
టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి దుబాయ్‌లో మరణించిన విషయం తెలిసిందే.. అయితే, ఆయన ఆంత్యక్రియలు కొంత సమయం క్రితం దుబాయ్‌లోనే ముగిశాయి. సుమారు పది రోజుల క్రితం అనుమానాస్పదంగా ఆయన మరణించారు. కానీ, కేదార్ మృతికి సంబంధించి కారణాలు తెలియడం లేదు. అయితే, ఆయన మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని దుబాయ్ పోలీసులు తేల్చడం గమనార్హం. కేదార్ అనారోగ్యం కారణంగానే మరణించారని వారు పేర్కొన్నారు. భారత ప్రభుత్వం అనుమతితో కేదార్ మృతదేహాన్ని ఆయన భార్య రేఖా వీణకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
దుబాయ్‌లో ఇప్పటికే స్థిర నివాసం, వ్యాపారాలు చేస్తున్న కేదార్ అంత్యక్రియలు అక్కడే పూర్తి చేయడంతో నెట్టింట వైరల్ అవుతుంది. అందులో వారి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. భారత్‌కు కేదార్ మృతదేహాన్ని తీసుకొస్తే ఇబ్బందులకు గురవుతామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కారణం వల్లే ఆయన అంత్యక్రియలు ఇక్కడే చేశామని వారు చెప్పుకొచ్చారు. కేదార్ అంత్యక్రియలలో సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరూ పాల్గొనలేదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినీ, రాజకీయ నాయకులకు బినామీగా కేదార్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వారికి సంబంధించిన వందల కోట్ల రూపాయలు ఆయన వద్ద ఉన్నట్లు సమాచారం. ఆ డబ్బుతో దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
కేదార్ మరణంపై సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నిర్మాత కేదార్ సెలగంశెట్టి మరణంపై సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజినెస్ పార్ట్‌నర్ ఫ్రెండ్ కేదార్ చనిపోవడం వెనక మిస్టరీ ఏమిటి..? అంటూ ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ దానిపైన ఎందుకు విచారణ కోరడం లేదు..? రాడిసన్ కేసులో కేదార్ నిందితుడుగా ఉన్నారని రేవంత్ అన్నారు. ఈ కేసులతో సంబంధం ఉన్నవారు వరుసగా చనిపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి..? ముందు సంజీవరెడ్డి, తర్వాత రాజలింగం, ఇప్పుడు కేదార్.. వారి మరణాల వెనకాల మిస్టరీ ఉంది. దీనిపైన కేటీఆర్ ఎందుకు విచారణ కోరలేదు ఫిర్యాదులు వస్తే దర్యాప్తు చేస్తామని రేవంత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment