'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రీరిలీజ్‌ ట్రైలర్‌ విడుదల | Seethamma Vakitlo Sirimalle Chettu Re Release Trailer Out Now | Sakshi
Sakshi News home page

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రీరిలీజ్‌ ట్రైలర్‌ విడుదల

Published Tue, Mar 4 2025 1:20 PM | Last Updated on Tue, Mar 4 2025 1:29 PM

Seethamma Vakitlo Sirimalle Chettu Re Release Trailer Out Now

టాలీవుడ్‌లో చాలా ఏళ్ల తర్వాత  మల్టీస్టారర్‌ మూవీగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ 2013లో విడుదలైంది. అయితే, సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ మూవీ మార్చి 7న రీరిలీజ్‌ కానున్నడంతో తాజాగా ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.   శ్రీకాంత్ అడ్డాల కథతో పాటు దర్శకత్వం వహించారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు.

వెంకటేష్, మహేష్ లాంటి ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి చేసిన సినిమా కావడంతో అప్పుట్లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా ఏళ్ల తర్వాత మల్టీస్టారర్‌ ట్రెండ్‌కు ఈ మూవీ కొత్త ఊపిరిపోసింది. బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 55 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇందులో సీతగా అంజలి పాత్ర ప్రధానంగా హైలెట్‌ అయిందని చెప్పవచ్చు.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ప్రధాన విశేశాలు

  • ఈ చిత్రంలో వెంకటేష్, మహేశ్ ‌బాబు అన్నదమ్ములుగా అదరగొట్టేశారు. ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటించారు. వీరికి తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్, అమ్మ పాత్రలో జయసుధ మెప్పించారు. అమ్మమ్మ పాత్రలో ప్రముఖ హిందీ నటి రోహిణీ హట్టంగడి కనిపించారు.

  • ఇందులో మహేశ్ బాబు గోదావరి యాసలో పలికిన డైలాగులకు విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

  • అప్పటిదాకా ప్రముఖ గాయని చిన్మయిచే తన పాత్రలకు డబ్బింగ్ చెప్పించుకున్న సమంత ఈ చిత్రం నుంచి తనే తన పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.

  • దాదాపు 20 ఏళ్ల తర్వాత నిర్మించబడిన మల్టీస్టారర్ చిత్రం కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించడమే కాక ప్రపంచవ్యాప్తంగా రూ. 55 కోట్ల కలెక్షన్లను సాధించింది. మగధీర (2009), దూకుడు (2011), గబ్బర్ సింగ్ (2012) తర్వాత ఈ సినిమా అత్యంత భారీ కలెక్షన్లను సాధించిన చిత్రంగా నిలిచింది.

  • ఈ చిత్రం 4 నంది అవార్డులను సొంతం చేసుకుంది.

  • ఉత్తమ కుటుంబ కథా చిత్రంతో పాటు ఉత్తమ సహాయ నటుడు (ప్రకాష్ రాజ్), ఉత్తమ గేయ రచయిత (సిరివెన్నెల సీతారామశాస్త్రి-మరీ అంతగా), ప్రత్యేక బహుమతి (అంజలి) నంది అవార్డ్స్‌ అందుకున్నారు.

  • 2013 సైమా అవార్డ్స్‌: ఉత్తమ నటుడు (మహేష్ బాబు), ఉత్తమ గీత రచయిత (అనంత శ్రీరామ్ -సీతమ్మ వాకిట్లో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement