బిగ్ బాస్ చాలా కన్ఫ్యూజన్‌లో వున్నట్టున్నాడు. తన ప్రేక్షకులను తమ్మిని బమ్మి అయినా చేసి ఆకట్టుకునే తీవ్ర ప్రయత్నంలో వున్నాడు. ఇందులో భాగంగా హౌస్ లోకి కొంతమందిని కొత్తవారిని తీసేసి పాతవారిని తీసుకువచ్చి కలగాపులగం చేసాడు. ఇంకా చెప్పాలంటే ఓ పులిహార లాంటి పార్ట్సిపెంట్స్ ఇప్పుడు హౌస్‌లో వున్నారు. కొత్త వాళ్ళు ఎంతలా ఆడినా, నామినేషన్స్ ప్రక్రియ నుండి టాస్క్ లుగాని, ఎలిమినేషన్ కాని అంతా రాయల్ క్లాన్స్ దే పైచేయిగా వుంది. గమనిక ఇక్కడ పాత వాళ్ళగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గ్రూప్‌కు రాయల్ క్లాన్స్ అనే పేరు పెట్టాడు బిగ్ బాస్.
హౌస్‌లో కన్నడ పార్టిసిపెంట్స్, తెలుగు పార్టిసిపెట్స్ మధ్య పోటీ అనిపిస్తుంది కాని హౌస్ మొత్తం ఒకే పార్టిసిపెంట్స్ అని అనిపించట్లేదు. బిగ్ బాస్ ఫాలో అవుతున్న సదరు ప్రేక్షకుడికి ఇట్టే అర్ధమవుతుంది గేమ్ అంతా ఏకపక్షమయిందని. ఇక ఈ వారం టాస్క్‌ల పరంగా ఉప్పు గురించి ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. కాకపోతే అది చాలా సిల్లీగా అనిపించింది. దసరా పండుగ స్పెషల్‌గా వారాంతం ఎపిసోడ్ కొన్ని మెరుపులతో కొన్ని పాత ఆటలతో మమ అనిపించాడు బిగ్ బాస్.
బిగ్ బాస్ అన్ని సీరిస్‌లు ఫాలో అవుతున్నవారికి తెలుస్తుంది. బిగ్ బాస్ టాస్క్‌లు అన్నీ పాత టాస్కులే అని. ఇక్కడ టాస్కులు పాతవైతే ఫరవాలేదు ఈ సీరిస్ లు ఆ పాత టాస్కులు ఆడే వారు కూడా పాతవారే. ఓ సారి ఆట ఆడినవాడు మరోసారి జాగ్రత్తగా ఆడతారు కదా. అప్పుడు కొత్తవాళ్ళెప్పుడూ పాత వాళ్ళ మీద గెలుస్తారు కదా. ఇంత చిన్న లాజిక్ బిగ్ బాస్ ఎందుకు గమనించలేదో ఏమో. కాని ఒక్క విషయంలో మాత్రం బిగ్ బాస్‌ను మెచ్చుకోవాలి.
ఈ కాన్సెప్ట్ పరదేశానిదైనా మన దేశంలో చేస్తున్నపుడు మన సంస్కృతికి పెద్ద పీట వేసి మన పండుగ శోభలను కార్యక్రమంలో పొందుపరచడం నిజంగా అభినందనీయం. ముఖ్యంగా వారాంతంలో ప్రసారమయిన ఎపిసోడ్ లో ప్రముఖ గాయని మంగ్లీ హౌస్ లోని పార్టిసిపెంట్స్ చేత బతుకమ్మ ఆడించడం ఆకర్షణగా నిలిచింది. ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ ఈ సీజన్‌లో ముందు ముందు ఇంకెన్ని కష్టాలు పడి ప్రేక్షకుల కోసం ఇంకెంత పులిహార కలుపుతాడో చూడాలి మరి.
- ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment