
మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా, మానస వారణాసి ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం దేవకీ నందన వాసుదేవ. ఈ సినిమా ద్వారా మిస్ ఇండియా మానస వారణాసి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రశాంత్ వర్మ రాసిన కథతో దర్శకుడు అర్జున్ జంధ్యాల ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.
అయితే ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. అందరిలా కాకుండా కాస్తా వైరైటీగా మూవీ ప్రమోట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా మొదటి ఐదు నిమిషాల మూవీని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రదర్శించనున్నారు. టాలీవుడ్ ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. ఈ మూవీ ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయనుంది.
#DevakiNandanaVasudeva
ఏం అయివుంటుంది? pic.twitter.com/FR1sIUH5xf— Kakinada Talkies (@Kkdtalkies) November 19, 2024
Comments
Please login to add a commentAdd a comment