బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మన కుటుంబాల కోసమైనా హెల్మెట్ పెట్టుకోవాలి. నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు హెల్మెట్ కాపాడింది’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. బాపినీడు .బి సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ‘‘భారీ యాక్సిడెంట్ తర్వాత విడుదలవుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. దర్శకుడు సుకుమార్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళ్లింది’’ అంటూ మరిన్ని విశేషాలను సాయిధరమ్ తేజ్ ఈ విధంగా చెప్పారు.
►1989–90 మధ్య ఓ గ్రామం అనుమానాస్పద హత్యలతో భయానకంగా మారుతుంది. హత్యలు ఎవరు చేశారు? గ్రామానికి చేతబడి ఎందుకు చేశారన్న వాటిని వెతుకుతూ హీరో చేసే ప్రయాణమే ‘విరూపాక్ష’ సినిమా. నేను చేతబడిని నమ్మను. ఆంజనేయుడ్ని నమ్ముతాను. ఆయన తోడుంటే మనకు ఏం కాదని నమ్ముతాను. విరూపాక్ష అంటే రూపం లేని కన్ను అని అర్థం. శివుడి పేరు. రూపం లేని వాటితో హీరో చేసే సంఘర్షణ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది.
►యాక్సిడెంట్ తర్వాత నేను సినిమాలు చేస్తానా... లేదా అని చాలామంది సందేహించారు. యాక్సిడెంట్ నాకు చాలా నేర్పింది. మా అమ్మ నన్ను ఈ వయసులో చిన్న పిల్లోడిలా చూసుకుంటూ నా మాటలు తడబడుతున్నా ధైర్యం నింపి ప్రోత్సహించారు. 36 ఏళ్ల వయసులో నాకు మళ్లీ మాటలు నేర్పించారు. ఈ ప్రపంచంలో అమ్మ తర్వాతే ఎవరైనా.
► ఈ సినిమా కోసం వర్క్ షాప్స్ చేసిన సమయంలో నా పరిస్థితి అంత బాగా లేదు. నేను చేయలేని పరిస్థితుల్లో ఉన్నా అడ్జస్ట్ అయ్యారు. మా నిర్మాతలు ఎంతో సపోర్టివ్‌గా నిలిచారు.
► ‘విరూపాక్ష’ని ‘కాంతార’తో పోల్చలేం. ‘కాంతార’ ఓ క్లాసిక్. ‘విరూపాక్ష’ సస్పెన్స్ థిల్లర్‌గా వైవిధ్యంగా ఉంటుంది. దర్శకుడు కార్తీక్ కథ చెబుతున్నప్పుడే కొత్త అనుభూతికి గురయ్యాను. కథలో కొత్త క్యారెక్టర్స్ రావడం.. ట్విస్ట్‌లతో చిత్రం వేగంగా వెళుతుంది. ప్రతి 20 నిమిషాలకు కొత్తదనంతో కథ సాగుతుంది.
► 1989లలో అబ్బాయి–అమ్మాయి మధ్య ప్రేమ ఎలా ఉంటుందో, ఆ సమయంలో గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవో చూపించాం. చేతబడులు, మూఢనమ్మకాల గురించి చెప్పాం. నాకు హర్రర్ సినిమాలంటే భయం. ఆ భయానికి విరుగుడుగా నేను హనుమంతుణ్ణి నమ్ముతాను.
► తెలుగు సినిమా స్టామినాని ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది. ‘విరూపాక్ష’ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ కుదరలేదు. ముందు ఇంట గెలవాలని అనుకుంటున్నాం. తెలుగులో రిలీజ్ చేశాక అన్ని భాషల్లో రిలీజ్ చేస్తాం.
► జీవితం అంటే కష్టాలు వస్తాయి.. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లడమే. యాక్సిడెంట్ తర్వాత మా మామయ్య మెగాస్టార్ చిరంజీవి గారు సిరివెన్నెల గారి పాటలోని స్ఫూర్తి నింపే ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి’ అంటూ మెసేజ్ చేశారు. అందరి ఆదరాభిమానాల వల్ల యాక్సిడెంట్ తర్వాత మీ ముందు ఇలా ఉన్నాను. నా జీవితం దాదాపు సవాళ్లతోనే నిండింది. సవాళ్లు లేకుంటే లైఫ్ చప్పగా అనిపిస్తుంది.
► ఇప్పుడు నా మెచ్యూరిటీ పెరిగింది. అందరినీ నవ్విస్తూ, హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయితే అందరం హ్యాపీ. రికార్డ్స్ బద్దలు కొట్టాలనుకోవడంలేదు. ఎందుకంటే ప్రతీ వారం ఓ రికార్డ్ బ్రేక్ అవుతుంటుంది.
చదవండి:
అదిరిపోయేలా ‘గేమ్ చేంజర్’ క్లైమాక్స్.. 1000 మంది ఫైటర్స్‌తో యాక్షన్ సీక్వెన్స్
Comments
Please login to add a commentAdd a comment