బిగ్ బాస్ 8 తెలుగు ఫైనల్‌కు చేరుకుంది. నేడు విజేత ఎవరో తేలనుంది. టైటిల్ రేసులో గౌతమ్, నిఖిల్,నబీల్,ప్రేరణ,అవినాష్ ఉన్నారు. వీరిలో గెలుపొందిన విజేతకు ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని కూడా అందిస్తారు. సుమారు 100 రోజులకు పైగా బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా వారందరూ ప్రేక్షకులను మెప్పించారు. హోస్ట్‌గా ఉన్న అక్కినేని నాగార్జున మాత్రమే వారితో టచ్‌లో ఉండేవారు. అయితే, తాజాగా బిగ్ బాస్ ఫైనల్‌కు సంబంధించిన ఫస్ట్ ప్రోమోను విడుదల అయింది. అందులో ప్రైజ్ మనీ, ట్రోఫీని నాగ్ రివీల్ చేశారు.
బిగ్ బాస్ విడుదల చేసిన ప్రోమోలో ఈ సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్స్ అందరూ కనిపించారు. ఆ సమయంలో అక్కినేని నాగార్జున ప్రైజ్ మనీ రివీల్ చేశారు. విజేతకు రూ. 55 లక్షలు అందేజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బిగ్ బాస్‌లో ఇదే అత్యంత ఎక్కువ మొత్తం అని నాగ్ తెలిపారు. గతంలో రూ. 50 లక్షలు వరకు మాత్రమే విజేతకు ఇస్తుండగా.. ఈసారి ప్రైజ్ మనీ కాస్త పెరిగిందని చెప్పవచ్చు. ఈ సీజన్ విన్నర్ మారుతి కార్ కూడా దక్కించుకోనున్నారు. ఇప్పటికే ఆ సంస్ధ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
బిగ్ బాస్ 8 ఫైనల్స్ ప్రోమోలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సందడి చేశారు. ఆయన నటించిన కొత్త సినిమా 'యూఐ' ప్రమోషన్స్‌లో భాగంగా షోలో పాల్గొన్నారు. మొదటి ఫైనలిస్ట్‌గా సెలెక్ట్ అయన అవినాష్‌ను ఎలిమినేట్ చేసి హౌజ్ నుంచి స్టేజీపైకి ఉపేంద్రనే తీసుకొచ్చారని తెలుస్తోంది. బిగ్ బాస్ హౌజ్‌లోకి డాకు మహారాజ్ టీమ్ కూడా వెల్లింది. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ హౌజ్‌లోకి వెళ్లి కొంత సమయం పాటు సరదాగా వారితో గడిపింది.
Comments
Please login to add a commentAdd a comment