Bhanu Sri mehra
-
'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం
అల్లు అర్జున్ 'వరుడు' సినిమాలో హీరోయిన్గా నటించిన భానుశ్రీ మెహ్రా.. ఆ తర్వాత కూడా తెలుగులో కొన్ని మూవీస్ చేసింది గానీ పెద్దగా పేరు రాలేదు. దీంతో ఐదేళ్ల క్రితం కరణ్ మానస్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుని సెటిలైపోయింది. ఇప్పుడు ఈమె ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఈమె సోదరుడు నందు.. ఏడు రోజుల క్రితం అనారోగ్య కారణాలతో చనిపోయాడు. ఈ క్రమంలోనే అతడిని తలుచుకుని భావోద్వేగానికి లోనైంది. సోషల్ మీడియాలో తన సోదరుడితో ఉన్న జ్ఞాపకాల్ని పంచుకుంది.(ఇదీ చదవండి: ఇళయరాజాకు అవమానం? వీడియో వైరల్)'నువ్వు చనిపోయి ఏడు రోజులైంది. కానీ ఇంకా పీడకలలానే ఉంది. ఇదంతా నిజమని ఎలా నమ్మాలి? నువ్వు లేకపోవడంతో కుటుంబంలో స్తబ్దుగా మారింది. ప్రతి చిన్న విషయంలోనూ నువ్వే గుర్తొస్తున్నావ్. నువ్వు లేవనే బాధ.. జీవితాంతం నేను మోయాల్సిందే. నా మనసులో ఎప్పటికీ నీకు చోటుంటుంది. ఐ లవ్ యూ. నందు ఐ మిస్ యూ' అని భానుశ్రీ తన బాధనంతా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) View this post on Instagram A post shared by внanυѕнree мeнra (@mehrabhanushree) -
అలాంటి లుక్‌లో షాకిచ్చిన మంచు లక్ష్మీ.. వరుడు హీరోయిన్ లేటేస్ట్ లుక్స్!
అలాంటి లుక్‌లో కనిపించి షాకిచ్చిన మంచు లక్ష్మీ వైట్ అండ్ బ్లూ డ్రెస్‌లో వరుడు హీరోయిన్ హోయలు! పింక్ డ్రెస్‌లో ఈషా రెబ్బా స్టన్నింగ్ లుక్స్.. యాంకర్ సుమ ట్రెండీ లుక్.. లైట్ బ్యూ శారీలో శ్రియా చరణ్ పోజులు View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shri bhanu ❤️🔥 (@iam_bhanusri) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
బిగ్ బాస్ ఓ చెత్త షో.. అల్లు అర్జున్ హీరోయిన్ ఫైర్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన వరుడు చిత్రంలో తెలుగులో అడుగుపెట్టిన పంజాబీ భామ భానుశ్రీ మెహ్రా. ఆ తర్వాత తెలుగులో చాలా చిత్రాల్లో కనిపించింది. అయితే ఆమెకు వరుడు సినిమాతో పెద్దగా క్రేజ్ మాత్రం రాలేదు. తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ సినిమాల్లో నటించింది. అయితే టాలీవుడ్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు దూరమైంది. గతంలో ఓసారి అల్లు అర్జున్ తనను ట్విట్టర్లో బ్లాక్ చేశాడంటూ ఆమె చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది భానుశ్రీ. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. అప్పుడప్పుడు ట్వీట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. మరోసారి ఆమె చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈసారి ఏకంగా బిగ్ బాస్ షో పైనే విమర్శలు చేసింది. అసలు ఇలాంటి షోలను ప్రజలు ఎందుకు చూస్తారో అర్థం కావడం లేదంటూ బాంబు పేల్చింది. ఇప్పటికే దక్షిణాదిలో భాషలతో పాటు హిందీలోనూ ఈ షో విజయవంతంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో భానుశ్రీ ఒక్కసారిగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. భానుశ్రీ తన ట్వీట్లో రాస్తూ..'ప్రజలు బిగ్ బాస్ షోను ఎలా చూస్తున్నారు. ప్రతిసారి కొత్త సీజన్లు ఎందుకు వస్తున్నాయని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటా. నా అభిప్రాయం ప్రకారం ఇది టీవీల్లో వచ్చే అత్యంత చెత్త షో. నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్‌లో ఈ షో నుంచి అలాంటి భయంకరమైన హైలెట్స్‌తో నిండిపోయింది!'అంటూ పోస్ట్ చేసింది. I've always wondered how people watch Big Boss and why new seasons keep coming up. In my opinion, it's the most mind-numbing thing on TV. My Instagram feed is bombarded with such cringe worthy highlights from the show !#bigboss #cringoverload — Bhanushree Mehra (@IAmBhanuShree) October 30, 2023 -
బిగ్‌బాస్ ఓ చెత్త షో.. తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
బిగ్‌బాస్ మీద ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోర్టులు, కేసులు, గొడవలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి ఏం డిస్కస్ చేయడం లేదులేండి. అదే టైంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ షో ఓ మాదిరి క్రేజ్ సంపాదించింది. అలాంటిది ఇప్పుడీ షోపై తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. (ఇదీ చదవండి: ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్.. త్వరలో పెళ్లి!) అల్లు అర్జున్ 'వరుడు' సినిమాతో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన భానుశ్రీ మెహ్రా.. ఆ తర్వాత కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది. డింగ్ డాంగ్ బెల్, గోవిందుడు అందరివాడేలే, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, అలా ఎలా?, రన్, మిస్ ఇండియా, 10th క్లాస్ తదితర తెలుగు చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేసింది. ఇవేవి ఈమెకు గుర్తింపు తీసుకురాలేకపోయాయి. రీసెంట్గా వచ్చిన 'లియో'లోనూ కనీకనిపించని పాత్రలో నటించింది. అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఈ బ్యూటీ ఇప్పుడు బిగ్‌బాస్‌పై విరుచుకుపడింది. 'బిగ్‌బాస్ షోని జనాలు ఎలా చూస్తున్నారా అని నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటాను. దానికి తోడు ఎప్పటికప్పడు కొత్త సీజన్స్ వస్తూనే ఉన్నాయి. నా దృష్టిలో ఇది ఓ చెత్త షో. నా ఇన్‌స్టా ఫీడ్ అంతా కూడా బిగ్‌బాస్ వీడియోలతో నిండిపోతోంది' అని భానుశ్రీ తన ట్విట్టర్లో షోపై కోపాన్నంతా బయటపెట్టింది. ఇది హిందీ షోని ఉద్దేశించి చెప్పినప్పటికీ.. మిగతా భాషల షోలకు ఇది వర్తిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) I've always wondered how people watch Big Boss and why new seasons keep coming up. In my opinion, it's the most mind-numbing thing on TV. My Instagram feed is bombarded with such cringe worthy highlights from the show !#bigboss #cringoverload — Bhanushree Mehra (@IAmBhanuShree) October 30, 2023 -
బీచ్‌లో బీర్ తాగుతూ జల్సా చేస్తున్న అల్లు అర్జున్ హీరోయిన్ (ఫోటోలు)
-
పెళ్లైంది, వయసు పెరిగిందని అలా చేయడమేంటి?: వరుడు హీరోయిన్
వరుడు సినిమాతో హీరోయిన్గా కెరీర్ ఆరంభించింది భానుశ్రీ మెహ్రా. తెలుగు, తమిళ, హిందీ, పంజాబీ భాషల్లో పలు చిత్రాలు చేసిన ఆమె హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయింది. ఇటీవల అల్లు అర్జున్ తనను బ్లాక్ చేశాడంటూ వార్తల్లోకెక్కిన భానుశ్రీ తాజాగా మరో అంశం గురించి ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలిచింది. 'వయసు పైబడటం అనేది సినీ ఇండస్ట్రీలో ప్రధాన సమస్యగా మారింది. హీరోయిన్లకు ఒక వయసు రాగానే వారిని తల్లి, వదిన.. అంటూ సైడ్ క్యారెక్టర్లకు పరిమితం చేస్తారు. కానీ ఏజ్ ఎక్కువున్న హీరోలు మాత్రం వారిలో సగం వయస్సున్న హీరోయిన్లతో లవ్ సీన్లలో నటిస్తుంటారు. పెళ్లైంది, వయసు పెరిగింది అని ఆడవాళ్లపై ఎందుకు పక్షపాతం చూపిస్తారు? ఈ మూసధోరణికి ఇకనైనా ముగింపు పలకండి. స్వతంత్రంగా జీవిస్తూ, మనోధైర్యంతో ముందడుగు వేస్తున్న మహిళల కథలను చెప్పండి' అని రాసుకొచ్చింది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'తాత వయసున్న హీరోలు 25 ఏళ్ల కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు, మీరు అనుకుంది జరగడం అంత ఈజీ కాదులెండి', 'మీరు చెప్పింది అక్షరాలా నిజం', 'మీరు గతంలోకన్నా ఇప్పుడే బాగున్నారు', 'మాటలు ఆపి ముందు సినిమాలు చేయండి', 'వయసుతో సంబంధం లేకుండా అనుష్క ఇప్పటికీ సినిమాలు చేస్తోంది. అయినా మీకు అదృష్టం కలిసి రాలేదు', 'చూడటానికి కూడా మీరు తల్లిలాగే కనిపిస్తున్నారు' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. Let's break the stereotype & tell stories of women who are strong, independent, and unapologetically themselves ! It's time for the industry to embrace and celebrate women of all ages, shapes, and sizes. Agree ? — Bhanushree Mehra (@IAmBhanuShree) March 24, 2023 -
నా ట్వీట్ ఉద్దేశం అదికాదు.. పెగ్గేస్తూ వివరణ ఇచ్చిన హీరోయిన్
అల్లు అర్జున్ తనను ట్విటర్లో బ్లాక్ చేశాడంటూ నిన్నంత రాద్దాంతం చేసింది భాను శ్రీ మెహ్రా. దీంతో ఆమె పేరు ట్విటర్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అసలు బన్ని ఎందుకు ఆమెను బ్లాక్ చేశాడని నెటిజన్లు తెగ ఆరా తీశారు. అయితే కాసేపటికే బన్ని మనసు మార్చుకొని అన్‌బ్లాక్ చేశాడంటూ మరో ట్వీట్ చేసి అందరిని కన్ఫ్యూజ్ చేసింది. అంతేకాదు తానేమీ అల్లు అర్జున్ను టార్గెట్ చేసేందుకు ట్వీట్ చేయలేదని, తనను ఎప్పుడూ బ్లేమ్ చేయలేదని భాను శ్రీ చెప్పుకొచ్చింది. అయితే బన్ని ప్యాన్స్ మాత్రం అప్పటికే భానుశ్రీపై ఫుల్ ఫైర్ అయ్యారు. అనవసరంగా తమ హీరోని బ్లేమ్ చేస్తున్నావంటూ ఆమెను ట్రోల్ చేయడం మొదలెట్టారు. దీంతో భానుశ్రీ మరోసారి వివరణ ఇచ్చింది. బన్ని అభిమానులను హర్ట్ చేసే ఉద్దేశం తనకు లేదని చెప్పుకొచ్చింది. ఈ రోజంతా కూడా వింతగా జరిగింది. అంతా రోలర్ కోస్టర్ రైడ్‌లా అనిపించింది. నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసేందుకు ఆ ట్వీట్ చేయలేదు. నేను కూడా బన్నీకి పెద్ద ఫ్యాన్నే. నా కెరీర్‌ను చూసి నేను నవ్వుకుంటాను. నా బాధలు చూసి నేనే నవ్వుకుంటున్నాను. ప్రేమను పంచుదాం.. ద్వేషాన్ని వద్దు’ అంటూ ఓ పెగ్గేస్తూ అందరికి గుడ్‌నైట్ చెప్పింది. ప్రస్తుతం భానుశ్రీ ట్వీట్ నెట్టింట్ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘వరుడు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది భానుశ్రీ మెహ్రా. తొలి సినిమా తర్వాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. హీరోయిన్ పాత్రలు లభించకోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారింది. Well, that was a rollercoaster of a day ! Goodnight, folks! Just to clear the air - my tweet wasn't intended to hurt any Allu Arjun fans. I'm a fan too! I was just poking fun at my own career struggles. Let's spread love & laughter, not hate. Sweet dreams! 💕#PeaceAndLove pic.twitter.com/q7l6Gg7mgr — Bhanushree Mehra (@IAmBhanuShree) March 18, 2023 -
ఆ హీరోయిన్ని బ్లాక్ చేసిన బన్నీ! స్క్రిన్ షాట్స్‌తో నటి ఆరోపణలు..
అల్లు అర్జున్ నటించిన వరుడు మూవీ బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచినా తెలుగు వారి హృదయాల్లో ఎప్పటికి నిలిచిపోతుంది. వివాహం అంటే ఇలా ఉండాలి అనేట్టుగా సంప్రదాయ పద్దతిలో జరిగిన హీరోహీరోయిన్ల పెళ్లి వేడుక ప్రేక్షకులను కనువిందు చేసింది. చెప్పాలంటే వరుడు సినిమా తర్వాత చాలా మంది ఐదు రోజుల పాటు పెళ్లి వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. అంతలా ఆకట్టుకుంది ఈ సినిమా. ఇక చిత్రంతోనే టాలీవుడ్‌కు పరిచయమైంది భాను శ్రీ మెహ్రా. వరుడు రిలీజ్‌కు ముందు ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. చదవండి: అదేం వెబ్ సిరీస్.. మన సంస్కృతి ఏమైపోతుంది: నటుడు షాకింగ్ రియాక్షన్ దీనికి కారణం ఆమె లుక్‌ను సస్పెన్స్‌లో ఉంచడమే. వరుడు ఫలితం ఎలా ఉన్న భాను శ్రీ మెహ్రా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ అర్టిస్ట్‌గా, సహానటి పాత్రలతో సర్దుకుపోతుంది. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్‌పై ఆరోపణలు చేస్తూ ఆమె ఓ ట్వీట్ చేసింది. అల్లు అర్జున్ తనని ట్విటర్లో బ్లాక్ చేశాడని. దీనికి సంబంధించిన స్క్రిన్ షాట్స్‌ను కూడా షేర్ చేసింది. చదవండి: ‘కోపంతో పుష్ప 2 సెట్ వీడిన రష్మిక!’ బన్నీనే కారణమంటూ ట్వీట్ ‘నేను వరుడు సినిమాలో అల్లు అర్జున్‌తో కలిసి నటించాను. ఈ సినిమా తర్వాత నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ నా ప్రయత్నాన్ని నేను ఆపలేదు. ఈ క్రమంలో నేను ఎన్నో కష్టాలు పడ్డాను. కానీ వాటిలో కూడా హాస్యాన్ని వెతుకడం నేర్చుకున్నా. కానీ ఇక్కడ చూడండి బన్నీ నన్ను ట్విటర్లో బ్లాక్ చేశాడు’ అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ ట్వీట్ చేసిన రెండు గంటల తర్వాత ఆమె మరో పోస్ట్ చేసింది. ‘గ్రేట్ న్యూస్.. అల్లు అర్జున్ నన్ను అన్‌బ్లాక్ చేశాడు. నేను ఎప్పుడు అయనను నిందించలేదు’ అంటూ భాను శ్రీ రాసుకొచ్చింది. కాగా అల్లు అర్జున్ ఆమెను బ్లాక్ చేయడానికి కారణం ఏంటన్నది మాత్రం క్లారిటీ లేదు. కానీ ఆమె ట్వీట్ చేసిన కొద్ది క్షణాలకే బన్నీ ఆమెను అన్‌బ్లాక్ చేయడం గమనార్హం. If you ever feel like you're stuck in a rut, just remember that I acted in Varudu with Allu Arjun and STILL couldn't get any work. But I've learned to find humor in my struggles – especially now that Allu Arjun has blocked me on Twitter🤷♀️ Go subscribe ?https://t.co/mqX2lVNjwx pic.twitter.com/ycSR5yGpfl — Bhanushree Mehra (@IAmBhanuShree) March 18, 2023 Great news, Allu Arjun has unblocked me! To clarify, I NEVER blamed him for my career setbacks. Instead, I've learned to find humor in my struggles and keep moving forward. Stay tuned for more laughs and good vibes! Thanks, Allu Arjun, for being a good sport. @alluarjun pic.twitter.com/oLovQdnWAE — Bhanushree Mehra (@IAmBhanuShree) March 18, 2023 -
బాలాజీ మహిమలతో...
సాయికుమార్, సుమన్, యస్.పి బాలసుబ్రహ్మణ్యం, భానుశ్రీ మెహ్రా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ శ్రీ చిలుకూరి బాలాజీ’. ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అల్లాణి శ్రీధర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 5న రిలీజ్ కానుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఐఏయస్ ఆఫీసర్ డాక్టర్ కేవీ రమణ సౌజన్యంతో నిర్మాత ‘దిల్’ రాజు ఈ సినిమాను విడుదల చేయిస్తున్నారని అల్లాణి శ్రీధర్ తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ– ‘‘యువతరానికి వీసాల బాలాజీగా ఆశీర్వాదాలు అందిస్తూ తరతరాలుగా ఆరాధించబడుతున్న చిలుకూరి బాలాజీ గొప్పతనాన్ని, ఆ ఆలయ పురాణాన్ని ఒక దృశ్యకావ్యంగా చిత్రీకరించాం. చినజీయర్ స్వామి విడుదల చేసిన ఆడియోకి మంచి స్పందన వస్తోంది. అర్జున్ మంచి సంగీతాన్ని అందించారు. సుద్ధాల అశోక్ తేజ, జొన్నవిత్తుల, రాపర్తి వీరేంద్ర, రాణి పులోమజాదేవి మంచి సాహిత్యం అందించారు. సినిమాను మెచ్చి రిలీజ్ చేస్తున్న ‘దిల్’ రాజుకి ధన్యవాదాలు’’ అన్నారు. -
ఐడియా తెచ్చిన ఇక్కట్లు
పెద్దలు కుదిర్చిన పెళ్లిని ప్రేమపెళ్లిగా మార్చుకోవాలనే చిలిపి ఆలోచన ఓ కుర్రాడికి వస్తుంది. ఆ ఆలోచన వల్ల ఆ కుర్రాడు ఎలాంటి ఇక్కట్లు పడ్డాడు అనే కథాశంతో రూపొందిన చిత్రం ‘అలా ఎలా?’. రాహుల్ రవీంద్ర, వెన్నెల కిశోర్, భానుశ్రీ మెహ్రా, షానిసలోమో, ఖుషి, హెబ్బా పటేల్ ఇందులో ప్రధాన పాత్రధారులు. అనీష్ కృష్ణ దర్శకుడు. అశోక్‌వర్ధన్ నిర్మాత. ఈ నెల 28న ఈ సినిమా విడుదల కానుంది. ఇది రొమాంటిక్ కామెడీ మూవీ అని దర్శకుడు పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించని ఓ కొత్త ఫ్లేవర్ ఇందులో కనిపిస్తుందని రాహుల్ రవీంద్ర పేర్కొన్నారు. -
అరు కథల్ని నడిపించే ఏడో కథ
రవిబాబు, అర్చన, వినోద్‌కుమార్, భానుశ్రీమెహ్రా, శివాజీరాజా ప్రధాన పాత్రధారులుగా, ప్రభాకరన్ దర్శకత్వంలో ఆర్.పద్మజ నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి జెమినీ కిరణ్ కెమెరా స్విచాన్ చేయగా, బి.గోపాల్ క్లాప్ ఇచ్చారు. భీమినేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహిం చారు. సినిమా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. ‘‘భిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులోని ఆరు కథలను ఏడో కథ ముందుకు నడిపిస్తుంది. చక్కని థ్రిల్లర్. పాటలు ఉండవు. శుక్రవారం నుంచి షూటింగ్ ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తాం’’ అని దర్శకుడు తెలిపారు. అభినయానికి ఆస్కారమున్న పాత్ర పోషిస్తున్నానని అర్చన చెప్పారు. ఓ టిపికల్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి దర్శకుడే నిజమైన హీరో అని ఉత్తేజ్ అన్నారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఈ చిత్రానికి మాటలు: పార్వతీచంద్, కెమెరా: ఉదయభాస్కర్ జాస్తి, సంగీతం: తారక రామారావు. -
అరుదైన అవకాశం ఇది!
రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్, షానీ, భానుశ్రీ మెహ్రా, ఖుషి హెబా ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘అలా ఎలా’. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ నిర్మించిన ఈ చిత్రానికి అనీల్ కృష్ణ దర్శకుడు. ఈ చిత్రం ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నటుడు మురళీమోహన్ బేనర్ లోగోను ఆవిష్కరించారు. మరో అతిథి కోన వెంకట్ ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ వేడుకలో పాల్గొన్న నాని, ఆది, ప్రిన్స్, లావణ్య త్రిపాఠి, రిచా పనయ్ తదితరులు చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ -‘‘అప్‌కమింగ్ హీరోలకు అన్ని కోణాలున్న పాత్రలు చేసే అవకాశం రావడం కష్టం. అలాంటి అరుదైన అవకాశం ఈ చిత్రం ద్వారా నాకు లభించింది’’ అని చెప్పారు. మంచి పాటల కుదిరాయని చిత్రసంగీతదర్శకుడు భీమ్స్ తెలిపారు. ఇదొక చక్కని ప్రేమకథా చిత్రమనీ, ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటుందని దర్శక, నిర్మాతలు చెప్పారు. -
మెరిసిన‘మెహరా’
మహబూబ్‌నగర్ కల్చరల్: న్యూటౌన్‌లో ప్రముఖ కే 6000 ఫ్యామిలీ షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లోని పురుషుల వస్త్రాల విభాగాన్ని ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, మొదటి అంతస్తులోని లేడీస్ రెడీమేడ్ గార్మెంట్స్ అండ్ శారీస్ మాల్‌లకు భానుశ్రీ మెహరా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లాంటి మహానగరాల స్థాయిలో ఆధునిక వస్త్ర దుకాణాన్ని కే 6000 యాజమాన్యం అక్కడే ప్రారంభించడం అభినందనీయమన్నారు. పెళ్లిళ్లు తదితర శుభకార్యాలకు కావాల్సిన వస్త్రాలకు హైదరాబాద్ తదితరర పట్టణాలకు వెళ్లకుండా ఇక్కడే కొనుగోలుచేయొచ్చన్నారు. షాపింగ్‌మాల్‌ను ప్రారంభించేందుకు వస్తున్న తమ అభిమాన హీరోయిన్ భానుశ్రీ మోహరాను చూసేందుకు అభిమానులు ఉదయం 9 గంటలకే వచ్చారు. అభిమానులు ఆమెకు ఇబ్బందులు కలిగించకుండా షాపు యాజమాన్యం ప్రైవేట్ బౌన్సర్లతోపాటు స్థానిక పోలీసుల సహకారం తీసుకున్నారు. అనంతరం మోడల్స్ నిర్వహించిన ఫ్యాషన్ షో పలువుని ఆకట్టుకుంది. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు మోసీన్‌ఖాన్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మహమూద్, ఎక్బాల్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరేందర్‌రాజు, షాపింగ్ మాల్ యజమానులు పాల్గొన్నారు.