ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు – అశోక్‌ గల్లా | Devaki Nandana Vasudeva Released on 22 nov 2024 | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు – అశోక్‌ గల్లా

Published Fri, Nov 22 2024 2:13 AM | Last Updated on Fri, Nov 22 2024 2:13 AM

Devaki Nandana Vasudeva Released on 22 nov 2024

‘‘దేవకీ నందన వాసుదేవ’ సినిమా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. భక్తి అంశాలు, ట్విస్ట్‌లు అదిరిపోతాయి. ఫైనల్‌ ఔట్‌పుట్‌ చూసిన తర్వాత సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు అశోక్‌ గల్లా.  డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ కథ అందించిన చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహించారు. అశోక్‌ గల్లా, మానస వారణాసి జంటగా నటించారు. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. 

ఈ సందర్భంగా అశోక్‌ గల్లా మాట్లాడుతూ– ‘‘దేవకీ నందన వాసుదేవ’లో హీరో పేరు కృష్ణ, హీరోయిన్‌ పేరు సత్యభామ, విలన్‌ కంసరాజు.. ఇలా మైథాలజీ టచ్‌ ఉంటుంది. ప్రశాంత్‌గారి టచ్‌తో బోయపాటి శ్రీనుగారు సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా అర్జున్‌ జంధ్యాల ఈ మూవీ తీశారు. సోమినేని బాలకృష్ణగారు కథని నమ్మి రాజీపడకుండా నిర్మించారు. మా సినిమా చూశాక మహేశ్‌బాబు మావయ్య ఎలా స్పందిస్తారా? అని ఎదురు చూస్తున్నా. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement