Devaki Nandana Vasudeva Movie
-
అందమైన తెలుగు హీరోయిన్.. మరికొన్నాళ్లు వెయిటింగ్ తప్పదు! (ఫొటోలు)
-
ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు – అశోక్ గల్లా
‘‘దేవకీ నందన వాసుదేవ’ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. భక్తి అంశాలు, ట్విస్ట్‌లు అదిరిపోతాయి. ఫైనల్ ఔట్పుట్ చూసిన తర్వాత సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు అశోక్ గల్లా. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించిన చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. అశోక్ గల్లా, మానస వారణాసి జంటగా నటించారు. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అశోక్ గల్లా మాట్లాడుతూ– ‘‘దేవకీ నందన వాసుదేవ’లో హీరో పేరు కృష్ణ, హీరోయిన్ పేరు సత్యభామ, విలన్ కంసరాజు.. ఇలా మైథాలజీ టచ్ ఉంటుంది. ప్రశాంత్‌గారి టచ్‌తో బోయపాటి శ్రీనుగారు సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా అర్జున్ జంధ్యాల ఈ మూవీ తీశారు. సోమినేని బాలకృష్ణగారు కథని నమ్మి రాజీపడకుండా నిర్మించారు. మా సినిమా చూశాక మహేశ్‌బాబు మావయ్య ఎలా స్పందిస్తారా? అని ఎదురు చూస్తున్నా. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు. -
ఈ సినిమా ఇద్దరికీ అగ్నిపరీక్షే
‘‘చిన్న సినిమా.. పెద్ద సినిమా అని ఉండదు. మంచి సినిమానా? కాదా? అనేది ఉంటుంది. ‘దేవకి నందన వాసుదేవ’ వంద శాతం మంచి సినిమా అనిపించింది. ఈ చిత్రం అశోక్‌కి, అర్జున్‌కి అగ్ని పరీక్షే. ఈ పరీక్షని ఎదుర్కొని వారు నిలబడతారని కోరుకుంటున్నాను’’ అని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. అశోక్ గల్లా, వారణాసి మానస జంటగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకుడు. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో బోయపాటి శ్రీను, హీరో సుధీర్ బాబు అతిథులుగా పాల్గొన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్, విజువల్స్, సాంగ్స్ చూసినప్పుడు అశోక్‌కి సరైన సినిమా అనిపించింది. తను కమర్షియల్ హీరోగా సక్సెస్ అవుతాడు’’ అన్నారు. ‘‘నేను రాసిన కథల్లో ఇది మాస్ ఎంటర్టైనర్. ఈ పాత్రకి అశోక్ కరెక్టుగా సరిపోయాడు. మహేశ్‌బాబుగారి ఫ్యాన్స్, ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూసి, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’’ అని చిత్ర కథారచయిత ప్రశాంత్ వర్మ అన్నారు. ‘‘ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. నాలాంటి కొత్త నిర్మాతని బతికించాలి’’ అని బాలకృష్ణ కోరారు. -
‘దేవకీ నందన వాసుదేవ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మహేశ్ బాబు మేనల్లుడి సినిమా.. టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి అలా!
మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా, మానస వారణాసి ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం దేవకీ నందన వాసుదేవ. ఈ సినిమా ద్వారా మిస్ ఇండియా మానస వారణాసి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రశాంత్ వర్మ రాసిన కథతో దర్శకుడు అర్జున్ జంధ్యాల ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.అయితే ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. అందరిలా కాకుండా కాస్తా వైరైటీగా మూవీ ప్రమోట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా మొదటి ఐదు నిమిషాల మూవీని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రదర్శించనున్నారు. టాలీవుడ్ ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. ఈ మూవీ ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. #DevakiNandanaVasudeva ఏం అయివుంటుంది? pic.twitter.com/FR1sIUH5xf— Kakinada Talkies (@Kkdtalkies) November 19, 2024 -
సత్యభామ గుర్తుండిపోతుంది: మానస వారణాసి
అశోక్ గల్లా, మానస వారణాసి జంటగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. ప్రశాంత్ వర్మ అందించిన కథతో అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన చిత్రమిది. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా మానస వారణాసి మాట్లాడుతూ–‘‘నేను హైదరాబాద్‌లో పుట్టాను. మా నాన్నగారు మలేషియాలో ఉద్యోగి. దీంతో నా స్కూలింగ్ అంతా అక్కడే సాగింది. ఇంజినీరింగ్ మాత్రం హైదరాబాద్‌లో పూర్తి చేశాను. ఆ తర్వాత ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేశాను.మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలవడంతో మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించాను. ఆ తర్వాత ఓ మూవీ వర్క్‌షాప్‌లో పాల్గొనడంతో సినిమా రంగంపై ఆసక్తి కలిగింది. ఇక ‘దేవకి నందన వాసుదేవ’ లో నేను విజయనగరం అమ్మాయి సత్యభామపాత్రలో నటించాను. ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే అమ్మాయి తను. సత్యభామపాత్ర ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది.నాకు భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది. దీంతో ఈ సినిమాలోని డ్యాన్స్ సాంగ్ ‘బంగారం’కు అది కొంత ఉపయోగపడింది. అశోక్ గల్లా, అర్జున్ జంధ్యాలగార్లు సెట్స్‌లో సపోర్టివ్‌గా ఉన్నారు. బాలకృష్ణగారి వల్లే ఈ సినిమా గ్రాండ్‌గా వచ్చింది. హీరో సంతోష్ శోభన్ తో ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ చేశాను’’ అన్నారు. -
మహేశ్‌బాబుకి ట్రైలర్ బాగా నచ్చింది: అర్జున్ జంధ్యాల
‘‘దేవకి నందన వాసుదేవ’ సినిమా మంచి భావోద్వేగాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్. ధర్మం అంటే దేవుడు అనే మాట కూడా ఈ మూవీలో చాలా కీలకం. అలాగే పూర్తి వాణిజ్య అంశాలు ఉంటాయి. మా చిత్రం కుటుంబ ప్రేక్షకులకు అద్భుతంగా నచ్చుతుంది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అని డైరెక్టర్ అర్జున్ జంధ్యాల తెలిపారు. అశోక్ గల్లా, వారణాసి మానస జంటగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది.ఈ సందర్భంగా అర్జున్ జంధ్యాల విలేకరులతో మాట్లాడుతూ– ‘‘గుణ 369’ డైరక్టర్ ప్రశాంత్ వర్మగారికి నచ్చింది. ఆయన రాసిన ‘దేవకి నందన వాసుదేవ’ కథకు నేనైతే న్యాయం చేయగలనని భావించి, దర్శకత్వ బాధ్యతలను నాకు అప్పగించారు. ఫైనల్ సినిమా చూసి సర్ప్రైజ్ అయ్యారాయన. అశోక్ గల్లాగారు తన పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. మానసది బలమైన పాత్ర. దేవ్ దత్తాగారు కంసరాజ్ పాత్రని అద్భుతంగా చేశారు.సాయి మాధవ్ బుర్రాగారు సినిమాలోని భావోద్వేగాలు, కథకి తగ్గట్టుగా మాటలందించారు. నేపథ్య సంగీతం, మ్యూజిక్‌తో ఈ సినిమాకిప్రాణం పోశారు భీమ్స్. బాలకృష్ణగారు ఈ కథకి కావల్సినవన్నీ సమకూర్చి గ్రాండ్‌గా నిర్మించారు. హీరో మహేశ్‌బాబుగారికి మా సినిమా ట్రైలర్ బాగా నచ్చింది. ఆయన మా టీమ్‌ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు’’ అని తెలిపారు. -
‘మురారి’తో మా సినిమా కథకు సంబంధమే లేదు: డైరెక్టర్ అర్జున్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన తాజా చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. ఈ చిత్రానికి ‘హను-మాన్’ఫేం ప్రశాంత్ వర్మ కథ అదించగా, ‘గుణ 369’ఫేం అర్జున్ జంధ్యాల దర్వకత్వం వహించారు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 22 ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అర్జున్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ‘దేవకి నందన వాసుదేవ’ సినిమాలో కృష్ణుడు, కంసుడు రిఫరెన్స్ ఇందులో ఉంటుంది. మూడో సంతానం వలన మరణం అని ట్రైలర్ లోనే చాలా క్లియర్ గా చెప్పాము. అయితే చెప్పని విశేషాలు చాలా ఉన్నాయి. ట్రైలర్లో కంటే చాలా ఎక్కువ కథ సినిమాలో ఉంది.→ ప్రశాంత్ వర్మ చెప్పిన కథను నేను ఓన్ చేసుకున్నాను. అలా కథను ఓన్ చేసుకున్నప్పడే కొత్త ఐడియాస్ వస్తాయి. నేను చెప్పిన కొన్ని ఆలోచనలకి ప్రశాంత్ గారు హ్యాపీగా ఫీలయ్యారు. ఆయన సినిమా చూసి చాలా సర్ ప్రైజ్ ఫీల్ అయ్యారు.→ ఈ కథకు హీరోగా అశోక్ అయితేనే బాగుటుందనిపించింది. ఆయన క్యారెక్టర్ కి ఎలాంటి లుక్ అయితే బాగుంటుందని దానిపై చాలా వర్క్ చేసాం. ప్రతిదీ ఆ క్యారెక్టర్ నుంచి డిజైన్ చేసుకున్నాం.→ అశోక్ గారు యాక్షన్ ఎమోషన్ లో ఇరగదీస్తారు. ఈ సినిమాని చాలా అద్భుతంగా చేశారు. తన పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు.→ ట్రైలర్ చూసి అందరూ ఈ సినిమా కథని మురారి సినిమాతో పోల్చుతున్నారు. కానీ ఆ కథకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. మురారిలో ఒక డెస్టినీ ఫీల్ ఉంటుంది. ఇందులో అది ఇంకోరకంగా ఉంటుంది. హీరోకి ఒక గండం ఉంది. ఆ గండం నుంచి ఎలా బయటపడతారనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ట్రైలర్ లో కూడా ఎక్కడా లేనివిధంగా భూమిలో సుదర్శన చక్రంతో వాసుదేవుని విగ్రహం అని చెప్పాం. దానికి ఒక కనెక్షన్ ఉంది. అది చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఒక సెపరేట్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. అది కచ్చితంగా చెప్పగలను.→ మహేష్ బాబు గారికి ట్రైలర్ చాలా నచ్చింది. ఆయన టీమ్ అందర్నీ అప్రిషియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే సినిమాను కూడా చూడబోతున్నారు. ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్లంతా కూడా చాలా అద్భుతంగా ఉందని అప్రిషియేట్ చేశారు. → ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి అద్భుతంగా నచ్చుతుంది. ఇది మంచి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్. ధర్మం అంటే దేవుడు అనే మాట కూడా ఇందులో చాలా కీలకం. దాని యొక్క సారాంశం కథలో అండర్లైన్ గా వెళుతుంది. అలాగే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. చాలా మంచి విజువల్ ఫీలింగ్ ఉంటుంది.→ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇచ్చిన కథకి 100% న్యాయం చేయాలి. అలాగే ఖచ్చితంగా ఈ సినిమాని హిట్ చేయాలి. ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకొని వర్క్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది.→ సాయి మాధవ్ గారు చాలా అద్భుతమైన డైలాగ్స్ రాశారు. ఎమోషనల్ డెప్త్ పట్టుకుని కథకి తగ్గట్టుగా మాటలందించారు. భీమ్స్ ఈ సినిమాకి తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ప్రాణప్రతిష్ట చేశాడు. మ్యూజికల్ గా సినిమా వండర్ఫుల్ గా ఉంటుంది.