిత్రాల్లో ఒకటైన 'కాతువాకుల రెండు కాదల్' సినిమా గురించి కొత్త అప్‌డేట్ ఇచ్చింది సామ్. ఈ సినిమా చిత్రీకరణ పూర్తియినట్లు సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అలాగే మూవీ రిలీజ్ డేట్‌ను కూడా చెప్పేసింది. 'మీరంతా కడుపు చెక్కలయ్యేలా నవ్వడం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇంకొన్ని రోజులే ఉన్నాయి. ఏప్రిల్ 28న విడుదల కానుంది.' అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌కు సినిమాలోని కొన్ని సన్నివేశాలతోపాటు షూటింగ్ ముగింపు వేడుక ఫొటోలను పంచుకుంది. విజయ్ సేతుపతిని పట్టుకుని నయన తార, సమంత వేలాడి ఉండటం ఆకట్టుకుంటుంది.
చదవండి: సమంత 'యశోద'కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న 'కాతువాకుల రెండు కాదల్' సినిమాను ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ట్రయాంగిల్ ప్రేమకథతో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది ఈ చిత్రం. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఉదయనిధి స్టాలిన్ తన రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కాగా సమంత యశోద, శాకుంతలంతోపాటు హాలీవుడ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ డైరెక్షన్‌లో మరో మూవీ చేయనుంది సామ్.
చదవండి: మాటలు సరిపోవట్లేదు, ఎప్పటికీ నా మదిలో నిలిచిపోతాయి: సమంత
Comments
Please login to add a commentAdd a comment