విరూపాక్ష సినిమా నేను చేయాల్సింది: అర్జున్‌ | Arjun Ambati Says He Is The First Choice of Virupaksha Movie, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Arjun Ambati: విరూపాక్ష సినిమా హీరోగా నన్నే అనుకున్నారు.. కానీ!

Published Sun, Mar 24 2024 2:29 PM | Last Updated on Sun, Mar 24 2024 4:35 PM

Arjun Ambati Says He Is The First Choice of Virupaksha Movie - Sakshi

సీరియల్స్‌ నుంచి సినిమాల్లోకి వచ్చినవాళ్లు చాలానే ఉన్నారు. అయితే కొందరే క్లిక్‌ అవుతారు. సీరియల్స్‌కు, సినిమాకు మధ్యలో బిగ్‌బాస్‌ ప్లాట్‌ఫామ్‌ను వాడుకున్నవాళ్లూ ఉన్నారు. ఇక్కడ క్రేజ్‌ తెచ్చుకున్నాక పలువురూ సినిమాల్లో బిజీ అవుతుంటే మరికొందరు మాత్రం ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 

నెగెటివిటీ
అయితే బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్‌ అర్జున్‌ అంబటి మరో రకం. ఇతడు నేరుగా సినిమాల్లోనే అడుగుపెట్టాడు. కానీ ఎంత కష్టపడ్డా గుర్తింపే దొరకలేదు. దీంతో బుల్లితెరను ఆశ్రయించాడు. సీరియల్స్‌ ద్వారా క్లిక్‌ అయ్యాడు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రేజ్‌ను మరింత క్యాష్‌ చేసుకునేందుకు బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లో అడుగుపెట్టాడు. కానీ వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడం అతడు చేసిన పెద్ద పొరపాటు! ఈ షో వల్ల అతడు నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు నటించిన తెప్ప సముద్రం త్వరలో రిలీజ్‌ కానుంది. 

రెండేళ్లు తిరిగాం
ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన అర్జున్‌ అంబటి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 'డైరెక్టర్‌ కార్తీక్‌ నా స్నేహితుడు. అతడు ఎప్పుడూ సినిమా ప్రపంచంలోనే ఉంటాడు. అతడితో నేను లూప్‌ అని ఓ వెబ్‌ ఫిలిం చేశాను. తర్వాత మేమిద్దరం ఓ సినిమా చేద్దామనుకున్నాం. నిర్మాతల కోసం రెండేళ్లు తిరిగాం. కానీ సెట్టవ్వలేదు. అప్పుడు ఓటీటీ లాంటి ప్లాట్‌ఫామ్స్‌ కూడా లేవు. ఆ ప్రాజెక్ట్‌కు శాసనం అని టైటిల్‌ పెట్టుకున్నాం. తర్వాత అదే విరూపాక్షగా రిలీజైంది. అయినా నేను సంతోషంగానే ఉన్నాను. నాతో చేసుంటే అంత పెద్ద సక్సెస్‌ వచ్చి ఉండేది కాదేమో!'  అని చెప్పుకొచ్చాడు.

చదవండి:  'ఓం భీమ్ బుష్' సినిమా కలెక్షన్స్‌ ఊహించలేరు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement