ఆ విషయంలో నన్ను క్షమించండి: సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ | Sai Dharam Tej Emotional About His Bike Accident At Virupaksha Pre-Release Event - Sakshi
Sakshi News home page

Sai Dharam Tej: ప్రమాదం తర్వాత మొదట చూసింది వాళ్లిద్దరినే: సాయి ధరమ్ తేజ్

Apr 17 2023 7:17 AM | Updated on Apr 17 2023 9:23 AM

Sai Dharam Tej Emotional On Road Accident with Bike  - Sakshi

సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్త మీనన్‌ జంటగా నటించిన తాజా చిత్రం 'విరూపాక్ష'. ఈ చిత్రానికి దర్శకుడు కార్తిక్‌ దండు తెరకెక్కించారు.తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్‌, ట్రైలర్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏలూరులో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో తనకు జరిగిన ప్రమాదంపై ఎమోషనలయ్యారు సాయి ధరమ్ తేజ్.  బైక్‌పై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. 

సాయి ధరమ్‌ తేజ్ మాట్లాడుతూ.. 'ఊహించని ప్రమాదంతో బైక్‌ పైనుంచి కిందపడ్డా. ఆ ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే.  మిమ్మల్ని టెన్షన్‌ పెట్టినందుకు నన్ను క్షమించండి. నాకు స్పృహ వచ్చాక మొదట చూసింది మా అమ్మను, తమ్మున్ని. వారికి సారీ చెప్పేందుకు కూడా నాకు మాట రాలేదు. బాధ ఒక మనిషిని ఎంత మార్చగలదో అప్పుడే అర్థమైంది. జీవితంలో ఎదురైన సవాలును స్వీకరించా. మీ అందరితో ఎలాగైనా మాట్లాడని గట్టిగా నిర్ణయించుకున్నా. మీ ప్రేమను పొందాలనేదే నా లక్ష్యం. మీ లక్ష్యం కోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే అసలు తగ్గొద్దు. మీ తల్లిదండ్రులు, గురువులు గర్వపడేలా చేయండి. అలాగే ప్రయాణించేటప్పుడు దయచేసి హెల్మెట్‌ వాడండి.' అని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కాగా.. ఈ చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి ధరమ్ తేజ్‌ యాక్సిడెంట్‌ తర్వాత చేసిన మొదటి చిత్రం కావడంతో ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement