ఈ నెల 15వ తేదీన బిగ్‌బాస్ సీజన్–8 ఫైనల్ జరగనుంది. ఈ సీజన్ విన్నర్ రేసులో గౌతమ్,నిఖిల్,నబీల్,ప్రేరణ,అవినాష్ ఉన్నారు. బిగ్ బాస్‌లోకి మొత్తం 22మంది ఎంట్రీ ఇస్తే వారిలో ఈ ఐదుమంది మాత్రమే సుమారు 100 రోజులకు పైగా గెలుపు రేసులో ఉన్నారు. అయితే, డిసెంబర్ 15వ తేదీన జరగనున్న గ్రాండ్ ఫినాలే కోసం చీఫ్ గెస్ట్‌గా నేషనల్ అవార్డ్ విన్నర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్‌లలో ముఖ్య అతిథిగా ఒక సెలబ్రెటీ రావడం సహజమే.. బిగ్ బాస్ రేసులో గెలిచిన వారికి చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా ట్రోపీతో పాటు ప్రైజ్ మనీ చెక్‌ను కూడా అందిస్తారు. అయితే, గత సీజన్‌లో ముఖ్య అతిథిగా ఎవరూ రాలేదు. దీంతో హోస్ట్‌గా షోను నడిపించిన నాగార్జున చేతుల మీదుగానే పల్లవి ప్రశాంత్ ట్రోఫీ అందుకున్నాడు.
దీంతో ఈ సీజన్‌లో తప్పకుండా సినీ సెలబ్రిటీని ముఖ్య అతథిగా తీసుకురావాలని మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ను బిగ్ బాస్‌కు రానున్నారని ప్రచారం జరుగుతుంది. పుష్ప2 విజయంతో బన్నీ విజయోత్సవంలో ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ ఫైనల్‌లో అతిథిగా పాల్గొంటే షో మరింత బజ్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బన్నీనే ముఖ్య అతిథిగా బిగ్‌బాస్‌కు వెళ్తే.. అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీగా జనం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
బిగ్ బాస్ ఫైనల్ కోసం భారీ సెక్యూరిటీ
బిగ్‌బాస్ సీజన్–8 ఫైనల్ జరగనున్న నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అల్లర్లు, గొడవలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోలోని ఏడెకరాల్లో బిగ్‌బాస్ సెట్టింగ్ వేయగా..ఫైనల్ కూడా ఇక్కడే జరగనుంది. గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన బిగ్‌బాస్ సీజన్–7 ఫైనల్ సందర్భంగా తలెత్తిన పరిణామాలు, గొడవలు, బస్సులపై రాళ్లు రువ్వడం తదితర అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ 53 సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని ఇప్పటికే పోలీసులు ఆయా పాయింట్లతో కూడిన జాబితాను అన్నపూర్ణ స్టూడియో, బిగ్‌బాస్ యాజమాన్యానికి అందజేశారు. ఫైనల్ రోజుకు ముందే 14వ తేదీన ఉదయమే వీటిని అమర్చుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment