
సాయికుమార్, సుమన్, యస్.పి బాలసుబ్రహ్మణ్యం, భానుశ్రీ మెహ్రా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ శ్రీ చిలుకూరి బాలాజీ’. ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అల్లాణి శ్రీధర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 5న రిలీజ్ కానుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఐఏయస్ ఆఫీసర్ డాక్టర్ కేవీ రమణ సౌజన్యంతో నిర్మాత ‘దిల్’ రాజు ఈ సినిమాను విడుదల చేయిస్తున్నారని అల్లాణి శ్రీధర్ తెలిపారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ– ‘‘యువతరానికి వీసాల బాలాజీగా ఆశీర్వాదాలు అందిస్తూ తరతరాలుగా ఆరాధించబడుతున్న చిలుకూరి బాలాజీ గొప్పతనాన్ని, ఆ ఆలయ పురాణాన్ని ఒక దృశ్యకావ్యంగా చిత్రీకరించాం. చినజీయర్ స్వామి విడుదల చేసిన ఆడియోకి మంచి స్పందన వస్తోంది. అర్జున్ మంచి సంగీతాన్ని అందించారు. సుద్ధాల అశోక్ తేజ, జొన్నవిత్తుల, రాపర్తి వీరేంద్ర, రాణి పులోమజాదేవి మంచి సాహిత్యం అందించారు. సినిమాను మెచ్చి రిలీజ్ చేస్తున్న ‘దిల్’ రాజుకి ధన్యవాదాలు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment