
అల్లు అర్జున్ 'వరుడు' సినిమాలో హీరోయిన్‌గా నటించిన భానుశ్రీ మెహ్రా.. ఆ తర్వాత కూడా తెలుగులో కొన్ని మూవీస్ చేసింది గానీ పెద్దగా పేరు రాలేదు. దీంతో ఐదేళ్ల క్రితం కరణ్ మానస్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుని సెటిలైపోయింది. ఇప్పుడు ఈమె ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఈమె సోదరుడు నందు.. ఏడు రోజుల క్రితం అనారోగ్య కారణాలతో చనిపోయాడు. ఈ క్రమంలోనే అతడిని తలుచుకుని భావోద్వేగానికి లోనైంది. సోషల్ మీడియాలో తన సోదరుడితో ఉన్న జ్ఞాపకాల్ని పంచుకుంది.
(ఇదీ చదవండి: ఇళయరాజాకు అవమానం? వీడియో వైరల్)
'నువ్వు చనిపోయి ఏడు రోజులైంది. కానీ ఇంకా పీడకలలానే ఉంది. ఇదంతా నిజమని ఎలా నమ్మాలి? నువ్వు లేకపోవడంతో కుటుంబంలో స్తబ్దుగా మారింది. ప్రతి చిన్న విషయంలోనూ నువ్వే గుర్తొస్తున్నావ్. నువ్వు లేవనే బాధ.. జీవితాంతం నేను మోయాల్సిందే. నా మనసులో ఎప్పటికీ నీకు చోటుంటుంది. ఐ లవ్ యూ. నందు ఐ మిస్ యూ' అని భానుశ్రీ తన బాధనంతా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment