Virupaksha Movie
-
Soniya Singh: కొత్త కారు కొన్న విరూపాక్ష నటి (ఫోటోలు)
-
విరూపాక్ష సినిమా నేను చేయాల్సింది: అర్జున్
సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చినవాళ్లు చాలానే ఉన్నారు. అయితే కొందరే క్లిక్ అవుతారు. సీరియల్స్‌కు, సినిమాకు మధ్యలో బిగ్‌బాస్ ప్లాట్‌ఫామ్‌ను వాడుకున్నవాళ్లూ ఉన్నారు. ఇక్కడ క్రేజ్ తెచ్చుకున్నాక పలువురూ సినిమాల్లో బిజీ అవుతుంటే మరికొందరు మాత్రం ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నెగెటివిటీ అయితే బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ అర్జున్ అంబటి మరో రకం. ఇతడు నేరుగా సినిమాల్లోనే అడుగుపెట్టాడు. కానీ ఎంత కష్టపడ్డా గుర్తింపే దొరకలేదు. దీంతో బుల్లితెరను ఆశ్రయించాడు. సీరియల్స్ ద్వారా క్లిక్ అయ్యాడు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రేజ్‌ను మరింత క్యాష్ చేసుకునేందుకు బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో అడుగుపెట్టాడు. కానీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడం అతడు చేసిన పెద్ద పొరపాటు! ఈ షో వల్ల అతడు నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు నటించిన తెప్ప సముద్రం త్వరలో రిలీజ్ కానుంది. రెండేళ్లు తిరిగాం ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన అర్జున్ అంబటి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 'డైరెక్టర్ కార్తీక్ నా స్నేహితుడు. అతడు ఎప్పుడూ సినిమా ప్రపంచంలోనే ఉంటాడు. అతడితో నేను లూప్ అని ఓ వెబ్ ఫిలిం చేశాను. తర్వాత మేమిద్దరం ఓ సినిమా చేద్దామనుకున్నాం. నిర్మాతల కోసం రెండేళ్లు తిరిగాం. కానీ సెట్టవ్వలేదు. అప్పుడు ఓటీటీ లాంటి ప్లాట్‌ఫామ్స్ కూడా లేవు. ఆ ప్రాజెక్ట్‌కు శాసనం అని టైటిల్ పెట్టుకున్నాం. తర్వాత అదే విరూపాక్షగా రిలీజైంది. అయినా నేను సంతోషంగానే ఉన్నాను. నాతో చేసుంటే అంత పెద్ద సక్సెస్ వచ్చి ఉండేది కాదేమో!' అని చెప్పుకొచ్చాడు. చదవండి: 'ఓం భీమ్ బుష్' సినిమా కలెక్షన్స్ ఊహించలేరు.. -
మరో థ్రిల్లర్‌తో...
‘విరూపాక్ష’ సినిమాతో ఘనవిజయం అందుకున్న డైరెక్టర్ కార్తీక్ దండు తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించారు. ‘విరూపాక్ష’ నిర్మాతలే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బి. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ ప్రీ లుక్ ΄ోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘విరూపాక్ష’ను మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందించిన కార్తీక్ దండు తన తదుపరి చిత్రాన్ని మిథికల్ థ్రిల్లర్ జానర్లో తీయబోతున్నాడు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
అందుకే గాండీవధారి అర్జున చేశాను – వరుణ్ తేజ్
‘‘ప్రవీణ్ సత్తారు ‘గాండీవధారి అర్జున’ కథ చెప్పినప్పుడు బాగా నచ్చేసింది. ఓ సమస్య గురించి సినిమా తీస్తున్నప్పుడు ఓ నటుడిగా అలాంటి సినిమా చేయటం నా బాధ్యత అనిపించింది.. అందుకే ఈ మూవీ చేశాను’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాక్షీ వైద్య జంటగా నటించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’. బాపినీడు .బి సమర్పణలో ఎస్వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. గురువారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘గాండీవధారి అర్జున’ ట్రైలర్ చూసి యాక్షన్ మాత్రమే ఉంటుందనుకోవద్దు.. మంచి ఎమోషన్స్ ఉంటాయి. దేశానికి వచ్చే సమస్య ఏంటి? అనేది చూపించాం’’ అన్నారు. ‘‘వరుణ్ తేజ్‌తో మేం చేసిన మొదటి సినిమా ‘తొలి ప్రేమ’, సాయితేజ్‌తో చేసిన ‘విరూ పాక్ష’ హిట్ అయ్యాయి. ఇప్పడు ‘గాండీవధారి అర్జున’ కూడా సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. ‘‘భూమిపై ఉన్న వనరులను ఇష్టానుసారం వాడేస్తున్నాం. భవిష్యత్ తరాల గురించి ఆలోచించటం లేదు. పర్యావరణ పరిరక్షణ గురించి ఈ సినిమా తీశాం’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. -
అదిరిపోయే ఫోజులతో సంయుక్త మీనన్ (ఫొటోలు)
-
'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?
ప్రేక్షకుల్ని భయపెట్టడం అంత తేలికైన విషయమేం కాదు. వందల సినిమాల చూసేసుంటారు కాబట్టి సినిమాని కాస్త డిఫరెంట్ గా తీయాలి. అప్పుడే షాకవుతారు. ఆ చిత్రాన్ని హిట్ చేస్తారు. అలా ఈ ఏడాది సక్సెస్ కొట్టిన చిత్రం 'విరూపాక్ష'. రూ.100 కోట్ల వసూళ్లు కూడా సాధించిన ఈ మూవీ.. ఓటీటీలోనూ సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే దర్శకుడిని అందరూ మెచ్చుకున్నారు. మూవీ టీమ్ మాత్రం ఖరీదైన బెంజ్ కారుని బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. (ఇదీ చదవండి: జెట్ స్పీడ్‌లో శ్రీలీల కెరీర్.. ఆ అంశాలే కలిసొచ్చాయా?) 'విరూపాక్ష' సంగతేంటి? గతంలో తెలుగులో పూర్తిస్థాయి హారర్ సినిమాలు వచ్చేవి కానీ ఆ తర్వాత తర్వాత అవి కాస్త హారర్ కామెడీ చిత్రాలుగా మారిపోయాయి. అలాంటిది 'విరూపాక్ష'ని చేతబడి కాన్సెప్ట్ తో కేవలం హారర్ కథతో అద్భుతంగా తీశాడు యంగ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ. స్క్రీన్ ప్లే విషయంలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ సహాయం చేసినప్పటికీ ఓవరాల్ క్రెడిట్ మాత్రం దర్శకుడికే దక్కుతుంది. దాన్ని ఏ మాత్రం మరిచిపోని నిర్మాతలు ఇప్పుడు కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. బెంజ్ బహుమతిగా తనకు బెంజ్ కారుని గిఫ్ట్ గా ఇచ్చారని చెబుతూ దర్శకుడు కార్తీక్ వర్మ ట్విట్టర్ లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేశాడు. వీటిలో బెంజ్ కారు సీ క్లాస్ మోడల్ కనిపించింది. మన దేశంలో దీని రోడ్ ప్రైస్ దాదాపు రూ.65-70 లక్షల వరకు ఉంటుంది. ఇలా హిట్ ఇచ్చిన దర్శకుడికి నిర్మాతలు కారుని బహుమతిగా ఇవ్వడం గతంలోనూ చాలాసార్లే జరిగింది. ఇప్పుడు 'విరూపాక్ష' దర్శకుడి విషయంలో మరోసారి నిజమైంది. ఇదంతా చూస్తే ప్రేక్షకుల్ని భయపెట్టాడు, ఖరీదైన కారుని పట్టేశాడు అనిపిస్తోంది. Virupaksha is a life time memory for me.. I would like to extend my gratitude to my guru @aryasukku sir, my hero @IamSaiDharamTej and my producers @BvsnP sir and @dvlns sir for this wonderful gift ….. pic.twitter.com/VbmT5Oeiqa — karthik varma dandu (@karthikdandu86) June 27, 2023 (ఇదీ చదవండి: ట్రైలర్ బాగుంది కానీ ఆ బూతు డైలాగ్ ఎందుకు పెట్టారో?) -
అచ్చిరాని సమ్మర్.. ఈసారి తెలుగు సినిమాలన్నీ కూడా!?
సమ్మర్ పేరు చెప్పగానే పిల్లలకు సెలవులు గుర్తొస్తాయి. వయసైన పెద్దోళ్లకు టూర్స్ గుర్తొస్తాయి. అదే మూవీ లవర్స్‌కు మాత్రం కొత్త సినిమాలే గుర్తొస్తాయి. ఏ వారం ఏ కొత్త సినిమా రిలీజ్ అవుతుందా? దాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని తెగ ఎదురుచూసేవాళ్లు. గత కొన్నేళ్లుగా వేసవికి తెలుగు బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. ఈసారి మాత్రం సందడి, హడావుడి ఏం లేకుండానే గడిచిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకనిర్మాతలు.. సంక్రాంతి, సమ్మర్, దసరా పండగ లాంటి వాటిని టార్గెట్ చేసుకుని మూవీస్ తీస్తుంటారు. ఈసారి సంక్రాంతికి చిరు-బాలయ్య హిట్స్ కొట్టేశారు. మార్చి చివర్లో నాని కూడా హిట్ కొట్టేశాడు. పాన్ ఇండియా చిత్రాలతో పెద్ద హీరోలందరూ బిజీ అయిపోవడంతో వాళ్లెవరివీ ఈసారి సమ్మర్ కు రిలీజ్ కాలేదు. ఇది మీడియం రేంజ్ హీరోలకు వరమైంది. కానీ దాన్ని వాళ్లు సరిగా వినియోగించుకోలేకపోయారు. (ఇదీ చదవండి: ఒక్క యాడ్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌కు అన్ని కోట్లా?) ఏప్రిల్ నెలని తీసుకుంటే.. తొలివారంలో రవితేజ 'రావణాసుర', కిరణ్ అబ్బవరం 'మీటర్' మూవీతో థియేటర్లలోకి వచ్చారు. ఈ రెండు కూడా తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని, ప్రేక్షకుల డిసప్పాయింట్ చేశాయి. రెండోవారం సమంత 'శాకుంతలం' వచ్చింది. ట్రైలర్ కాస్త అటుఇటుగా ఉండటంతో అందరూ డౌట్ పడ్డారు. కరెక్ట్ గా అదే జరిగింది. ప్రీమియర్ షోలకే అసలు విషయం తెలిసిపోయింది. సామ్ కెరీర్ లోనే ఘోరమైన ఫ్లాప్ గా ఇది నిలిచింది. మూడో వారం వచ్చిన 'విరూపాక్ష'.. ఎవరూ కనీసం ఎక్స్ పెక్ట్ చేయనంత హిట్ అయిపోయింది. పూర్తిస్థాయి హారర్ కాన్సెప్ట్ కావడం 'విరూపాక్ష'కు చాలా ప్లస్ అయింది. స్టోరీకి సుకుమార్ తనదైన శైలిలో టచ్ ఇచ్చేసరికి.. ఈ సినిమా జనాలకు తెగ నచ్చేసింది. లాంగ్ రన్ లో ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. చివరి వారంలో వచ్చిన అఖిల్ 'ఏజెంట్'పై రిలీజ్ కి ముందు కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మార్నింగ్ షోకే రిజల్ట్ తేలిపోయింది. బొమ్మ ఫట్ అయిపోయింది. ఇలా ఏప్రిల్ మొత్తమ్మీద టాలీవుడ్ కి ఒక్కటంటే ఒక్కటే హిట్ దక్కింది. (ఇదీ చదవండి: టిఫిన్ సెంటర్‌కు స్టార్ హీరోయిన్.. ఎవరూ గుర్తుపట్టలేదు!) మే నెలని తీసుకుంటే.. తొలివారం గోపీచంద్ 'రామబాణం', అల్లరి నరేష్ 'ఉగ్రం' సినిమాలతో వచ్చారు. వీటిలో 'రామబాణం' ఫట్ మని బుడగలా పేలిపోయింది. 'ఉగ్రం' పర్వాలేదనిపించింది. కానీ పెద్దగా జనాలు తెలియకుండానే థియేటర్లలో నుంచి మాయమైపోయింది. రెండో వారం వచ్చిన 'కస్టడీ'పై అక్కినేని ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ చైతూ వాళ్లని పూర్తిగా నిరాశపరిచాడు. నీరసమైన స్టోరీ లైన్ వల్ల చూసిన ప్రతిఒక్కరూ డిసప్పాయింట్ అయ్యారు. ఈ మూవీని ఫ్లాప్ గా డిక్లేర్ చేశారు. మూడో వారంలో వచ్చిన 'అన్నీ మంచి శకునములే' చాలా అంటే చాలా నిరాశపరిచింది. మే చివరి వారంలో వచ్చిన 'మేమ్ ఫేమస్'కి కూడా సేమ్ రిజల్ట్. ఇలా ఎంతో సందడిగా ఉంటుందనుకున్న సమ్మర్.. ఎప్పుడూ లేనంత నీరసంగా సాగింది. 'బిచ్చగాడు 2' , 2018 లాంటి ఒకటి రెండు డబ్బింగ్ సినిమాలు.. ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేశాయి గానీ మూవీ లవర్స్ ని సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో ఇప్పుడు అందరి కళ్లు ప్రభాస్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్' పైనే ఉన్నాయి. మరి రామయణం ఆధారంగా తీసిన ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో ఏమో? (ఇదీ చదవండి: సీఎం జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు: పంచ్ ప్రసాద్) -
ఓటీటీలోకి వచ్చేసిన 'విరూపాక్ష' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన సినిమా విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంచనాలకు తగ్గట్లుగానే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. చదవండి: మరో వ్యాపారరంగంలోకి లేడీ సూపర్‌స్టార్ నయనతార ఇటీవలే హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై అక్కడ కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇటీవలె రూ. 100 కోట్ల క్లబ్లో కూడా చేరిపోయింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ సూపర్‌హిట్ అయిన ఈ మూవీ ఓటీటీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సుమారు నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. శనివారం అర్థరాత్రి నుంచే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి థియేటర్స్‌లో సినిమాను మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయండి మరి. చదవండి: రాత్రికి రాత్రే రూ. 40కోట్లు నష్టపోయాను: కంగనా రనౌత్ -
విరూపాక్ష 100 కోట్ల కలెక్షన్ల సునామీ.. దెబ్బకి మెగాస్టార్ రేంజ్‌కి సాయి ధరమ్ తేజ్
-
ఓటీటీలో సందడి చేసే సినిమాలివే, ఆ హిట్ మూవీ కోసం అంతా వెయిటింగ్!
థియేటర్లో సినిమా రిలీజ్ కోసం ఎంత ఎదురుచూస్తున్నారో ఆ మూవీ ఓటీటీలోకి వచ్చే రోజు కోసం కూడా అంతే ఎదురుచూస్తున్నారు. కరోనా సమయంలో చిన్నాపెద్దా సినిమాలన్నీ మరో దారి లేక ఓటీటీలోనే నేరుగా విడుదలయ్యాయి. దీంతో అందరూ ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు. పరిస్థితులు చక్కబడ్డాక థియేటర్లకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కానీ ఇప్పటికీ ఓటీటీకి క్రేజ్ తగ్గలేదు. పైగా థియేటర్లో మెప్పించని కొన్ని సినిమాలు ఓటీటీలో బాగా క్లిక్ అవుతుండటం విశేషం. అలాగే బాక్సాఫీస్ దగ్గర జైత్రయాత్ర చేపట్టిన చిత్రాలు కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి. ఓటీటీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా తెరకెక్కుతున్నాయి. మరి ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీస్‌లేంటో ఓసారి చూసేద్దాం.. నెట్‌ఫ్లిక్స్ ► అయాలవాషి(మలయాళం) - మే 19 ► కథల్: ఎ జాక్‌ఫ్రూట్ మిస్టరీ (హిందీ) - మే 19 ► బయూ అజైబి (ఇంగ్లీష్)- మే 19 ► సెల్లింగ్ సన్‌సెట్ (ఆరో సీజన్)- మే 19 ► మ్యూటెడ్ (ఇంగ్లీష్) - మే 19 ► విరూపాక్ష - మే 21 హాట్‌స్టార్ ► డెడ్ పిక్సెల్స్ - మే 19 సోనీలివ్ ► ఏజెంట్ - మే 19 ► కడిన కదోరమీ అంద కదహం (మలయాళం) - మే 19 అమెజాన్ ప్రైమ్ వీడియో ► బ్యాక్‌డోర్- స్ట్రీమింగ్ అవుతోంది ► మోడ్రన్ లవ్ చెన్నై (తమిళ్) - స్ట్రీమింగ్ అవుతోంది ► హే మేరీ ఫ్యామిలీ సీజన్ 2 (హిందీ) - మే 19 ఆహా ► ఏమి సేతురా లింగ - మే 19 ► మారుతి నగర్ పోలీస్ స్టేషన్ (తమిళ్) - మే 19 జియో సినిమా ► లవ్ యూ అభి (కన్నడ సిరీస్) - మే 19 ► కచ్చి లింబూ - మే 19 ► క్రాక్ డౌన్ సీజన్ 2 - మే 20 చదవండి: తనకంటే చిన్నవాడితో లవ్.. బ్రేకప్ చెప్పిన నటి -
మెగాహీరో సెన్సేషన్.. రూ.100 కోట్లు కొల్లగొట్టిన 'విరూపాక్ష'
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష. సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్గా నటించింది. కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.హర్రర్ థ్రిల్లర్ జానర్లో తెరకెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.ఏప్రిల్ 21న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం తొలిరోజు నుంచే సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సాయితేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా తాజాగా వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత తెరకెక్కిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే విరూపాక్ష బాక్సాఫీస్‌ను షేక్‌చేసి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.చదవండి: సల్మాన్ ఖాన్ సోదరి ఇంట్లో భారీ దొంగతనం ఈ విజయంపై సాయితేజ్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. అభిమానులు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు అంటూ ఇన్‌స్టాలో పోస్టును షేర్ చేశాడు. కాగా ఇప్పటికే థియేటర్లలో సూపర్ హిట్ అయిన విరూపాక్ష ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అయ్యింది.ఈనెల 21 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. Supreme Hero @IamSaiDharamTej's #Virupaksha celebrates the Spectacular Commercial Triumph 🥳🥁#BlockbusterVirupaksha amasses Incredible 1️⃣0️⃣0️⃣ Crores with Immense Love from audience ♥️@iamsamyuktha_ @karthikdandu86 @Shamdatdop @AJANEESHB @SVCCofficial @SukumarWritings pic.twitter.com/UcftHOtRPv — SVCC (@SVCCofficial) May 18, 2023 -
ఓటీటీకి విరూపాక్ష.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా... శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఏప్రిల్ 21న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఓటీటీ పార్ట్నర్ ఖరారు చేసుకున్న విరూపాక్ష రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. (ఇది చదవండి: స్కూల్ రోజుల్లోనే ప్రేమ.. లవ్ లెటర్ కూడా రాశా: హీరోయిన్) ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం స్ట్రీమింగ్ డేట్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. మే 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయ్యాక తీసిన చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంచనాలను అందుకుంది. ఈ మూవీ రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తోంది. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. హోటల్ గదిలో ప్రముఖ సింగర్ సూసైడ్!) #Virupaksha to stream on #Netflix from May 21, 2023.#AjaneeshLokanath Musical pic.twitter.com/zFEWrOtGdF — Filmy Corner (@filmycorner9) May 16, 2023 -
విరూపాక్ష సక్సెస్ పై నాగచైతన్య ఊహించని కామెంట్స్
-
విరూపాక్ష భారీ డిజాస్టర్
-
ఈ రెండు సినిమాల పరిస్థితి ఏంటి..? హిట్ అవ్వకపోతే మాత్రం
-
'విరూపాక్ష' టీం థ్యాంక్యూ మీట్.. ఫొటోలు..
-
ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగించనున్న విరూపాక్ష
-
విరూపాక్ష హిట్.. ఇది నాకు సవాల్ లాంటిది: దిల్ రాజు
సాయిధరమ్‌తో నేను మూడు సినిమాలు తీశాను. తన కెరీర్లో విరూపాక్ష హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇది నాకు సవాల్ లాంటిదే. తనతో నేను సినిమా తీస్తే విరూపాక్ష కంటే ఇంకా పెద్ద సినిమాను, దాన్ని మించి హిట్ కొట్టే మూవీ తీయాలి అని నిర్మాత దిల్ రాజు అన్నారు. సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'విరూపాక్ష'. బాపినీడు బి. సమర్పణలో శ్రీ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలై, హిట్గాగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. 'విరూపాక్షని హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఆ మాట చెప్పడంలో ఆనందం ఉంది. ఈ సినిమాను ఈ నెల 5న హిందీ, తమిక్, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. అలాగే మే 12న కన్నడలో విడుదల చేస్తున్నాం' అన్నారు. "మా బ్యానర్‌కి విరూపాక్ష లాంటి పెద్ద సక్సెస్ ఇచ్చిన మా టీమ్‌కు, ప్రేక్షకులకు థ్యాంక్స్" అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు. బి. "విరూపాక్ష"ని మళ్లీ మళ్లీ చూసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు" అన్నారు కార్తీక్ దండు. "విరూపాక్ష ఇతర భాషల్లోనూ అద్భుతాలు సృష్టిస్తుందని భావిస్తున్నాం" అని సంయుక్తా మీనన్ అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాటో గ్రాఫర్ శ్యామ్ దత్, చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు, విరూపాక్ష మూవీ పంపిణీదారులు పాల్గొన్నారు. చదవండి: అఖిల్ కొత్త సినిమా.. హీరోయిన్గా జాన్వీ! -
ఓకే చెప్పాకే ఆలోచిస్తా, ఇకపై అలాంటి ప్రశ్న తలెత్తకూడదు: హీరోయిన్
కోలీవుడ్‌లో వరుసగా రెండు సక్సెస్‌లను అందుకుని జోరుమీదున్న నటి సంయుక్త. మాలీవుడ్‌లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ మలయాళ బ్యూటీ ఇంతకుముందు ధనుష్ కథానాయకుడిగా తమిళం, తెలుగు భాషల్లో నటించిన వాత్తీ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఆ సినిమా సక్సెస్ కావడంతో పాటు ఆమెకు మంచి పేరు వచ్చింది. దీంతో వెంటనే విరూపాక్ష అనే మరో తెలుగు చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం గత వారం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నటి సంయుక్త నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించింది. కాగా విరూపాక్ష చిత్రం తమిళంలోనూ అనువాదం అయి ఈనెల 5వ తేదీన తెరపైకి రాబోతుంది. ఈ సందర్భంగా శనివారం చైన్నెలో మీడియాతో ముచ్చటించిన నటి సంయుక్త ఏ విషయంలోనైనా తాను ముందు ఓకే చెప్పి ఆ తరువాతే ఆలోచిస్తానని చెప్పింది. విరూపాక్ష వంటి కమర్షియల్ కథా చిత్రంలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యతను ఇవ్వడం అన్నది అభినందించదగ్గ విషయం అని పేర్కొంది. ఈ చిత్రం కోసం చాలా రిస్క్ చేసి నటించినట్లు చెప్పింది. భవిష్యత్‌లో కథానాయికల పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందా? అన్న ప్రశ్నకు తావే ఉండరాదని పేర్కొంది. దయచేసి దర్శక, నిర్మాతలు మహిళా పాత్రలకు ప్రాధాన్యత నివ్వాలని విజ్ఞప్తి చేసింది. ప్రతిభావంతమైన నటీమణులు ఇక్కడ చాలా మంది ఉన్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తమిళంలో మరిన్ని చిత్రాలలో నటించాలని కోరుకుంటున్నానని నటి సంయుక్త పేర్కొంది. చదవండి: ఢీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ ఆత్మహత్య -
'విరూపాక్ష' టీం థ్యాంక్యూ మీట్.. ఫొటోలు..
-
రికార్డు బ్రేక్ చేసిన సాయి ధరమ్ తేజ్
-
నేను మీ వాడినే, ఇక్కడే చదువుకున్నా: సాయిధరమ్ తేజ్
తాను మీ వాడినేనని నటుడు సాయి ధరమ్ తేజ్ చెన్నైలో పేర్కొన్నారు. ఈయన కథా నాయకుడిగా నటించిన తాజా చిత్రం విరూపాక్ష. బి. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. కార్తీక్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా నటించింది. గత వారం తెలుగులో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచి ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పుడు ఈ చిత్రం తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళంలో దీనిని స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ పతాకంపై కేఈ జ్ఞానపీవల్ రాజా తమిళనాడులో మే 5న విడుదల చేయనున్నారు. శక్తి ఫిలింస్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విరూపాక్ష చిత్ర యూనిట్ శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలో మీడియాతో సమావేశం అయ్యారు. నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ.. తాను 35 ఏళ్లుగా తమిళంలో చిత్రం చేయాలని ప్రయత్నిస్తున్నానని, దర్శకుడు ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వంలోనే చిత్రం చేయాలని భావించానన్నారు. ఆ తరువాత అగస్త్రియన్ దర్శకత్వంలో చేసే ప్రయత్నం చేసినా కుదరలేదన్నారు. అలాంటివి విరూపాక్ష చిత్రంతో కోలీవుడ్‌కు రావడం సంతోషంగా ఉందని అన్నారు. చిత్ర కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. తాను మీ వాడినేనని టీ నగర్లో చదువుకున్నానని చెప్పారు. విరూపాక్ష చిత్రాన్ని కష్టపడి చేశామని తెలుగులో మంచి విజయం సాధించిందని చెప్పారు. చిత్రంలో అన్ని అంశాలు ఉంటాయని, మీ ఆదరణ కావాలని కోరారు. తమిళంలో చిత్రం చేయాలని చాలా కాలంగా కోరుకుంటున్నానని, అవకాశం వస్తే నేరుగా తమిళ చిత్రం చేయడానికి సిద్ధం అని సాయిధరమ్ తేజ్ పేర్కొన్నారు. చదవండి: ప్రియురాలితో నటుడి సహజీవనం, పెళ్లికాకుండానే రెండోసారి -
సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా అప్డేట్
-
నేను డబ్బులు ఇవ్వలేదు, కానీ రుణపడి ఉంటాను : సాయితేజ్
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సాయితేజ్‌ను అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి సకాలంలో ఆసుపత్రికి తరలించి సాయమందించాడు. దీంతో సాయితేజ్‌ను కాపాడినందుకు మెగా ఫ్యామిలీ అబ్దుల్‌కు కారు, బైకు, లక్ష రూపాయల వరకు నగదు.. ఇలా వరాలు కురిపించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై తొలిసారి అబ్దుల్ స్పందించాడు. చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్తా మీనన్ తేజ్ నుంచి, ఆయన కుటుంబం నుంచి ఎలాంటి సాయం అందలేదని, ఇలా అసత్య ప్రచారం వల్ల గతంలో పనిచేసే చోట జాబ్ కూడా మానేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కానీ సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ వల్ల తాను చాలా ఇబ్బందులు పడినట్లు అబ్దుల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. అది కాస్తా సాయితేజ్ దగ్గరకు వెళ్లడంతో ఆయన స్పందించక తప్పలేదు. 'అబ్దుల్ ఫర్హాన్‌కు సాయం చేసినట్లు నేను, నా టీమ్ ఎక్కడా చెప్పలేదు. కావాలంటే ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించాను. ఆయన ఫ్యామిలీకి మేం ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఆయన వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా ఫోన్ చేయమని నా మేనేజర్ నెంబర్ ఇచ్చాను' అంటూ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ విషయంలో ఇకపై తాను మాట్లాడాలనుకోవట్లేదని కూడా పేర్కొన్నాడు. చదవండి: ప్రతీకారంతో జైలుపాలు.. డ్రగ్స్ కేసులో నిర్దోషిగా తేలిన హీరోయిన్ To whomsoever it may concern.. Thank You Sai Dharam Tej. pic.twitter.com/qJr3SYYJ6B — Sai Dharam Tej (@IamSaiDharamTej) April 27, 2023 -
'విరూపాక్ష' డైరెక్టర్‌కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్తా మీనన్
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన సినిమా విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. హర్రర్ థ్రిల్లర్ జానర్లో తెరకెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో కమర్షియల్ సక్సెస్‌ని సొంతం చేసుకుంది. చదవండి: ప్రతీకారంతో జైలుపాలు.. డ్రగ్స్ కేసులో నిర్దోషిగా తేలిన హీరోయిన్ సినిమా రిలీజ్ అయిన ఆరు రోజులకు కూడా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో హీరోయిన్ సంయుక్తా మీనన్ డైరెక్టర్ కార్తీక్ దండుకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి షాకిచ్చింది. ఈ విషయంపై సంయుక్తా మాట్లాడుతూ.. 'మూవీ హిట్ కావడంతో కార్తీక్‌కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా. విరూపాక్ష రిలీజ్ రోజు ఓ థియేటర్లో అతని ఫోన్ ఎవరో కొట్టేశారు. దీంతో సినిమా రెస్పాన్స్ చూడటానికి వేరే వాళ్ల ఫోన్లలో చూసేవాడు. అందుకే వెంటనే ఐఫోన్‌ను కొని గిఫ్ట్‌గా ఇచ్చాను' అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: డైరెక్టర్ లింగుస్వామికి ఊరట.. జైలు శిక్షపై స్టే -
ఫుల్ ఖుషీలో సుకుమార్...
-
టాలీవుడ్ పై సీక్వెల్ వర్షాలు
-
సెంటిమెంట్ తో ఏజెంట్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్!
-
కాకి సెంటిమెంట్ తో వండర్స్ క్రీయేట్ చేస్తున్న విరూపాక్ష కలెక్షన్
-
తేజ్ క్రష్ ఆన్ సామ్...!
-
గుజరాత్ హీరోయిన్స్ మధ్య సూపర్ ఫైట్
-
అప్పుడు నేను కోమాలో ఉన్నాను: విరూపాక్ష డైరెక్టర్
ఇటీవలి కాలంలో హారర్ కామెడీ సినిమాలు వచ్చాయి. కానీ ఓ స్ట్రిక్ట్ అండ్ హానెస్ట్ హారర్ ఫిలిం రాలేదు. అందుకే హారర్ జానర్‌కు అభిమానిని అయిన నేను విరూపాక్ష తీశాను. ప్రేక్షకులను థ్రిల్ చేయాలని సినిమాలోని మర్డర్ సీక్వెన్స్‌లను కొత్తగా డిజైన్ చేశాం అన్నారు దర్శకుడు కార్తీక్ దండు. సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన చిత్రం విరూపాక్ష. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజైంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో కార్తీక్ మాట్లాడుతూ.. 2016-17 సమయంలో ఓ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను. చేతబడి చేస్తున్నారనే ఆరోపణతో ఓ మహిళను గ్రామస్తులు కొట్టి చంపేస్తారు. ఆమెకు నిజంగా చేతబడి చేసే శక్తులు ఉంటే ఏం జరుగుతుందని ఊహించి విరూపాక్ష కథ రాశాను. నా కథను నమ్మిన సుకుమార్ గారు స్క్రీన్‌ప్లే అందించి, తాను ఓ నిర్మాతగా ఉంటానన్నారు. అలాగే సాయితేజ్గారిని హీరోగా నిర్ణయించి, బీవీఎస్ఎన్ ప్రసాద్ గారిని నిర్మాతగా నిర్ణయించారు. అయితే విరూపాక్ష షూటింగ్‌ను మరో రెండు మూడు రోజుల్లో మొదలు పెడదామనుకున్న సమయంలో సాయిధరమ్ తేజ్ గారికి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో సినిమా పరిస్థితి ఏంటో అని మెంటల్‌గా నాకు నేను కోమాలోనే ఉన్నట్లనిపించింది. సాయితేజ్ గారికి అంతా బాగానే ఉందని చెప్పగానే రిలాక్స్ అయ్యాను. విరూపాక్ష విడుదలయ్యాక చాలామంది నిర్మాతలు ఫోన్ చేశారు. ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాం అన్నారు. -
'విరూపాక్ష' విధ్వంసం.. నాలుగు రోజుల్లోనే ఆ మార్క్ దాటేసింది!
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, సార్ భామ సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం 'విరూపాక్ష'. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. హర్రర్ థ్రిల్లర్ జానర్లో తెరకెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెళ్లోంది. రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ వంశీ కాక తన ట్విటర్లో షేర్ చేశారు. సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత తెరకెక్కిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే విరూపాక్ష బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించటం విశేషం. దీంతో సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. సాయిధరమ్ తేజ్ కెరీర్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం.. అది కూడా నాలుగు రోజుల్లోనే యాభై కోట్లు మార్క్‌ను టచ్ చేయటం ఇదే తొలిసారి అవుతుంది. కాగా.. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, రవి కృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సుకుమార్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. #Virupaksha continues the Blockbuster run at Box-office on weekdays too & hits the 50CR+ Milestone at the Box-office in just 4 days 🥳💥#BlockbusterVirupaksha IN CINEMAS NOW 👇https://t.co/VXxU4xmSnk@IamSaiDharamTej pic.twitter.com/pqOzIu3udj — Vamsi Kaka (@vamsikaka) April 25, 2023 -
యాంకర్ ప్రశ్నకు మాట్లాడలేక ఎమోషనల్ అయిన సాయిధరమ్ తేజ్..
-
బాక్స్ ఆఫీస్ ని పీస్ పీస్ చేస్తున్నవిరూపాక్ష కలెక్షన్స్..
-
ప్రేక్షకులు సవాల్ విసిరారు, దానికి సమాధానమే ఇది: సాయిధరమ్ తేజ్
‘‘గత ఏడాది కొన్ని సినిమాలకు ప్రేక్షకులు సరిగ్గా రాలేదు. మమ్మల్ని థియేటర్స్‌కు రప్పించే సినిమాలు తీస్తేనే వస్తామంటూ ఆడియన్స్ ఓ చాలెంజ్ విసిరారు. ఆ సవాల్‌కి జవాబే ‘విరూపాక్ష’’ అని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. బాపినీడు బి.సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా గత శుక్రవారం (ఏప్రిల్ 21) విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘విరూపాక్ష’ విజయం నాదో, మా టీమ్‌దో కాదు.. మన ప్రేక్షకులది. మన ఇండస్ట్రీకి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తీసుకెళ్లటానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘విరూపాక్ష’ని హిట్ చేసిన ఆడియన్స్‌కు థ్యాంక్స్’’ అన్నారు కార్తీక్ దండు. ‘‘ఈ మూవీలో నా పాత్రకి వస్తున్న స్పందనకు కారణం కార్తీక్గారే’’ అన్నారు సంయుక్తా మీనన్. ‘‘ఈ సినిమాని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు డైరెక్టర్ మారుతి. ‘‘విరూపాక్ష’ని అందరూ థియేటర్లోనే చూడండి.. గొప్ప అనుభూతి వస్తుంది’’ అన్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్, కెమెరామేన్ శ్యామ్ దత్, నటీనటులు సోనియా సింగ్, సాయిచంద్, అజయ్, కమల్ కామరాజు బ్రహ్మాజీ, రవికృష్ణ పాల్గొన్నారు. -
విరూపాక్ష సినిమా వేయలేదని థియేటర్‌పై తేజ్ ఫ్యాన్స్ దాడి
ఎక్కడ చూసినా విరూపాక్ష సందడే కనిపిస్తోంది. ఈ హారర్ సినిమాతో థియేటర్లు మోత మోగిపోతున్నాయి. ఎలాగోలా వీలు చేసుకుని మరీ ఈ సినిమాకు వెళ్తున్నారు ప్రేక్షకులు. అయితే హైదరాబాద్ మూసాపేటలో ఏషియన్ లక్ష్మీకళ థియేటర్లో సినిమా టిక్కెట్లు కొనుగోలు చేసి లోనికి వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. సాయంత్రం ఆరు గంటలకు లోపలకు వెళ్లిన ప్రేక్షకులు గంటకు పైగా షో కోసం వేచి చూశారు. కానీ ఎంతకూ షో ప్రారంభమవలేదు. గంటన్నర తర్వాత కూడా షో వేయకపోవడంతో ఆగ్రహానికి గురైన సాయిధరమ్ తేజ్ అభిమానులు థియేటర్‌పై దాడి చేశారు. థియేటర్ అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. అటు థియేటర్ యజమానులు సైతం టిక్కెట్లు కొనుగోలు చేసినవారికి డబ్బులు తిరిగిచ్చేశారు. అయితే చాలామందికి జీఎస్టీ, పార్కింగ్ ఫీజు అంటూ సగం టికెట్ డబ్బులే ఇచ్చారని, కొద్దిమందికి మాత్రమే పూర్తి మొత్తం డబ్బు వాపస్ చేశారని ఓ ప్రేక్షకుడు సోషల్ మీడియాలో వాపోయాడు. కాగా సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన విరూపాక్ష మూవీ ఏప్రిల్ 21న విడుదలైంది. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం రోజురోజుకీ కలెక్షన్లు పెంచుకుంటూ పోతుండటం విశేషం. మొత్తానికి రీఎంట్రీతోనే సాయిధరమ్ తేజ్ భారీ హిట్ కొట్టడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు. చదవండి: నగ్న ఫోటోలు ఫ్రేమ్ కట్టిస్తానన్న ఫ్రెండ్ మాటలకు నటి ఎమోషనల్ -
కాసుల వర్షం కురిపిస్తున్న ‘కాకి’!
సాధారణంగా కొన్ని సినిమాల్లో జంతువులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు దర్శకులు. ముఖ్యంగా పెంపుడు కుక్క, గుర్రం, ఏనుగు లాంటి జంతువులను బేస్ చేసుకొని సినిమాలను తెరకెక్కించారు. వాటిలో చాలా వరకు విజయం సాధించాయి. అంతేకాదు హీరో కంటే ఆ జంతువులకు సంబంధించిన సన్నివేశాలే ప్రేక్షకులను అలరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మన దర్శకుల కన్ను కాకులపై పడింది. కాకులను బేస్ చేసుకొని సన్నివేశాలను రాసుకుంటున్నారు. అవి ప్రేక్షలను బాగా ఆకట్టుకుంటున్నాయి. కాకి కాన్సెప్ట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన చిత్రాలపై ఓ లుక్కేద్దాం. కాకి కాన్సెప్ట్ అనగానే ఇప్పుడు అందరికి గుర్తొచ్చె సినిమా ‘బలగం’. ఓ మనిషి తదానానంతరం కాకి పిండం ముట్టడం అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు వేణు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మనిషి చనిపోయిన తర్వాత కాకి పిండంను తినకపోవడం గురించి చూపించారు. కథంతా కాకి చుట్టే తిరుగుతుంది. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఇక రీసెంట్గా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విరూపాక్ష’చిత్రంలోనూ కాకికి ఇంపార్టెంట్ రోల్ లభించింది. క్షుద్రపూజల నేపథ్యంలో మిస్టరీ,థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. ఏప్రిల్ 21న విడుదలై పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. ప్రేక్షకులను భయపెట్టడానికి కాకిని చాలా సన్నివేశాల్లో వాడారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో కాకులన్నీ గుంపుగా వచ్చి అగ్నికి ఆహుతి అవ్వడం అనేది సినిమాకి హైలెట్‌గా నిలిచింది. అలాగే ఇటీవల విడుదలైన నాని తొలి పాన్ ఇండియా చిత్రం ‘దసరా’లోనూ కాకిని వాడేశారు. ఈ సినిమాలో కూడా కాకి పిండాన్ని తినకపోవడాన్ని చూపించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో టాలీవుడ్‌కి కాకి సెంటిమెంట్‌గా మారిపోయింది. మరి ఈ కాకుల కాన్సెప్ట్‌తో ఇంకెన్ని చిత్రాలు వస్తాయో చూడాలి. (చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు వీరే) -
ఇది పాన్ ఇండియా స్థాయి సినిమా..
-
ముగ్గురు మావయ్యల పేర్లు చెప్పగానే దద్దరిల్లిన ఆడిటోరియం..
-
తేజ్ మీద చాలా కోపంగా ఉంది..
-
తేజ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయినా డైరెక్టర్ కార్తీక్..
-
గోల్డెన్ లెగ్ హీరోయిన్ అనగానే సంయుక్త రియాక్షన్ చూడండి..
-
ఫన్నీ స్పీచ్ తో నవ్వులు పూయించిన సోనియా.. తేజ్ రియాక్షన్ చూడండి
-
Virupaksha Success Meet : ‘విరూపాక్ష’ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
సినిమా హిట్.. థియేటర్‌కు వెళ్లిన విరూపాక్ష దర్శకుడికి షాక్..
చాలా కాలం తర్వాత విరూపాక్షతో హిట్ అందుకున్నాడు సాయిధరమ్ తేజ్. ఏప్రిల్ 21న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.24.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించగా ఆయన శిష్యుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. థియేటర్‌కు వచ్చినవాళ్లను భయపెట్టడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. ఈ సినిమాపై అటు సినీప్రేమికులు, ఇటు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తుండటంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటోంది. ఒక్కసారి ప్రేక్షకుల స్పందన ఎలా ఉందామో నేరుగా చూద్దామని కార్తీక్ వర్మ, నిర్మాత బాపినీడుతో కలిసి సరదాగా థియేటర్‌కు వెళ్లాడు. తన సినిమాను స్క్రీన్‌పై చూసుకుని మురిసిపోయాడు డైరెక్టర్. సినిమా చూస్తున్నంతసేపు బాగానే ఉంది కానీ బయటకు వచ్చాక చూసుకుంటే జేబులో మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయింది. థియేటర్లో ఉన్నప్పుడు ఎవరో ఆయన ఫోన్ కొట్టేశారు. ఈ విషయాన్ని కార్తీక్ వర్మే స్వయంగా వెల్లడించాడు. సినిమా హిట్టయింది కానీ ఫోన్ పోయిందని చెప్పుకొచ్చాడు. విరూపాక్ష విషయానికి వస్తే.. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా నటించగా రాజీవ్ కనకాల, సునీల్, సాయిచంద్, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషించారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు. చదవండి: ప్రియురాలి ఆత్మహత్య.. మూడేళ్ల తర్వాత నటితో నటుడి లవ్ మ్యారేజ్ -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘విరూపాక్ష’.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..
చాలా కాలం తర్వాత సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఖాతాలో మరో హిట్ పడింది. యాక్సిడెంట్ తర్వాత ఆయన నటించిన ‘విరూపాక్ష’ మూవీ ఈ నెల 21న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి రోజు తెలుగు రాష్ట్రాలలో దాదాపు రూ.5 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు అంతకంటే ఎక్కువగా రూ5.80 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.65 కోట్ల షేర్, రూ. 24.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని దక్కించుకుంది. ఈ మూవీకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 22 కోట్లకు జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 23 కోట్లను వసూలు చేయాలి. రెండు రోజుల్లో రూ.13.65 కోట్లు సాధించింది. అంటే రూ. 9.35 కోట్ల 5 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. మూవీకి వచ్చిన టాక్ని బట్టి చూస్తే.. మరో రెండు రోజుల్లో ఈజీగా బ్రేక్ ఈవెన్ సాంధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి సాయి తేజ్ రీఎంట్రీతోనే బిగ్ కొట్టాడని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: 20 ఏళ్ల తర్వాత చిరంజీవితో శ్రియ.. ఏకంగా రూ. కోటి డిమాండ్!) ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించగా.. ఆయన శిష్యుడు కార్తిక్ దండు దర్శకత్వం వహించారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. సాయితేజ్‌కి జోడిగా సంయుక్త మీనన్ నటించగా.. రాజీవ్ కనకాల, సునీల్, సాయిచంద్, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రలు పోషించారు. -
యాంకర్ ప్రశ్నకి ఎమోషనల్ అయిన సాయి ధరమ్ తేజ్
-
సాయితేజ్ 'విరూపాక్ష' సక్సెస్‌పై రామ్‌చరణ్ ట్వీట్
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. నిన్న(శుక్రవారం)గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. హర్రర్ థ్రిల్లర్ జానర్లో తెరకెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో కమర్షియల్ సక్సెస్‌ని సొంతం చేసుకుంది. కార్తీక్‌దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయితేజ్‌కు జంటగా సంయుక్తా మీనన్ నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అందుకు తగ్గట్లే వసూళ్లను రాబట్టింది. చాలాకాలం తర్వత సాయితేజ్ విరూపాక్ష చిత్రంతో మంచి కంబ్యాక్ ఇచ్చాడని మెగా అభిమానులు సహా ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో సాయితేజ్ సక్సెస్‌ని మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇప్పటికే చిరంజీవి విరూపాక్ష టీంకు అభినందనలు తెలుపగా తాజాగా రామ్‌చరణ్ ట్వీట్ చేశారు. 'కంగ్రాట్స్.. మై బ్రదర్(సాయితేజ్). విరూపాక్ష సినిమా గురించి చాలా మంచి టాక్ వింటున్నా' అంటూ చరణ్ పేర్కొన్నాడు. Congratulations brother @IamSaiDharamTej hearing great things about #Virupaksha 😊 @karthikdandu86@iamsamyuktha_ @BvsnP @SVCCofficial @Shamdatdop @bkrsatish @SukumarWritings pic.twitter.com/PIH235uYxM — Ram Charan (@AlwaysRamCharan) April 22, 2023 -
‘విరూపాక్ష’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..
సూప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. కార్తీక్ దండు రాసుకున్న కథ రొటీన్‌గానే ఉన్నప్పటికీ.. సుకుమార్ స్క్రీన్‌ప్లే సినిమాను నిలబెట్టింది. అలాగే అజనీష్ లోక్‌నాథ్ నేపథ్యం సంగీతం కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇక ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. . ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 కోట్ల షేర్, 8.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. (చదవండి: విరూపాక్ష మూవీ రివ్యూ) ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 6.35కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఏరియా వైజ్‌గా చూస్తే.. నైజాంలో అత్యధికంగా రూ.1.82 కోట్లు, వైజాగ్ రూ.58లక్షలు, సీడెడ్ రూ. 54 లక్షలు, గుంటూరు రూ. 46 లక్షలు, నెల్లూరు రూ. 20 లక్షలు, కృష్ణా రూ. 32 లక్షలు, వెస్ట్ రూ. 47 లక్షలు, ఈస్ట్ రూ.40 లక్షలు కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్తో పాటు మిగిలిన ప్రాంతాలలో రూ. 1. 56కోట్లు వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 22 కోట్లకు జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 23 కోట్లను వసూలు చేయాలి. తొలిరోజు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ వీకెండ్‌లోగా ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని సినీ వర్గాలు అంచానా వేస్తున్నాయి. -
తేజ్ 6 నెలలుగా..పోరాడుతూనే ఉన్నాడు
-
ఓటీటీకి విరూపాక్ష.. స్ట్రీమింగ్ పార్ట్నర్ ఫిక్స్!
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా... శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈనెల 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. (ఇది చదవండి: Virupaksha Review In Telugu: ‘విరూపాక్ష’ మూవీ రివ్యూ) తాజాగా ఈ చిత్రానికి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నాలుగు వారాల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత తెరకెక్కించిన చిత్రం కావడంతో అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అయితే ఓటీటీకి సంబంధించిన మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
విరూపాక్ష హీరోయిన్ సంయుక్త స్పెషల్
సౌతిండియన్ చిత్రాల్లో అన్ని లాంగ్వేజ్ సినిమాల్లో నటించిన సంయుక్త(సంయుక్త మీనన్)కు.. ఈ ఏడాది టాలీవుడ్లో బాగా కలిసొచ్చింది. ధనుష్ సార్ చిత్రంతో తెలుగులోనూ సాలిడ్ హిట్ అందుకున్న సంయుక్త.. ఇప్పుడు విరూపాక్షతోనూ ఆడియొన్స్‌ను మెస్మరైజ్ చేసింది. కిందటి ఏడాది భీమ్లా నాయక్, బింబిసారలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు సంయుక్త. ► 1995, సెప్టెంబర్ 11న పాలక్కాడ్(కేరళ)లో జన్మించింది సంయుక్త(సంయుక్త మీనన్). ► ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసి.. 2016లో పాప్‌కార్న్ చిత్రంతో మాలీవుడ్‌లో అగుడుపెట్టింది. ► కలరి చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టారు సంయుక్త. జులై కాట్రిల్, ఎరిడా, వాతి చిత్రాల్లో నటించారు. ► మాలీవుడ్‌లో ‘లిల్లీ’, టోవినో థామస్ సరసన ‘కల్కి’, ‘తీవండి’, వెల్లమ్, వోల్ఫ్, కడువా, బూమరాంగ్ తదితర చిత్రాల్లో నటించింది. ఉయరేలో ఓ కీలక పాత్ర పోషించింది. ► పవన్-రానాల మల్టీస్టారర్ భీమ్లా నాయక్‌తో టాలీవుడ్లో అడుగుపెట్టింది. కల్యాణ్ రామ్ బింబిసార, ధనుష్ బైలింగువల్ సార్(వాతి), సాయి ధరమ్‌తేజ్ విరూపాక్షతో హిట్లు అందుకుంది. ► కిందటి ఏడాది గాలిపటా2తో శాండల్‌వుడ్‌లో అడుగుపెట్టింది ఈ మల్లు బ్యూటీ. ► తనను సంయుక్తా మీనన్ అని పిలవొద్దని అంటున్నారామె. సంయుక్తా మీనన్లో ఇంటి పేరు ‘మీనన్’ను తాను పక్కనపెట్టానని, తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారామె. ► టిపికల్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సంయుక్త.. హీరోయిన్లను సినిమా ఫలితం ఆధారంగా గోల్డెన్ లెగ్-ఐరెన్ లెగ్ అని విభజించడాన్ని తాజాగా విరూపాక్ష ప్రెస్మీట్లో తీవ్రంగా ఖండించారు తాజాగా. -
Virupaksha : విరూపాక్ష సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
మేనల్లుడి 'విరూపాక్ష' హిట్.. చిరంజీవి ఎంత ఆనందంగా ఉన్నారో
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం విరూపాక్ష నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్ దండు తెరకెక్కిచిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో సాయితేజ్‌కు జంటగా సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో హిట్ టాక్‌తో థియేటర్ల వద్ద సందడి చేస్తోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి విరూపాక్ష టీంకు అభినందనలు తెలిపారు. సతీమణి సురేఖ సాయితేజ్‌కు కేక్ తినిపిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. విరూపాక్ష సినిమాపై అద్భుతమైన స్పందన వస్తోంది. సాయితేజ్ విరూపాక్షతో గ్రాండ్ వెల్కమ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నీ సినిమాని ప్రేక్షకులు మెచ్చుకోవడం, వారి ఆశీస్సులు అందించడం సంతోషంగా ఉంది. వీరూపాక్ష టీంకు హృదయపూర్వక అభినందనలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. దీనికి మేనల్లుడు సాయితేజ్ స్పందిస్తూ.. థ్యాంక్యూ అత్తా, మామ. లవ్ యూ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. Hearing fabulous reports about #Viroopaksha ! I am so happy for you dear @IamSaiDharamTej that you have made your come back with a bang. 🤗Delighted that the audience is appreciating and blessing your film! Hearty Congratulations to the entire team! 💐💐@iamsamyuktha_… pic.twitter.com/eeBh7L2skm — Chiranjeevi Konidela (@KChiruTweets) April 21, 2023 -
100 కోట్లు కాకపోతే 1000 కోట్లు తెస్తుంది..
-
సస్పెన్స్,ట్విస్టులతో పిచ్చెక్కిపోతారు..
-
తేజ్ పైనే ఆశలు...
-
విరూపాక్ష మూవీ పబ్లిక్ టాక్
-
Virupaksha Review In Telugu: ‘విరూపాక్ష’ మూవీ రివ్యూ
టైటిల్: విరూపాక్ష నటీనటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్, రాజీవ్ కనకాల, సునీల్, సాయిచంద్, బ్రహ్మాజీ తదితరులు నిర్మాణ సంస్థలు: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్ దర్శకత్వం: కార్తీక్ దండు స్క్రీన్‌ప్లే: సుకుమార్ సంగీతం: అజనీష్ లోక్‌నాథ్ సినిమాటోగ్రఫీ: శామ్‌దత్ సైనుద్దీన్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: ఏప్రిల్ 21, 2023 రోడ్డు ప్రమాదం తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే తొలి హారర్ మూవీ. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించడం, ఆయన శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ఫస్ట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్,ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు (ఏప్రిల్ 21) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. విరూపాక్ష కథేంటేంటే ఈ సినిమా కథంతా రుద్రవనం అనే గ్రామంలో జరుగుతుంది. 1979లో క్షుద్ర పూజలు చేస్తూ చిన్న పిల్లల ప్రాణాలు తీస్తున్నారనే నెపంతో ఓ జంటను కొట్టి చంపుతారు గ్రామస్తులు. అది జరిగిన పుష్కరకాలం తర్వాత సూర్య(సాయి ధరమ్ తేజ్) తన తల్లితో కలిసి ఆ గ్రామానికి వస్తాడు. ఆ గ్రామంలో జాతర జరుగుతుండడంతో 15 రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో ఆ ఊరి సర్పంచ్ హరిశ్చంద్ర(రాజీవ్ కనకాల) కూతురు నందిని(సంయుక్త మీనన్)తో ప్రేమలో పడతాడు. ఆమెను ఒప్పించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో రుద్రవనం గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తాయి. అందులో సూర్య పెదనాన్న కూతురు పార్వతి(యాంకర్ శ్యామల) కూడా ఉంటుంది. అనుమానాస్పద మరణాల సంఖ్య పెరుగుతుండడంతో ఊరి ప్రజలంతా భయంతో వణికిపోతారు. చేతబడి కారణంగానే మరణాలు సంభవిస్తున్నాయని పూజారి (సాయిచంద్) ఊరినంతా అష్టదిగ్బంధనం చేయిస్తారు. అసలు ఆ ఊరిని పట్టిపీడుస్తున్న ఆ దుష్టశక్తి ఏంటి? చావుల వెనుక ఉన్న రహస్యం ఏంటి? ప్రేమించిన అమ్మాయి నందినిని రక్షించుకోవడం కోసం సూర్య ఎం చేశాడు? ఆ మిస్టరీ డెత్స్ కారణంగా భయపడుతున్న ఊరి ప్రజలకు ఎలాంటి విముక్తిని ఇచ్చాడు? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. చేతబడి నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా విజయం సాధించాయి కూడా. అయితే ఈ మధ్య కాలంతో ఈ తరహా చిత్రాలు రావడం లేదు. చాలా కాలం తర్వాత ఆ మధ్య ‘మసూద’ వచ్చి మంచి విజయం సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘విరూపాక్ష’ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ సీన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కథను చక్కగా అల్లుకున్నాడు కార్తిక్ దండు. అయితే ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో ప్రేమ కథను చొప్పించి కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు ఒక ఫ్లోలో వెళ్తున్న కథకు అడ్డంకిగా అనిపిస్తుంది. పాడుబడ్డ ఇంట్లో క్షుద్రపూజల సీన్‌తో సినిమా ఆసక్తిగా ప్రారంభం అవుతుంది. పుష్కరకాలం తర్వాత ఏం జరుగుతుందో చనిపోతున్న జంటతో ముందే చెప్పించారు. చేతబడి కారణంగానే ప్రజలు చనిపోతున్నారనేది ప్రేక్షకులు ఈజీగా అర్థమవుతుంది. అయితే ఈ చేతబడి వెనుక ఉంది ఎవరు? ఎలా చేస్తున్నారు? అనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిపిస్తూ సస్పెన్స్‌ని మెంటైన్ చేయడంలో సుకుమార్ వందశాతం విజయం సాధించారు. కొన్ని సన్నివేశాలు చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. అదేసమయంలో లవ్‌స్టోరీ, లాజిక్‌లెస్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి. క్లైమాక్స్‌కి ముందు వచ్చే సీక్వెన్స్‌లను మరింత క్లారిటీగా చూపిస్తే బాగుండేది. కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా సింపుల్‌గా ముగించారు. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుంది. హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి ‘విరూపాక్ష’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే... యాక్సిడెంట్ తర్వాత తేజ్ నటించిన తొలి చిత్రమిది.హీరోయిజానికి అంతగా స్కోప్‌లేదు.అయినా కూడా తేజ్ తన పాత్రకి న్యాయం చేశాడు. సూర్య పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే.. నటనలోనూ మెచ్యూర్డ్‌గా కనిపించాడు. ఇక నందినిగా సంయుక్త మీనన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. కొన్ని కీలకమైన సన్నివేశాలలో అద్భుతంగా నటించింది. ఈ చిత్రంలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. సునీల్ పాత్రని కథలో అనవసరంగా ఇరికించారనిపిస్తుంది. ఇక సర్పంచ్ హరిశ్చంద్రగా రాజీవ్ కనకాల, పూజారిగా సాయిచంద్, అఘోరాగా అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. శామ్ దత్ సైనూద్ధీన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. రొటీన్ కథకు సుకుమార్ స్క్రీన్‌ప్లే బాగా ప్లస్ అయింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - అంజిశెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
తేజ్.. ఇది నిజామా? మెగా మేనల్లుడిని ఆడుకుంటున్నారు
-
ఊహించని లాభాలలో విరుపాక్ష మూవీ ప్రాఫిట్ ఎన్ని కొట్లో తెలిస్తే బిత్రరాపోతారు..
-
‘విరూపాక్ష’ ట్విటర్ రివ్యూ
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ హీరోయిన్. కార్తిక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని .బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల విరూపాక్ష ఫస్ట్ షో పడిపోవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే ట్విటర్లో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘విరూపాక్ష’ కథేంటి? ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. (ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న మాస్ మహారాజా.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?) సినిమాకు ట్విటర్లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దర్శకుడు కార్తీక్ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశాడని అంటున్నారు. స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉందట. సుకుమార్ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉందని కామెంట్ చేస్తున్నారు. ట్విస్టులు కూడా బాగున్నాయట. (ఇది చదవండి: బుల్లితెర నటి సూసైడ్ కేసు.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో!) #Virupaksha A Good Village Thriller with Horror Elements! Interesting storyline with some spine chilling moments and nice twists. Though the love track in the 1st half is boring and the pace is uneven in parts, the screenplay engages for the most part and works out. Rating:… — Venky Reviews (@venkyreviews) April 21, 2023 #VirupakshaReview Something untitled Story Lineup concept is regular story no extra added fresh mashup @IamSaiDharamTej Done with maximum efforts @iamsamyuktha_ clevage shots highlights movie Director Version of Narration. SDM Overall Rating - 2/5 ⭐⭐ #Virupaksha — South Digital Media (@SDM_official1) April 21, 2023 ప్రీ ఇంటర్వెల్లో చిల్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయట. సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ కలిగేలా ఇంటర్వెల్ సెట్ చేశారట. మొదటిభాగంలో లవ్ స్టోరీ బోరింగ్‌గా ఉంటుందట. అలాగే సినిమా కూడా స్లోగా సాగుతుందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. Nice 2nd half. Highly engaging screenplay. Interesting story. It's been quite some time since we saw this kind of story in telugu films. Good watch #Virupaksha https://t.co/oLy3E7Lw6m — Puri stan (@purijagan_stan) April 21, 2023 #Virupaksha has a very good story and almost made well. The climax is bad and could have been much better story wise. This story also deserves a higher budget and could have used VFX better. Overall, I highly recommend watching the movie. @IamSaiDharamTej @SukumarWritings — Telugu Cinemaalaya (@cinemaalayaa) April 21, 2023 Decent watch..bgm aripinchadu..telugu lo chala days tarvatha proper thriller/horror #Virupaksha — Pandagowwww (@ravi_437) April 21, 2023 #Virupaksha is @IamSaiDharamTej’s career best film. Excellent script & wonderful execution by Director Karthik. It’s a big screen spectacle with top notch sounds effects. Rating 4/5. — Deccan Delight (@DeccanDelight) April 21, 2023 Virupaksha review: 2023 version of Chandramukhi Congrats @IamSaiDharamTej vanna.#Virupaksha#VirupakshaInCinemasNow — sri (@sri_pspk_devote) April 21, 2023 -
ఆ హీరోయిన్ని ప్రేమించా.. డేటింగ్‌కి పిలిచా కానీ..: సాయి ధరమ్‌తేజ్
ఏ విషయంలోనైనా చాలా ఓపెన్‌గా ఉంటాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. తన సినిమా వివరాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అందరితో పంచుకుంటాడు. ఇక యాక్సిడెంట్ సాయిధరమ్ ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. ఉన్నది ఒక్కటే జీవితం.. నవ్వుతూ..నవ్విస్తూ బతకాలని డిసైడ్ అయ్యారు. ప్రెస్ మీట్స్, ఇంటర్వ్వూలోనూ ఇదే విషయాన్ని ఆయన చెబుతున్నారు. జీవితం అంటే కష్టాలు వస్తాయని అని వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లాలని అంటున్నాడు. ఇక తన పెళ్లి విషయంలోనూ చాలా క్లారిటీతో ఉన్నాడు. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని, మంచి అమ్మాయి కనిపిస్తే తప్పకుండా చేసుకుంటానని చెబుతున్నాడు. అలాగే గతంలో ఓ అమ్మాయితో బ్రేకప్ అయిన విషయం కూడా చెప్పాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన క్రష్ గురించి, తాను ఇష్టపడ్డ అమ్మాయిల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. (చదవండి: 36 ఏళ్ల వయసులో మళ్లీ మాటలు నేర్పించారు..అమ్మ తర్వాతే ఎవరైనా: సాయి తేజ్) ‘ప్రతి ఒక్క రియల్ లైఫ్ లోనూ ఎవరో ఒకరైనా క్రష్ ఉంటారు. నా లైఫ్ లోనూ ఒకరున్నారు. ఒక నటిగా, మనిషిగా అట్రాక్ట్ చేసింది సమంత. రెజీనా, సయామి అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్లు నా ఫస్ట్ హీరోయిన్స్. ఇక నా లవ్‌స్టోరీ విషయానికొస్తే.. ఇంటర్లో ఉన్నప్పుడు నా బెస్ట్‌ఫ్రెండ్ అయిన ఓ అమ్మాయిని ప్రేమించా. మొదట్లో మేమిద్దరం ప్రాణ స్నేహితులం. కానీ ఆ తర్వాత ప్రేమించుకున్నాం. కట్ చేస్తే.. డిగ్రీలో నేనే దగ్గరుండి ఆమెకు పెళ్లి చేశా. ఎందుకంటే అప్పటికీ నా దగ్గర డిగ్రీ పట్టా తప్ప ఏమీ లేదు. అందుకే నా ప్రేమను త్యాగం చేశా(నవ్వూతూ...). ఇక సినిమాల్లోకి వచ్చాక.. .. 'తిక్క' సినిమా హీరోయిన్ లారిస్సా బోనేసి చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్డాను. సాంగ్ షూటింగ్ సమయంలోనే ఆమెకు ప్రపోజ్చేశా. ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒప్పుకుంటే డేటింగ్ చేద్దాం’అని డైరెక్ట్‌గా అడిగేశా. కానీ ఆమె ఇచ్చిన రిప్లైకి నా హార్ట్ బ్రేక్ అయింది. సారీ తేజ్.. నాకు ఆల్రెడీ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది. బాధతో వెళ్లిపోయా. ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అన్నట్లు బ్రతుకుతున్నా. ఎప్పుడు రాసి పెట్టి ఉంటే అప్పుడు పెళ్లి అవుతుంది’ అని సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు. -
యాక్సిడెంట్ నాకు చాలా నేర్పింది..అమ్మ తర్వాతే ఎవరైనా..: సాయిధరమ్ తేజ్
బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మన కుటుంబాల కోసమైనా హెల్మెట్ పెట్టుకోవాలి. నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు హెల్మెట్ కాపాడింది’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. బాపినీడు .బి సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ‘‘భారీ యాక్సిడెంట్ తర్వాత విడుదలవుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. దర్శకుడు సుకుమార్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళ్లింది’’ అంటూ మరిన్ని విశేషాలను సాయిధరమ్ తేజ్ ఈ విధంగా చెప్పారు. ►1989–90 మధ్య ఓ గ్రామం అనుమానాస్పద హత్యలతో భయానకంగా మారుతుంది. హత్యలు ఎవరు చేశారు? గ్రామానికి చేతబడి ఎందుకు చేశారన్న వాటిని వెతుకుతూ హీరో చేసే ప్రయాణమే ‘విరూపాక్ష’ సినిమా. నేను చేతబడిని నమ్మను. ఆంజనేయుడ్ని నమ్ముతాను. ఆయన తోడుంటే మనకు ఏం కాదని నమ్ముతాను. విరూపాక్ష అంటే రూపం లేని కన్ను అని అర్థం. శివుడి పేరు. రూపం లేని వాటితో హీరో చేసే సంఘర్షణ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. ►యాక్సిడెంట్ తర్వాత నేను సినిమాలు చేస్తానా... లేదా అని చాలామంది సందేహించారు. యాక్సిడెంట్ నాకు చాలా నేర్పింది. మా అమ్మ నన్ను ఈ వయసులో చిన్న పిల్లోడిలా చూసుకుంటూ నా మాటలు తడబడుతున్నా ధైర్యం నింపి ప్రోత్సహించారు. 36 ఏళ్ల వయసులో నాకు మళ్లీ మాటలు నేర్పించారు. ఈ ప్రపంచంలో అమ్మ తర్వాతే ఎవరైనా. ► ఈ సినిమా కోసం వర్క్ షాప్స్ చేసిన సమయంలో నా పరిస్థితి అంత బాగా లేదు. నేను చేయలేని పరిస్థితుల్లో ఉన్నా అడ్జస్ట్ అయ్యారు. మా నిర్మాతలు ఎంతో సపోర్టివ్‌గా నిలిచారు. ► ‘విరూపాక్ష’ని ‘కాంతార’తో పోల్చలేం. ‘కాంతార’ ఓ క్లాసిక్. ‘విరూపాక్ష’ సస్పెన్స్ థిల్లర్‌గా వైవిధ్యంగా ఉంటుంది. దర్శకుడు కార్తీక్ కథ చెబుతున్నప్పుడే కొత్త అనుభూతికి గురయ్యాను. కథలో కొత్త క్యారెక్టర్స్ రావడం.. ట్విస్ట్‌లతో చిత్రం వేగంగా వెళుతుంది. ప్రతి 20 నిమిషాలకు కొత్తదనంతో కథ సాగుతుంది. ► 1989లలో అబ్బాయి–అమ్మాయి మధ్య ప్రేమ ఎలా ఉంటుందో, ఆ సమయంలో గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవో చూపించాం. చేతబడులు, మూఢనమ్మకాల గురించి చెప్పాం. నాకు హర్రర్ సినిమాలంటే భయం. ఆ భయానికి విరుగుడుగా నేను హనుమంతుణ్ణి నమ్ముతాను. ► తెలుగు సినిమా స్టామినాని ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది. ‘విరూపాక్ష’ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ కుదరలేదు. ముందు ఇంట గెలవాలని అనుకుంటున్నాం. తెలుగులో రిలీజ్ చేశాక అన్ని భాషల్లో రిలీజ్ చేస్తాం. ► జీవితం అంటే కష్టాలు వస్తాయి.. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లడమే. యాక్సిడెంట్ తర్వాత మా మామయ్య మెగాస్టార్ చిరంజీవి గారు సిరివెన్నెల గారి పాటలోని స్ఫూర్తి నింపే ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి’ అంటూ మెసేజ్ చేశారు. అందరి ఆదరాభిమానాల వల్ల యాక్సిడెంట్ తర్వాత మీ ముందు ఇలా ఉన్నాను. నా జీవితం దాదాపు సవాళ్లతోనే నిండింది. సవాళ్లు లేకుంటే లైఫ్ చప్పగా అనిపిస్తుంది. ► ఇప్పుడు నా మెచ్యూరిటీ పెరిగింది. అందరినీ నవ్విస్తూ, హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయితే అందరం హ్యాపీ. రికార్డ్స్ బద్దలు కొట్టాలనుకోవడంలేదు. ఎందుకంటే ప్రతీ వారం ఓ రికార్డ్ బ్రేక్ అవుతుంటుంది. చదవండి: అదిరిపోయేలా ‘గేమ్ చేంజర్’ క్లైమాక్స్.. 1000 మంది ఫైటర్స్‌తో యాక్షన్ సీక్వెన్స్ ఆదిపురుష్‌లో భాగం కావడం అదృష్టం: ప్రభాస్ -
తేజ్ చిలిపిగా సంయుక్త ని ఎలా ఏడిపిస్తునాడో చుడండి
-
ఆక్సిడెంట్ నుండి షూటింగ్ కి వెళ్లినపుడు!
-
నందినికి పొగరు, పట్టుదల.. నాతో పోలికే లేదు: సంయుక్త మీనన్
‘‘విరూక్ష’ మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందింది. హారర్ మూవీ కాదు. కానీ ప్రేక్షకులు భయపడతారు. 1990ల నాటి కాలంలో ఈ మూవీ కథ జరుగుతుంది’’ అన్నారు సంయుక్తా మీనన్. సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరూపాక్ష’. బాపినీడు .బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక సంయుక్తా మీనన్ మాట్లాడుతూ– ‘‘బింబిసార’ తర్వాత నేను సంతకం చేసిన రెండో చిత్రం ‘విరూపాక్ష’. అయితే కరోనా లాక్డౌన్, తేజ్‌కి ప్రమాదం.. వంటి కారణాలతో ఈ సినిమా లేట్ అయింది. ‘విరూపాక్ష’ తర్వాత నేను ఒప్పుకున్న ‘వకీల్ సాబ్, సార్’ సినిమాలు ముందు రిలీజ్ అయ్యాయి. రుద్రవనం అనే గ్రామంలో జరిగే కథే ‘విరూపాక్ష’. నేను నందిని అనే పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశాను. నందినికి పొగరు, పట్టుదల ఎక్కువ ఉంటుంది. నందిని పాత్రకి, నిజ జీవితంలో నా క్యారెక్టర్‌కి పోలికే లేదు. బైక్ ప్రమాదం నుంచి కోలుకున్నాక తేజ్ గారు ఎంతో ఎనర్జీతో ఈ మూవీ చేశారు. నాకు కామెడీ రోల్స్ ఇష్టం.. అవి చేయాలనుంది. ప్రస్తుతం కల్యాణ్ రామ్‌గారితో ‘డెవిల్’ చిత్రం చేస్తున్నా’’ అన్నారు. -
సాయి ధరమ్ తేజ్, సంయుక్తల 'విరూపాక్ష' షూటింగ్ ఎలా చేశారో చూడండి..
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం విరూపాక్ష. కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింఇ. ఈనెల 21న తెలుగు, తమిళ భాషల్లో విరూపాక్ష గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్ వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయ్యారు. తాజాగా ఆడియెన్స్‌లో మరింత క్యూరియాసిటీని పెంచేలా ఈ సినిమా మేకింగ్ వీడియోను వదిలారు. ఇంటెన్స్ యాక్షన్‌తో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ మరి థియేటర్లలో ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందన్నది చూడాల్సి ఉంది. -
Sai Dharam Tej: విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
Sai Dharam Tej: విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ -
ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడి చేసే చిత్రాలివే!
ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఓటీటీలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేని వారు ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే చూసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రతి వారం సినీ ప్రియులను అలరించేందుకు చిత్రాలు రెడీ ఉన్నాయి. అలాగే ఈ వారంలో థియేటర్లలో సందడి చేసే చిత్రాలు కూడా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం. సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన తాజా చిత్రం 'విరూపాక్ష'. ఈ చిత్రానికి దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కించారు.తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, ట్రైలర్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 21న థియేటర్లలో సందడి చేయనుంది సింగిల్ క్యారెక్టర్‌తో 'హలో మీరా' గార్గేయి యల్లాప్రగడ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'హలో మీరా'. ఈ చిత్రం ద్వారా కాకర్ల శ్రీనివాసు దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. కేవలం ఓకే ఒక్క క్యారెక్టర్‌తో సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్‌గా రూపొందించారు. ఈ సినిమా కథ మొత్తం మీరా అనే పాత్ర చూట్టే తిరుగుతుంది. ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్ హౌ టు గెట్ రిచ్ (ఇంగ్లీష్) - ఏప్రిల్ 18 చింప్ ఎంపైర్ (డాక్యుమెంటరీ) -ఏప్రిల్ 19 ది మార్క్డ్ హార్ట్ (సీజన్2) - ఏప్రిల్ 19 చోటా భీమ్ (సీజన్-17) - ఏప్రిల్ 20 టూత్‌పరి (హిందీ) - ఏప్రిల్ 20 డిప్లొమ్యాట్ (ఇంగ్లీష్) - ఏప్రిల్ 20 సత్య2 (తెలుగు) -ఏప్రిల్ 21 రెడీ (తెలుగు) -ఏప్రిల్ 21 ఇండియన్ మ్యాచ్ మేకింగ్ (వెబ్‌సిరీస్) - ఏప్రిల్ 21 ఎ టూరిస్ట్స్ గైడ్ టు లవ్ (ఇంగ్లీష్) - ఏప్రిల్ 21 సోనీలివ్ గర్మీ (సిరీస్) హాట్‌స్టార్ సుగా (డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 21 -
సినిమా తీసి చనిపోవాలనుకున్నాడు.. సుకుమార్ ఎమోషనల్
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన తాజా చిత్రం 'విరూపాక్ష'. ఈ చిత్రానికి దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కించారు.తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, ట్రైలర్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏలూరులో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ సుకుమార్ తన శిష్యుడు, విరూపాక్ష దర్శకుడు గురించి సంచలన విషయాలు వెల్లడించారు. కార్తీక్ దండు గురించి సుకుమార్ మాట్లాడుతూ.. 'కార్తీక్ దండు నా శిష్యుడు. అతను మొదట ఒక కథ చెప్పాడు. అది నాకు పెద్దగా నచ్చలేదు. కార్తీక్ నేరేషన్ బాగా నచ్చింది. ఇంకో కథతో రమ్మని చెప్పా. నేను అమేజ్ అయిపోయా. ఆ తరువాత అతనికి బాపినీడును పరిచయం చేసి.. సాయికి కథ చెప్పించాను. అతని లైఫ్ చాలా చిన్నది. నాకు తెలిసి మరో ఐదేళ్లు బతుకుతాడేమో. అతనికి ఓ మెడికల్ ప్రాబ్లం ఉంది. అయినా కూడా ఆ బాధను అధగమించి ఈ సినిమా తీశాడు. తన లైఫ్ చాలా క్రిటికల్‌గా ఉన్నా కూడా.. సినిమా తీసి చనిపోవాలనుకున్నాడు. కేవలం స్టెరాయిడ్స్ తీసుకుని బతికేవాడు. మీ అమ్మగారి ప్రార్థనలే నిన్ను బతికించాయి. ఈ సినిమాను అద్భుతంగా తీశాడు. నేను కేవలం సపోర్ట్‌గా నిలిచా. ఈ సినిమా కార్తీక్‌కు మంచిపేరు రావాలని కోరుకుంటున్నా. అతన్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది.' అని అన్నారు. సాయి ధరమ్ తేజ్ గురించి మాట్లాడూతూ.. 'మొదటిసారి నేను దిల్‌రాజ్ అమ్మాయి పెళ్లిలో కలిశాం. అక్కడే అందరినీ నవ్విస్తూ ఉన్నాడు. విరూపాక్ష షూట్‌కు వెళ్లినప్పుడు ఒకసారి షవర్ అయ్యాను. నటించడానికి ఇబ్బంది పడ్డాడు. తనకిది నటుడిగా పునర్జన్మ. మొదటి రోజు సాయి డ్యాన్స్ చేస్తే మీకు కన్నీళ్లు ఆగవు. ప్రమాదం తర్వాత తీసిన సినిమా ఇది. తప్పకుండా బ్లాక్ బస్టర్‌గా నిలుస్తోంది.' అంటూ ప్రశంసలు కురిపించారు. -
Sai Dharam Tej: ‘విరూపాక్ష’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
యాక్సిడెంట్ తరువాత సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ ఇంటర్వ్యూ .. సూపర్ క్యూట్ సంయుక్త మీనన్
-
బ్రేకప్ అయింది..అమ్మాయిలంటేనే భయమేస్తుంది: సాయితేజ్
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో టాలీవుడ్ యంగ్ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఆయన పెళ్లి గురించి గతంలో అనేకసార్లు రూమర్స్ వచ్చాయి. అయితే సాయి తేజ్ మాత్రం వాటన్నింటిని కొట్టేస్తూ.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పుకొచ్చాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఆయన నటించిన తాజా చిత్రం విరూపాక్ష ఈ నెల 21న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్స్‌లో పాల్గొంటున్నాడు. సినిమా ప్రచారం కోసం పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎవరో అంటున్నారు కదా అని తాను పెళ్లి చేసుకోనని, తనకు నచ్చినప్పుడే చేసుకుంటానని చెప్పాడు. అలాగే తన లవ్‌స్టోరీ గురించి కూడా చెప్పాడు. గతంలో ఓ అమ్మాయిని ప్రేమించానని.. కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయిందని చెప్పుకొచ్చాడు. బ్రేకప్ తర్వాత చాలా సైలెంట్ అయిపోయానని, అమ్మాయిలంటేనే భయమేస్తుందని తేజ్ అన్నారు. ఇక విరూపాక్ష విషయానికొస్తే.. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్. బాపినీడు సమర్పణలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించటం గమనార్హం. -
బిత్తిరి సత్తితో సాయి ధరమ్ తేజ్ ముఖాముఖీ
-
Virupaksha Trailer: 'విరూపాక్ష' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రక్తం చుక్క కూడా రాలేదు.. చాలా భయపడ్డా: అల్లు అరవింద్
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గతంలో బైక్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న తేజ్..ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా తేజ్ నటించిన చిత్రం ‘విరూపాక్ష’ విడుదలకు సిద్ధంగా ఉంది. నేడు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అరవింద్ .. తేజ్ ప్రమాదం గురించి మాట్లాడారు. ‘తేజ్‌కు యాక్సిడెంట్ అయిందనే విషయం తెలియగానే.. మొదట నేనే ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లాను. సాయి ధరమ్ తేజ్ పరిస్థితి చూసి చాలా భయమేసింది. రక్తం చుక్క కూడా రాలేదు. ఏం జరిగిందో తెలియడానికి పావు గంట పట్టింది. అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడినందుకు చాలా ఆనందంగా ఉంది. బ్రతుకుతాడో లేదో అనుకున్న వ్యక్తి.. ఇప్పుడు ‘విరూపాక్ష’లో అద్భుతంగా నటించాడని కొంతమంది చెబుతుంటే సంతోషంగా ఉంది’అని అల్లు అరవింద్ అన్నారు. కార్తీక్‌దండు దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరూపాక్ష’లో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ నెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'జరగబోయే మారణహోమాన్ని ఎవరూ ఆపలేరు'.. ఆసక్తిగా ట్రైలర్
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం 'విరూపాక్ష'. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే 'గ్రహణం నీడపట్టి విడిచేలోపు ఊరు అంతమైపోతుంది.. గుడిని, ఊరిని అష్ట దిగ్బంధనంతో మూసేయాలి' అంటూ స్వామీజి డైలాగ్ చెప్పడం, 'జరుగుతున్న చావులకు నేను కారణం తెలుసుకుని తీరుతాను' అని సాయి ధరమ్ తేజ్ డైలాగ్ , ఇక్కడ ఎవరికైనా చావుకి ఎదురెళ్లే దమ్ముందా' అని సునీల్ డైలాగ్.. 'జరగబోయే మారణహోమాన్ని ఎవరూ ఆపలేరు' అంటూ మరో స్వామీజి చెప్పడం.. 'చివర్లో ఈ రుద్రవణాన్ని కాపాడే విరూపాక్షవి నువ్వే' అంటూ హీరోను ఉద్దేశించి చెప్పే డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన సాయితేజ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఇటీవలే 'ధనుశ్' సార్ సినిమాతో సక్సెస్ అందుకున్న సంయుక్త మీనన్.. ఈ చిత్రంలో తేజ్ సరసన నటిస్తోంది. పాన్ ఇండియాగా రూపొందుతున్న ఈ సినిమా.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఈ నెల 21వ తేదీన రిలీజ్ కానుంది. కాగా.. ఈనెల 16న ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో ఈ మూవీ ప్రీ రిలీజ్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
మీ అంచనాలను మించి ఉంటుంది.. 'విరూపాక్ష' ట్రైలర్‌పై అప్డేట్
సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం విరూపాక్ష. SDT15 ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్ ఆడియెన్స్‌ను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ న్యూస్ తెరమీదకి వచ్చింది. ప్రేక్షకులను మరింత థ్రిల్‌కి గురిచేసేందుకు రేపు (ఏప్రిల్ 11) ఉదయం 11:07 నిమిషాలకు ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నాం అంటూ మేకర్స్ తెలిపారు. ఇది ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందంటూ సాయితేజ్ సైతం ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూను కూడా ఫిక్స్ చేశారు. ఈనెల 16న ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో ఈ మూవీ ప్రీ రిలీజ్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. This will surprise you beyond your imagination#VirupakshaTrailer https://t.co/Q5DcGuH0Gm — Sai Dharam Tej (@IamSaiDharamTej) April 10, 2023 -
సినిమా ఈవెంట్స్ లో పర్సనల్ క్వశ్చన్స్
-
నాకు యాక్సిడెంట్ అయిన విషయం ఎప్పుడో మర్చిపోయా.. అది నాకు స్వీట్ మెమోరీ
-
సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
'విరూపాక్ష' బ్లాక్ బస్టర్ అవుతుంది : సాయిధరమ్ తేజ
‘‘విరూపాక్ష’ చిత్రాన్ని దయచేసి థియేటర్లలో చూడండి.. సినిమా అదిరిపోద్ది. ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుంది. మా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన తారక్ అన్నకి (ఎన్టీఆర్) థ్యాంక్స్.. ఆయన వాయిస్ మా మూవీకి చాలా ప్లస్ అయింది’’ అని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘విరూపాక్ష’. బాపినీడు.బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ–‘‘అభిమానులు, ప్రేక్షకుల ఆశీర్వాదాల వల్లే నేను మళ్లీ ఈ వేదికపై నిలుచున్నా. మీ అందరి ప్రార్థనలు, సపోర్ట్ వల్లే ‘విరూపాక్ష’ బయటికి వచ్చింది. 2019లో సుకుమార్‌గారు ఫోన్ చేసి, ‘విరూపాక్ష’ కథ వినమన్నారు. ప్రేమకథ అయ్యుంటుందిలే చేసేద్దాం అనుకున్నా. కానీ, కార్తీక్ వచ్చి థ్రిల్లర్ అనగానేషాక్ అయ్యాను. ‘విరూపాక్ష’ కథ మొత్తం విన్నాక ఇది బ్లాక్‌బస్టర్ అవుతుంది, చేయాలని ఫిక్స్ అయిపోయాను. మా కొడుకులు ‘విరూపాక్ష’ సినిమా చేశారని మా అమ్మ, కార్తీక్ అమ్మ గర్వంగా చెబుతారు. సెట్స్‌లో నాకు ధైర్యం చెబుతూ సపోర్ట్ చేసిన ప్రసాద్, సుకుమార్, బాపినీడుగార్లకు, తోటి నటీనటులకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘2018లో సుకుమార్‌గారికి ‘విరూపాక్ష’ కథ చెప్పాను. కరోనా, లాక్డౌన్, తేజ్‌గారికి ప్రమాదం వల్ల సినిమా ఆలస్యం అయ్యింది’’ అన్నారు కార్తీక్ దండు. ‘‘విరూపాక్ష’ యూనివర్సల్ సబ్జెక్ట్.. అందుకే పాన్ ఇండియా స్థాయిలో తీశాం’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. -
'విరూపాక్ష' సినిమా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష. సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన విరూపాక్ష టైటిల్ గ్లింప్స్ వీడియో, టీజర్‌కు మంచి స్పందన రాగా తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే.. అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను కార్తీక్ ఆలపించారు. కాంతార ఫేం అంజనీశ్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. -
ఇంత నిర్లక్ష్యమా..‘విరూపాక్ష’ మేకర్స్‌పై హీరోయిన్ సంయుక్త ఆగ్రహం
సంయుక్త మీనన్... ప్రస్తుతం టాలీవుడ్ బాగా వినిపిస్తున్న పేరు. భీమ్లా నాయక్ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది ఈ మలయాళ బ్యూటీ. ఆ తర్వాత బింబిసార చిత్రంలో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. రీసెంట్గా సార్ మూవీతో హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఈ మూడు చిత్రాలు మంచి విజయం సాధించడంతో తెలుగులో హ్యాట్రిక్ హిట్ కొట్టిన భామగా మంచి క్రేజ్‌ను సొంతంగా చేసుకుంది. దాంతో తెలుగు దర్శక-నిర్మాత దృష్టి ఇప్పుడు ఈ అమ్మడుపై పడింది. చదవండి: అప్పుడు సో కాల్డ్ అంటూ కామెంట్స్.. ఇప్పుడు ఏకంగా మాజీ ప్రియుడుకి క్రెడిట్.. ఈ క్రమంలో ఆమె తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విరుపాక్షలో ఆఫర్ కొట్టేసిన సంయుక్త తాజాగా ఈ మూవీ మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు మాటిచ్చి ఎందుకు మోసం చేశారంటూ సోషల్ మీడియా వేదికగా విరూపాక్ష టీంను కడిగిపారేసింది. ఈ మేరకు సంయుక్త ట్వీట్ చేస్తూ.. ‘నా నిరాశను వ్యక్తం చేసే ముందు ఒకటి చెప్పాలి. విరూపాక్ష టీంతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. మీతో కలిసి చేసిన ఈ ప్రయాణం నాకెప్పటికీ మధుర క్షణాలుగా మిగిలిపోతాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని అద్భుతమైన నటీనటులు, టెక్నిషియన్స్‌తో కలిసి పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. కానీ@SVCCofficial వారు నన్ను నిరుత్సాహపరచం కరెక్ట్ కాదు. మీరేందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ ఉగాదికి నా పోస్టర్ రిలీజ్ చేస్తామని మాట ఇచ్చి ఎందుకు తప్పారు? నా పోస్టర్ ఎక్కడా?’ అని ప్రశ్నించింది. అంతేకాదు సదరు నిర్మాణ సంస్థ పేరు ట్యాగ్ చేస్తూ నేరుగా కడిగిపారేసింది. దీంతో ఆమె ట్వీట్‌పై స్పందించిన నిర్మాణ సంస్థ ఆమెను క్షమాపణలు కోరింది. చదవండి: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను విమర్శిస్తూ పాట పాడిన ప్రముఖ సింగర్ కన్నుమూత ఈ తప్పును సరిదిద్దుకునేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని సంయుక్తను కోరారు. ఇక దీనికి శాంతించిన ఆమె ‘సరే.. ఎదురుచూస్తుంటాను’ అంటూ బదులిచ్చింది. ప్రస్తుతం సంయుక్త మీనన్ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తిక్ దండు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎస్వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ దీన్ని నిర్మిస్తున్నారు. మూఢ నమ్మకాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిన్నట్లు గతంలో విడుదలైన టీజర్ చూస్తే తెలుస్తోంది. వేసవి కానుకగా వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కానుంది. Our Sincere Apologies. Please give us some time to fix this. — SVCC (@SVCCofficial) March 22, 2023 -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాయితేజ్ 'విరూపాక్ష'.. టీజర్ చూశారా?
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష. సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. కార్తీక్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 21న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్ తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. నిజానికి నిన్నే(సోమవారం) టీజర్ విడుదల కావాల్సి ఉండగా సాయిధరమ్ తేజ్ అభిమాని గుండెపోటుతో మృతిచెందడంతో టీజర్ రిలీజ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సాయితేజ్ కెరీర్లోనే తొలి పాన్ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. -
వీరాభిమాని మృతి.. వాయిదా పడ్డ విరూపాక్ష టీజర్
యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం విరూపాక్ష. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. నేడు( మార్చి 1) విరూపాక్ష టీజర్ రిలీజ్ కానున్నట్లు చిత్రయూనిట్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే! కానీ సాయిధరమ్‌తేజ్ వీరాభిమాని మృతి చెందడంతో టీజర్ రిలీజ్‌ను వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియాలో వెల్లడించింది. 'భీమవరం సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రావూరి పండు మరణంపై విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ విరూపాక్ష టీజర్ విడుదలను వాయిస్తున్నాం' అని తెలిపింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఇదివరకే రిలీజైన గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. We are shocked to hear about the untimely demise of Ravuri Pandu Garu ( Mega Fan and Sai Dharam Tej Fans president, Bhimavaram ) As a mark of respect, The teaser release of #Virupaksha stands postponed. — SVCC (@SVCCofficial) March 1, 2023 Get ready to Enter the World of #Virupaksha 👁️🔍 'Supreme Hero' @IamSaiDharamTej's #VirupakshaTeaser will be out on March 1st 📣💥#VirupakshaOnApril21st #CourageOverFear@iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @BvsnP @aryasukku @bkrsatish pic.twitter.com/DoP7cRI2ME — SVCC (@SVCCofficial) February 26, 2023 చదవండి: ఇండియన్ 2లో విలన్‌గా వెన్నెల కిశోర్, ఇదిగో క్లారిటీ -
సాయిధరమ్ తేజ్ 'విరూపాక్ష' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కార్తీక్‌వర్మ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. SDT15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. ఏప్రిల్21న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ ఓ వీడియోను వదిలారు. మార్చి 1న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా ఈ చిత్రంలో సాయితేజ్ రిస్కీ బైక్ స్టంట్స్ డూప్ లేకుండా చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా టీజర్ అప్డేట్తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. Get ready to Enter the World of #Virupaksha 👁️🔍 'Supreme Hero' @IamSaiDharamTej's #VirupakshaTeaser will be out on March 1st 📣💥#VirupakshaOnApril21st #CourageOverFear@iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @BvsnP @aryasukku @bkrsatish pic.twitter.com/DoP7cRI2ME — SVCC (@SVCCofficial) February 26, 2023 -
ఎండలు బాగా మండే ఏప్రిల్‌లో సందడి చేసే సినిమాలివే!
సంక్రాంతి సీజన్ తర్వాత సినిమాలకు బాగా కలిసొచ్చేది సమ్మర్. సమ్మర్ హాలీడేస్‌ను బాగా వాడుకోవాలి అనుకుంటారు మేకర్స్. అందుకోసం తమ సినిమాలు రిలీజ్ అయేలా ప్లాన్ చేసుకుంటారు. ఎండలు బాగా మండే ఏప్రిల్ నెలలో రిలీజ్‌కు కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. పొన్నియిన్ సెల్వన్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిన విషయమే. గతేడాది సెప్టెంబర్ 30న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజైన ఈ చిత్రానికి ఊహించని స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ మూవీ సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న రాబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. సూపర్ స్టార్ రజినీ కాంత్ నెల్సన్ దర్శకత్వంలో జైలర్ మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్‌తో ఆకట్టుకున్నారు మేకర్స్. ఈ మూవీని ఏప్రిల్ 14 న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అలాగే మెగాస్టర్ చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ మూవీని కూడా ఏప్రిల్ 14 న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక మెగా మేనల్లుడు సాయి తేజ్ ఏప్రిల్ 21 విరుపాక్ష మూవీతో రావాటానికి ముస్తాబు అవుతున్నాడు. మాస్ మహారాజ రవితేజ ధమాకా సినిమాతో సాలిడ్ విజయం అందుకున్నాడు.ఈయన కెరీర్లోనే భారీ విజయాన్ని నమోదు చేసింది ధమాకా. త్వరలో రావణ సుర మూవీతో రాబోతున్నాడు. ఏప్రిల్ 7 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అలాగే బాలీవుడ్ ముచ్చటకు వస్తే..సల్మాన్ ఖాన్ ‘కిసికా బాయ్ కిసికా జాన్’ కూడా ఏప్రిల్‌లో విడుదలకు ముస్తాబు అయింది. ఏప్రిల్ 21 న మూవీ రిలీజ్ కాబోతుంది. -
మా అమ్మ కోసం విరూపాక్ష చేశాను : సాయిధరమ్ తేజ్ ఎమోషనల్
‘‘మా అమ్మ కోసం ‘విరూపాక్ష’ చేశాను. ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్‌కు థ్యాంక్స్. ఈ చిత్రానికి సుకుమార్‌గారు స్క్రీన్‌ప్లే అందించి, నిర్మాణ భాగస్వామిగా ఉండటం హ్యాపీ’’ అని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ ఖరారు చేశారు. బాపినీడు .బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను సాయిధరమ్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో ఈ గ్లింప్స్ సాగుతుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో 2023 ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది. విలేకరుల సమావేశంలో కార్తీక్ దండు మాట్లాడుతూ– ‘‘1990 నేపథ్యంలో ఫారెస్ట్ బేస్డ్ విలేజ్‌లో జరిగే థ్రిల్లర్ ఇది. అక్కడ జరిగే వింత పరిణామాలను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనేది ఆసక్తిగా ఉంటుంది. ప్రమాదం నుంచి కోలుకున్నాక సాయిధరమ్ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మా సినిమా కోసం ఎంతో కష్ట పడ్డాడు’’ అన్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు సతీష్ బీకేఆర్, అశోక్ బండ్రెడ్డి, సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ పాల్గొన్నారు.