బిగ్‌ బాస్‌ ఓ చెత్త షో.. అల్లు అర్జున్ హీరోయిన్ ఫైర్! | Bhanu Sri Mehra Tweet On Bigg Boss Goes Viral | Sakshi
Sakshi News home page

'నా ఇన్‌స్టా ఆ చెత్తతో నిండిపోయింది'.. బిగ్‌బాస్‌పై వరుడు భామ!

Published Tue, Oct 31 2023 7:05 PM | Last Updated on Wed, Nov 1 2023 6:41 PM

Bhanu Sri Mehra Tweet On Bigg Boss Goes Viral - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన వరుడు చిత్రంలో తెలుగులో అడుగుపెట్టిన పంజాబీ భామ భానుశ్రీ మెహ్రా. ఆ తర్వాత తెలుగులో చాలా చిత్రాల్లో కనిపించింది. అయితే ఆమెకు వరుడు సినిమాతో పెద్దగా క్రేజ్ మాత్రం రాలేదు. తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ సినిమాల్లో నటించింది. అయితే టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు దూరమైంది. గతంలో ఓసారి అల్లు అర్జున్ తనను ట్విట్టర్‌లో బ్లాక్ చేశాడంటూ ఆమె చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది భానుశ్రీ. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. అప్పుడప్పుడు ట్వీట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. మరోసారి ఆమె చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈసారి ఏకంగా బిగ్ బాస్ షో పైనే విమర్శలు చేసింది. అసలు ఇలాంటి షోలను ప్రజలు ఎందుకు చూస్తారో అర్థం కావడం లేదంటూ బాంబు పేల్చింది. ఇప్పటికే దక్షిణాదిలో భాషలతో పాటు హిందీలోనూ ఈ షో విజయవంతంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో భానుశ్రీ ఒక్కసారిగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 

భానుశ్రీ తన ట్వీట్‌లో రాస్తూ..'ప్రజలు బిగ్ బాస్‌ షోను ఎలా చూస్తున్నారు. ప్రతిసారి కొత్త సీజన్‌లు ఎందుకు వస్తున్నాయని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటా. నా అభిప్రాయం ప్రకారం ఇది టీవీల్లో వచ్చే అత్యంత చెత్త షో. నా ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో ఈ షో నుంచి అలాంటి భయంకరమైన హైలెట్స్‌తో నిండిపోయింది!'అంటూ పోస్ట్ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement