Sai Dharam Tej's Virupaksha Joins Rs 100 Crore Elite Club - Sakshi
Sakshi News home page

Sai Dharam Tej : మెగాహీరో సెన్సేషన్‌.. రూ.100 కోట్లు కొల్లగొట్టిన 'విరూపాక్ష'

Published Thu, May 18 2023 11:55 AM | Last Updated on Thu, May 18 2023 12:28 PM

Sai Dharam Tej Virupaksha Joins Rs 100 Crore Club - Sakshi

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ విరూపాక్ష. సంయుక్త మీనన్‌ ఇందులో హీరోయిన్‌గా నటించింది. కార్తీక్‌ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది.హర్రర్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది.ఏప్రిల్ 21న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం తొలిరోజు నుంచే సూపర్‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

సాయితేజ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా తాజాగా వంద కోట్ల ‍క్లబ్‌లో చేరిపోయింది. ఈ మేరకు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. సాయి ధరమ్‌ తేజ్‌ బైక్ యాక్సిడెంట్‌ తర్వాత తెరకెక్కిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే విరూపాక్ష బాక్సాఫీస్‌ను షేక్‌చేసి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.చదవండి: సల్మాన్‌ ఖాన్‌ సోదరి ఇంట్లో భారీ దొంగతనం

ఈ విజయంపై సాయితేజ్‌ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. అభిమానులు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు అంటూ ఇన్‌స్టాలో పోస్టును షేర్‌ చేశాడు. కాగా ఇప్పటికే థియేటర్లలో సూపర్‌ హిట్‌ అయిన విరూపాక్ష ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది.ఈనెల 21 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement