Lady Superstar Nayanthara 75 Shooting Begins Soon - Sakshi
Sakshi News home page

Nayanthara: నయనతార ఆశలన్నీ 75 పైనే!

Jul 3 2023 7:40 AM | Updated on Jul 3 2023 8:54 AM

Nayanthara Lady Superstar 75 Begins Shoot Soon - Sakshi

సంచలనాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ నయనతార. ఈమె నట జీవితం అంతా వివాదాలు, వినోదాలతోనే సాగుతుందని చెప్పవచ్చు. మొదట్లో నటుడు శింబును గాఢంగా ప్రేమించిన నయనతార అది పెళ్లికి దారి తీస్తుందని నమ్మారు అయితే ఆ ప్రేమ బెడిసికొట్టింది. ఆ తర్వాత నృత్య దర్శకుడు, నటుడు ప్రభుదేవాతో ప్రేమ ఇక ఏడడుగులు వేయడమే ఆలస్యం అన్నంత వరకు వెళ్లింది. అయితే ఆ ప్రేమ కథ అడ్డం తిరిగింది. ఇక ఇటీవల దర్శకుడు విగ్నేష్‌శివన్‌తో కొంతకాలం సహజీవనం చేసి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయ్యారు.

(ఇదీ చదవండి: రూ. 20 కోట్లతో ఇల్లు కొన్న టాప్‌ హీరోయిన్‌.. ఆయన బహుమతే కదా అంటూ..)

అయినా ఇప్పటికీ నటనకు మాత్రం దూరం కాలేదు. అయితే పెళ్లి అయిన తరువాత కెరీర్‌ మాత్రం ఆశించిన స్థాయిలో సాగడం లేదనే మాట వినిపిస్తోంది. భారీ చిత్రాల అవకాశాలు రావడం, నటించిన చిత్రాలు కూడా ఆశించిన విధంగా ఆడడం లేదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే బాలీవుడ్‌ ఎంట్రీ.. షారుక్‌ ఖాన్‌ జంటగా జవాన్‌ చిత్రంలో నటించడం ఒక్కటే ప్లస్‌ పాయింట్‌ అని చెప్పక తప్పదు. లేడీస్‌ సూపర్‌స్టార్‌ స్థానాన్ని అనుభవించిన నయనతార ఇప్పుడు దాన్ని నిలుపుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఎందుకు నయనతార తన 75వ చిత్రాన్నే నమ్ముకున్నారు. ఇది లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రం.

ఇందులో జై కథానాయకుడిగా నటిస్తున్నారు. రాజారాణి చిత్రం తర్వాత వీళ్లు కలిసి నటిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా శంకర్‌ శిష్యులు నీలేష్‌ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇది తిరుచ్చి, చైన్నెలలో జరిగే కథా చిత్రంగా ఉంటుందని, ఇందులో నయన మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువతిగా నటిస్తున్నట్లు సమాచారం. ఓకే చోట పనిచేసే నయనతార, జై మధ్య ప్రేమను దర్శకుడు కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నట్లు తెలిసింది.


(ఇదీ చదవండి: వాళ్లు బాలకృష్ణ మనుషులని నాకు తెలియదు: కిర్రాక్‌ ఆర్పీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement