హీరోయిన్ నయనతార రీసెంట్ టైంలో చెప్పుకోదగ్గ సినిమాలేం చేయలేదు. కానీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. దీనికి కారణం వివాదాలు. కొన్నాళ్ల క్రితం తమిళ స్టార్ హీరో ధనుష్‌తో పెద్ద గొడవే పెట్టుకుంది. ఇందులో నయన్ భర్త విఘ్నేశ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇతడిపై షాకింగ్ రూమర్స్ వచ్చాయి. ఏకంగా ప్రభుత్వ భూముల్నే కొనేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ఇప్పుడు దీనిపై స్వయంగా విఘ్నేశ్ క్లారిటీ ఇచ్చేశాడు.
దర్శకుడు విఘ్నేశ్ శివన్.. ఈ మధ్య పుదుచ్చేరికి వెళ్లి ముఖ్యమంత్రి, పర్యాటక శాఖామంత్రిని కలిసి వచ్చాడు. అయితే పుదుచ్చేరి బీచ్ రోడ్‌లో ప్రభుత్వానికి చెందిన సీగల్ హోటల్‌ని కొనుగోలు చేసే ప్రయత్నాల్లో విఘ్నేశ్ ఉన్నాడని ప్రచారం మొదలైంది. అందుకే స్వయంగా సీఎంని కలిసి వచ్చాడనే పుకారు వచ్చింది. కానీ ప్రభుత్వ ఆస్తిని అమ్మడం కుదరదని పర్యాటక శాఖామంత్రి చెప్పడంతో విఘ్నేశ్ తిరిగొచ్చేశాడని మాట్లాడుకున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో పుకార్ల అన్ని అబద్ధాలే అని విఘ్నేశ్ శివన్ పేర్కొన్నాడు. తన పాండిచ్చేరి పర్యటన వెనకున్న కారణాన్ని ఇప్పుడు బయటపెట్టాడు. 'నా సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' షూటింగ్ అనుమతి తీసుకునేందుకు అక్కడికి వెళ్ళాను. గౌరవ మర్యాదలతో ముఖ్యమంత్రిని, పర్యాటక శాఖా మంత్రిని కలిశాను. అనుకోకుండా, నాతో పాటు వచ్చిన లోకల్ మేనేజర్.. నా మీటింగ్ తర్వాత దేని గురించో వాళ్ళతో మాట్లాడారు. దీంతో ఆ చర్చ నాకోసమే అని పొరబడుతున్నారు. వస్తున్న రూమర్స్ ఏవి నిజం కాదు' అని విఘ్నేష్ శివన్ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.
'నానుమ్ రౌడీ దానే' సినిమాతో దర్శకుడిగా మారిన విఘ్నేశ్ శివన్.. తొలి మూవీతో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. కానీ తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు గానీ ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవ్వడం లేదు. మధ్యలో నయన్ని ప్రేమించి పెళ్లి చేసుకునే విషయంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మువీ చేస్తున్నాడు. ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి హీరోహీరోయిన్లు.
(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం)
Comments
Please login to add a commentAdd a comment