Kaathu Vaakula Rendu Kaadhal Telugu Trailer Released: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, లేడీ సూపర్ స్టార్ నయన తార, విలక్షణ నటుడు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కలిసి నటించిన చిత్రం 'కాతు వాకుల రెండు కాదల్.' ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తమిళం, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు. అలాగే ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ తమిళ ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేయగా.. తెలుగు ట్రైలర్‌ను శనివారం (ఏప్రిల్ 23) రిలీజ్ చేశారు. తెలుగులో 'కన్మణి రాంబో ఖతీజ' టైటిల్‌తో థియేటర్లలో విడుదల కానుంది. అనిరుధ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. కన్మణిగా నయనతార, ఖతీజ పాత్రలో సమంత.. ఇక రాంబోగా విజయ్ సేతుపతి కామెడీ పండించనున్నారు. ట్రైలర్‌లో ఈ ముగ్గురి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వించేలా ఉన్నాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి కామెడీ జోడించి డైరెక్ట్ చేశారు విఘ్నేష్ శివన్.
చదవండి: సమంత 'యశోద'గా వచ్చేది అప్పుడే.. నాగ చైతన్య, అఖిల్‌తో పోటీ !
Comments
Please login to add a commentAdd a comment