Sai Dharam Tej
-
‘సంబరాల ఏటిగట్టు’ మూవీ టైటిల్ ఈవెంట్లో రామ్ చరణ్ (ఫొటోలు)
-
సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతిలకు అవార్డ్స్ (ఫోటోలు)
-
30 ఏళ్ల క్రితం ఫోటో.. చిరుతో ఉన్నదెవరో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవితో ఉన్న ఒక బాలుడి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అతని పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. ఇందులో ఉన్నది ఎవరో కనిపెట్టండి అంటూ ఒక క్యాప్షన్‌తో వారు షేర్ చేస్తున్నారు. గుర్తుపట్టిన అభిమానులు మాత్రం వెంటనే శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. ఇంతకు చిరు చేతిలో ఉన్న ఆ బాలుడు ఎవరంటే..? టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్.మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన సాయిధరమ్ తేజ్ అక్టోబర్ 15న తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సినిమాల పరంగా తన కెరీర్ ప్రారంభంలో వరస హిట్స్ కొట్టిన ఆయన ఆ తర్వాత రొటీన్ కమర్షియల్ సినిమాలతో ఘోరంగా దెబ్బతిన్నాడు. మధ్యలో 'రిపబ్లిక్' లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అయితే, విరూపాక్ష, బ్రో చిత్రాలతో అభిమానులను మెప్పించాడని చెప్పవచ్చు.రాబోయే సినిమా విషయానికొస్తే.. సాయి ధరమ్ తేజ్ టైటిల్ రోల్లో ‘గాంజా శంకర్’గా రానున్నాడు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాదిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే, సినిమా టైటిల్ మార్చాలని పలు అభ్యంతరాలు వచ్చాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. -
సందీప్, సాయి ధరమ్‌తేజ్‌తో ఎఫైర్స్.. రెజీనా రియాక్షన్
రెజీనా కసాండ్రా తన ఎఫైర్స్ గురించి తాజాగా రివీల్ చేశారు. తను నటించిన కొత్త చిత్రం 'ఉత్సవం' విడుదల సందర్భంగా ఆమె ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రెజీనా, టాలీవుడ్లో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,కొత్త జంట వంటి సినిమాలతో కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. అయితే, ఈ బ్యూటీ గురించి అప్పుడప్పుడు భారీగానే రూమర్స్ వస్తూ ఉంటాయి. గతంలో యంగ్ హీరో సందీప్ కిషన్‌తో పాటు సాయి ధరమ్ తేజ్‌తో రెజినా రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. వారిద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోనుందంటూ కూడా సోషల్‌మీడియాలో వైరల్ అయింది. అయితే, సందీప్ గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. ఆమె స్నేహితురాలు మాత్రమే.. దయచేసి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయకండి అంటూ పేర్కొన్నారు. తాజాగా రెజీనా కూడా రియాక్ట్ అయ్యారు.'సందీప్, సాయి ధరమ్‌తేజ్ ఇద్దరూ కేవలం స్నేహితులు అయినప్పటికీ, వారితో నా అనుబంధం చాలా భిన్నంగా ఉంటుంది. సందీప్, నేను టామ్ అండ్ జెర్రీ లాంటి వాళ్లం. మేము ఇద్దరం ఒకరిపై మరొకరం తరచూ అరచుకుంటాం. ఒక్కోసారి ఒకరితో ఒకరం రెండు నెలలు మాట్లాడుకోము. కానీ, కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ మాట్లాడటం మొదలుపెడుతాం. మా సంభాషణ ఎలా ఉంటుందంటే.. అసలు మా మధ్య ఎలాంటి గొడవ జరగలేదు అనేంతగా ఉంటుంది. ఇదీ చదవండి: హీరోయిన్ 'సమంత' దినచర్య ఇదే.. నెట్టింట వైరల్సాయి కూడా నాకు చాలామంచి స్నేహితుడు. అతను ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటాడు. చాలా స్వీట్ పర్సన్. అతనితో నా బంధం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సందీప్‌తో గొడవపడినట్లు సాయితో జరగదు. అలా మేమిద్దరం ఎప్పుడూ పోట్లాడుకోలేదు. అయినప్పటికీ, ప్రేక్షకులు మాకు ఎప్పుడూ సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తుంటారు.' అని రెజీనా తెలిపింది. కొద్దిరోజుల క్రితం కూడా ఓ బిజినెస్‌మేన్‌తో రెజీనా వివాహం అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అలా ఆమె పెళ్లి చుట్టూ పుకార్లు వస్తూనే ఉన్నాయి.అదే ఇంటర్వ్యూలో రెజీనాకు ఎలాంటి వ్యక్తి కావాలో కూడా చెప్పుకొచ్చింది. బాధ్యత తెలియని వ్యక్తితో కలిసి ఉండాలని ఏ అమ్మాయి కోరుకోదని చెప్పింది. తనను జాగ్రత్తగా చూసుకునే వాడు అయితే చాలు అంటూ ఆమె పేర్కొంది. తన జీవితంలో చాలామందితో రిలేషన్షిప్లో ఉన్నాను షాకింగ్ న్యూస్ చెప్పింది. ఒక రకంగా తాను సీరియల్ డేటర్ అంటూ నవ్వేసింది. అయితే, ప్రస్తుతం బ్రేక్ తీసుకున్నానని, ఇప్పుడు ఎక్స్ బాయ్‌ఫ్రెండ్స్ మాత్రమే తనకు ఉన్నారిని చెప్పింది. ఈ విషయంలో తాను ఎలాంటి అబద్దం చెప్పడంలేదని పేర్కొంది. -
ఈ బ్యూటీ డ్యాన్స్‌కు ఆ మెగా హీరో అభిమాని! ఎవరంటే..? (ఫోటోలు)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం
టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ మంచి మనసు చాటుకున్నారు. సీనియర్ నటి పావలా శ్యామల కష్టాల్లో ఉన్నట్లు తెలుసుకున్న ఆయన చలించిపోయారు. సాయం చేస్తానని గతంలో ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పలు ఆరోగ్య సమస్యల వల్ల వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతున్న పావలా శ్యామాలకు రూ. లక్ష సాయం చేశారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా ఆ డబ్బును ఆమెకు అందించారు.పావలా శ్యామలతో సాయిధరమ్ తేజ్ కూడా వీడియో కాల్లో మాట్లాడారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 'గతంలో మా అమ్మాయికి ఆపరేషన్ అయిన సమయంలో సాయిధరమ్ తేజ్ నాకు ఫోన్ చేసి చాలా ధైర్యం చెప్పారు. త్వరలో వచ్చి కలుస్తానని చెప్పారు. కానీ, ఆయన రాలేదు. చాలా రోజులైపోయింది కాబట్టి నన్ను మర్చిపోయారనుకున్నాను. ఆయనకు ప్రమాదం జరిగినప్పుడు సురక్షితంగా బయటపడాలని దేవుడిని కోరుకున్నాను. దేవుడి దయ వల్ల అంతా మంచే జరిగింది. అయితే, నన్ను గుర్తుపెట్టుకొని సాయం చేసినందుకు తేజ్‌కు నా ధన్యవాదాలు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఆసుపత్రి ఖర్చులకు కూడా డబ్బు లేదు. దీంతో నా కూతురితో సహా చనిపోదామనుకున్నా..సమయానికి మీరు సాయం చేసి నాకూ, నా కూతురుకు ప్రాణభిక్ష పెట్టారు. అని సాయ్ ధరమ్ తేజ్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు రూ.5 లక్షలు సాయిధరమ్‌తేజ్ విరాళం ఇచ్చారు. దానిలో భాగంగా రూ.లక్షను పావలా శ్యామలకు అందించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన సాయాన్ని కూడా ఆమె మరోసారి గుర్తుచేసుకున్నారు.We extend our heartfelt thanks to the mega supreme hero, @IamSaiDharamTej Garu, for donating 5 lakhs to our @FilmJournalistsWe are grateful. As part of this donation, 1 lakh was given to senior artist #PavalaShyamala Garu through our association, keeping the promise made by you… pic.twitter.com/1FYiUAKoOL— Telugu Film Journalists Association (@FilmJournalists) July 26, 2024 -
'సాయి ధరమ్ తేజ్ పోస్ట్.. ఇలా జరిగినందుకు క్షమాపణలు': సుధీర్ బాబు
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్‌కు మద్దతుగా టాలీవుడ్ హీరోలు స్పందిస్తున్నారు. ఇప్పటికే మంచు మనోజ్ ఇలాంటి వాళ్లను వదిలిపెట్టను అంటూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చిన్నపిల్లలు, మహిళలపై అసభ్యకరమైన వీడియోలు చేసేవారిని అస్సలు ఊపేక్షించవద్దని సోషల్ మీడియా వేదికగా కోరారు. దీనిపై ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో రియాక్ట్ అయ్యారు. ఇలా జరిగినందుకు క్షమించాలంటూ ట్వీట్ చేశారు.ఇటీవల హరోం హర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో సుధీర్ బాబు ఈ అంశంపై ట్విటర్ వేదికగా స్పందించారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన వ్యక్తి ప్రణీత్ హనుమంత్ నా చిత్రం హరోం హరలో నటించినందుకు క్షమాపణలు కోరుతున్నా అని అన్నారు. ప్రణీత్ హనుమంతు నా సినిమాలో నటించడం చాలా అసహ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. అతను ఇలాంటి వ్యక్తి అని తనకు తెలియదన్నారు. సుధీర్ బాబు ట్వీట్లో రాస్తూ..'మంచో, చెడో నేను అయితే సోషల్ మీడియా వ్యక్తిని కాదు. ఇలాంటి విషయాలను అస్సలు క్షమించను. ప్రణీత్ హనుమంతు అనే వ్యక్తి హరోం హార చిత్రంలో నటించడం అసహ్యంగా భావిస్తున్నా. ఈ విషయంలో మా చిత్ర బృందం తరఫున హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నా. ఈ మనిషి ఇలాంటి వాడని నాకు తెలియదు. అతని గురించి సోషల్ మీడియాలో బహిర్గతం చేయడానికి నేను ధైర్యం చేయలేకపోయా. కానీ ఇలాంటి విషయాలపై మనం దృష్టి సారించాలి. ఇది ఏ విధంగానూ వాక్ స్వాతంత్ర్యం కాదు.' అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. For good or bad, I'm not a social media guy nor do I keep up with things. I feel so disgusted by the fact we had #PraneethHanumanthu casted in #HaromHara. Sincere apologies from me and my entire team. We didn't know what a pathetic creature this man is. It wasn't in my knowledge.…— Sudheer Babu (@isudheerbabu) July 8, 2024 -
'ఇలాంటివి చాలా భయానకం'.. మెగా హీరో మరో ట్వీట్!
సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణాలపై మెగా హీరో సాయిధరమ్ తేజ్ మరో ట్వీట్ చేశారు. పేరేంట్స్ చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో పిల్లల ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయవద్దని ఆయన కోరారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు.ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే మరో ట్వీట్ చేశారు సాయి ధరమ్ తేజ్. ఫన్నీ పేరుతో చిన్న పిల్లలను ట్రోల్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తాజాగా కొంతమంది యూట్యూబర్స్ ఓ తండ్రి, తన చిన్నారి కూతురి వీడియోను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.స్పందించిన భట్టి విక్రమార్కతాజాగా ఈ సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్‌పై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి స్పందించారు. ఇలాంటి క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.. తాము చిన్నపిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. సోషల్ మీడియా వేదికగా చిన్నపిల్లలను ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెడితే సహించేది లేదన్నారు. చిన్నపిల్లల భద్రత కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క ట్వీట్లో పేర్కొన్నారు.Thank you for raising this critical issue @IamSaiDharamTej garu, Child safety is indeed a top priority. we will ensure that our government takes necessary steps to prevent child abuse and exploitation on social media platforms. Let's work together to create a safer online… https://t.co/OGQ4NN4doh— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) July 7, 2024This is beyond gruesome, disgusting and scary.Monsters like these go unnoticed on the very much utilised social platform doing child abuse in the disguise of so-called Fun & Dank.Child Safety is the need of the hour 🙏🏼I sincerely request Hon'ble Chief Minister of Telangana… https://t.co/05GdKW1F0s— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 7, 2024 -
పేరెంట్స్‌కు హెచ్చరిక జారీ చేసిన సాయిధరమ్ తేజ్
సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలు, వీడియోలు షేర్ చేసే పేరెంట్స్ తస్మాత్ జాగ్రత్త అంటున్నాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. 'పిల్లల ఫోటోలు లేదా వీడియోలు పోస్ట్ చేసేటప్పుడు తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే సోషల్ మీడియా మరీ దారుణంగా, భయంకరంగా మారిపోయింది. ఇక్కడ ఉన్న మానవ మృగాలను నియంత్రించడం, అడ్డుకోవడం కష్టమైపోతోంది. కాబట్టి మీ పిల్లల పిక్స్, వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు విచక్షణతో ఆలోచించండి. లేదంటే తర్వాత ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది' అని హెచ్చరిక జారీ చేశాడు.కాగా కొంతమంది తెలుగు యూట్యూబర్స్ తండ్రీకూతుర్ల బంధంపై అసభ్య కామెంట్లు చేశారు. డార్క్ కామెడీ పేరుతో విచ్చలవిడిగా మాట్లాడారు. ఆత్మీయ బంధాన్ని అవమానించేలా వికృత చేష్టలకు దిగారు. తండ్రీకూతుర్ల బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ వారి గురించి అత్యంత నీచంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సాయిధరమ్ తేజ్ వారిమీద మండిపడుతూ పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని పోస్టు పెట్టాడు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఈ ట్వీట్‌పై తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. పిల్లల భద్రతే తొలి ప్రాధాన్యతగా పేర్కొంటూ సోషల్ మీడియాలో చిన్నారులపై అసభ్య కామెంట్లు చేస్తూ వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. To whom so ever it may concern, my kind request to all the parents is to please use some sort of discretion when you post a video or photos of your kids as the world of social media has become ruthless and dangerous and is very difficult to control or stop these animals from…— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 7, 2024 Sai dharam tej ki ame ante chala istam https://t.co/dqs5QQ9Y5B pic.twitter.com/sV1byFiksT— Mani #SSMB29 (@PokiriTweet) July 7, 2024 Thank you for raising this critical issue @IamSaiDharamTej garu, Child safety is indeed a top priority. we will ensure that our government takes necessary steps to prevent child abuse and exploitation on social media platforms. Let's work together to create a safer online… https://t.co/OGQ4NN4doh— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) July 7, 2024 i remember a youtuber being jailed for a similar joke few weeks back. https://t.co/Jv8ce4GhGw pic.twitter.com/eFXZXGMS4W— Ab (@thebottlegourd) July 5, 2024 చదవండి: అంబానీ ఇంట సంగీత్.. బాద్షా ఎన్ని కోట్లు తీసుకున్నాడంటే? -
సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?
గతేడాది విరూపాక్ష, బ్రో సినిమాలతో అలరించిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ అతనికి జంటగా నటించింది. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పీరియాడిక్ హై యాక్షన్ మూవీతో అభిమానులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. వర్కింగ్ టైటిల్ 'ఎస్డీటీ 18' పేరుతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ద్వారా రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు.ల్యాండ్ మైన్లతో చుట్టుముట్టబడిన ఎడారి భూమిలో పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఓ యూనివర్శల్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాం. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ పాత్ర చాలా శక్తివంతంగా వుంటుంది. ప్రస్తుతం ఓ భారీ సెట్లో ఈ చిత్రం తొలిషెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం' అన్నారు. కాగా.. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.MY NEXT #SDT18 ✊This one will be more than special.Need all your love & blessings 🙏🏼All the best to us @rohithkp_dir 🤗 Glad to be associating with @niran_reddy @chaitanyaniran & @Primeshowtweets pic.twitter.com/wFhvFAELZb— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 21, 2024 -
అల్లు అర్జున్ను అన్ ఫాలో చేసిన మెగా హీరో!
మెగా హీరో సాయిధరమ్ తేజ్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశారు. అల్లు అర్జున్‌తో పాటు ఆయన భార్య స్నేహను ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో అన్‌ఫాలో చేసినట్ తెలుస్తోంది. అల్లు కుటుంబంలో కేవలం అల్లు శిరీష్‌ను మాత్రమే తేజ్ ఫాలో అవుతున్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ తప్ప.. మిగతా మెగా హీరోలందరూ అల్లు అర్జున్ను ప్రస్తుతానికి ఫాలో అవుతున్నారు.కాగా.. బన్నీ గతంలో నంద్యాలకు చెందిన తన స్నేహితుడు శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత తరువాత సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ ఆర్మీ మధ్య పెద్ద ఎత్తున వార్ జరిగింది. అందువల్లే సాయి ధరమ్ తేజ్.. అల్లు అర్జున్‌తో పాటు ఆయన భార్య అల్లు స్నేహారెడ్డిని ఎక్స్, ఇన్‌స్టాలో అన్ ఫాలో చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అప్పట్లోనే నాగబాబు చేసిన ట్వీట్ సైతం వివాదానికి దారితీసింది. ఆ తర్వాత నాగబాబు తన ట్వీట్‌ను తొలగించారు. -
మామయ్య ఆశీస్సులతో కొత్త ప్రయాణం ప్రారంభించిన 'సాయి దుర్గ తేజ్'
మెగా హీరో సాయి దుర్గ తేజ్ కొత్త జర్నీని ప్రారంభించాడు. ఆయన ముందుగు చెప్పినట్లే నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగించనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మెగా అభిమానులకు తెలిపాడు. తను ఏర్పాటు చేసిన కొత్త ప్రొడక్షన్ హౌస్‌కు 'విజయదుర్గ ప్రొడక్షన్స్' అనే పేరు పెట్టినట్లు తెలిపాడు. సాయి ధరమ్ తేజ్ తాజాగా తను పేరును కూడా మార్చుకున్న విషయం తెలిసిందే. తన అమ్మగారి పేరు దుర్గను తీసుకుని సాయి దుర్గ తేజ్‌గా ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రొడక్షన్ హౌస్‌కు కూడా తన అమ్మగారి పేరుతోనే 'విజయదుర్గ ప్రొడక్షన్స్' అని ఫిక్స్ చేశాడు. అమ్మపేరు మీద నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన ఇలా తెలిపాడు. 'మా మామయ్యలు చిరంజీవి, నాగబాబు, మా గురువు పవన్‌కల్యాణ్ ఆశీస్సులతో దీన్ని ప్రారంభించాను. నా కెరీర్ ప్రారంభంలో నాకు సహకరించిన నిర్మాత దిల్‌రాజు ఈ ప్రొడక్షన్ హౌస్‌ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. 'సత్య' సినిమా టీమ్‌తో కలిసి ఈ సంస్థను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.' అని ఆయన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆయనకు శుభాకంక్షలు చెబుతున్నారు. A New beginning ☺️ Happy to announce a small gift to my mother on her name, Our Production House @VijayaDurgaProd 🥳 Begun this on an auspicious note with the blessings of My Mavayyas@KChiruTweets mama@NagaBabuOffl mama & my guru garu @PawanKalyan mama My Producer #DilRaju… pic.twitter.com/XZBS1V0zBT — Sai Dharam Tej (@IamSaiDharamTej) March 9, 2024 -
పేరు మార్చుకున్న మెగా హీరో.. కొత్తగా..
మెగా హీరో సాయిధరమ్ తేజ్ పేరు మార్చుకున్నాడు. తన తల్లి దుర్గ పేరును తీసుకుని సాయిదుర్గ తేజ్‌గా సరికొత్తగా నామకరణం చేసుకున్నాడు. అమ్మ ఎప్పటికీ తనతో ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అలాగే తల్లి పేరు మీదట ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాలన్న కలను సైతం నెరవేర్చుకున్నాడు. దుర్గ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రారంభించినట్లు తెలిపాడు. ఈ బ్యానర్ ద్వారానే సోల్ ఆఫ్ సత్య షార్ట్ ఫిలిం తెరకెక్కిందని పేర్కొన్నాడు. నెక్స్ట్ టార్గెట్ చిరంజీవే మార్చి 8న ఉమెన్స్ డే (మహిళా దినోత్సవం) సందర్భంగా సోల్ ఆఫ్ సత్య ప్రత్యేక ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ వేదికపైనే తన పేరు మార్పును వెల్లడించాడు. రామ్‌చరణ్‌తో మల్టీస్టారర్ సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అన్న ప్రశ్నకు.. మొన్నే పవన్ కల్యాణ్‌తో సినిమా చేశాను. అంతకుముందు నాగబాబుగారితో చేశాను. నా నెక్స్ట్ టార్గెట్ చిరంజీవిగారే! మా చిరుమామతో సినిమా చేశాకే మిగతావాళ్లతో మల్టీస్టారర్ చేస్తాను అని తేజ్ చెప్పుకొచ్చాడు. వెబ్సైట్లో రాస్తేనే తెలిసింది గాంజా శంకర్ సినిమా ఉందా? ఆగిపోయిందా? అన్న ప్రశ్నకు.. 'సినిమా ఆగిపోయిందని ఓ వెబ్సైట్లో వార్త చూశాకే నాకూ తెలిసింది. మూవీ ఉందా? లేదా? అన్న విషయం ఆ వెబ్‌సైట్స్ చెప్తే కానీ తెలియదు' అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన షార్ట్ ఫిలిం సత్య. సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలిం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. చదవండి: ఓటీటీకి హనుమాన్.. తొలిసారి అలాంటి షాకింగ్ నిర్ణయం! -
సాయి ధరమ్ తేజ్ 'సత్య' ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
వ్యాపారవేత్తతో హీరోయిన్ 'రెజీనా' పెళ్లి ఫిక్స్
దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రెజీనా. ముఖ్యంగా తెలుగు, తమిళ్ భాషల్లో సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. చెన్నైలో పుట్టి పెరిగిన రెజీనా.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ స్థాయికి చేరుకుంది. టాలీవుడ్లో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,కొత్త జంట వంటి సినిమాలతో కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. ఒకప్పడు స్టార్ హీరోయిన్గా వెలిగిన రెజీనా ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో వెబ్ సీరీస్‌పై దృష్టి పెట్టింది. వరుసగా వెబ్‌సీరీస్‌ల్లో నటిస్తూ బిజీగా మారింది. ఆపై చిన్ని సినిమాలను కూడా ఒప్పుకుంటుంది. అయితే ఈ బ్యూటీ గురించి అప్పుడప్పుడు భారీగానే రూమర్స్ వస్తూ ఉంటాయి. గతంలో యంగ్ హీరో సందీప్ కిషన్‌తో రెజినా రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని సందీప్ చెప్పడంతో అది కాస్త ఆగిపోయింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజను ఏకంగా పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వచ్చాయి.. కొన్నిరోజుల తర్వాత ఓ తమిళ స్టార్ హీరోతో సీక్రెట్‌గా రొమాన్స్ చేస్తుందని కూడా టాక్ వచ్చింది. ఇవన్నీ రూమర్స్ అని తర్వాత తేలిపోయింది. కానీ ఆమె మాత్రం ఇలాంటివి ఇండస్ట్రీలో కామనే అనుకుని సమాధానం ఇవ్వకుండా తనపని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. సినిమా ఛాన్సులు తగ్గడంతో అందరి హీరోయిన్ల మాదిరే రెజీనా కూడా పెళ్లి పీటలెక్కబోతుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఓ బిజినెస్‌మేన్‌ను ఆమె వివాహం చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు వారి కుటుంబాల మధ్య మాటలు కూడా జరిగాయని అంటున్నారు. త్వరలో ఈ శుభవార్తను రెజీనా ప్రకటించే అవకాశం ఉందని టాక్.. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ రెజీనా పెళ్లి ప్రచారం మాత్రం భారీగా జరుగుతుంది. ప్రస్తుతం తమిళంలో అజిత్ హీరోగా 'విడమయూర్చి' సినిమా తీస్తున్నారు. ఇందులో అర్జున్ విలన్‌గా నటిస్తున్నాడు. రెజీనా.. విలన్ పాత్రధారి అర్జున్‌కి జోడీగా నటిస్తోంది. ఒకప్పుడు హీరోల సరసన నటించిన రెజీనా ఇప్పుడు విలన్ సరసన నటించే పాత్రలు చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by RegenaCassandrra (@reginaacassandraa) -
ఒక్క మెసేజ్‌తో ఇద్దరు చిన్నారులను ఆదుకున్న సాయిధరమ్ తేజ్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇద్దరు చిన్నారులకు సాయం చేసి మంచి మనసు చాటుకున్నారు. తనకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత జీవితం అంటే ఏమిటో తెలిసింది అని చెప్పిన ఆయన ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూనే.. సోషల్ సర్వీసులో కూడా ముందుంటాడు. తాజాగా సాయి ధరమ్ తేజ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఓ అనాథ ఆశ్రమంలో ఉండే ఇద్దరు చిన్నారులకు అవసరమైన వైద్య ఖర్చులను ఆయన చెల్లించారు. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని చార్లెట్ అనాథ ఆశ్రమం నుంచి ఇద్దరు పిల్లల ట్రీట్మెంట్ కోసం సాయం కోరుతూ తనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు తెలిపారు. వారికి సాయం అందించాలంటే తనకు వెంటనే గుర్తుకు వచ్చిన పేరు సాయిధరమ్ తేజ్ మాత్రమే అని ఆయనకు ఒక్క మెసేజ్ చేస్తే.. వెంటనే ఆ పిల్లలకు ఆయన సాయం చేశారని ఆండ్రూ తన సోషల్ మీడియా ద్వారా చెప్పాడు. సాయిధరమ్ చేసిన సాయానికి ఒక వీడియో ద్వారా ఆ పిల్లలు కృతజ్ఞతలు చెప్పారు. గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ ఇలాంటి సహాయాలు చాలా చేశాడు. విజయవాడలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆశ్రమం కట్టించాడు. తన పుట్టినరోజు సందర్భంగా గతేడాది అక్టోబరులో సైనిక కుటుంబాలతో పాటు ఏపీ, తెలంగాణ పోలీసులకు రూ.20 లక్షల సాయం చేసిన సంగతి తెలిసిందే. ఇలా పలు సందర్భాల్లో తన వంతు సాయం చేస్తూ మనసు చాటుకున్నారు. బ్రో, విరూపాక్షలతో మెప్పించిన సాయిధరమ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'గాంజా శంకర్'చేస్తున్నారు. కానీ గాంజా అనే పదాన్ని తొలగించాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు ఇటీవల నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. Thank you @IamSaiDharamTej your kind help for them, children sent you thank you wishes❤️❤️❤️ pic.twitter.com/gwrzmZQYR7 — I.Andrew babu (@iandrewdop) February 22, 2024 -
సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాకు బ్రేక్
-
'ఈ ఏడాదికి సరైన ముగింపు'.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పోస్ట్ వైరల్!
ఈ ఏడాది విరూపాక్షతో హిట్ కొట్టిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కించారు. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా మెగా హీరో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారంది. పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉండే వ్యక్తుల్లో హీరో సాయిధరమ్ తేజ్ ఒకరు. ఎల్లప్పుడూ సినిమా గెలవాలని ఆయన కోరుకుంటారు. అందులోనూ తెలుగు సినిమా ఎప్పుడూ ముందుడాలని కోరుకునే వ్యక్తి సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ. తాజాగా ఆయన చేసిన పోస్ట్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నేడు మన తెలుగు సినిమా సక్సెస్‌ఫుల్‌గా ఉన్నత స్థితికి చేరుకుందని తెలిపారు. సాయి ధరమ్ తేజ్ నోట్లో రాస్తూ.. 'రెండు రోజుల్లో మూడు సినిమా ఇండస్ట్రీల నుంచి చిత్రాలు రిలీజవ్వడం సంతోషంగా ఉంది. తెలుగు సినిమా ప్రభాస్ సలార్. షారుక్ ఖాన్ డంకీ, హాలీవుడ్ ఫిలిం అక్వామెన్‌తో సరిసమానమైన క్రేజ్‌తో విడుదల కావడం గర్వంగా వుంది. మూడు అగ్ర సినీ పరిశ్రమలు ఓకేసారి ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతికి ఇవ్వడానికి సిద్దం కావడం గొప్ప విషయం. అన్నింటి కంటే ఈ రోజు సినిమా చాలా అగ్రస్థాయిలో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. 2023కు ఇదే సరైన ముగింపు. ఈ అనుభూతికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. యువర్ కమ్ బ్యాక్ ఈజ్ సో గ్రేట్ షారుఖ్ సార్. డంకీ చిత్రంతో వరుసగా హ్యట్రీక్ సక్సెస్ సాధించాలి. సలార్‌తో వెండితెరపై ఫైర్ క్రియేట్ చేయడానికి సిద్దమైన ప్రభాస్ అన్నకు, అలాగే అక్వామెన్ సినిమాకు బెస్ట్ ఆఫ్ లక్' అంటూ రాసుకొచ్చారు. ఎందుకంటే ఈ వారంలో మోస్ట్ అవేటెడ్ ఫిల్స్మ్ డంకీ, సలార్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇవాళ డంకీ రిలీజ్ కాగా.. మరికొద్ది గంటల్లో సలార్ థియేటర్లలో సందడి చేయనుంది. అంతే కాకుండా మరో చిత్రం సైతం బాక్సాఫీస్ బరిలో నిలిచింది. అదే హాలీవుడ్ మూవీ అక్వామెన్ కూడా ఈరోజు రిలీజైంది. రెండు రోజుల వ్యవధిలో మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఈ సందర్భంగా మూడు సినిమాలను ఉద్దేశించి సాయి ధరమ్ తేజ్ నోట్ విడుదల చేశారు. CINEMA IS WINNING 💪🏼❤️#TeluguFilmIndustry#HindiFilmIndustry#Hollywood pic.twitter.com/hmlLm6PaJC — Sai Dharam Tej (@IamSaiDharamTej) December 21, 2023 -
Sai Dharam Tej Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్ (ఫొటోలు)
-
సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్
-
ఎంత పని చేశావ్ వరుణ్ తేజ్.. పెళ్లిపై మెగా హీరో పోస్ట్ వైరల్!
ఇటీవలే టాలీవుడ్ జంట వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో జరిగిన వీరి పెళ్లికి మెగా కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లిలో రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్‌తో సహా నితిన్ కూడా పాల్గొన్నారు. అయితే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. వరుణ్ తేజ్ పెళ్లిని ఉద్దేశించి చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చూస్తే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లిలో సాయి ధరమ్ తేజ్ ఓ రేంజ్లో హంగామా చేసినట్లు కనిపిస్తోంది. పెళ్లిలో వరుణ్ తేజ్‌ను ఊరేగించే కారుపై కాలు పెట్టిన ఫోటో చూస్తే చాలా ఫన్నీగా కనిపిస్తోంది. అతన్ని చూసిన వరుణ్ తేజ్ చిరునవ్వుతో కనిపించాడు. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఓ నోట్ రాసుకొచ్చాడు. సాయి తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఎందుకు, క్యూన్, యేన్, వై.. ఎంత పని చేశావ్ వరుణ్ బాబు.. ఉష్..నీకు పెళ్లి సంబరాలు.. కానీ నాకేమో స్వతంత్ర పోరాటం' అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు మాత్రం అలాంటి కమిట్మెంట్స్ పెట్టుకోకు అన్నా అంటూ సలహాలు ఇస్తున్నారు నెటిజన్స్. కాగా.. సాయి ధరణ్ తేజ్ ఈ ఏడాది విరూపాక్ష, బ్రో సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. View this post on Instagram A post shared by Sai Dharam Tej (@jetpanja) -
Pre-Wedding Party: వరుణ్-లావణ్య ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
ఊర మాస్ శంకర్
‘సూపర్ మ్యాన్ ఏం చేశాడంటే’... ‘అబ్బా ఈ స్పైడర్ మ్యాన్లు.. సూపర్ మ్యాన్లు కాదు నాన్నా.. మన లోకల్ మ్యాన్ కథ ఏదైనా ఉంటే చెప్పు నాన్నా..’ అని చిన్నారి కూతురు అడుగుతుంది... అప్పుడు మొదలవుతుంది లోకల్ మ్యాన్ గురించి... ఆడు చిన్నప్పుడే చదువు మానేశాడనీ, అమ్మా నాన్న మాట వినలేదనీ, అన్ని చెడు అలవాట్లు ఉన్నాయనీ, పది రూపాయలుంటే పార్కులో, పది వేలుంటే పార్క్ హయత్‌లో ఉంటాడని చెప్పడంతో ఆ లోకల్ మ్యాన్ ఊర మాస్‌గా పెరిగినవాడని అర్థం అవుతుంది. అతని పేరు ‘గాంజా శంకర్’. సాయి ధరమ్ తేజ్ టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘గాంజా శంకర్’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం సాయిధరమ్ పుట్టినరోజు సందర్భంగా గాంజా శంకర్ పాత్రను పరిచయం చేస్తూ, విడుదల చేసిన టీజర్లో పైన పేర్కొన్న డైలాగ్స్ ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: రిషీ పంజాబి, సమర్పణ: శ్రీకర స్టూడియోస్. -
ఊరమాస్‌గా సాయి ధరమ్ తేజ్.. గత్తరలేపిన ‘గాంజా శంకర్’ గ్లింప్స్
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు(అక్టోబర్ 15) సాయి తేజ్ బర్త్‌డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేస్తూ ఓ వీడియో గ్లింప్స్‌ని వదిలారు. ఈ చిత్రానికి ‘గాంజా శంకర్’ అని టైటిల్ ఖరారు చేశారు. మాస్‌కి నిర్వచనం ఇవ్వొద్దని, ఫీల్ అవ్వమని చెబతూ ‘గాంజా శంకర్’ వీడియో గ్లింప్స్ ప్రారంభం అవుతుంది. ‘స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ కాదు నాన్నా... మన లోకల్ మ్యాన్ కథ ఏదైనా ఉంటే చెప్పు' అని ఓ చిన్నారి అడగటంతో 'గాంజా శంకర్' ఇంట్రో మొదలైంది. హీరో పాత్ర ఎలా ఉండబోతుందో ఈ ఇంట్రోలో చూపించారు. గంజాయి అని పేరు చెప్పలేదు కానీ.. హీరో గాంజా అమ్ముతాడనే విషయాన్ని మాత్రం ఈ వీడియో ద్వారా చెప్పేశారు. మొత్తానికి సాయి తేజ్ పూర్తి మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. -
సాయి ధరమ్ తేజ్ కి ముద్దు పెట్టిన కలర్స్ స్వాతి